“అబ్రాహాము మరియు శారా,” నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2022 ఫిబ్రవరి
“అబ్రాహాము మరియు శారా”
నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2022 ఫిబ్రవరి
అబ్రాహాము మరియు శారా
అబ్రాహాము ఒక ప్రవక్త. దేవుడు అబ్రాహాము మరియు అతని భార్యయైన శారాతో ఒక నిబంధన చేసారు.
వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానమిచ్చారు. వారికి పిల్లలు పుడతారని ఆయన వారితో చెప్పారు. దేవునిని అనుసరిస్తామని అబ్రాహాము మరియు శారా వాగ్దానం చేసారు.
అబ్రాహాము మరియు శారా తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. కానీ చాలా కాలం పాటు వారికి పిల్లలు ఎవరూ పుట్టలేదు. వారు చాలా వృద్ధులయ్యారు.
చివరకు, అబ్రాహాముకు 100 ఏండ్లు మరియు సారాకు 90 ఏండ్లు ఉన్నప్పుడు, వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. వారు అతడికి ఇస్సాకు అని పేరు పెట్టారు. దేవుడు వారిని ఆశీర్వదించారని వారికి తెలుసు.
నేను దేవునిని నమ్మగలను. కొన్నిసార్లు దీవెనలు వెంటనే రావు. కానీ దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తారు.
రంగులువేసే పేజీ
నేను దేవునిని నమ్మగలను
డౌన్లోడ్ చేయడానికి చిత్రపటముపై క్లిక్ చేయండి.
ఏప్రిల్ స్టాట్ చేత వివరణ
మీరు భయపడినప్పుడు లేదా విచారంగా ఉన్నప్పుడు పరలోక తండ్రి మీకేవిధంగా సహాయపడ్డారు?
Intellectual Reserve, Inc. చేత © 2022 All rights reserved. అ.సం.రాలలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, January 2022 యొక్క అనువాదం Telugu. 18313 421