2022
రూతు మరియు నయోమి
2022 జూన్


“రూతు మరియు నయోమి,” నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2022 జూన్

“రూతు మరియు నయోమి”

నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2022 జూన్

రూతు మరియు నయోమి

నయోమి కుటుంబ సభ్యుడ్ని పెండ్లి చేసుకొంటున్న రూతు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

కరువు కారణంగా నయోమి మరియు ఆమె కుటుంబం క్రొత్త దేశానికి వచ్చారు. వారు రూతు అను పేరుగల ఒక యువతిని కలిసారు. రూతు నయోమి కుమారుడ్ని వివాహము చేసుకొంది.

మరణించబోవుచున్న భర్తతో రూతు

తరువాత రూతు భర్త చనిపోయాడు. రూతు చాలా విచారించింది.

నయోమి

నయోమి కూడా చాలా విచారించింది. ఆమెను చూసుకోవడానికి ఆమెకు కుటుంబం లేదు. ఆమె తన దేశానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది.

నయోమి మరియు రూతు

తన కుటుంబానికి తిరిగి వెళ్ళమని నయోమి రూతుతో చెప్పంది. కానీ రూతు నయోమిని ప్రేమించింది. ఆమె నయోమితో వెళ్ళి, ఆమెను చూసుకుంటానని హామీ ఇచ్చింది.

ఏరుకొనుచున్న రుతు

రూతు మరియు నయోమి బీదవారు. కాబట్టి వారికి ఆహారం వెదకడం కోసం రూతు చాలా కష్టపడింది.

పొలములో రూతు మరియు బోయజు

ఒకరోజు బోయజు అనే వ్యక్తి రూతు తన పొలంలో మిగిలిపోయిన ధాన్యాన్ని సేకరించడం చూసాడు.

సేవకుడితో బోయజు

బోయజు దయగలవాడు. రూతు కోసం ఎక్కువ ధాన్యం విడువమని అతడు తన సేవకులకు చెప్పాడు.

బిడ్డతో రూతు, బోయజు మరియు నయోమి

తరువాత రూతు మరియు బోయజు వివాహం చేసుకున్నారు. వారికి ఒక మగ బిడ్డ పుట్టాడు. అతడిని చూడటానికి నయోమి సహాయం చేసింది.

భోజనం వడ్డిస్తున్న కుటుంబము

నేను ఇతరులకు శ్రద్ధ చూపడానికి సహాయం చేయగలను. నేను అవసరతలో ఉన్న వారికి దయ చూపగలను.

రంగులువేసే పేజీ

నేను ఇతరుల కోసం శ్రద్ధ చూపగలను

తాతతో పిల్లలు

డౌన్‌లోడ్ చేయడానికి చిత్రపటముపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత దృష్టాంతం

మీకెవరు సహాయము చేయగలరు?