“యువ యోధులు” ఫ్రెండ్, 2024 ఆగష్టు, 26–27.
ఆగష్టు 2024, ఫ్రెండ్ యొక్క నెలవారీ సందేశం
యువ యోధులు
ఆండ్రూ బోస్లీ చేత సచిత్ర వర్ణన
అమ్మోను మరియు అతని సోదరులు బోధించిన ఆ ప్రజలు యేసు క్రీస్తును అనుసరించుటకు కోరుకొనిరి. వారు తమ ఆయుధములను భూమిలో పాతిపెట్టిరి మరియు ఎన్నటికి యుద్ధము చేయబోమని దేవునికి వాగ్దానము చేసిరి.
కాని, వారు వెంటనే తమ కుటుంబములను కాపాడుకొనవలసి వచ్చెను. ఏ తండ్రులైతే ఆయుధములను భూమిలో పాతిపెట్టిరో వారు దేవునితో తమ వాగ్దానమును ఉల్లంఘించడానికి ఇష్టపడలేదు. కనుక వారి కుమారులు వారి స్థానములో యుద్ధము చేయుటకు సిద్ధపడిరి. రెండు వేల యువ యోధులు అని వారు పిలువబడిరి. యువ అనగా “యవ్వన” అని అర్ధము.
ఆ యువ యోధులు అంతకు ముందెన్నడు యుద్ధము చేయలేదు. కాని వారు సిద్ధపడుటకు వారి తల్లులు సహాయము చేసిరి మరియు దేవుని యందు విశ్వసించుట వారికి నేర్పిరి.
వారు హీలమన్ను తమ నాయకునిగా ఎంచుకున్నారు వారు ధైర్యవంతులు, మరియు దేవుడు వారికి సహాయము చేసెను వారందరు గాయపడ్డారు, ఐతే వారు ఒకరికొకరు సహాయము చేసుకున్నారు. దేవుడు వారి విశ్వాసమును అభినందించెను, మరియు వారందరు బ్రతికిరి!
రంగులువేసే పేజీ
లేఖనాలు నాకు ప్రతీరోజు సహాయపడగలవు.
ఆడమ్ కోఫోర్డ్ చేత సచిత్ర వర్ణన
మీకు ఏ లేఖన కథనము బాగా నచ్చింది?
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, August 2024 యొక్క అనువాదము. Telugu. 19290 421