2022
గోత్రజనకులు: వారెవరు మరియు అది తెలుసుకొనుట ఎందుకు ప్రాముఖ్యమైనది
2022 ఫిబ్రవరి


“గోత్రజనకులు: వారెవరు మరియు అది తెలుసుకొనుట ఎందుకు ప్రాముఖ్యమైనది,” యౌవనుల బలము కొరకు 2022 ఫిబ్ర.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2022 ఫిబ్రవరి

ఆదికాండము 11-50

గోత్రజనకులు

వారెవరు మరియు అది తెలుసుకొనుట ఎందుకు ప్రాముఖ్యమైనది

అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబు గురించి మీరు వినే ఉంటారు. మనము వారి గురించి తరచుగా మోర్మన్ గ్రంథములో చదువుతాము మరియు మీరు ఈ సంవత్సరం పాత నిబంధనను అధ్యయనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటి గురించి మరి ఎక్కువగా వింటారు. వారికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది గనుక, వారు చాలా ముఖ్యమైనవారై ఉండాలి, అవునా? కానీ మీరు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు, “వేల సంవత్సరాల క్రితం జీవించిన ముగ్గురు వ్యక్తులు నేడు ఎందుకు ముఖ్యమైనవారు?” ఎందుకంటే, ఆ సమాధానానికి కీలకమైనది శాశ్వతమైన నిబంధనలలో మరియు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దీవెనలలో ఉంది.

అబ్రాహాము

చిత్రం
అబ్రాహాము

జరోమ్ వోగెల్ ద్వారా దృష్టాంతాలు

అబ్రాహాము గొప్ప ప్రవక్త. అతడు నీతిమంతుడు మరియు దేవుని ఆజ్ఞలకు విధేయుడు.

అతడు బాప్తిస్మం తీసుకున్నాడు, యాజకత్వం పొందాడు మరియు నిత్యత్వం కొరకు అతని భార్య శారాతో ముద్రించబడ్డాడు.

అతని సంతానం గొప్పదగునని మరియు అతడు పొందిన దీవెనలనే వారు పొందుతారని దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేసెను.

యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణతను వారు ప్రపంచ దేశాలకు తీసుకొని వెళ్తారు.

ఇస్సాకు

చిత్రం
ఇస్సాకు

అబ్రాహాము మరియు శారా యొక్క కుమారుడే ఇస్సాకు.

ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు అబ్రాహాముకు చెప్పారు. అబ్రాహాము ఇస్సాకును ప్రేమించాడు కానీ దేవునికి విధేయత చూపడానికి ఎంచుకున్నాడు. అబ్రాహాము ఇస్సాకును బలి ఇవ్వబోతుండగా, ఆపమని ప్రభువు యొక్క దేవదూత అబ్రాహాముకు చెప్పాడు. దేవునికి విధేయత చూపడానికి అబ్రాహాము మరియు ఇస్సాకు యొక్క సుముఖత దేవుని అద్వితీయ కుమారుని ప్రాయశ్చిత్తానికి చిహ్నము.

అబ్రాహాము వలె ఇస్సాకుకు కూడా దీవెనలు వాగ్దానం చేయబడ్డాయి.

యాకోబు

చిత్రం
యాకోబు

తన తండ్రి మరియు తాత వలె, యాకోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు.

అతని విశ్వసనీయత కారణంగా, ప్రభువు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చారు, దీని అర్థం “దేవునితో విజయం సాధించేవాడు” లేదా “దేవుని జయించనివ్వండి” (బైబిలు నిఘంటువు, “ఇశ్రాయేలు” చూడండి).

యాకోబుకు పన్నెండుమంది కుమారులు కలరు. ఈ కుమారులు మరియు వారి కుటుంబాలు ఇశ్రాయేలు తెగలుగా ప్రసిద్ధి చెందారు.

దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన యాకోబు మరియు అతని పిల్లలతో పునరుద్ధరించబడింది.

గోత్రజనకులు మరియు మీరు

సంఘ సభ్యులైన మీరు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు యొక్క సంతానములో భాగము. వారు దేవునితో చేసిన నిబంధన మీకు కూడా వర్తిస్తుంది!

రక్షకుడు గురించి సాక్ష్యమిచ్చి, సువార్త పంచుకొనే దీవెనను మరియు బాధ్యతను మీరు కలిగియున్నారు.

నిబంధనలు చేసి వాటిని పాటించమని మరియు యాజకత్వ విధులను పొందమని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించడానికి కూడా మీరు పిలువబడ్డారు. ఇదంతా ఇశ్రాయేలు యొక్క సమకూర్పులో భాగమని, “నేడు భూమిపై జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు (“Hope of Israel,” [worldwide youth devotional, June 3, 2018], 8, ChurchofJesusChrist.org).

ముద్రించు