2023
యేసు క్రీస్తు మిమ్మల్ని బలపరిచే 4 మార్గాలు
2023 జనవరి


“యేసు క్రీస్తు మిమ్మల్ని బలపరిచే 4 మార్గాలు,” యౌవనుల బలము కొరకు, 2023, జనవరి.

2023 జనవరి, యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము

యేసు క్రీస్తు మిమ్మల్ని బలపరిచే 4 మార్గాలు

క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను”
ఫిలిప్పీయులకు 4:13.

చిత్రం
కైర్న్

ప్రపంచమంతటా, క్రైస్తవులు ఈ లేఖనములో ఆనందిస్తారు: “నన్ను బలపరచు క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను” (ఫిలిప్పీయులకు 4:13).

జనులు దీనిని విన్నప్పుడు, వారిలో కొందరు ఏ పరీక్షలోనైనా తాము ఉత్తీర్ణత సాధించగలమని, ఏ ఆటలోనైనా తాము గెలవగలమని మరియు ప్రతీ కోరికను నెరవేర్చుకోవచ్చని భావించవచ్చు. కానీ ఈ లేఖనము బోధించేది అది కాదు.

ఇది అపొస్తలుడైన పౌలు జైలులో ఉన్నప్పుడు అతనిచేత వ్రాయబడింది. ఖైదీగా, పౌలు చేయలేనివి చాలా ఉన్నాయి, కానీ చాలా ముఖ్యమైనది చేయడానికి యేసు క్రీస్తు తనను బలపరచగలడని అతనికి తెలుసు.

మీ విషయంలో కూడా అదే నిజం!

1 తెలుసుకోవడానికి క్రీస్తు మిమ్మల్ని బలపరుస్తారు

సత్యమేమిటో మీరు తెలుసుకోవడానికి యేసు క్రీస్తు మీకు అనేక ముఖ్యమైన మార్గాలను అందించారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని (3 నీఫై 18:18 చూడండి) మరియు ఏది సత్యమో తెలుసుకోవడానికి అడగాలని (మొరోనై 10:4-5 చూడండి) ఆయన మనందరికీ బోధించారు. మీరు మీ లేఖనాలను అధ్యయనం చేయడం ద్వారా కూడా ఏది సత్యమో కనుగొని తెలుసుకోవచ్చు.

ప్రార్థన మరియు లేఖన అధ్యయనం మీ జీవితంలోకి ఆత్మను తీసుకువస్తాయి. ఆత్మ “మీ మనస్సుతో మరియు … మీ హృదయంతో” మాట్లాడవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2), “మీ ఆత్మను సంతోషముతో నింపవచ్చు” మరియు “మీ మనస్సును వెలిగించవచ్చు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:13).

ఈ మార్గాల్లో, మీరు “ఆయనను వినగలరు”—రక్షకుని మాటలు విని, ఆయన చెప్పినదానిని అనుసరించండి. “ఈ జీవితంలో విజయం, సంతోషం మరియు ఆనందానికి ఇది నమూనా” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.1

2 చేయడానికి క్రీస్తు మిమ్మల్ని బలపరుస్తారు

మీరు ఆజ్ఞలను పాటించడానికి, శాంతి మరియు సంతోషానికి దారితీసే మంచి ఎంపికలను చేయడానికి ప్రయత్నించినప్పుడు మీకు బలం వస్తుంది. ఆ ఎంపికలు చేయడం కష్టతరమైనప్పుడు కూడా దీన్ని చేయడానికి యేసు క్రీస్తు మిమ్మల్ని బలపరుస్తారు. కొన్నిసార్లు మీరు చెడు ఎంపిక చేయవచ్చు. కృతజ్ఞతాపూర్వకంగా, రక్షకుని ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపాన్ని సాధ్యం చేస్తుంది. యేసు క్రీస్తు కారణంగా, మీరు పరిశుద్ధంగా మారవచ్చు మరియు ఆనందాన్ని కనుగొనవచ్చు. ప్రతిరోజూ “ఉత్తమముగా చేయడానికి మరియు ఉత్తమముగా ఉండడానికి2 ఆయన మిమ్మల్ని బలపరచగలరు.

3 అధిగమించడానికి క్రీస్తు మిమ్మల్ని బలపరుస్తారు

జైలులో ఉన్నప్పుడు, పౌలు ఇలా వ్రాశాడు: “నేను ఏ స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను.

“దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను ఉండుటకు నేర్చుకొనియున్నాను” (ఫిలిప్పీయులకు 4:11-12).

మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు ద్వారా, తన శ్రమలు మరియు సవాళ్ళను అతడు అధిగమించగలడని మరియు వాటి నుండి నేర్చుకోగలడని పౌలు తెలుసుకున్నాడు. అదేవిధంగా చేయడానికి యేసు క్రీస్తు మిమ్మల్ని బలపరచగలరు.

రక్షకుడు “ప్రతి విధమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించాడు.” “వారి బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో [సహాయపడడం అని అర్థం] … ఆయన ఎరుగునట్లు” (ఆల్మా 7:11–12) ఆయన మన బలహీనతలను తనపై తీసుకున్నారు. మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, మీరు మీ స్వంతంగా చేయలేని వాటిని సహించడానికి మరియు సాధించడానికి యేసు క్రీస్తు మిమ్మల్ని బలపరుస్తారు.

4 మారడానికి క్రీస్తు మిమ్మల్ని బలపరుస్తారు

యేసు క్రీస్తు మనందరి కొరకు పునరుత్థానాన్ని ఒక వాస్తవంగా చేసారు మరియు పశ్చాత్తాపపడి, అవసరమైన విధులను పొంది, వాటికి సంబంధించిన నిబంధనలను చేసి, పాటించేవారికి ఆయన నిత్యజీవాన్ని సాధ్యం చేస్తారు. క్రీస్తు లేకుండా, పరలోక తండ్రి కోరుకునేవి—మనం ఆయన మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వలె ఎక్కువగా మారడం మరియు వారితో శాశ్వతంగా నివసించడం వంటివి మనం నెరవేర్చలేము.

చిత్రం
యేసు క్రీస్తు

మీరు యేసు క్రీస్తు గురించి నేర్చుకునేటప్పుడు, ఆయనపై ఆధారపడడం, ఆయనపై నమ్మకం ఉంచడం మరియు ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా మీరు మరింతగా యేసు క్రీస్తులా మారవచ్చు. ఇది మిమ్మల్ని మరింత విశ్వాసం, నిరీక్షణ, దాతృత్వం, సహనము, వినయము, స్వచ్ఛత మరియు విధేయతతో జీవించేలా చేస్తుంది. ఇవన్నీ రక్షకుని గుణాలు.

మీరు యేసు క్రీస్తును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయన మీ నిరీక్షణగా మరియు మీ వెలుగుగా ఉంటారు, మీరు కాగలరని ఆయన ఎరిగినట్లుగా మీరు కావడానికి అది మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మరియు పౌలుతోపాటు, “నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను” అని మీరు చెప్పగలరు.

ముద్రించు