“ఏడు రోజులు సువార్తను భిన్న విధాలుగా పంచుకొనుట,” యౌవనుల బలము కొరకు, జూలై 2023.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, జూలై 2023
ఏడు రోజులు సువార్తను భిన్న విధాలుగా పంచుకొనుట
సువార్తను సాధారణమైన, సహజమైన విధానాలలో మీరు పంచుకోగలను. కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరు సమ్మతిగా, సిద్ధంగా ఉన్నారా?
మన సాక్ష్యములు పంచుకోవడం గురించి మనము మాట్లాడినప్పుడు, తరచుగా మనము సంస్కార సమావేశంలో లేదా మరొక ఇతర అధికారిక సందర్భములో మన సాక్ష్యాలను పంచుకోవడమని ఆలోచిస్తాము. కాని “సహజమైన, సాధారణమైన విధానాలలో మీ విశ్వాసమును పైకి తీసుకొని రావడానికి అవకాశాల కొరకు వెదకడానికి”1 మనము ప్రోత్సహించబడ్డాము.
క్రింద ఏడు-రోజుల సవాలులో, ప్రతిరోజు ఒక వారము వేర్వేరు విధానాలలో మీ సాక్ష్యమును మీరు పంచుకోవచ్చు. ఈ విషయాలను మీరు ఏ క్రమములోనైనా చేయవచ్చు, లేదా మీ స్వంత ఉపాయాలను కూడ మీరు ఆలోచించవచ్చు! ఎదుర్కోవడానికి మీరు సమ్మతిగా, సిద్ధంగా ఉన్నారా?
1 రోజు:
మీకు సౌకర్యంగా ఉంటే, సంఘములో ఉపవాసము, సాక్ష్యపు సమావేశములో మీ సాక్ష్యాన్ని చెప్పడానికి పరిగణించవచ్చు. లేదా, మీ ఆదివారము మరియు సెమినరీ తరగతులలో పాల్గొనుట ద్వారా సంఘములో మీ సాక్ష్యమును కూడ మీరు పంచుకోవచ్చు. అక్కడ మీరు పంచుకొనే వ్యాఖ్యలు ఇతరులను పైకెత్తగలవు, మీ, అదేవిధంగా వారి సాక్ష్యాలను బలపరచుకోగలరు.
2 రోజు: స్నేహితులు
ఆదివారము సంఘములో మీరు ఏమి నేర్చుకున్నారు? సంస్కార సమావేశ ప్రసంగముల లేదా మీ తరగతి చర్చలో ఎవరైనా పంచుకొన్న దానిని మీరు ఇష్టపడ్డారా? ప్రారంభ పాట మీ ప్రియమైన కీర్తనలలో ఒకటి కావచ్చు. దాని గురించి ఒక స్నేహితునికి చెప్పండి! తరువాత వారి వారాంతం గురించి అడగండి.
3 రోజు: సామాజిక మాధ్యమం
ఆత్మీయమైన విషయాలు సాధారణంగా, సహజంగా పంచుకోవడానికి సామాజిక మాధ్యమం ఒక గొప్ప స్థలము. ఈ సవాలు దినము కొరకు, క్రింది విషయం గురించి పంచుకోవడానికి ఆలోచించండి:
-
లేఖనాలలో మీ ప్రియమైన లేఖన వచనాలలో ఒకటి.
-
సర్వసభ్య సమావేశంలో ఒక పైకెత్తే వ్యాఖ్యానము.
-
ఒక ఆత్మీయ ఆలోచన లేక అనుభవము.
-
రక్షకుని గురించి మీరు ప్రేమించేది లేదా ప్రశంసించేది ఏదైనా.
-
ఇటీవల ఆయన మీకు సహాయపడిన ఒక విధానము లేదా ఆయనలో మీరు మెచ్చుకొనే ఒక లక్షణము మరియు ఎందుకు.
4 రోజు: వచనము లేదా వీడియో
వచనము లేదా వీడియో ద్వారా ఒక స్నేహితునికి పైకెత్తే సందేశాన్ని పంపండి. వారు ఇష్టపడతారని మీరనుకొనే ఒక సమావేశ ప్రసంగాన్ని మీరు పంచుకోవచ్చు, వాటి గురించి మీరు ప్రశంసించేది ఏదైనా వారితో చెప్పండి, లేదా యేసు క్రీస్తునందు మీ విశ్వాసము గురించి పంచుకోండి. ఉదాహరణకు, వారి కొరకు పరలోక తండ్రి యొక్క ప్రేమ గురించి వారు తెలుసుకోవాల్సిన అవసరముండవచ్చు. మీరు ఎల్లప్పుడు వారికి వ్యక్తిగతంగా కూడ చెప్పవచ్చు!
5 రోజు: సేవ
ఇతరులకు సేవ చేయుట ఎలా మీ సాక్ష్యమును పంచుకోవడానికి ఒక విధానమవుతుందని మీరు ఆశ్చర్యపడవచ్చు. అపొస్తులుడైన పౌలు, తిమోతికి ఇలా చెప్పాడు, “నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము” (1 తిమోతి 4:12). రక్షకుడు వారికి సేవ చేయునట్లుగా ఇతరులకు సేవ చేయుట ద్వారా, మీ మాదిరి ద్వారా, మీ విశ్వాసాలను మీరు చూపగలరు.
6 రోజు: కళ
కొన్నిసార్లు జనులు తమ ఆలోచనలు మరియు భావాలను పంచుకోవడానికి భిన్నమైన విధానంగా కళను ఉపయోగిస్తారు. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మీరు ఎలా భావిస్తున్నారో పంచుకోవడానికి మీరు చిత్ర లేఖనాలు, శిల్పాలు, కవిత్వము, సంగీతము, లేదా ఏ ఇతర విధాలైన కళను ఉపయోగించవచ్చు.
7 రోజు: సాధారణ సంభాషణలు
ఇవ్వబడిన ఒక విషయం గురించి మీకు గల ఏ ఇతర ఆలోచనలైనా మీరు పంచుకొన్నట్లుగా, సాధారణమైన సందర్భాలలో మీ విశ్వాసాలను తెలియజేయడానికి భయపడవద్దు.
అవును, మీరు సంఘ ప్రోత్సాహకార్యక్రమాల గురించి లేదా మీరు ఈమధ్య చదివిన లేఖనము గురించి మాట్లాడవచ్చు, కానీ అది ఇంకా ఎక్కువ సాధారణమైనదిగా ఉండవచ్చు. ఉదాహరణకు:
-
ప్రకృతి చేత మీరు ప్రేరేపించబడినప్పుడు, ఎవరికైనా దేవుని యొక్క సృష్టి గురించి మీ ప్రశంసను వ్యక్తపరచండి.
-
ఈమధ్య మీకు ఆసక్తికరమైన ఆత్మీయమైన అనుభవము కలిగియుండవచ్చు. అది అంత వ్యక్తిగతం కాని యెడల, దాని గురించి ఒక స్నేహితునికి చెప్పండి.
-
మీకు నచ్చిన పుస్తకం లేదా సినిమాలో సువార్త సాదృశ్యాలను కనుగొనండి, మరియు మీ పరిజ్ఞానములను పంచుకోండి.
సాధారమైన, సహజమైన
మీ విశ్వాసాలను పంచుకోవడానికి భిన్నమైన విధానాలను మీరు కనుగొన్నప్పుడు, మీరు ఆవిధంగా చేయడం మరింత సహజంగా మారుతుంది. ఇది మొదట ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ అది ఫరవాలేదు! జ్ఞాపకముంచుకోండి, మీ సాక్ష్యము దానికదే మీకు సహజమైనది---అది మీరు ఎవరో ఒక భాగము. దానిని పంచుకోవడం సహజంగా కూడ మారుతుంది. ప్రతిరోజు కాస్త ఎక్కువగా వ్యక్తపరచడమే దానికి అవసరము.
ఈ రోజు మీరు సాక్ష్యాన్ని ఎలా పంచుకుంటారు?
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, June 2023 యొక్క అనువాదము. Language. 19045, 421