“ఇప్పుడైతే క్రీస్తు లేచియున్నాడు,” యౌవనుల బలము కొరకు, సెప్టె. 2023.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2023 సెప్టెంబరు
ఇప్పుడైతే క్రీస్తు లేచియున్నాడు
యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి అపొస్తులుడైన పౌలు బోధించిన దానిని నేర్చుకొనండి.
ఇప్పుడైతే క్రీస్తు మృతులలోనుండి లేచియున్నారు.
యేసు క్రీస్తు సిలువపై మరణించారు, సమాధిలో పెట్టబడ్డారు, మరియు మూడవ దినమున మరణము నుండి లేపబడ్డారు.
చనిపోయిన వారిలో ప్రథమఫలము
ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదము ప్రథమఫలము అనగా సంవత్సరములో తొలి పంట. అది పంట కోయడానికి మొదటిది—రాబోయే వాటిలో మొదటిది.
నిద్రించినవారు అనే వాక్యభాగమునకు అర్ధము “చనిపోయిన వారు.”
యేసు క్రీస్తు పునరుత్థానము చెందిన వారిలో ప్రధముడు, మరియు పునరుత్థానము తరువాత, సమస్త జనులు పునరుత్థానము చెందుతారు.
మనుష్యుని ద్వారా మరణము వచ్చెను
ఇది ఆదాము గురించి చెప్పబడింది. అతడి పతనమునకు అర్ధము లోకములోనికి వచ్చిన జనులందరూ చనిపోతారు. (మోషే 4 చూడండి.)
క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు
యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము వలన, జనులందరు పునరుత్థానము చెందుతారు. దాని అర్ధము ఎప్పటికీ జీవించిన లేదా జీవించబోయే ప్రతిఒక్కరు పునరుత్థానము చెందుతారు. మన ఆత్మలు మన శరీరాలతో ఏకము చేయబడతాయి, మరియు మన శరీరాలు పరిపూర్ణము, అమర్త్యముగా చేయబడతాయి. (ఆల్మా 11:43–45 చూడండి.)
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, September 2023 యొక్క అనువాదము. Language. 19047, 421