“నేను ‘ఆనందముగా జీవిస్తున్నానా’?,” యౌవనుల బలము కొరకు, 2024 ఫిబ్రవరి.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 ఫిబ్రవరి
నేను “ఆనందముగా జీవిస్తున్నానా”?
నీఫై చెప్పిన అతని జనులు జీవించిన విధంగా మీరు జీవించుటకు ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నవి.
లేమనీయుల నుండి విడిపోయిన కొద్ది కాలం తరువాత, తన జనులు “ఆనందముగా జీవించితిరని” నీఫై చెప్పెను (2 నీఫై 5:27). అక్కడ వారిని చంపకోరుచున్న మరొక జనుల సమూహము కలదని పరిశీలించినప్పుడు (2 నీఫై 5:1–6, 14 చూడుము), అది ఆశ్చర్యకరముగా ఉండవచ్చును. అటువంటి పరిస్థితులలో ఎవరైనా సంతోషంగా ఎలా ఉండగలరు?
మొట్టమొదటిగా, గమనించండి “మేము ఆనందముగా జీవించితిమి” అనగా “ప్రతి ఒక్క నీఫైయుడు 24/7 సంతోషంగా ఉన్నాడని ” అర్దము కాదు.” సాధారణంగా ఆనందకరమైన విధంగా నడుస్తూ, మరియు ఆనందకరమైన పనులు చేస్తూ జీవించేవారు, అని అర్ధము.మొత్తంమీద, వారి సవాళ్ళు ఎన్నైనా, అది ఆనందకరమైన కాలం.
అయితే “ఆనందకరమైన విధము” ఏమిటి? సవాళ్లను కలిగియున్న మన స్వంత జీవితంలో దానిని అదే మాదిరిగా మనం ఎలా అవలంభించగలము? మనం చూద్దాం!
-
విధేయులుగా ఉందాం. “మనము ప్రభువు యొక్క ఆజ్ఞలను … పాటించుట ఆచరించితిమి” (2 నీఫై 5:10).
సువార్తలో జీవించుట 1వ మెట్టు. మీరు పాపములో తాత్కాలికంగా ఆనందించవచ్చును, కానీ అది శాశ్వతంగా నిలువదు. ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయత “ఆనందకరమైన విధము” కాదు (ఆల్మా 41:10 చూడండి).
-
లేఖనాలను వెదకండి. “నీఫైయను నేను … కంచు పలకలపై చెక్కబడియున్న వృత్తాంతములను తెచ్చితిని” (2 నీఫై 5:12). “మేము … వాటిని పరిశోధించి, అవి కోరదగినవని కనుగొంటిమి; అంతేకాక అవి మాకు అత్యంత విలువైనవి” (1 నీఫై 5:21).
నీఫై యొక్క జనులు లేఖనములను కలిగియుండిరి. మరియు వారు కేవలము కలిగియుండుట మాత్రమే కాదు—వారు వాటిని వెదకియుండిరి.
-
ప్రేరేపించబడిన నాయకులను వినండి. “నీఫైయను నేను, జేకబ్ మరియు జోసెఫ్‌లను దేశములో నా జనులపై యాజకులుగా, బోధకులుగా నియమించితిని” (2 నీఫై 5:26).
ఈ బోధకులు లేఖనములను తమకు మార్గదర్శకములుగా వినియోగించిరి (2 నీఫై 4:15; 6:4 చూడుము).
-
దేవాలయము (మరియు ఇతర పవిత్ర ప్రదేశములను) సందర్శించండి. “నీఫై అను నేను ఒక దేవాలయమును నిర్మించితిని” (2 నీఫై 5:16).
శిష్యులు కూడుకొని మరియు ఆరాధించుటకు సమావేశ గృహాలు మరియు దేవాలయముల వంటి పవిత్ర ప్రదేశములు కలిగియుండుట ముఖ్యము. (నీఫైయులు కేవలము ఒక దేవాలయమును కలిగియుండుట మాత్రమే కాదు— వాస్తవంగా దానిని వినియోగించిరి అని మనము తలంచవచ్చును.) మీరు స్వయంగా దేవాలయమునకు హాజరు కాలేని యెడల మీరు ఎల్లప్పుడూ కుటుంబ చరిత్ర పనిని చేయవచ్చును.
-
ఫలవంతులై ఉండుడి. “నేను నా జనులకు కట్టడములు కట్టుట మరియు పనిచేయుట నేర్పించితిని. … [నేను] నా జనులను శ్రామికులుగాను, మరియు చేతులతో పనిచేయు కార్మికులుగాను అగునట్లు చేసితిని. (2 నీఫై 5:15, 17).
చేయుటకు ఏదో ఒకటి కలిగి యుండుట “ఆనందకరమైన విధము” లోని భాగము! మీకు ఒక గురి మరియు లక్ష్యము నిచ్చుటకు, ఏదో ఒక కేటాయింపు, ఒక పని, ఒక బాధ్యత—ఏదో ఒక వ్యాపకం (అలాగే విశ్రాంతి కొరకు తగినంత విరామం). సమయమంతా పనితో విసుగు చెందితే ఆనందముగా ఉండుట కష్టం.
ప్రస్తుతం మీరు ఆనందముగా జీవిస్తున్నారని అంటారా? లేనిచో, ఎలా మెరుగుపరచుకోవచ్చునో తెలుసుకొనుటకు, నీఫై యొక్క మాదిరి మీకు కొన్ని ఆలోచనలు ఇవ్వగలదు.
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, ఫిబ్రవరి 2024. యొక్క అనువాదము. Language. 19276 421