“క్రీస్తు మరల రాకముందే ఆయనపై నమ్మికయుంచడం,” యౌవనుల బలము కొరకు, 2024, ఏప్రి.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 ఏప్రిల్
క్రీస్తు మరల రాకముందే ఆయనపై నమ్మికయుంచడం
రక్షకుడు రాకముందే నీఫైయులు విశ్వాసం కలిగియున్నారు, మరియు ఆయన మరల రాకముందే మనం విశ్వాసం కలిగియుండవచ్చు.
రక్షకుడు భూమిమీదకు రాకముందే ఆయనపై నమ్మికయుంచడం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? “మెస్సీయ కొరకు ఎదురు చూచుటకు, రాబోవు ఆయన వచ్చియున్నట్లుగా విశ్వసించుటకు”—ప్రాచీన నీఫైయులు ఒప్పించబడ్డారు (జేరమ్ 1:11).
ఈ రోజుల్లో, యేసు క్రీస్తు జీవించి, మరణించి, తిరిగి లేచారని సాక్ష్యమిచ్చే వ్రాతపూర్వకమైన మరియు చారిత్రక గ్రంథాలు మనకున్నాయి. మనము ఇప్పటికే వచ్చియున్న రక్షకునియందు విశ్వసిస్తున్నాము. అయితే మరల రాబోయే రక్షకునిపై కూడా మనము విశ్వసిస్తున్నాము.
యేసు క్రీస్తు రాకముందు, నీఫైయులు:
వారి పాపముల క్షమాపణయందు విశ్వాసం ఉండేది.
“ క్రీస్తు వచ్చునని విశ్వసించువారు తమ పాపక్షమాపణను పొందెదరు మరియు ఆయన వారి మధ్య అప్పటికే వచ్చియున్నట్టు మహదానందముతో సంతోషించెదరు” (మోషైయ 3:13; ఉద్ఘాటన జోడించబడింది).
తమను తాము క్షమించుకుంటున్నారు.
“మరియు ఒక స్వరము నా యొద్దకు వచ్చి ఇట్లనెను; ఈనస్ నీ యొక్క పాపములు నీకు క్షమించబడినవి. … కావున, నా అపరాధము తొలగించబడెను. మరియు నేను చెప్పతిని: ప్రభువా ఇది ఎట్లు చేయబడెను? మరియు ఆయన నాతో చెప్పెను: నీవు ముందెన్నడు వినని మరియు చూచియుండని ఆ క్రీస్తు నందున్న విశ్వాసమును బట్టి ఇది చేయబడెను. ఆయన శరీరమునందు తననుతాను ప్రత్యక్షపరచుకొనుటకు ముందు అనేక సంవత్సరములు గడిచిపోవును; … నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” (ఈనస్ 1:5–8; ఉద్ఘాటన జోడించబడింది).
అద్భుతాలు ప్రదర్శిస్తున్నాడు.
“మేము క్రీస్తును గూర్చి ఎరిగియున్నామని, ఆయన రాకడకు అనేక వందల సంవత్సరముల ముందుగానే ఆయన మహిమ యొక్క నిరీక్షణను మేము కలిగియున్నామని. … మేము నిజముగా యేసు నామమందు ఆజ్ఞాపించగా చెట్లు, పర్వతములు లేదా సముద్రపు అలలు మాకు లోబడునట్లు మా విశ్వాసము నిశ్చలమాయెను.” (జేకబ్ 4:4, 6; ఉద్ఘాటన జోడించబడింది).
బయల్పాటును పొందండి
“క్రీస్తు వచ్చుటకు ముందు కూడా మిక్కిలి దృఢమైన విశ్వాసము గలవారు అనేకులుండిరి, వారు తెర లోపలివి చూడకుండా ఉంచబడలేకపోయిరి, కావున విశ్వాసపు కంటితో చూచిన దానిని వారు తమ కన్నులతో యథార్థముగా చూచిరి” (ఈథర్ 12:19; ఉద్ఘాటన జోడించబడింది).
యేసు క్రీస్తు మరల రాకముందే, మనము విశ్వాసముంచగలము:
క్షమించబడండి, తమను తాము క్షమించుకోండి, అద్భుతాలు చేయండి, మరియు బయల్పాటును పొందుకోండి (నీఫైయులవలె).
ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాము.
మనము మన నిబంధనలను పాఠించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనము సిలెస్టియల్ రాజ్యములో నివసించడానికి సిద్ధమవుచున్నాము. “ఏలయనగా ఈ జీవితము దేవుడిని కలుసుకొనుటకు మనుష్యులు సిద్ధపడు సమయమైయున్నది; అనగా, ఈ జీవితకాలము మనుష్యులు తమ పనులు చేయు సమయమైయున్నది” (ఆల్మా 34:32).
ఆయన రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధం చేయండి.
“భూమిపై జరిగే మహా గొప్ప కార్యము”—ఇశ్రాయేలును సమకూర్చుటలో భాగమవ్వాలని అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు. “మన పరలోక తండ్రి తన మిక్కిలి ఘనమైన ఆత్మలలో అనేకమందిని—బహుశా, ఈ చివరి దశ కొరకు—ఆయన శ్రేష్టమైన జట్టును దాచి ఉంచారని నేను చెప్పగలను. ఆ ఘనమైన ఆత్మలు—ఆ ఉత్తమమైన ఆటగాళ్ళు, ఆ నాయకులు— మీరే!”1
కష్ట సమయాల్లో నిరీక్షణ కలిగియుండండి.
రక్షకుడు తిరిగి వచ్చినప్పుడు, నీతిమంతులు ప్రశాంతంగా జీవిస్తారు. రక్షకుడు రాజ్యపాలన చేస్తారు, అన్యాయము సరిచేయబడుతుంది. “ఏలయనగా ప్రభువు వారి మధ్యనుండును, ఆయన మహిమ వారిమీద నుండును, ఆయన వారి రాజుగా, శాసనకర్తగా ఉండును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:59).
పునరుత్థానమందు నమ్మకముంచండి.
సమస్త మానవజాతి పునరుత్థానం చెందుతారు. మనకు పరిపూర్ణమైన, అమర్త్యమైన శరీరాలు ఉంటాయి. మరణించిన ప్రియమైన వారిని మనం మళ్ళీ చూడవచ్చు. “ఆత్మ మరియు శరీరము దాని పరిపూర్ణ రూపమందు తిరిగి ఐక్యమగును; అవయవము మరియు కీళ్ళు రెండును మనము ఈ సమయమున ఉన్నట్లుగానే దాని సరియైన ఆకారమునకు పునఃస్థాపించబడును” (ఆల్మా 11:43).
రక్షకుడు రాకముందే ప్రాచీన నీఫైయులు ఆయనయందు విశ్వాసం కలిగియున్నారు. రక్షకుడు మరల వస్తారనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండవచ్చు—అప్పుడు “[మనము] [ఆయనను] శక్తి మరియు గొప్ప మహిమ సమేతముగా ఆకాశ మేఘములలో చూచెదము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:44; అపొస్తలుల కార్యములు 1:11 కూడా చూడండి). ఆయన మరలా వస్తారని తెలుసుకోవడం ఈరోజు మీరు చేసే పనిని ఎలా మార్చుతుంది?
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, April 2024 యొక్క అనువాదము. Language. 19353 421