“బాప్తీస్మము పొందినప్పుడు మనము కచ్చితంగా ఏమని వాగ్దానము చేస్తాము?” యౌవనుల బలము కొరకు, 2024 జూన్.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 జూన్
బాప్తీస్మము పొందినప్పుడు మనము కచ్చితంగా ఏమని వాగ్దానము చేస్తాము?
మనము బాప్తీస్మము పొందినప్పుడు యేసు క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనడానికి అంగీకరిస్తున్నామనియు, దేవునికి సేవ చేస్తామనియు, మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తామనియు మనము నిబంధన (లేక వాగ్దానము) చేయుదుము అని లేఖనములు బోధిస్తున్నాయి (మోషైయ 18:10; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37, 77 చూడుము).
“దేవుని యొక్క సముదాయములోనికి రావలెననియు, మరియు ఆయన జనులని పిలువబడాలనే” మన కోరిక నెరవేరుటకు బాప్తీస్మము మనకు సహాయముచేయునని కూడా మనం లేఖనాలలో నేర్చుకుంటాము (మోషైయ 18:8). మరొక విధంగా చెప్పాలంటే, మనము బాప్తీస్మము పొందుటకు ఒక కారణము ఏమనగా మనము యేసు క్రీస్తు సంఘములో చేరి క్రీస్తునందు ఐక్యమగుటద్వారా లభించు ప్రేమ మరియు సహవాసము నందు ఆనందించ వలెనను నదియే.
ప్రభువును సేవించుటకు మరియు ఆయన ఆజ్ఞలను పాటించుటకు ప్రతిజ్ఞ బూనుటలో మన జీవితాంతము అనేక విషయములు ఇమిడియుండును. అనగా, మనము బాప్తీస్మము పొందినపుడు, “ఒకరి భారములు ఒకరు భరించుటకు, … దుఖించు వారితో దుఖించుటకు; ఔను, మరియు, ఆదరణ అవసరములో నున్న వారిని ఆదరించుటకు, మరియు అన్ని సమయములలో మరియు అన్ని విషయములలో మరియు అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు” వాగ్దానము చేయుచున్నాము.” (మోషైయ 18:8).
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, June 2024 యొక్క అనువాదము. Telugu. 19299 421