యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 ఆగష్టు
ఒక శక్తివంతమైన బాంధవ్యము
ఒక నిబంధన ఒక ఒప్పందము కంటే అధికము; అది ఒక బాంధవ్యము.
ఎల్డర్ పిస్టన్ మరియు ఎల్డర్ మొరాస్కో అర్జెంటీనాలో మా ఇంటిలో మా కుటుంబమునకు బోధించునప్పుడు కూర్చుచున్న ఆ ఆకుపచ్చ కుర్చీల యొక్క చిత్రం నాదగ్గర ఇంకా ఉన్నది. వారు ఎంత ఆత్మ శక్తితో బొధించే వారంటే 10-యేండ్ల నా సోదరి మరియు నేను (వయసు 9) వారు కూర్చున్న కుర్చీలను తాకితే చాలు వారి శక్తి మాకు సోకునని ఆశతో పరుగు తీసే వారము.
ఆ శక్తి కుర్చీల నుండి కాదు, కాని దేవునితోను, మరియు యేసు క్రీస్తుతోను నిబంధన బాంధవ్యము పొందుట చేతనే అని నేను వెంటనే నేర్చుకున్నాను.
నా బాప్తీస్మపు అనుభవము
నవంబరు 13, 1977 తేదీన నేను నా మొదటి నిబంధన చేసాను. నా బాప్తీస్మము గూర్చి నాకు ఎక్కువ జ్ఞాపకము లేదు, కాని ఎల్డర్ పిస్టోన్ నన్ను నీటిలోనికి నడిపించడం, మరియు ఎల్డర్ మొరాస్కో నా తల తడి ఆరకముందే నన్ను సంఘ సభ్యునిగా నిర్దారణ చేయడం నాకు జ్ఞాపకం ఉన్నాయి. వార్డులోని క్రొత్త స్నేహితులు ఆర్జెంటీనా పద్ధతిలో నాకు కౌగిలి లేక ముద్దుతో అభినందనలు తెలిపినప్పుడు కలిగిన ఆనందం; మరియు పరలోక తండ్రిని విశ్వసించిన కుమార్తెగా ఉండవలెనని నాకు కలిగిన ధృడమైన కోరిక జ్ఞాపకమున్నాయి.
నేను అనుభవించిన ఆ ఆనందం పరిశుద్ధాత్మ వరము నుండి వచ్చిందని ఆ తరువాత నేను గ్రహించాను. నేను విశ్వాసపూర్వకంగా దేవునితో నా నిబంధనలను పాటించినప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఉంటుందని నేను నేర్చుకున్నాను. దేవునితోను యేసు క్రీస్తుతోను గల నిబంధన బాంధవ్యము ద్వారా కలుగు శక్తివంతమైన దీవెనలలో ఒకటి పరిశుద్ధాత్మ వరము.
ఇప్పుడు, నా యొక్క ప్రేరణలు, తలంపులు, చేతలు వెనుకబడినప్పటికి, నా ప్రయత్నం కొనసాగించగలననే నిరీక్షణ నేను కలిగి యున్నాను. ఎందుకు? ఎందుకంటే సంస్కారములో పాల్గొనుట వలన నా నిబంధనలను పునరుద్ధరించుటకును, మరియు ప్రతివారము సరి క్రొత్త నిబంధనలను చేసుకొనుటకును అది సాధ్యపరుస్తుంది. ఆ దీవెన కొరకు నేను ఎంతో కృతజ్ఞుడను.
ఒక వెచ్చని, నిబంధన బాంధవ్యము
నిబంధనలు మనకు, దేవునికి మధ్య పరస్పర వాగ్దానాలు అని మనము తరచు వింటాము. అది నిజమైనప్పటికి, అది మాత్రమే అంతా కాదు. నిజ జీవితంలో, “నిబంధన పాటించుట ఒక నిర్జీవ వ్యాపార ఒప్పందము కాదు కాని, ఒక వెచ్చని బాంధవ్యము.
ఐతే పరలోక తండ్రి మరియు రక్షకునితో ఒక నిబంధన బాంధవ్యమును మీరు ఏ విధముగా సృష్టించ గలరు? వారు ఇప్పటికే నిన్ను పరిపూర్ణంగా ప్రేమించుచున్నారు మరియు నిన్ను దీవించాలని కోరుచున్నారు (3 నీఫై 14:11). పరస్పర బాంధవ్యం ఏదైనా ఏర్పడుటకు ఇరువైపులనుండి సమయము మరియు ప్రేమ అవసరమవుతుంది.
వారితో మరింత ఎక్కువ సమయం గడపాలని కోరుచున్నావా? వారు చేసిన విషయాలను మీరు చేసినప్పుడు, దేవుడు, యేసు క్రీస్తుతో సమయాన్ని గడుపుతూ,వారి బోధనలను అనుసరిస్తున్నారు! అది కష్ట కాలంలోఉన్న ఒక స్నేహితుని మాటలు వినుట, తోబుట్టువుతో ఆడుకొనడం, లేక దూరం చేయబడ్డారని భావించే వారిని కలుపుకొనుట వంటి సాధారణమైనది కావచ్చును. ఈ మధ్య నేను ఆర్జెంటీనాలో ఒంటరితనంతో బాధ పడుచున్న ఒక స్నేహితురాలితో రికార్డు సంభాషణ మరియు ఫోనులో అక్షర సందేశం పంపించుట ద్వారా దేవునితో నడుస్తూ సమయం గడిపాను. ఆయన పరిశుద్ధాలయములో ప్రభువుతో సమయము గడపగలుగునట్లు నా దేవాలయ సిఫారసును ఎల్లప్పుడు చెలామణిలో ఉంచుకోవాలని కూడా నేను నిశ్చయించుకున్నాను. పరలోక తండ్రి మరియు మీ రక్షకునితో సమయము గడుపుటకు సహాయపడే ఆలోచనల కొరకు మీరు ప్రార్ధించవచ్చును.
వారి యెడల మీ శ్రద్ధను వారికి చూపించాలని కోరుచున్నారా? మీరు నిబంధన చేసుకున్న ఆజ్ఞలను పాటించుటను ఒక నియమాల పట్టికవలె కాకుండా మీ ప్రేమను వ్యక్తపరచుటకు వర్తించండి. ఉదాహరణకు, జ్ఞాన వాక్యము ప్రకారము జీవించడానికి ఆరోగ్యకరమైన బోజనము ఎలా వండాలో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను నా కుమార్తెలకు అదే విధంగా చేయుట నేర్పిస్తున్నాను. మీరు ఇష్టపూర్వకంగా దేవుని ఆజ్ఞలను పాటించినట్లైతే, ఆయనయందు మరియు రక్షకునియందు మీ ప్రేమ వృద్ధిచెందును.
పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మన నిబంధన బాంధవ్యాలు వారిని మరింత బాగుగా తెలుసుకోవడానికి, మరియు—ఒక జత ఆకుపచ్చ కుర్చీలు ఇవ్వగలదానికంటే కూడ అనంతమైన వారి శక్తి మన జీవితాలలో ప్రవేశించుటకు సహాయపడును ఆ శక్తి మనలను శాశ్వతంగా మార్చును!
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, August 2024 యొక్క అనువాదము. Telugu. 19342 421