యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 సెప్టెంబరు
పశ్చాత్తాపమంటే భయపడుతున్నారా?
జెస్సికా జోయ్ స్ట్రాంగ్
సంఘ పత్రికలు
అధ్యక్షులు నెల్సన్ ప్రకారం, మీరు ఎందుకు భయపడకూడదో ఇక్కడున్నది.
మీరు దేనికి భయపడుతున్నారు? రోలర్ కోస్టర్స్? లెక్కల తరగతి? యెషయాను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడమా?
పశ్చాత్తాపం అనగా ఏమిటి? పశ్చాత్తాపపడుట అనే ఆలోచన మీరు దుప్పటిలో దాగుకోవాలని లేదా చాలా ఎక్కువగా చాక్లెట్ తినాలని మీరు కోరుకునేలా చేస్తుందా, ఈ వ్యాసము మీ కోసం.
“దయచేసి భయపడవద్దు లేదా పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేయవద్దు,” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అన్నారు. మరియు మంచి కారణంతో. అధ్యక్షులు నెల్సన్ ప్రకారము పశ్చాత్తాపం అనేది ఏమిటిఏదికాదో ఇక్కడ కొన్ని విషయాలున్నాయి.
దేవుని యొక్క పరిపూర్ణమైన బహుమానమును అంగీకరించుట.
కాబట్టి, పశ్చాత్తాపమంటే మీ భయాన్ని జయించడానికి రక్షకునిని నమ్మడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు దాని గురించి చింతించరు.
అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “లోకము రక్షించబడాలి, మరియు మీరు, నేను రక్షించబడాలి కనుక, [పరలోక తండ్రి] మనకు ఒక రక్షకుని పంపారు.
“… దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రశస్తమైన బహుమానమును మనం అంగీకరించాలి. మన భారములు మరియు పాపములు రక్షకుని పాదాల వద్ద పడవేసి, పశ్చాత్తాపము, మరియు మార్పు నుండి వచ్చే సంతోషాన్ని మనం అనుభవిద్దాం.