2024
మనమంతా ఎంతో విభిన్నముగా ఉంటే ఏ విధంగా ఐక్యపడ గలము?
2024 అక్టోబరు


“మనమంతా ఎంతో విభిన్నముగా ఉంటే ఏ విధంగా ఐక్యపడ గలము?,” యౌవనుల బలము కొరకు, 2024 అక్టోబరు.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 అక్టోబరు

మనమంతా ఎంతో విభిన్నముగా ఉంటే ఏ విధంగా ఐక్యపడ గలము?

బాణం గుర్తులు గల ఘనములు

మనమంతా విభిన్నము కానీ ప్రభువు మనలను “ఐక్యంగా” ఉండమని కోరుచున్నాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:27). మనకు ప్రవక్తలు మరియు అపోస్తలులు బోధించిన ఐక్యతా సూత్రాలు కొన్ని ఇక్కడ ఉన్నవి:

మనము యేసు క్రీస్తులో ఐక్యమై యున్నాము, ఆయన సువార్తలోను, మరియు ఆయన సంఘములోను. “యేసు క్రీస్తు పట్ల మన వ్యక్తిగత నమ్మకము మరియు ప్రేమ ద్వారా మాత్రమే మనం ఒక్కటిగా ఉండగలమని ఆశించగలము.”

ఐక్యతకు ప్రేమ అవసరము. “భాషల యొక్క భిన్నత్వము మరియు అందమైన, ఉత్సాహపరచే సాంస్కృతిక సాంప్రదాయాలలో, భిన్నత్వము ఉన్నప్పటికీ, మనకు ఐక్యత మరియు ప్రేమలో అల్లుకున్న హృదయాలు ఉండవలెను.”

ఐక్యత అంటే ఒకే విధమని కాదు. ఐక్యత మరియు భిన్నత్వము ఒకదానికొకటి వ్యతిరేకము కావు. మనం భిన్నత్వమును ఆహ్వానించుచు, మరియు గౌరవించు వాతావరణాన్ని పెంపొందించుటతో మరింత ఎక్కువ గొప్ప ఐక్యతను సాధించగలము. ఐక్యతకు ఒకే పోలిక అవసరం లేదు, కానీ సామరస్యం అవసరం.

వివాదము మరియు పక్షపాతము లను వెలివేయుట ఐక్యతకు అవసరం. “అక్కడ ప్రతీ ఒక్కరికీ స్థలమున్నది. అయినప్పటికీ, పక్షపాతానికి, ఖండించుటకు లేదా ఏ రకమైన వివాదానికి స్థలం లేదు”.