పాడినవి మరియు పాడని పాటలు
గాయక బృందములో స్థిరముగా మరియు విశ్వాసముగా ఉండమని మనలో ప్రతి ఒక్కరిని నేను వేడుకొంటున్నాను.
“ఈరోజు నా ఆత్మలో ఉన్న సూర్యకాంతి,” “ఏ భూమిపైన ఆకాశములో ప్రకాశించు వెలుగు కన్నా ఎక్కువ మహిమ మరియు కాంతితో ప్రకాశిస్తుంది, ఏలయనగా యేసు నా వెలుగు,”1 అని ఎలైజా హ్యువెట్ వ్రాసింది. ప్రతి స్వరములో ప్రకాశంతో, ఈ అద్భుతమైన పాత క్రైస్తవ కీర్తన చిరునవ్వు నవ్వకుండా పాడుట చాలా కష్టము. కానీ పాడుటకు లేక నవ్వుటకు కష్టముగా మనకు కనిపించే రోజులలో సహాయపడుటకు, ఈ రోజు నేను దానినుండి ఒక పదమును తీసుకోవాలని కోరుతున్నాను, “శాంతికరమైన సంతోష క్షణములు” దొర్లునట్లుగా కనబడుటలేదు. ఇతరులనుండి మీరు వినే సంతోష కీర్తనలను, మీరు ప్రతిధ్వనించలేకపోయినప్పుడు, “(మీరు) పాడలేని పాటలు యేసు వినగలడు” 2 అని ధైర్యమిచ్చు ఈ పాటలోని పదమును, దృఢముగా పట్టుకొని ఉండమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యేసుయేసు యేసు నా వెలుగు కావున,
పడిపోయిన లోకములో దేవుని యొక్క పిల్లలుగా మనము ఎదుర్కొను వాస్తవాల మధ్య, మన విశ్వాసము మరియు ధైర్యము పరీక్షించబడు కష్టమైన రోజులు కొన్ని ఉన్నాయి. ఈ సవాళ్ళు మనలో కొదువుగా ఉండుట, ఇతరులలో లేకపోవుట, లేక జీవితములో కొరత వలన రావచ్చు, కానీ కారణాలు ఏవైనప్పటికీ, ఈ సవాళ్ళు రావచ్చు. మనము ఎక్కువగా పాడుటకు కోరుకొనే పాటలను అవి దొంగిలించగలవని మరియు ఎలైజా హ్యువిట్ తన పల్లవులలో ఒకదానిలో కొనియాడిన “ఆత్మలో వసంతకాలము”3 యొక్క వాగ్ధానమును చీకటిగా చేయుటను మనము కనుగొంటాము.
అటువంటి సమయాలలో మనము ఏమిచేస్తాము? ఒక విషయము, “మనము చూడని (దాని) కొరకు నిరీక్షించిన . . . (మరియు) సహనముతో దాని కొరకు వేచి యుండాలి”4 అని అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను మనము హత్తుకోవాలి. సంతోషము యొక్క కీర్తన, మన మాటతీరు యొక్క శక్తికి క్రిందగా తడబడినప్పుడు, మనము మౌనముగా కొంతసేపు నిలిచి మరియు ఇతరులను వింటూ, మన చుట్టూ ఉన్న సంగీతము యొక్క కాంతినుండి శక్తిని తీసుకోవాలి. “సంగీతపరంగా కష్టమైన” మనలో చాలా మందికి, బలమైన, బాగా నిశ్చలమైన కంఠధ్వని గల మరొకరి ప్రక్కగా నిలబడితే, మన విశ్వాసముకు సాయపడుతుంది మరియు మనము పాడుట విశిష్టంగా వృద్ధి చెందును. నిశ్చయముగా, నిత్యత్వము యొక్క కీర్తనలు పాడుటలో, సంపూర్ణమైన శ్రుతిగల--లోక రక్షకుడు మరియు విమోచకుని ప్రక్క, మనుష్య యత్నానికి సాధ్యమైనంత దగ్గరగా, మనము నిలబడాలి. మన మౌనమును వినుటకు ఆయనకి గల సామర్ధ్యము నుండి ధైర్యమును మరియు మన తరపు తండ్రితో వున్న ఆయన శ్రావ్యమైన మధ్యవర్తిత్వము నుండి నిరీక్షణను తీసుకోగలము. నిజముగా “ప్రభువు దగ్గరగా ఉన్నప్పుడు” “శాంతి యొక్క పావురం నా హృదయములో పాడును (మరియు) కనికరము యొక్క పుష్పములు కనపడును.” 5
మనము ఇతరులను చూచి లేక వినిన దానికంటె కాస్త అపస్వరముగా, కాస్త తక్కువగా ఉన్నామని మనము అనుకున్న రోజులలో, దైవ ప్రణాళిక ద్వారా దేవుని యొక్క గాయకబృందములో అన్ని స్వరములు సమానము కాదని జ్ఞాపకముంచుకోమని మనల్ని, ముఖ్యముగా సంఘము యొక్క యువతను, నేను అడుగుతున్నాను. శ్రేష్టమైన సంగీతము చేయుటకు---సోప్రొనాలు, ఆల్టోస్, మధ్యమ స్వరము మరియు మంద్రస్వరము---భిన్నత్వము కావాలి. ఇద్దరు అసాధారణమైన కడవరిదిన పరిశుద్ధ స్త్రీల యొక్క ఉల్లాసముగల ఉత్తర ప్రత్యుత్తరాలనుండి నన్ను ఉదాహరణ ఇవ్వనియ్యండి: “దేవుని యొక్క జంతువులన్నిటికి గాయకబృందములో ఒక స్థలము ఉంది.”6 మన ప్రత్యేకతను తృణీకరించి లేక అత్యాశగల వినియోగదారుని సంస్కృతి తరమబడిన మూస పద్ధతులు మరియు సామాజిక ప్రసార సాధనాల ద్వారా ఏ సాధ్యమైన గుర్తింపును మించి ఆదర్శవంతము చేయబడిన కల్పిత మూసపద్ధతులతో పోల్చుకొనుటకు ప్రయత్నించినప్పుడు---దేవుడు భిన్నత్వముగల లోకమును సృష్టించినప్పుడు ఆయనచేత ఉద్దేశింపబడిన స్వరము మరియు ధ్వని యొక్క గొప్పతనమును మనము పోగొట్టుకొంటాము.
ఇప్పుడు, ఈ దివ్యమైన బృందగానములో వున్న ప్రతి ఒక్కరు అతడు లేక ఆమె కేవలము స్వంత వ్యక్తిగతమైన సంగీత నాటకాన్ని ఆరవటం ప్రారంభించాలని ఇది చెప్పటం కాదు. భిన్నత్వం అపస్వరం కాదు, మరియు గాయకబృందములకు శిక్షణ అవసరము----ఈ రోజు మన ఉద్దేశము కొరకు, ఎల్డర్ హేల్స్, శిష్యత్వము అని నేను చెప్తున్నాను----కాని ఒకసారి దేవునిచే బయల్పరచబడిన గీతములు మరియు ప్రపంచమునకు ముందుగా కూర్చబడిన మధురమైన వాద్యబృందమును మనము అంగీకరించినప్పుడు, మన పరలోక తండ్రి, మరియొకరిది కాకుండా, మన స్వంత కంఠధ్వనితో పాడుటను సంతోషిస్తారు. మీయందు నమ్మకముంచుము, మరియు ఆయనయందు నమ్మకముంచుము. మీ యోగ్యతను నీచపరచుకొనకండి లేక మీ సహాయమును అప్రతిష్ఠపాలు చేయకండి. అన్నటికిపైగా, పల్లవిలో మీ పాత్రను విడిచిపెట్టకండి. ఎందుకు? మీరు అసమానమైనవారు; మీరు అమూల్యమైనవారు. సమాజము లేక సంఘము యొక్క అంచులలో ఉన్నామని భావించే వారి నష్టముతో కలిపి, ఒక స్వరము యొక్క నష్టము కూడా, మన గొప్పదైన మర్త్య గాయకబృందములో మిగిలిన ప్రతీ గాయకుడిని తక్కువ చేస్తుంది.
కాని పాడుటకు కష్టమైన పాటలు గురించి విశ్వాసము కలిగి ఉండమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పటికి కూడా, వేర్వేరు కారణముల మూలంగా, మరికొన్ని పాడవలసిన, కాని ఇంతవరకు పాడని, పాటలతో నేను ప్రయాసపడతానని నేను వెంటనే ఒప్పుకుంటాను.
ఈ లోకములో ఉన్న ఆస్థిరమైన ఆర్థిక అసమానతను నేను చూసినప్పుడు, “(దేవుడు) నాకిప్పుడు ఇచ్చు దీవెనలు, (మరియు) పైన పొందుపరిచిన ఆనందాలు”7 అన్న శ్రీమతి. హ్యువిట్ తో పాడుటకు నేను దోషిగా భావిస్తాను. మనము గౌరవంగా బీద వారిని శ్రద్ధగా రక్షించు వరకు ఆ బృందగానం సంపూర్ణముగా, విశ్వాసముగా పాడలేము. ఆర్థిక లేమి, ఏడాది తరువాత ఏడాది మరియు తరము తరువాత తరము, ఎడతెగకుండా శపించు శాపము. అది శరీరములకు హాని చేస్తుంది, ఆత్మలను వికలాంగునిగా చేయును, కుటుంబాలకు హాని చేయును, మరియు కలలను నాశనం చేస్తుంది. యేసు మనల్ని చేయమని పలుమార్లు ఆజ్ఞాపించినట్లుగా, పేదరికమును తగ్గించుటకు మనము ఎక్కువ చేయగలిగితే, లోకములో ఉన్న బీదవారిలో కొందరు “ఈ రోజు నా ఆత్మలో సూర్యకాంతి ఉన్నది” యొక్క కొన్ని స్వరములను, వారి జీవితములలో బహుశా మొదటిసారిగా పాడగలుగుతారు.
మన చుట్టూ ఉన్నవారు మానసిక మరియు భావావేశపరమైన వ్యాధిని లేక బలహీనపరచే ఆరోగ్య పరిమితులు అనుభవిస్తున్నప్పుడు, ఆహ్లాదకరమైన, ఎగిరిపడే పాటలు పాడుట కష్టమైనదిగా కూడ నేను కనుగొన్నాను. దురదృష్టవశాత్తు, కుటుంబ సభ్యులతో కలిపి, సంరక్షణ ఇచ్చు వారి సాహసమైన ప్రయత్నములు ఉన్నప్పటికి ఈ భారములు అప్పుడప్పుడు విడువకుండా ఉంటాయి. ఈ దేవుని యొక్క పిల్లలు మౌనముగా బాధపడుట మనము అనుమతించమని, మరియు వారిప్పుడు పాడలేని పాటలు వినుటకు మనము ఆయన సామర్ధ్యముతో నిండి ఉంటామని నేను ప్రార్ధిస్తున్నాను.
ఎదోఒకరోజు తుపాకులు, అపనిందలు, మరియు త్తీవ్ర వ్యంగం, మానవ వివాదమును కుదుర్చుటకు మార్గము కాదని ప్రకటిస్తూ, అన్ని జాతులు మరియు జాతి వర్గముల అంతటా ఒక గొప్ప ప్రపంచ బృందగానం సమన్వయం చేస్తుందని నేనాశిస్తున్నాను. క్లిష్టమైన సమాజము యొక్క సమస్యలను సంతృప్తిగా పరిష్కరించుటకు ఏకైక విధానము, దేవుని ప్రేమించి మరియు ఆయన ఆజ్ఞలను పాటించుట మాత్రమే అని పరలోకము యొక్క ప్రకటింపులు మనకి చెప్తున్నాయి, ఆవిధంగా ఇరుగు పొరుగువారిగా ఒకరినొకరు ప్రేమించుకొనుటకు ఒక శాశ్వతమైన, రక్షించు దారి యొక్క తలుపును తెరుస్తుంది. మనము మెరుగైన లోకము కొరకు ఆశించాలని ప్రవక్త ఈథర్ బోధించాడు. ఆ ఆలోచనను వెయ్య సంవత్సరాల తరువాత చదువుతూ, యుద్ధము మరియు దౌర్జన్యముతో అలసిన మొరోనై, ఆ లోకమునకు యేసుక్రీస్తు యొక్క సువార్త ఎల్లప్పుడు “అతి శ్రేష్టమైన మార్గము”8 అని ప్రకటించాడు.
ఇటువంటి సవాలుల మధ్య, అప్పుడప్పుడు, మరియొక రకమైన పాట వచ్చినందుకు మనమెంత కృతజ్ఞతను కలిగియున్నాము, కాని వేరే కారణము వల్ల దానిని మనము పాడలేమని కనుగొంటాము. ఈ భావనలు చాలా లోతైనవి, మరియు వ్యక్తిగతమైనవి, చాలా పవిత్రమైనవి కూడా అయినప్పుడు, అవి పలకలేనివి లేక పలకకూడనివి--- కార్డెలియా తండ్రిపై వున్న ప్రేమవలె. దాని గురించి ఆమె ఇలా చెప్పింది: “నా ప్రేమ . . . నా నాలుకకన్న గొప్పది. . . . నేను నా గుండెను నా నోటిలోకి ఎత్తలేను.” 9 పవిత్రముగా మనకు వచ్చే ఈ భావములు పలకలేనివి----యేసు నీఫైయుల పిల్లలకు చేసిన ప్రార్ధనవలె ఆత్మీయముగా పలుకుటకు కష్టమైనవి. ఆ సంఘటనకు సాక్ష్యులైనవారు ఇలా వ్రాసారు:
“కన్ను ఎప్పుడు చూడలేదు, చెవి కూడా వినలేదు...యేసు తండ్రితో మాట్లాడిన గొప్ప మరియు ఆద్భుతమైన విషయములను మేము చూసాము మరియు విన్నాము;
. . . మేము చూసిన మరియు వినిన యేసు పలికిన గొప్ప మరియు అద్భుతమైన విషయములు, ఏ నాలుక పలకలేదు, ఏ మనిషి వ్రాయలేడు, మరియు మానవ హృదయములు ఊహించలేవు.”10
ఇటువంటి పవిత్రపరచబడిన క్షణములు పలకబడకుండా ఉంటాయి, ఎందుకనగా మాట, సాధ్యమైనాకూడా, అపవిత్రపరచునట్లు కనబడవచ్చు.
సహోదర, సహోదరిలారా, మనము పాడలేని, లేక పాడుటకు ఇష్టపడని, అనేక పాటలతో మర్త్యలోకములో జీవిస్తున్నాము. మనలో ప్రతి ఒక్కరిని గాయకబృందములో స్థిరముగా మరియు విశ్వాసముగా ఉండమని వేడుకొనుచున్నాను, అక్కడ అన్నిటికంటే విలువైన కీర్తన, “విమోచించు ప్రేమ యొక్క పాట”11 ను నిత్యముగా రుచి చూడగలము. అదృష్టవశాత్తూ, ఈ ప్రత్యేకమైన పాట యొక్క ఆసనములకు అంతు లేదు; ఇతర భాషలు మాట్లాడువారికి, వివిధమైన సంస్కృతులను ఆచరించువారికి, మరియు అనేక ప్రదేశములలో నివసించువారికి అక్కడ చోటు ఉన్నది. పెండ్లికాని వారికి, పెండ్లి అయిన వారికి, పెద్ద కుటుంబాలకు, మరియు పిల్లలు లేనివారికి అక్కడ చోటు ఉన్నది. ఒకప్పుడు వారి విశ్వాసము గురించి ప్రశ్నలు ఉన్నవారికి, మరియు ఇప్పుడింకా ప్రశ్నలు ఉన్నవారికి, అక్కడ చోటు ఉన్నది. భిన్నమైన లైంగిక ఆకర్షణలు ఉన్నవారికి అక్కడ స్థానమున్నది. క్లుప్తంగా, దేవుని ప్రేమించి మరియు ఆయన ఆజ్ఞలను, వ్యక్తిగత పరివర్తన కొరకు పవిత్రమైన కొలిచే కర్రగా గౌరవించు ప్రతిఒక్కరికీ, అక్కడ చోటు ఉన్నది---ఏలయనగా దేవుని యొక్క ప్రేమ మనము పంచుకొన్న పాట యొక్క శ్రావ్యత అయితే, నిశ్చయముగా ఆయనకు లోబడియుండుటకు మన సాధారణమైన తపన, దానిలోని అనివార్యమైన సామరస్యము. దైవికంగా అత్యవసరాలైన ప్రేమ, విశ్వాసము, పశ్చాత్తాపము, కనికరము, నిజాయితీ మరియు క్షమాపణతో అక్కడ12వుండాలని కోరుకొనే వారందరికీ ఈ గాయకబృందములో స్థానం ఉన్నది. మనలో ప్రతిఒక్కరితో “మీరు వున్నట్టుగానే రండి” అని ప్రేమగల తండ్రి చెప్తారు, కాని “మీరున్నట్లుగానే ఉండాలని ప్రణాళిక చేయవద్దు” అని కూడా అంటారు. మనము నవ్వి మరియు మనము ఎలా ఉండాలని ఆలోచించిన దాని కంటే ఎక్కువగా మనల్ని చేయుటకు దేవుడు నిర్ణయించాడని మనము జ్ఞాపకముంచుకుంటాము.
మన ఉన్నతస్థితి కొరకైన ఆయన ప్రణాళికలో ఈ గొప్ప సంగీత నాటకములో, మనము ఆ “సంతోష కీర్తనలను (మన) రాజుకి”13 ఇవ్వ గలిగేంత వరకు, మనము వినయముగా ఆయన అధికార దండమును అనుసరించి మరియు మనము పాడలేని పాటలపై పనిచేయుట కొనసాగిద్దాము. అప్పుడు ఒక రోజు, మన మిక్కిలి ప్రియమైన కీర్తన చెప్పినట్లుగా:
పరలోకము యొక్క సైన్యములతో, మనము పాడెదము మరియు కేకలు వేద్దాం,
దేవునికి మరియు గొర్రె పిల్లకి హోసన్నా, హోసన్నా! ...
... యేసు ఆయన అగ్ని యొక్క రధముతో దిగుతున్నప్పుడు!14
మన నిత్యమైన తండ్రియైన దేవుడు, తన అద్వితీయమైన కుమారుని రాజుల రాజుగా శాశ్వతంగా పారిపాలించి యేలుటకు, ఈ సమయములో భూమిమీదకు మరలా పంపుతారని, ఆ గడియ వస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది ఆయన పునస్థాపించబడిన సంఘము మరియు సమస్త మానవాళికి ఆయన సువార్త యొక్క బోధనలు మరియు రక్షించు విధులను తెచ్చుటకు అది వాహనమని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన సందేశము “ప్రతి ఖండమును ప్రవేశించి మరియు ప్రతి దేశమును దర్శించినప్పుడు”15 యేసు వాస్తవంగా “తన నవ్వుతున్న ముఖమును రూఢిగా (చూపిస్తారు).”16 ఆ రోజు ఆత్మ కొరకు నిత్యమైన సూర్యకాంతి విస్తారముగా ఉండును. ఈ వాగ్ధానము చేయబడిన గడియ కొరకు నేను ఆశగా ప్రార్ధిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో ఆమేన్.