2010–2019
ముగింపు వ్యాఖ్యలు
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

ముగింపు వ్యాఖ్యలు

ప్రభువు వలె మరింతగా ఉండుటకు వ్యక్తిగత యోగ్యతకు మనస్సు మరియు హృదయం యొక్క పూర్తి పరివర్తన కావాలి .

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ చారిత్రక సమావేశము ముగింపునకు మనము వచ్చియుండగా, సందేశాలను ప్రేరేపించినందుకు మరియు మనకు మనోవికాసాన్ని కలిగించిన సంగీతము కొరకు ప్రభువుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనము నిజముగా ఆత్మీయమైన విందును ఆనందించాము.

ఆయన సిద్ధాంతమును విని, లక్ష్యపెట్టు జనులకు యేసుక్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త నిరీక్షణను మరియు సంతోషమును తెస్తుందని మేము ఎరుగుదుము. ప్రతీ గృహము విశ్వాసము యొక్క నిజమైన పరిశుద్ధ ఆశ్రయముగా మారగలదని, అక్కడ సమాధానము, ప్రేమ, మరియు ప్రభువు యొక్క ఆత్మ నివసించవచ్చని కూడ మేము ఎరుగుదుము.

నిశ్చయముగా, పునఃస్థాపన యొక్క అత్యంత ముఖ్యమైన భాగము పరిశుద్ధ దేవాలయము. దాని పరిశుద్ధ విధులు మరియు నిబంధనలు ఆయన రెండవ రాకడయందు రక్షకునికి స్వాగతమిచ్చుటకు సిద్ధపడియున్న జనులను సిద్ధపరచుటకు కీలకమైనవి. ప్రస్తుతం మనము 166 సమర్పించబడిన దేవాలయములను కలిగియున్నాము, మరియు ఎక్కువ రాబోతున్నాయి.

ప్రతీ క్రొత్త మరియు పునర్నిర్మించిన దేవాలయము యొక్క సమర్పణకు ముందు ప్రదర్శనకు తెరవబడును. మన విశ్వాసమునకు చెందని అనేకమంది స్నేహితులు ఆ దేవాలయములను పర్యటనలో పాల్గొంటారు మరియు దేవాలయ దీవెనలను గూర్చి ఎదైనా నేర్చుకుంటారు. ఆ సందర్శకులలో కొందరు ఎక్కువగా తెలుసుకోవటానికి ప్రేరేపించబడతారు. కొందరు దేవాలయ దీవెనల కొరకు వారు ఎలా అర్హులు కాగలరో మనఃపూర్వకంగా అడుగుతారు.

సంఘ సభ్యులుగా, మనము వారి ప్రశ్నలకు జవాబిచ్చుటకు సిద్ధపడాల్సినవసరమున్నది. దేవాలయ దీవెనలు తమను తాము సిద్ధపరచుకొను జనులందరికీ మరియు ఎవరికైనా, లభ్యమవుతాయని మనము వివరించవచ్చు కానీ ఒక సమర్పించబడిన దేవాలయమును వారు ప్రవేశించుటకు ముందు, వారు అర్హులు కావాలి. ప్రభువు తన బిడ్డలందరూ తన దేవాలయములో లభ్యమయ్యే నిత్య దీవెనలలో పాలుపంచుకోవాలని కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించుటకు అర్హులగుటకు ప్రతీ వ్యక్తి తప్పక చేయాల్సిన దానిని ఆయన నిర్ధేశించారు.

అటువంటి బోధించు అవకాశమును ప్రారంభించుటకు ఒక మంచి స్థలము దేవాలయము వెలుపల చెక్కబడిన మాటలకు ఆసక్తిని నడిపించుట: “ప్రభువునకు పరిశుద్ధత; ప్రభువు యొక్క గృహము.” ఈరోజు అధ్యక్షులు ఐరింగ్ యొక్క సందేశము మరియు అనేకమంది ఇతరులు ఎక్కువ పరిశుద్ధంగా ఉండుటకు మనల్ని ప్రేరేపించారు. ప్రతీ దేవాలయము ఒక పరిశుద్ధ స్థలము; ప్రతీ దేవాలయ పోషకుడు ఎక్కువ పరిశుద్ధముగా మారుటకు ప్రయాసపడతాడు.

దేవాలయములో ప్రవేశించుటకు అర్హతలన్నీ వ్యక్తిగత పరిశుద్ధతకు సంబంధించినవి. ఆ సిద్ధపాటును లెక్కించుటకు, దేవాలయ దీవెనలు ఆనందించుటకు కోరు ప్రతీవ్యక్తి, రెండు ఇంటర్యూలను కలిగియుంటారు: మొదట బిషప్పు, బిషప్రిక్కు సలహాదారుడు, లేక బ్రాంచి అధ్యక్షుడితో; రెండవది స్టేకు లేక మిషను అధ్యక్షులు లేక ఆయన సలహాదారులలో ఒకరితో. ఆ ఇంటర్యూలందు, కొన్ని ప్రశ్నలు అడగబడతాయి.

ఈ ప్రశ్నలలో కొన్ని ఈ మధ్యనే స్పష్టత కొరకు సవరించబడినవి. ఇప్పుడు వాటిని మీ కొరకు పునర్వీక్షించాలని నేను కోరుతున్నాను:

  1. నిత్యుడగు తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు, మరియు పరిశుద్ధాత్మయందు మీరు విశ్వాసమును మరియు సాక్ష్యమును కలిగియున్నారా?

  2. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మరియు రక్షకునిగా, విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి మీరు సాక్ష్యము కలిగియున్నారా?

  3. యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన గూర్చి మీరు సాక్ష్యమును కలిగియున్నారా?

  4. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షునిని ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా, సమస్త యాజకత్వ తాళపుచెవులను ఉపయోగించుటకు అధికారము పొందిన ఏకైక వ్యక్తిగా మీరు బలపరుస్తున్నారా?

    ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులను ప్రవక్తలు, దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారులుగా మీరు బలపరుస్తున్నారా?

    సంఘము యొక్క ఇతర ప్రధాన అధికారులు మరియు స్థానిక అధికారులను మీరు బలపరుస్తున్నారా?

  5. ఆయన యెదుట అన్ని సంగతులు “స్వచ్ఛతతో చేయబడవలెను“ అని ప్రభువు చెప్పెను ( సిద్ధాంతము మరియు నిబంధనలు 42:41).

    మీ ఆలోచనలలో, ప్రవర్తనలో నైతిక స్వచ్ఛత కొరకు మీరు శ్రమిస్తున్నారా?

    పవిత్రత చట్టమును మీరు గైకొనుచున్నారా?

  6. మీ కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో మీ వ్యక్తిగత మరియు బహిరంగ ప్రవర్తనలో యేసు క్రీస్తు సంఘము యొక్క బోధనలను అనుసరిస్తున్నారా?

  7. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ బోధనలు, ఆచరణలు లేదా సిద్ధాంతములకు వ్యతిరేకముగా ఉన్న వేటినైనా మీరు బలపరుస్తున్నారా లేదా సమర్థిస్తున్నారా?

  8. మీ గృహములో మరియు సంఘములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా అనుసరించుటకు; మీ కూడికలు హాజరగుటకు; సంస్కారము కొరకు సిద్ధపడి యోగ్యతతో దానిలో పాలుపొందుటకు మీరు శ్రమిస్తున్నారా; మరియు మీ జీవితమును సువార్త యొక్క చట్టములు, ఆజ్ఞలకు అనుగుణముగా జీవిస్తున్నారా?

  9. మీరు చేయు వాటన్నిటిలో నిజాయితీగా ఉండుటకు శ్రమిస్తున్నారా?

  10. మీరు పూర్తి దశమభాగమును చెల్లించువారిగా ఉన్నారా?

  11. జ్ఞాన వాక్యమును మీరు అర్ధము చేసుకొని, గైకొనుచున్నారా?

  12. మాజీ భార్య లేక భర్త లేక పిల్లలతో ఆర్ధిక లేక ఇతర బాధ్యతలను మీరు కలిగియున్నారా?

    అలాగైతే, ప్రస్తుతం ఆ బాధ్యతలను మీరు నిర్వహిస్తున్నారా?

  13. వరము పొందే కార్యక్రమములో ఉపదేశించబడినట్లుగా దేవాలయ వస్త్రమును ధరించుటతో పాటు దేవాలయములో మీరు చేసిన నిబంధనలను పాటిస్తున్నారా?

  14. మీ పశ్చాత్తాపములో భాగముగా యాజకత్వ అధికారులతో పరిష్కరించబడవలసియున్న తీవ్రమైన పాపములు మీ జీవితంలో ఏవైనా ఉన్నాయా?

  15. ప్రభువు యొక్క మందిరములోనికి ప్రవేశించుటకు మరియు దేవాలయ విధులందు పాల్గొనుటకు మిమ్మల్ని మీరు యోగ్యులుగా పరిగణిస్తున్నారా?

రేపు, ఈ సమీక్షించబడిన దేవాలయ సిఫారసు ప్రశ్నలు ప్రపంచమంతటా సంఘ నాయకులకు పంపిణీ చేయబడతాయి.

ఆ ప్రశ్నలకు నిజాయితీగా జవాబిచ్చుటకు అదనముగా, ప్రతీ యుక్త వయస్సుగల దేవాలయ పోషకుడు వారి క్రమమైన దుస్తుల క్రింద యాజకత్వము యొక్క పరిశుద్ధ వస్త్రమును ధరిస్తారని గ్రహించబడింది. ఇది ప్రభువువలే ఎక్కువగా మారుటకు ప్రతీరోజు ప్రయాసపడుటకు అంతర్లీనమైన ఒడంబడికకు చిహ్నము. అది ప్రతీరోజు చేయబడిన నిబంధనలకు విశ్వాసులగా నిలిచియుండుటకు మరియు ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానములో ప్రతీరోజు నిబంధన బాటపై నడుచుటకు కూడా మనకు జ్ఞాపకం చేయును.

ఒక క్షణం, నేను మన యువతతో మాట్లాడాలని కోరుతున్నాను. పరిమితంగా-ఉపయోగించు దేవాలయ సిఫారసుల కొరకు యోగ్యులగుటకు మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ప్రతినిధి బాప్తీస్మము మరియు నిర్ధారణ విధుల కొరకు మీ సిద్ధపాటులో మీకు అన్వయించు ఆ ప్రశ్నలు మాత్రమే మీరు అడగబడతారు. ఆ పరిశుద్ధ దేవాలయ కార్యములో పాల్గొనుటకు మీ యోగ్యత మరియు సమ్మతి కొరకు మేము చాలా కృతజ్ఞత కలిగియున్నాము. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము!

ప్రభువు యొక్క మందిరములో ప్రవేశించుటకు వ్యక్తిగత యోగ్యతకు వ్యక్తిగత ఆత్మీయ సిద్ధపాటు అవసరము. కాని ప్రభువు సహాయముతో, ఏదీ అసాధ్యము కాదు. కొన్ని విషయాలలో, ఒక దేవాలయము కొరకు సిద్ధపరచబడిన జనులను కట్టుట కంటే ఒక దేవాలయమును నిర్మించుట తేలికైనది. వ్యక్తిగత యోగ్యతకు ప్రభువు వలే ఎక్కువగా అగుటకు, ఒక నిజాయితీగల పౌరునిగా ఉండుటకు, ఒక మంచి మాదిరిగా ఉండుటకు, మరియు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండుటకు మనస్సు, హృదయము యొక్క పూర్తి మార్పు అవసరమగును.

“ఎన్నడును అంతముకాని సంతోషము,”1 యొక్క స్థితిలో నిత్యత్వమంతటా మీ కుటుంబ విభాగము నిరంతరం కొనసాగుట కలిపి, అటువంటి సిద్ధపాటు ఈ జీవితంలో విస్తారమైన దీవెనలు మరియు రాబోయే జీవితంలో లెక్కలేని దీవెనలు తెస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను.

ఇప్పుడు నేను మరొక విషయాన్ని చర్చిస్తాను--రాబోయే సంవత్సరము కొరకు ప్రణాళికలు. 2020 వసంతకాలములో, మొదటి దర్శనముగా మనము ఎరిగిన మానవునికి దేవుడు ప్రత్యక్షమైనప్పటి నుండి ఖచ్చితంగా 200 సంవత్సరాలవుతాయి. తండ్రియైన దేవుడు మరియు ఆయన ప్రియమైన కుమారుడైన యేసు క్రీస్తు 14 -సంవత్సరాల- యువకునికి ప్రత్యక్షమయ్యారు. ఆ సంఘటన పరిశుద్ధ బైబిలలో ముందుగా చెప్పబడినట్లుగా ఖచ్చితంగా, యేసు క్రీస్తు యొక్క సువార్త దాని సంపూర్ణతయందు పునఃస్థాపన యొక్క ప్రారంభమును గుర్తించును. 2

తరువాత మొరోనై, బాప్తీస్మమిచ్చు యోహాను, మరియు ప్రాచీన అపోస్తులులైన పేతురు, యాకోబు, యోహానులు కలిపి, పరలోక రాయబారుల నుండి దర్శనముల క్రమము వచ్చెను. తరువాత మోషే, ఏలీయా, మరియు ఏలీషా కలిపి, మిగిలిన వారు అనుసరించారు. భూమి మీద మరలా దేవుని పిల్లలను దీవించుటకు ఒక్కొక్కరు దైవిక అధికారమును తెచ్చారు.

అద్భుతంగా, మనము మోర్మన్ గ్రంథమును కూడా పొందాము: యేసు క్రీస్తు యొక్క మరియొక సాక్ష్యము, పరిశుద్ధ బైబిలుకు తోడైన లేఖనము. సిద్ధాంతము మరియు నిబంధనలు, అమూల్యమైన ముత్యములో ప్రచురించబడిన బయల్పాటులు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు మరియు నిత్య సత్యమును గూర్చి మన జ్ఞానమును బహుగా మెరుగుపరచాయి.

అపోస్తులులు, డెబ్బది, గోత్రజనకుడు, ప్రధాన యాజకుడు, ఎల్డరు, బిషప్పు, యాజకుడు, బోధకుడు, మరియు పరిచారకుడు కలిపి, యాజకత్వము యొక్క తాళపు చెవులు, కార్యాలయాలు, పునఃస్థాపించబడ్డాయి. ప్రభువును ప్రేమించు స్త్రీలు ఉపశమన సమాజము, ప్రాధమిక, యువతులు, సండే స్కూల్, మరియు ఇతర సంఘ పిలుపులందు--యేసుక్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలో ముఖ్యమైన భాగములలో సాహసముగా సేవ చేస్తారు.

కాబట్టి, 2020 ఒక ద్విశతాబ్ది సంవత్సరంగా నియమించబడింది. వచ్చే ఏప్రిల్ సర్వసభ్య సమావేశము ఇదివరకు ఏ సమావేశము కంటే భిన్నముగా ఉంటుంది. తరువాత ఆరు నెలలు, ప్రతీ సభ్యుడు, ప్రతీ కుటుంబము ఒక ప్రత్యేక సమావేశము కొరకు సిద్ధపడతారని నేను ఆశిస్తున్నాను, అది పునఃస్థాపించబడిన సువార్త పునాదులను జ్ఞాపకం చేస్తుంది.

అమూల్యమైన ముత్యములో వ్రాయబడినట్లుగా జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శన వృత్తాంతమును చదువుట ద్వారా మీ సిద్ధపాటును ప్రారంభించుటకు మీరు కోరవచ్చు. వచ్చే సంవత్సరమురండి, నన్ను వెంబడించుములో మన అధ్యయన పాఠ్యక్రమము మోర్మన్ గ్రంధము. “మోర్మన్ గ్రంథము నుండి పొందిన నా జ్ఞానం అకస్మాత్తుగా తీసివేయబడితే నా జీవితం ఎలా భిన్నంగా ఉంటుంది?” లేదా “మొదటి దర్శనము తరువాత జరిగిన సంఘటనలు నాకు మరియు నేను ప్రేమించే వారికి ఎటువంటి మార్పులు తెచ్చాయి?” వంటి ముఖ్యమైన ప్రశ్నలను దీర్ఘంగా ఆలోచించాలనుకోవచ్చు. మరియు, మోర్మన్ గ్రంథ వీడియోలు ఇప్పుడు లభ్యమగుటతో, మీ వ్యక్తిగత, కుటుంబ అధ్యయనములో వాటిని చేర్చుటకు మీరు కోరవచ్చు.

మీ స్వంత ప్రశ్నలు ఎంపిక చెయ్యండి. మీ స్వంత ప్రణాళికను ఏర్పరచండి. పునఃస్థాపన యొక్క మహిమకరమైన వెలుగులో మీరు నిమగ్నమవ్వండి. మీరు చేసినప్పుడు, వచ్చే ఏప్రిల్ సర్వసభ్య సమావేశము జ్ఞాపకార్ధమైనది మాత్రమే కాదు, అది మరచిపోలేనదగును.

ఇప్పుడు ముగిస్తూ, మీలో ప్రతీ ఒక్కరు సంతోషముగా ఉండాలని, గడిచే ప్రతీరోజు పరిశుద్ధముగా మారాలని, నా దీవెనను మరియు నా ప్రేమను మీతో వదలుతున్నాను. మధ్యకాలంలో, సంఘములో బయల్పాటు కొనసాగుతుందని, “దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడి, గొప్ప యెహోవా కార్యము పూర్తయినదని చెప్పు”3 వరకు ప్రభువు యొక్క నడిపింపు క్రింద కొనసాగుతుందని దయచేసి హామీ ఇస్తున్నాను.

దేవుడు జీవిస్తున్నాడనే నా సాక్ష్యముతో, మీ కొరకు నా ప్రేమను మరొసారి ధృవీకరిస్తూ, ఆవిధంగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసే క్రీస్తు! ఇది ఆయన సంఘము మరియు మనము ఆయన జనులము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.