2019
పరిచర్య చేయుట రక్షకుడు చూసినట్లుగా ఇతరులను చూచుట
జూన్ 2019


ministering

పరిచర్య చేయు సూత్రములు, జూన్ 2019

పరిచర్య చేయుట రక్షకుడు చూసినట్లుగా ఇతరులను చూచుట

రక్షకుడు భిన్నంగా చూడబడిన వారితో తన సమయాన్ని ఎక్కువగా గడిపాడు; ఆయన వారి దైవిక సాధ్యతను చూసాడు.

రక్షకుడు చేసినట్లుగా పరిచర్య చేయుటకు మన ప్రయత్నాలలో, మన కంటే భిన్నంగా ఉండే వారికి పరిచర్య చేయుటకు మనము అడగబడవచ్చు. ఇది మనకు నేర్చుకొనుటకు మరియు ఎదుగుటకు అవకాశమునిచ్చును.

మనము ఎవరినైనా తెలుసుకొనుటకు ముందుగా సంప్రదాయ, విద్యాపరమైన, జాతిపరమైన, వయస్సు, గతము లేక ప్రస్తుతపు ప్రవర్తనలు, లేక ఇతర భిన్నత్వాలు వారిని విమర్శించుటను సులభతరము చేయును. ఈ ముందుగా తీర్పు తీర్చుట పక్షపాతము యొక్క ప్రధానమైనది, మరియు రక్షకుడు దానికి వ్యతిరేకంగా హెచ్చించాడు (1సమూయేలు 16:7; యోహాను 7:24 చూడుము).

గత భిన్నత్వాలను మరియు ఇతరులను రక్షకుడు చూసినట్లుగా మనము చూడగలమా? ఇతరులు ఎవరైనా మరియు వారేమి కాగలరో ప్రేమించుటను మనము ఎలా నేర్చుకోగలముొ?

చూచుట మరియు ప్రేమించుట

నిత్య జీవమును ఎలా పొందగలనని అడిగిన ధనికుడైన యువకుని వృత్తాంతమును గూర్చి సుపరిచయమైన కధను బైబిలు చెప్పును: “యేసు అతని చూచి, అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది: నీవు వెళ్ళి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను” (మార్కు 10:21).

కొన్ని సంవత్సరాల క్రితం, డెబ్బిది యొక్క ఎల్డర్ ఎస్. మార్క్ పామర్ ఈ లేఖనము చదివినప్పుడు, ఈ కధలో క్రొత్త భాగము హఠాత్తుగా ఆయన ఎదుట నిలిచింది.

‘యేసు అతని చూచి, అతని ప్రేమించెను.’

“నేను ఈ మాటలను విన్నప్పుడు, మన ప్రభువు నిదానించి, ఈ యువకునిని చూస్తున్న స్పష్టమైన దృశ్యముతో నా మనస్సు నింపబడింది చూచుట లోతుగా అతడి హృదయములోనికి చొచ్చుకొనిపోయి చూచుట, అతడి మంచితనమును మరియు అతడి సాధ్యతను గుర్తించి, అదేవిధంగా అతడి గొప్ప అవసరతను గ్రహించుట.

“తరువాత సాధారణమైన మాటలు యేసు అతని ప్రేమించెను. ఈ మంచి యువకుని కొరకు ఆయన అమితమైన ప్రేమను అనుభూతి చెందాడు, మరియు ఈ ప్రేమ వలన, ఈ ప్రేమతో, యేసు అతడి నుండి ఇంకా ఎక్కువగా కోరాడు. అతడికి కలిగిన సమస్తమును అమ్మివేసి, బీదలకిమ్మనే, కష్టమైన దానిని చేయమని అడగబడినప్పుడు కూడ అటువంటి ప్రేమ చేత చుట్టబడుట ఈ యౌవనునికి ఎలా ఉంటుందో నేను చిత్రించుకున్నాను. …

“[నాకై నేను ప్రశ్నించుకున్నాను] ‘నేను క్రీస్తువంటి ప్రేమతో ఎలా నింపబడగలను, ఆవిధంగా (ఇతరులు) నా ద్వారా దేవుని యొక్క ప్రేమను మరియు మారాలనే కోరికను అనుభవించగలరు?’ రక్షకుడు ఈ ధనికుడైన యువకుడిని చూసినట్లుగా, (నా చుట్టూ ఉన్న వారిని) వారేమి చేస్తున్నారు లేక చేయుట లేదో వారు నిజముగా ఎవరు మరియు వారు ఏమి కాగలరో నేను ఎలా చూడగలను నేను రక్షకునిగా ఎక్కువగా ఎలా కాగలను?”1

ఇతరులను చూచుట నేర్చుకొనుట

రక్షకుడు చూచినట్లుగా ఇతరులను చూచుట గొప్ప బహుమానములను తెచ్చును. ఈ లక్ష్యము వైపు పనిచేస్తున్నప్పుడు మనకు సహాయపడుటకు ఇక్కడ కొన్ని సూచనలున్నాయి.

  • వారిని గూర్చి తెలుసుకొనుము
    పై పై వివరాలను మించి జనులను తెలుసుకొనుటకు ప్రయత్నాలను చేయుము. అనుబంధాలను ఏర్పరచుటకు సమయము మరియు నిజాయితీగల ప్రయత్నము అవసరమని గుర్తించుము. (సహాయము కొరకు “అర్ధవంతమైన అనుబంధాలను నిర్మించుటకు” అనే 2018 ఆగష్టు పరిచర్య సూత్రముల వ్యాసమును చూడుము.)

  • మిమ్మల్ని పరీక్షించుకొనుము.
    తెలిసి లేక తెలియక మీరు చేస్తున్న విమర్శలకు జాగ్రత్త వహించుము. ఇతరుల గురించి మీ అంచనాలను గమనించుము మరియు మీరు అలా ఎందుకు భావిస్తున్నారో గ్రహించుటకు ప్రయత్నించుము.

  • విమర్శను ఆపుము
    ఒక వ్యక్తి యొక్క విలువ పరిస్థితులు నిర్వచించవని గ్రహించుము. వారి స్థానములో మిమ్మల్ని ఉంచుకొని, అదే పరిస్థితులలో మీరున్న యెడల, ఎవరైన మిమ్మల్ని ఎలా చూడాలని మీరు కోరతారో ఆలోచించుము. ఎవరైన ఒకరి అంతర్గత విలువను మరియు దైవిక సాధ్యత నుండి ఎంపికలను మరియు ప్రవర్తనను ప్రత్యేకించి రక్షకుడు చేసినట్లుగా చేయుటకు వారిని చూచుటకు మనకు సహాయపడగలదు.

  • వారిని ప్రేమించుటకు ప్రార్థించుము
    పేరు చొప్పున వారి కొరకు మరియు నిజమైన స్నేహమును వృద్ధి చేయుటకు సహనము కొరకు ప్రార్ధించుము. మీ సేవ పట్ల ప్రార్ధనాపూర్వకంగా చూడుము. మీరు చేసే దానికి మరియు వారికి నిజముగా అవసరమైన దాని మధ్య ఏదైనా ఖాళీ ఉన్నదా?

ధనికులు, పేదవారు, అధికారులు, మరియు సామాన్యులైన జనులు: జీవితపు అనేక భిన్నమైన రీతులనుండి వచ్చిన జనులతో యేసు సమయాన్ని గడిపాడు. వారు ఆయనను, ఆయన ప్రత్యక్షమైన పేదరికపు, లేక ముఖ్యముకాని పరిస్థితులను చూచినప్పుడు, ఆయన తరచుగా ఇతరుల యొక్క తప్పుడు విమర్శకు బాధితుడయ్యాడు. “మనమతని చూచి, ఆపేక్షించునట్లుగా, అతనియందు సురూపము లేదు. “అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. మనుష్యుల వలన విసర్జించబడిన వాడును (యెషయా 53:2– 3).

క్రీస్తు వంటి దర్శనము

ఒక సహోదరి క్రీస్తు వంటి కన్నులతో పొరుగువానిని చూచుటను నేర్చుకొన్న వృత్తాంతమును పంచుకొన్నది.

“జూలియా (పేరు మార్చబడింది) మా ప్రక్కన నివసించేది మరియు స్నేహితులు ఎవరూ లేనట్లు కనబడేది. ఆమె ఎల్లప్పుడు కలత చెంది, కోపముగా ఉన్నట్లు కనబడేది. అది లక్ష్యపెట్టకుండా, నేను ఆమెకు ఒక స్నేహితురాలిగా ఉండుటకు నిర్ణయించుకున్నాను. కాలక్షేపము చేసే స్నేహితురాలిగా ఉండుట మాత్రమే కాదు, ఒక నిజమైన స్నేహితురాలిగా ఉండుటకు. నేను ఆమెను చూసినప్పుడల్లా ఆమెతో నేను మాట్లాడాను మరియు ఆమె చేసే దానిపై ఆసక్తిని చూపాను. నెమ్మదిగా, నేను ఆమెతో స్నేహ బంధమును ఏర్పరుచుకున్నాను.

“ఒకరోజు, జూలియాను దర్శించి, తాను సంఘానికి హాజరుకాగూడదనే నిర్ణయము గురించి ఆమెను అడగాలని నేను నిర్ణయించుకున్నాను.

“ఆమెకు దగ్గరలో కుటుంబము లేక బంధువులు లేరని నేను నేర్చుకున్నాను. ఆమె ఏకైక తోబుట్టువు, ఒక సహోదరుడు, దూరముగా నివసిస్తున్నాడు, ఆమెతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫోను ద్వారా మాట్లాడతాడు. ఆమె తన కుటుంబము మరియు సంఘమును గూర్చి తన విషాదమును, కోపమును క్రుమ్మరించుటను నేను విన్నప్పుడు, ఈ సహోదరి కొరకు తిరస్కరించబడని కనికరముగల భావన మరియు ప్రేమ నాపై చాలా బలముగా కలిగాయి. నేను ఆమె బాధను మరియు నిరాశలను భావించాను. ఆమె జీవితము ఎంత ఒంటరియైనదో నేను హించాను. నా వెనుక ఒక మెల్లని వాక్యము చెప్పుట వినినట్లుగా అది ఉన్నది: ‘నేను కూడా ఆమెను ప్రేమిస్తున్నాను. ఆమెను ప్రేమించు మరియు గౌరవించు.

“నేను కూర్చోని, ఆమెకు ఇక చెప్పాల్సినది లేనంతవరకు విన్నాను. నేను ఆమె కొరకు ప్రేమను మరియు కనికరమును అనుభవించాను. ఈ సహోదరి ప్రేమించబడుట ఎలా ఉంటుందో ఎన్నడూ ఎరగదు. హఠాత్తుగా నేను ఆమెను ఎక్కువ లోతుగా అర్ధము చేసుకున్నాను. ఆమెతో మాట్లాడుటకు అనుమతించినందుకు ఆమెకు ధన్యవాదములు తెలిపాను, నేను ఆమెను హత్తుకొని, ఆమెకు నా ప్రేమను మరియు ఆమె కొరకు గౌరవమును తెలిపాను. ఆ సందర్శనముతో ఆమె నన్ను ఎంతగా సృశించిందో ఆమెకు ఎన్నడూ తెలియదు. పరలోక తండ్రి నా కన్నులు తెరిచాడు మరియు హెచ్చించబడిన కనికరముతో ప్రేమించుటకు నాకు సమర్ధత ఉన్నదని నాకు బోధించాడు. నేను ఆమెకు ఒక స్నేహితురాలిగా ఉండుట మాత్రమే కాదు కానీ ఆమెకు కుటుంబముగా ఉండుటకు నా తీర్మానములో నేను నిర్ణయించాను.

వేరోకరి జీవితములో ఆహ్వానించబడుట ఒక పరిశుద్ధమైన విషయము. ప్రార్థన, సహనము, మరియు ఆత్మ నుండి సహాయముతో, మనము ఎక్కువ క్రీస్తువంటి దర్శనముతో చేయుటకు మనము నేర్చుకోగలము.

వివరణ

  1. S. Mark Palmer, “Then Jesus Beholding Him Loved Him,” Liahona, May 2017, 115.