లియహోనా
సువార్త జీవనము యొక్క శాశ్వతమైన ఆనందము
2024 ఫిబ్రవరి


“సువార్త జీవనము యొక్క శాశ్వతమైన ఆనందము.” లియహోనా, 2024 ఫిబ్రవరి.

లియహోనా నెలవారీ సందేశము, 2024 ఫిబ్రవరి

సువార్త జీవనము యొక్క శాశ్వతమైన ఆనందము

యేసు క్రీస్తు సువార్తలో సహనముగా నుండుట, మరియు ఇతరులు అదే విధముగా చేయుటకు సహాయపడుట ద్వారా శాశ్వతమైన ఆనందము కలుగును.

చిత్రం
ఏదేను తోట నేపథ్యంలో ఆదాము మరియు హవ్వ

The Garden of Eden [ఏదేను తోట], గ్రాంంట్ రామ్నీ క్లాసన్ చేత; Leaving the Garden of Eden [ఏదేనుతోటను విడిచిపోవుట], జోసెఫ్ బ్రిక్లీ చేత

లీహై యొక్క ప్రవచనపరమైన బోధనలలో భూమి మీద మన జీవిత పరమార్ధము యొక్క సంక్షిప్త వ్యక్తీకరణను మానవ జీవన ఆరంభమును గూర్చియు సంక్షిప్తంగా కనుగొనవచ్చును. ఏదేను తోటలో ఆదాము హవ్వలు అమాయకపు స్థితిలో జీవించేవారు. వారు అదే పరిస్థితిలో ఉన్నయెడల, వారికి “ఆనందము లేదు ఎందుకంటే వారికి కష్టాలు తెలియవు; మంచిని చేయరు ఏలయనగా వారు పాపము నెరుగరు” (2 నీఫై 2:23). లీహై ఈ విధంగా వివరించాడు, “ఆదాము మనుష్యులుండునట్లు పతనమాయెను. మరియు మనుష్యులు సంతోషమును కలిగియుండునట్లు వారు ఉన్నారు.” 2 నీఫై 2:25; మరియు మోషే 5:10–11).

మనము పతనమైన ప్రపంచములో ఎదుగుచున్నాము కనుక, మనము ఏదైతే బోధింపబడ్డామో మరియు ఏదైతే అనుభవించామో వాటి ద్వారా మంచి మరియు చెడుల మధ్య తేడాను నేర్చుకొనుచున్నాము. మనం “చేదును రుచి చూచెదము, తద్వారా మంచిని బహూకరించుట [మనం] తెలుసుకొనగలము.”(మోషే 6:55). చేదును విసర్జించి మరియు ఎక్కువగా మంచిని ఆదరించుచు మరియు గట్టిగా హత్తుకొనిన యెడల ఆనందము కలుగును.

ఆనందమును కనుగొనుట

మన కొరకు ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రేమ వలన మన పరలోక తండ్రి తన పరిపూర్ణమైన ఆనందమును మనతో పంచుకొనుటకు ఇప్పుడు మరియు నిత్యము ఆతృతపడుచున్నారు. ఆరంభము నుండి అది ఆయనకు ప్రతి విషయములోను, ఆయన మహిమగల ఆనంద ప్రణాళిక, మరియు మనలను విమోచించుటకు ఆయన యొక్క అద్వితీయ కుమారుని బలిదానమునకు ప్రేరణగా ఉంటున్నది.

దేవుడు ఆనందమునుగాని సంతోషమునుగాని మనమీద బలవంతము చేయడు, కాని అది ఎట్లు కనుగొనవలెనో ఆయన మనకు నేర్పించును ఎక్కడ ఆనందము కనుగొనలేమో కూడ ఆయన మనకు చెప్పును—“దుర్మార్గము ఎన్నడును సంతోషము [కాదు, మరియు] కాలేదు” (ఆల్మా 41:10). అది ఆయన ఆజ్ఞల ద్వారానే మన పరలోక తండ్రి మన ఆనందమునకు దారి చూపును.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ విధంగా వ్యక్తపరిచారు:

“అత్యున్నతమైన సత్యము ఇక్కడున్నది: అధికారము, ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు, మరియు శారీరక సుఖాలు సంతోషాన్నిస్తాయని ప్రపంచం నొక్కి చెప్పినప్పటికీ, అవి ఇవ్వవు! అవి ఇవ్వ జాలవు! “[ఎవరైతే] దేవుని ఆజ్ఞలను పాటిస్తారో వారి ఆశీర్వాదకరమైన మరియు సంతోషకరమైన స్థితికి” ఏదైతే అవి తయారుచేస్తాయో అది శూన్యమైన ప్రత్యామ్నాయం తప్ప మరేమీ కాదు.[మోషైయ 2:41].

“అసలు సత్యమేమిటంటే, ఎక్కడైతే మీరు సంతోషాన్ని ఎన్నటికీ కనుగొనలేరో అక్కడ వెదకడం మరింత ఆయాసకరము!. అయినప్పటికీ, మీరు యేసు క్రీస్తు యొక్క కాడిని యెత్తుకొని, లోకాన్ని జయించుటకు అవసరమైన ఆత్మీయ పరిచర్య చేసినప్పుడు, ఆయన మరియు ఆయన మాత్రమే ఈ లోకపు శోధనల యొక్క ఆకర్షణకు అతీతంగా మిమ్మును పైకెత్తగల శక్తిని కలిగియున్నారు.”1

ఆ విధంగా, దేవుని ఆజ్ఞలను పాటించుటలో శాశ్వతానందం కనిపించును, మరియు దేవుని ఆజ్ఞలు, యేసు క్రీస్తు సువార్తలో కనిపించును. కాని అది మన ఇష్టం. మన బలహీనత వలన ఆజ్ఞలను పాటించుటలో కొంత కాలం విఫలమైనను మనము వెనుకకు తిరిగి, చేదును తిరస్కరించి, మరొక్క సారి మంచిని కొనసాగించవచ్చును. దేవుని ప్రేమ పాపమును మన్నించదు—దయ న్యాయాన్ని దోచుకొనదు—కానీ తన ప్రాయశ్చిచిత్తము ద్వారా యేసు క్రీస్తు పాపము నుండి విమోచనను అనుగ్రహించును.

“అమ్యులెక్ … తన జనులను విమోచించుటకు ప్రభువు నిశ్చయముగా వచ్చును, వారిని పాపములలో విమోచించుటకు రాడు కాని, వారిని పాపముల నుండి విమోచించుటకు [వచ్చును], అని అతడు చెప్పెను.

మరియు పశ్చాత్తాపమును బట్టి, వారి పాపముల నుండి వారిని విమోచించుటకు తండ్రి నుండి ఆయనకు శక్తి ఇవ్వబడెను; కావున వారి ఆత్మల రక్షణకై జనులను విమోచకుని శక్తి యొద్దకు తెచ్చు పశ్చాత్తాపము యొక్క షరతులను గూర్చిన వార్తలను ప్రకటించుటకు ఆయన తన దేవదూతలను పంపెను” (హీలమన్ 5:10–11; ఉద్ఘాటన చేర్చబడినది).

యేసు చెప్పెను:

“నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియుందురు.

మీయందు నా సంతోషము నిలిచియుండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను” (యోహాను15:10–11)

దేవుని ప్రేమను ప్రత్యక్షపరచు—జీవ వృక్షము యొక్క ఫలములను రుచి చూచినపుడు లీహై కలలో ఏమి అనుభూతి పొందెనో అదే ఇది. అతడు ఇలా చెప్పెను, ”దానియొక్క ఫలమును నేను తినుచుండగా అది నా ఆత్మను మిక్కిలి గొప్ప ఆనందముతో నింపెను” 1 నీఫై 8:12; 11:21–23 కూడ చూడుము).

“కావున నేను, నా కుటుంబము కూడా దానిని [ఆ ఫలమును] తినవలెనని కోరుట మొదలు పెట్టితిని”, అని చెప్పినప్పుడు లీహై మన జీవితములలో ఆనందమును పొందుటకు రెండవ మార్గమును కూడ బయలుపరచెను (1 నీఫై 8:12).

చిత్రం
చెట్టు నేపథ్యంలో ఒక చేయి మరొక చేతికి పండును అందించుట

Tree of Life [జీవ వృక్షము] కజూటో యుఓటా చేత

ఇతరులు ఆనందమును కనుగొనుటకు సహాయపడుట

మేము మా పాపముల యొక్క క్షమాపణను పొంది మరియు “మనస్సాక్షి యొక్క సమాధానమును” అనుభవించినప్పుడు బెంజిమెన్ యొక్క జనులవలె, “ఆనందముతో నిండి” యుంటిమి (మోషైయ 4:3). మనము బయటికి చూచి, మన కుటుంబ సభ్యులు మరియు ఇతరులు అదే విధమైన ఆనందము మరియు శాంతిని పొందునట్లు సహాయపడినచో మరొక సారి అదే అనుభూతి పొందుదుము.

యువకునిగా ఆల్మా, యేసు క్రీస్తు యొక్క సువార్తకు వ్యతిరేకముగా నున్న ప్రతి దానియందు సంతోషమును వెదకెను. ఒక దేవ దూత చేత గద్దింపబడిన తరువాత, అతడు మరణమునకు సమీపమైన ఆ “చేదు” నుండి “మంచి” మరియు రక్షకుని కృపా సమృద్ధి వైపు చాల దూరము వచ్చెను (మోషైయ 27:28). సంవత్సరాల తరువాత ఆల్మా తన కుమారుడు హీలమన్ కు ఆనంద పారవశ్యముతో ప్రకటించాడు:

“ఓహో! నేను ఎంత ఆనందమును అనుభవించితిని, ఎంత ఆశ్చర్యకరమైన వెలుగును చూచితిని! నేను ఎంత బాధ అనుభవించితినో, అంత ఎక్కువ ఆనందముతో నా ఆత్మ నింపబడెను …

ఆ సమయము నుండి ఇప్పటి వరకు, నేను ఆత్మలను పశ్చాత్తాపపడునట్లు చేయుటకు, నేను అనుభవించిన అధిక సంతోషమును వారు కూడా అనుభవించగలుగునట్లు. …

ఇప్పుడు ఓ నా కుమారుడా, నా శ్రమల యొక్క ఫలమందు ప్రభువు నాకు మహదానందమును ఇచ్చియుండెను;

ఏలయనగా ఆయన నాకనుగ్రహించిన వాక్యమును బట్టి, అనేకులు దేవుని వలన జన్మించియున్నారు, నేను అనుభవించినట్లు అనుభవించియున్నారు, నేను చూచియున్నట్లు కన్నులారా చూచియున్నారు” (ఆల్మా 36:20, 24–26).

మరొక సందర్భంలో, ఆల్మా సాక్ష్యమిచ్చెను:

“అవును, మరియు ఏ ఆత్మనైనా పశ్చాత్తాపమునకు రప్పించుటకు దేవుని యొక్క హస్తములలో బహుశా నేను ఒక సాధనముగ ఉందునేమోననునది నా అతిశయమైయున్నది, మరియు ఇది నా సంతోషమైయున్నది.

“మరియు ఇదిగో నా సహోదరులలో అనేకులు నిజముగా పశ్చాత్తాపము పొందుట, మరియు వారి దేవుడైన ప్రభువు వద్దకు వచ్చుట నేను చూచినప్పుడు నా ఆత్మ ఆనందముతో నిండిపోవును”(ఆల్మా 29:9–10).

ఇతరులు క్రీస్తునొద్దకు ఆత్మలను తెచ్చి సాధించినప్పుడు తాను పొందిన ఆనందభరితమైన అనుభూతి గూర్చి ఆల్మా చాటింప సాగెను

“నేను నా విజయమందు మాత్రమే సంతోషించను, కానీ నీఫై దేశమునకు వెళ్ళిన నా సహోదరుల [మోషైయ యొక్క కుమారులు] విజయమును బట్టి నా సంతోషము మరింత సంపూర్ణమైనది.

చూడుము, వారు అధికముగా శ్రమపడి అధిక ఫలమును ఫలించిరి; వారి బహుమానము ఎంత గొప్పగానుండును!

ఇప్పుడు, ఈ నా సహోదరుల విజయమును గూర్చి నేను తలంచినప్పుడు శరీరము నుండి నా ఆత్మ వేరు చేయబడుచున్నట్లు కొనిపోబడుచున్నది, నా సంతోషము అంత అధికముగానున్నది” (ఆల్మా 29:14–16).

మనము ఇతరులను “క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమతో” ప్రేమించినప్పుడు అదే ఆనందమును కనుగొనగలము. (మొరోనై 7:47; వచనము 48 కూడా చూడండి), పునస్థాపించబడిన సత్యమును వారితో పంచుకొనుటకు, మరియు నిబంధన జనులతో చేరుటకు ఆహ్వానించగలము).

చిత్రం
గెత్సెమనే లో రక్షకుడు

O My Father [నా తండ్రీ], సైమన్ డ్యూయీ చేత

అత్యధిక దుఃఖము మధ్య ఆనందము

మనము మర్త్యత్వములో తప్పనిసరిగా ఎదుర్కొను పరీక్షలు మరియు సవాళ్ళు మన ఆనందాన్ని ఆటంకపరచునని గాని నాశనము చేయుననిగాని భయపడకూడదు. ఇతరుల కొరకు నిస్వార్ధ సేవ చేసి, నష్ట మూల్యము చెల్లించిన వారిలో ఆల్మా ఒకడు. అతడు కారాగారములో బాధను, ఆకలి మరియు దాహమును, దెబ్బలను, ప్రాణాపాయమును, మరియు తరచుగా హేళన మరియు తృణీకారమును అనుభవించెను. అయినను,అదంతయు “క్రీస్తు యొక్క ఆనందములో మ్రింగివేయబడెను” (ఆల్మా 31:38) బహుశా ఆల్మా యొక్క బాధలు అతనికి ఆ తరువాత అనుసరించిన ఆనందమును ఇంకనూ గొప్పగ చేసెను.

అధ్యక్షులు నెల్సన్ మనకు జ్ఞాపకం చేస్తున్నారు, రక్షకుని శ్రమలలో ఆనందము ఒక పాత్ర వహించింది—“ఆయన యెదుట ఏర్పాటుచేయబడిన ఆనందము కొరకు [ఆయన] సిలువను సహించెను” (హెబ్రీ 12:2)

“దాని గురించి ఆలోచించండి! భూమిపై సహించిన అనుభవాలన్నింటిలో అత్యంత బాధాకరమైన దానిని సహించుటకు మన రక్షకుడు ఆనందముపై తన దృష్టిసారించెను!

ఆయన యెదుట ఏర్పాటుచేయబడిన ఆనందము ఏమిటి? నిశ్చయముగా అది మనల్ని శుద్ధిచేయుట, స్వస్థపరచుట మరియు బలపరచుట యందు ఆనందమును; పశ్చాత్తాపపడు వారందరి పాపముల పరిహారమును చెల్లించే ఆనందమును; శుద్ధిగా మరియు, యోగ్యతగా—ఇంటికి తిరిగి వెళ్ళి, మన పరలోక తల్లిదండ్రులు మరియు కుటుంబాలతో కలిసి జీవించుటకు మీకు, నాకు సుసాధ్యము చేసిన ఆనందమును కలిగియున్నది.”

మనకు లభించబోవు ఆనందముపైగాని లేక మనము ప్రేమించిన వారిపైగాని కేంద్రీకరించినచో, ప్రస్తుతము విపరీతముగాను, బాధాకరముగాను, భయంకరముగాను, అన్యాయముగాను లేక అసాధ్యముగాను అనిపించు వాటిని ఎట్లు సహించగలము?”2

యేసు క్రీస్తు సువార్తలో సహించుటద్వారాను మరియు ఇతరులు అదే విధంగా చేయుటకు సహాయం చేయుట ద్వారా శాశ్వతమైన ఆనందము వచ్చును. మనము దేవుని ప్రేమకు కట్టుబడి, ఆయన అజ్ఞలకు విధేయులమై మరియు రక్షకుని కృపను పొందుచూ ఉన్నయెడల శాశ్వతానందము వచ్చును. సువార్త మార్గంలోని, ప్రయాణంలోనూ ఆనందం అలాగే ముగింపులోను ఆనందం ఉండును. యేసు క్రీస్తు యొక్క సువార్త అనుదిన ఆనందమునకు దారి.

గమనికలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” లియహోనా, నవంబరు 2022, 97.

  2. రస్సెల్ ఎమ్. నెల్సన్ “Joy and Spiritual Survival [ఆనందము మరియు ఆత్మీయ మనుగడ],” లియహోనా, నవం. 2016, 83.

ముద్రించు