లియహోనా
దేవుడు మనలను బలపరచును మరియు సంరక్షించును
2024 ఆగష్టు


“దేవుడు మనలను బలపరచును మరియు సంరక్షించును,” లియహోనా, 2024 ఆగష్టు.

లియహోనా నెలవారీ సందేశము, 2024 ఆగష్టు

దేవుడు మనలను బలపరచును మరియు సంరక్షించును

అధిపతియైన మొరొనై వలె మనము జీవితములో ఎదుర్కొను పోరాటముల కొరకు దైవిక సహాయమును శక్తిని పొందగలము.

చిత్రం
స్వేచ్ఛ యొక్క పతాకమును పట్టుకున్న అధిపతి మొరోనై

ఎరిక్ చౌ చే సచిత్ర వర్ణన

నేను మొదటిసారిగా మోర్మన్ గ్రంధమును చదివినప్పుడు, నీఫైయులకు మరియు లేమనీయులకు మధ్య యుద్ధముల చరిత్రను నేను ఆనందించాను. అధిపతియైన మొరోనై కేవలం 25 సంవత్సరాల వయసులో నీఫైయుల సైన్యములన్నిటి యొక్క యుద్ధ నాయకునిగా నియమింప బడినప్పుడు అతని విశ్వాసము, చాతుర్యము, మరియు వ్యూహముల చేత నేను ఆకర్షించబడ్డాను. అతడు జ్ఞాని, బలవంతుడు, మరియు తెలివైన వాడు. అతడు తన ప్రజల యొక్క స్వేచ్చ మరియు సంక్షేమము కొరకు పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. (ఆల్మా 48:11–12 చూడుము.)

యుద్ధంలో విజయమును మొరోనై తన వలన కలిగినదని అనుకోకుండా విజయాన్ని దేవునికి మరియు తన సైన్యములకు పవిత్రమైన బలమును నిచ్చిన వీరులు కాని స్త్రీలకు మరియు పిల్లలకు ఆపాదించెను. “ప్రభువు మిమ్ములను మా చేతులకు అప్పగించెను” అని ఓడిపోయిన శతృ నాయకునికి అతడు చెప్పెను. ఇప్పుడు మా మతము మరియు క్రీస్తు నందు మా విశ్వాసమును బట్టియే ఇది మాకు చేయబడెనని మీరు గ్రహించవలెనని నేను కోరుచున్నాను,” అప్పుడు మొరోనై ఈ ప్రవచన భావమును ఇట్లు పంచుకొనెను: “మేము ఆయనకు, మా విశ్వాసమునకు మరియు మా మతమునకు నమ్మకముగా ఉన్నంత వరకు దేవుడు మాకు సహాయము చేసి, నిలిపి, కాపాడును”(ఆల్మా 44:3, 4).

మన ఆధునిక జీవితాలలో సవాళ్ళను ఎదుర్కొనుటకు, మొరోనై యొక్క ఆదర్శప్రాయమైన సూత్రములను ప్రయోగించుట ద్వారా సహాయమును పొందవచ్చునని కాల క్రమేణా నేను గ్రహించియున్నాను. లోక రక్షకుడైన యేసు క్రీస్తు నందు విశ్వాసమును సాధన చేసినప్పుడు, ఆయన తన శక్తితో మనలను దీవించును. ఆయన ఆవిధంగా చేయడానికి, దీవెనలను మనము గ్రహించడానికి ముందు మనం మొరోనై తన జీవితంలో ఎదుర్కొన్న నిజమైన యుద్ధములకు సారూప్యమైన పోరాటములను మన జీవితాలలో ఎదుర్కొన్నప్పుడు విజయ సాధన కోసం మనకు లక్ష్యము మరియు ప్రణాళిక అవసరము సారూప్యము. ఆవిధముగ మనం చేసినప్పుడు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మనలను బలపరచి కాపాడతారు.

మన ఉద్దేశమును గ్రహించుట

మొరోనై జనులకు మరీ మరీ జ్ఞాపకం చేసేవాడు వారెవరో (అబ్రహాము నిబంధనకు వారసులు), వారు ఎవరికి చెందుతారో (దేవుని ప్రియమైన బిడ్డలు) మరియు ఏ కారణము చేత వారు పోరాడుచున్నారో (కుటుంబము, విశ్వాసము, మరియు స్వేచ్చ) పలుమార్లు గుర్తు చేసాడు. మొరోనై తన జనులకు వారు కేవలం తమ మనుగడ కోసం, మరియు అణచివేత, బానిసత్వం నుండి స్వేచ్చ కోసం వారు పోరాడు చున్నారని బోధించాడు. అందుకు భిన్నంగా, వారి శతృవులు తమ వైభవము కోసం మరియు ఇతరులను లొంగదీసుకోవడం ద్వారా అధికారం కొరకు పోరాడుచున్నారు.

కొందరు నీఫైయులు అధికారమును స్వలాభం కోసం వాడుకోవాలని చూచినప్పుడు మొరోనై తన అంగీని చించి, గుడ్డ ముక్క మీద తన సందేశం యొక్క ప్రధాన అంశమును వ్రాసాడు: “దేవుని జ్ఞాపకార్ధం, మన మతం, మరియు మన స్వేచ్చ, మరియు మన శాంతి, మన భార్యా పిల్లల కోసం.” ఆ పతాకమును ఎగుర వేసి, దానిని “స్వేచ్ఛా పతాకము” అని పిలిచి. దానితో తన జనులకు వారి పోరాటమంతా ఎందుకో తెలిపి, వారిని ఆ లక్ష్యము వైపు నడిపించుటకు దానిని ఉపయోగించాడు. (ఆల్మా 46:12-13, 19-20 చూడండి.)

ఆత్మీయ జీవిత పోరాటములో, “మనము రక్త మాంసములతో కాదు కాని అంధకార సంబంధమైన అధిపతులతోను … [మరియు] ఆత్మీయ దుష్టత్వముతోను పోరాడుదుము” (ఎఫెసీయులకు 6:12). పోరాటమంతా ఎందుకో మనము కూడా జ్ఞాపకము చేయబడవలసిన అవసరము ఉన్నది. పన్నెండు మంది అపోస్తలుల సమూహములో పూర్వ సభ్యులైన ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్(1926–2004), ఈ ఆలోచనను క్లుప్త సంభాషణలోనైనా అనర్గళంగా వ్యక్తపరచారు.

2004 లో, నేను ఎల్డర్ మాక్స్‌వెల్ చనిపోకముందు ఆస్పత్రి గదిలో దర్శించాను. ఆయనను దర్శించే ప్రతి ఒక్కరితోను, లేక సహాయపడే వారితోను ఎంతో దయగా ఉన్నారు. ఆయన గదిలోనికి వెళ్లిన ఆరోగ్య రక్షణ సిబ్బంది ఏడ్చుచు బయటికి వచ్చేవారు. “ఎల్డర్ మాక్స్వెల్, ఇది నిజంగా కష్టతరము” అని నేను అన్నాను. ఆయన నవ్వుతూ అన్నారు, “ఓహ్, డేల్, మనము మర్త్యలోకంలో నివసిస్తున్న నిత్య జీవులము. మనము నీటి బయట ఉన్న చేపలవలే మన మూలకము బయట ఉన్నాము. మనము నిత్యజీవము యొక్క దృక్పధం కలిగియున్నప్పుడే ఈ సంగతులు దేనికైనా అర్థాన్ని కలిగి ఉంటుంది.

మన దైవిక స్వభావము యొక్క విశాలమైన సంకీర్ణ స్వరూపమును మరియు నిత్యమైన గమ్యమును మరియు మనలను వ్యతిరేకించే క్రూర శక్తులపైన దృష్టిని మనము ఎన్నడూ మరచిపోరాదు. మనము సరియైన విధంగా గ్రహించినచో పరలోక తండ్రి యొక్క ప్రణాళిక మనలను నిత్య రక్షణ కొరకు మరియు ఆత్మీయ దాస్యము నుండి మన స్వేచ్చ కొరకు పోరాడుట కొనసాగించడానికి మనలను ప్రేరేపించును.

చిత్రం
జనులు కోటలను సిద్ధము చేస్తున్నారు

విజయవంతంగా ఉండటానికి ఎటువంటి ప్రణాళికలను చేయాలి

తన సైన్యములు పోరాడిన యుద్ధములన్నిటిలోను మొరోనై విజయము సాధించుటకు వ్యూహమును రచించే వాడు. తమ శతృవుల కార్యకలాపములు మరియు ఉద్దేశములు కనిపెట్టుటకు అతడు గూఢచారులను ఉపయోగించాడు. అతడు ప్రవక్తయైన ఆల్మా నుండి నడిపింపును కోరేవాడు. మొరోనై ఆ స్ఫూర్తిని తన యుద్ధ సన్నాహములో ఉపయోగించేవాడు. రక్షణ విధానము తక్కువగానున్న పట్టణములలో ఎక్కువ సైన్యమును ఉంచుచు, అతడు వనరులను అవసరమును బట్టి వాడే వాడు. తాజా సమాచారమును బట్టి అతడు కార్యాచరణ ప్రణాళికను వ్యూహాత్మకంగా అమర్చే వాడు.

అతడు శతృవులపై ఆ విధంగా పైచేయి సంపాదించేవాడు. గతించిన విజయాలతో ఎప్పుడూ తృప్తిపడలేదు; బదులుగా, అతడు భవిషత్ సవాళ్ళతో వ్యవహరించుటకు తనయొక్క మరియు సైన్యము యొక్క సామర్థ్యములను పెంపొందించుట కొనసాగించే వాడు.

ఆత్మ సంబంధమైన విరోధులతో వ్యవహరించుటకు మనము అటువంటి విధానాలు వినియోగించ వచ్చును. మొదటిగా సాతాను మన జీవితాలలో ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నదో గుర్తించాలి. మన ఉద్దేశ్యము నుండి మన దృష్తి మరలించాలని అతడు ప్రయత్నించును. మనము శోధనను ఎదుర్కొన్నప్పుడు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

  • నా పక్షాన ఈ చర్య బయల్పరచబడిన దేవుని వాక్యమునకు వ్యతిరేకంగాను ఎలా ఉంటుంది?

  • ఈ చర్య వలన కలిగే పర్యవసానాలేమిటి?

  • భూమి మీద నా కర్తవ్యము నెరవేర్చుటకు ఈ చర్య నాకు సహాయపడునా?

చిన్న శోధనకు లొంగిపోయినా కూడా దానివలన కలిగే ఫలితమును మనము గుర్తించవలెను. శోధనకు లొంగిపోవుటవలన మనము “కొంచెము కొంచెముగా విషమును వినియోగిస్తున్నాము (ఆల్మా 47:18), ఇది దుష్ట శక్తుల చేత ఉపయోగించబడిన వ్యూహము, అది ఆత్మీయంగా దారుణమైన ఫలితాలకు నడిపించ గలిగిన అతి సమర్ధవంతమైన వ్యూహం.

మన కడవరి దిన ప్రవక్త నుండి మనము పొందు సూచనలను అనుసరించుట ద్వారా సాతాను శోధనలనుండి మనలను మనము రక్షించుకొనవచ్చును. ఆ విధంగా చేయుట మన నిత్యమైన దృక్పధము నిలుపుకొనుటకును తద్వారా మన క్రియల యొక్క వెల కట్టుటకును సహాయపడును. మన జీవితములోని అనేక రంగాలలో ఎదుర్కొను శోధనలను ఏ విధంగా ఎదుర్కొన వలెనో అను వ్యూహరచన ద్వారా మనము మరింత సరైన ఎంపికలు సమయానుకూలంగా చేయగలము. మనలను నిత్య జీవ లక్ష్యమునుండి దృష్టి మరల్చువాటి నుండి రక్షించుటకు ప్రణాళికా బద్ధమైన వ్యూహములు మరియు విధానాలు మనకు సహాయపడును.

సాంకేతిక పరిజ్ఞానం అందుకు ఉదాహరణం. సాంకేతిక పరిజ్ఞానం రెండంచుల ఖడ్గము వంటిది, మేలైనది మరియు కీడైనది కూడా. మనము పరికరాలను గూర్చి జ్ఞానయుక్తమైన ఎంపికలు చేయు సూచనల కొరకు యువకులు, మరియు వృద్ధులు “సాంకేతిక పరిజ్ఞానము యొక్క బాధ్యత తీసుకొనుట” మరియు యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గ సూచికను చూడవచ్చు. ఇవి మన ఉద్దేశమును మనకు జ్ఞాపకము చేయును, యేసు క్రీస్తు వైపు సూచించును, మరియు పరిశుద్ధాత్మను మన జీవితాలలోనికి ఆహ్వానించుటకు మనకు సహాయపడును. సాంకేతిక పరిజ్ఞానమును ఎట్లు, ఎప్పుడు, మరియు ఎక్కడ మనము ఉపయోగించ వలెను అనే ప్రణాళిక మనలను నీచమైన, ప్రాపంచిక జిత్తుల నుండి రక్షించును.

చిత్రం
లేమనీయులు నీఫైయుల రక్షణ స్థావరాలపై దాడిచేయుట

సారూప్యమైన యుద్ధాల కొరకు సిద్ధపాటు

రాబోవు యుద్ధాలను ముందుగా కనిపెట్టి, మొరోనై తన జనులను ఒక్కొక్కరిని కవచములు, డాళ్ళు, శిరస్త్రాణములు, మరియు ముతక వస్త్రములతో సిద్ధము చేసెను. నగరముల చుట్టు కోటగోడలు కట్టి, వాటి చుట్టు మట్టి దిబ్బలు పోసి, అతడు తన జనులను సమిష్టిగా సిద్ధము చేసెను.

వ్యక్తిగతంగా మనము దేవుని ఆజ్ఞలు పాటించుట ద్వారా ఆత్మీయంగా సిద్ధపడతాము. యేసు క్రీస్తు యొక్క శక్తిని మన జీవితాలలోనికి దగ్గరగా చేసే నిబంధనలు చేసి దేవునితో చేసుకొని పాటిస్తాము. ప్రార్ధించుట, ఉపవాసముండుట, మరియు లేఖనములను పరిశోధించు వంటివి, మనము వ్యక్తి గతముగ, ఏకాంతముగ భక్తిగల చర్యలందు పూనుకుంటాము. మనము పొందు ఆత్మీయమైన నడిపింపుకు స్పందిస్తూ, విశ్వాసముతో పనిచేస్తాము. మనము హృదయపూర్వకంగా సంస్కారముకొరకు సిద్ధపడి మరియు యోగ్యతతో పాలుపంచుకొందుము. ఆ విధముగా మనం చేయుట ద్వారా యేసు క్రీస్తు నందు విశ్వాసములో స్థిరమై యున్న మొరోనైకి సాక్షాత్కరించినట్లు రక్షకుడు మన జీవితాలలోను మరింతగా సాక్షాత్కరించును. అతడు సూచన కొరకు, విడుదల కొరకు రక్షకునిపై ఆధారపడగలడని మొరోనైకి తెలియును (ఆల్మా 48:16). మనము కూడా సూచన కొరకు, మరియు విడుదల కొరకు యేసు క్రీస్తు పై ఆధార పడవచ్చును.

మనము మన కుటుంబములను బలపరచుట ద్వారా మరింత సిద్ధపడ గలము. మనము సంతోషముగా నుండుటకును, మరియు తిరిగి ఆయనను చేరుకొనుట ఎట్లో నేర్చుకొనుటకును మన పరలోక తండ్రి మనలను కుటుంబములు గా ఏర్పరచెను. మన కుటుంబములు మనకు సహాయకరముగా నుందురు. మన వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు ఎట్లున్నప్పటికినీ, మనము దేవుని గొప్ప కుటుంబములో పాలివారమని జ్ఞాపకము చేసుకొని, ఆనందము, ప్రేమ అనుభూతిని పొందగలము.

మనము పరిశుద్ధుల సంఘములలో చేరి, సమిష్టిగా బలము పొంది ఆత్మపరమైన యుద్ధముల కొరకు సిద్ధపడ గలము. మన స్టేకులు మరియు మన జిల్లాలు అటులంటి ఆశ్రయ స్థానము మరియు రక్షణ అందిస్ఠాయ మనము ఎల్లప్పుడు, ముఖ్యముగా కష్టకాలంలో ఒకరి నొకరు ఆత్మీయముగా పోషించ వచ్చును, దేవుని ఆజ్ఞలు పాటించుటకు ఒకరికొకరు సహాయపడవచ్చును, దేవునిపై ఆధారపడుటకు ఒకరినొకరు ప్రోత్సహించ వచ్చును, మన యుద్ధములలోను పోరాటములలోను మనము ఒంటరిగా లేమన్న విషయం మనము గ్రహిస్తాము. మనకు సహాయము చేసి కాపాడగల స్నేహితులు, బోధకులు, మరియు నాయకులు మనకున్నారు. మనం కలిసి సిద్ధపడినప్పుడు మనమంతా బలంగా ఉంటాము.

అసాధారణంగా, తన జనుల యొక్క సంతోషమును తమ దేవునియందు వారి విశ్వాసమునకు మరియు వారి మతమునకు వారు నిజాయితీగా ఉన్నందుకు అని మొరోనై ఆపాదించాడు. సంతోషము కలుగుట పరలోక తండ్రి, మరియు ఆయన ప్రణాలిక వలన, మరియు యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిచిత్తము వలన అని మొరోనై వలే, మనమును గ్రహించాలి. మనము మన ఉద్దేశమును గ్రహించి, సారూప్య యుద్ధాలలో విజయమునకు వ్యూహాత్మకంగా సిద్ధపడినప్పుడు మనము దైవిక సహాయమును, శక్తిని పొందుదుము.

మొరోనై వలే, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మనకు దాస్యమునుండి—మరణము మరియు పాపము నుండి అంతిమ స్వేచ్చను అనుగ్రహించునని నేనెరుగుదును. సమస్త విషయములలో వారి వైపు చూచిన యెడల వారు తమ శక్తితో మనలను దీవించెదరు.

వివరణలు

  1. సాంకేతిక పరిజ్ఞానము యొక్క బాధ్యత తీసుకొనుట,” Gospel Library.

  2. For the Strength of Youth: A Guide for Making Choices [యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శి] (2022), 11. Gospel Library.

  3. See Russell M. Nelson, “Joy and Spiritual Survival,” Liahona, Nov. 2016, 82.

ముద్రించు