ఉపశమన సమాజము మరియు పెద్దల సమూహము
సర్వసభ్య సమావేశ సందేశాలను బోధించుట, నేర్చుకొనుట మరియు అన్వయించుకొనుట


రండి, నన్ను అనుసరించండి

సర్వసభ్య సమావేశ సందేశాలను బోధించుట, నేర్చుకొనుట మరియు అన్వయించుకొనుట

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పెద్దల సమూహములు మరియు ఉపశమన సమాజములు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వారి ఆదివాపు సమావేశాలందు, వారు ఈ కార్యములో వారి ప్రయత్నాలకు ఇటీవల సర్వసభ్య సమావేశ సందేశాలలో బోధనలను ఎలా అన్వయించాలో వారు చర్చిస్తారు. పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు సభ్యుల అవసరాలు మరియు ఆత్మ యొక్క నడిపింపును బట్టి ప్రతి ఆదివారపు కూడిక సమయములో నేర్చుకోవడానికి, సమావేశములో ఒక సందేశమును ఎంపిక చేస్తారు. కొన్ని సందర్భాలలో, బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడు కూడా ఒక సందేశమును సూచించవచ్చును. సాధారణంగా, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహపు సభ్యుల యొక్క సందేశములను నాయకులు ఎంపిక చేయవలెను. అయినప్పటికీ, ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశము నుండి ఏ సందేశమైనా చర్చించబడవచ్చును.

వారి జీవితాలలో సర్వసభ్య సమావేశ సందేశాలలో బోధనలను ఎలా అన్వయించాలో వారికి సహాయపడటానికి బోధకులు దృష్టిసారిస్తారు. ఎంపిక చేయబడిన సందేశమును కూడికకు ముందుగా చదవాలని సభ్యులను ప్రోత్సహించుటకు నాయకులు మరియు బోధకులు మార్గాలను వెదకుతారు.

పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ కూడికల గురించి మరింత సమాచారము కొరకు General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 8.2.1.2, 9.2.1.2, ChurchofJesusChrist.org చూడండి.

బోధించుటకు ప్రణాళిక చేయుట

బోధకులు సర్వసభ్య సమావేశ సందేశమును బోధించుటకు ప్రణాళిక చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు వారికి సహాయపడగలవు. అవసరమైనప్పుడు, ఈ ప్రశ్నలను వారు ధ్యానించినప్పుడు, బోధకులు పెద్దల సమూహము లేక ఉపశమన సమాజ అధ్యక్షత్వముతో సంప్రదిస్తారు.

  • పెద్దల సమూహము లేక ఉపశమన సమాజ అధ్యక్షత్వము చర్చించడానికి ఈ సందేశమును ఎందుకు ఎంపిక చేసారు? ఈ సందేశమును చర్చించిన తరువాత సభ్యులు తెలుసుకొని చేయాలని వారు ఆశించేది ఏమిటి?

  • ప్రసంగీకుడు సభ్యులు ఏమి అర్థము చేసుకోవాలని కోరుచున్నాడు? అతడు లేదా ఆమె బోధిస్తున్న సువార్త సూత్రములు ఏమిటి? నా పెద్దల సమూహము లేదా ఉపశమన సమాజమునకు ఈ సూత్రములు ఎలా అన్వయిస్తాయి?

  • ప్రసంగీకుడు అతడు లేక ఆమె సందేశమునకు ఆధారంగా ఏ లేఖనాలు ఉపయోగించాడు? వారి అవగాహనను లోతుగా చేయగలుగునట్లు సభ్యులు చదవగలిగిన ఇతర లేఖనాలు ఏవైనా ఉన్నాయా? (సందేశము యొక్క ముగింపు వివరణలో లేదా లేఖన దీపికలో మీరు కొన్నిటిని కనుగొనవచ్చు [scriptures.ChurchofJesusChrist.org].)

  • సభ్యులు ఆ సందేశములోని బోధనలను ధ్యానించి, అన్వయించడానికి సహాయపడటానికి ఏ ప్రశ్నలను నేను అడుగగలను? ఆ సందేశముతో వారి జీవితములకు, వారి కుటుంబములకు మరియు ప్రభువు కార్యమునకు గల సంబంధమును చూచేలా వారికి ఏ ప్రశ్నలు సహాయపడతాయి?

  • మన సమావేశములోనికి ఆత్మను ఆహ్వానించుటకు నేను ఇంకా ఏమి చేయగలను? కథలు, సాదృశ్యములు, సంగీతము, లేదా కళాఖండముతో సహా ఆ చర్చను వృద్ధిచేయుటకు నేనేమి ఉపయోగించగలను? ప్రసంగీకుడు అతడు లేక ఆమె సందేశమును సభ్యులు గ్రహించడానికి సహాయపడటానికి ఏమి చేసాడు?

  • ప్రసంగీకుడు ఏవైనా ఆహ్వానాలు ఇచ్చాడా? ఆ ఆహ్వానాలను అనుసరించి చర్య తీసుకొనుటకు సభ్యులకు కోరిక కలుగునట్లు నేనేవిధంగా సహాయపడగలను?

ప్రోత్సాహకార్యక్రమ ఉపాయములు

సర్వసభ్య సమావేశ సందేశముల నుండి నేర్చుకొనునట్లు సభ్యులకు సహాయపడుటకు అనేక మార్గాలు కలవు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కలవు; మీ యాజకత్వ సమూహము లేదా ఉపశమన సమాజములో ఉత్తమముగా పనిచేయు ఇతర ఉపాయాలను మీరు కలిగియుండవచ్చును.

  • లేఖనాలను మన జీవితాలకు అన్వయించండి. వ్యక్తులుగా లేదా పెద్దల సమూహముగా లేదా ఉపశమన సమాజముగా దేవుడు వారికిచ్చిన కార్యమును నెరవేర్చుటకు వారికి సహాయపడగల సత్యముల కొరకు వెదకుతూ సమావేశ సందేశమును సమీక్షించడానికి సభ్యులను ఆహ్వానించండి. ఉదాహరణకు, పరిచారకులుగా, తల్లిదండ్రులుగా, సభ్య సువార్తికులుగా మనకు సహాయపడునట్లు మనము నేర్చుకొనేదేమిటి? మన ఆలోచనలు, భావాలు మరియు క్రియలను ఈ సందేశము ఎలా ప్రభావితం చేస్తుంది?

  • సముదాయాలుగా చర్చించండి. సభ్యులను చిన్న సముదాయాలుగా విభజించి, ప్రతి సముదాయాన్ని సమావేశ సందేశములో వేర్వేరు భాగాలను చదువుటకు, చర్చించుటకు నియమించండి. తరువాత వారు కనుగొన్న ఒక సత్యము అది వారికి ఎలా అన్వయిస్తుందో పంచుకోమని ప్రతి సముదాయాన్ని అడగండి. లేదా వేర్వేరు భాగాలను చదివిన సభ్యులతో సముదాయాలు ఏర్పాటుచేసి, వారు నేర్చుకున్న దానిని ఒకరితోనొకరు పంచుకొనునట్లు చేయండి.

  • ప్రశ్నలకు జవాబుల కోసం వెదకండి. సమావేశ సందేశము గురించి ఈ విధమైన ప్రశ్నలకు జవాబు చెప్పమని సభ్యులను ఆహ్వానించండి: ఈ సందేశములో ఎటువంటి సువార్త సత్యాలను మనం కనుగొంటాము? ఈ సత్యాలను మనమేవిధంగా అన్వయించుకోగలము? ఏ ఆహ్వానాలు మరియు వాగ్దానము చేయబడిన దీవెనలు ఇవ్వబడ్డాయి? దేవుడు మనలను ఏ కార్యము చేయాలని కోరుచున్నారో దాని గురించి ఈ సందేశము మనకు ఏమి బోధిస్తుంది? లేదా సందేశం గురించి లోతుగా ఆలోచించేలా లేదా అది బోధించే సత్యాలను అన్వయించుకునేలా సభ్యులను ప్రోత్సహించే మీ స్వంతంగా కొన్ని ప్రశ్నలను సృష్టించండి. సభ్యులు ఈ ప్రశ్నలలో ఒకటి ఎంచుకొని, ఆ సందేశములో జవాబులు కనుగొనునట్లు వారిని అనుమతించండి.

  • సమావేశ సందేశము నుండి కథనాలను పంచుకోండి. రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యములో తమ బాధ్యతలను నెరవేర్చునట్లు సమావేశ సందేశము నుండి వారిని ప్రేరేపించిన కథనాలను పంచుకొనుటకు సభ్యులను ఆహ్వానించండి. వారు ప్రేమించేవారు మరియు పరిచర్య చేయు వారితోపాటు ఎవరినైనా దీవించుటకు ఈ కథనాలను ఏవిధంగా పంచుకోగలరో పరిగణించుటకు వారిని ప్రోత్సహించండి.

  • ఒక వస్తు పాఠమును పంచుకోండి. సమావేశ సందేశము గురించి బోధించుటకు వారు ఉపయోగించగలిగేలా ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసుకొని రమ్మని ముందుగా కొంతమంది సభ్యులను ఆహ్వానించండి. కూడిక సమయములో, ఆ వస్తువులు ఆ సందేశముతో ఏవిధంగా సంబంధాన్ని కలిగియున్నాయో వివరించమని సభ్యులను అడగండి.

  • గృహములో బోధించుటకు ఒక పాఠాన్ని సిద్ధం చేయండి. సమావేశ సందేశమును ఆధారము చేసుకొని గృహ సాయంకాల పాఠమును ప్రణాళిక చేయుటకు జంటలుగా పనిచేయమని సభ్యులను అడగండి. ఇటువంటి ప్రశ్నలకు వారు జవాబివ్వగలరు: ఈ సందేశమును ఏవిధంగా మన కుటుంబాలకు సమయోచితముగా చేయగలము? మనం పరిచర్య చేయు జనులతో ఈ సందేశమును మనమేవిధముగా పంచుకోగలము?

  • అనుభవాలను పంచుకోండి. సమావేశ సందేశము నుండి అనేక కథనములను కలిసి చదవండి. ఈ కథనములలో బోధించబడిన సిద్ధాంతమును బలపరచు లేదా వివరించు ఉదాహరణలను లేఖనములనుండి లేదా వారి జీవితములనుండి పంచుకోమని సభ్యులను అడగండి.

  • ఒక వాక్యభాగాన్ని కనుగొనండి. వారికి అర్థవంతమైన వాక్యభాగాల కొరకు చూస్తూ సమావేశ సందేశాన్ని వెదకమని సభ్యులను ఆహ్వానించండి. వాక్యభాగాలను, వాటినుండి వారు నేర్చుకున్నదానిని పంచుకోమని వారిని అడగండి. ఈ బోధనలు ప్రభువు కార్యమును నెరవేర్చుటకు వారికి ఏవిధంగా సహాయపడగలవో పంచుకోమని వారిని అడగండి.

సర్వసభ్య సమావేశ సందేశములను ఎలా అధ్యయనము చేయాలి, వాటిని ఎలా బోధించాలో మరిన్ని ఉపాయముల కొరకు “Ideas for Learning and Teaching from General Conference” చూడండి. (సువార్త గ్రంధాలయములో “General Conference” క్రింద “Ideas for Study” క్లిక్ చెయ్యండి.)