“బాప్తీస్మమిచ్చు యోహాను దర్శనం,” Friend,ఫిబ్రవరి 2021
ఫిబ్రవరి 2021, నెలవారీ ఫ్రెండ్ సందేశం
బాప్తీస్మమిచ్చు యోహాను దర్శనం
ఏప్రిల్ స్టాట్ చేత సచిత్ర వివరణలు
ఒక రోజు జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు ఒక సందేహం కలిగింది. బాప్తీస్మము తీసుకోవడానికి ఏది సరైన పద్ధతి? జవాబు తెలుసుకోడానికి వారు ప్రార్థన చేశారు.
ఒక దూత వచ్చెను. అతడు బాప్తీస్మమిచ్చు యోహాను. అతడు యేసుకు బాప్తీస్మమిచ్చెను. జనులకు బాప్తీస్మమివ్వడానికి వారికి యాజకత్వము అవసరమని అతడు వారికి చెప్పెను.
యోహాను జోసెఫ్ మరియు ఆలీవర్‌లను దీవించెను. అతడు వారికి యాజకత్వమునిచ్చెను. అప్పుడు వారు యేసు బాప్తీస్మము పొందిన విధముగా జనులకు బాప్తీస్మము ఇవ్వగలిగారు.
జోసెఫ్ ఆలీవర్‌కు నదిలో బాప్తీస్మమిచ్చెను. తరువాత ఆలీవర్ జోసెఫ్‌కు బాప్తీస్మమిచ్చెను. తరువాత, అనేకమంది ఇతరులు కూడా బాప్తీస్మము పొందారు.
పరలోక తండ్రి జోసెఫ్ స్మిత్ యొక్క ప్రార్థనకు జవాబిచ్చెను కనుక యాజకత్వము తిరిగి భూమిమీదకు వచ్చినది! యేసు పొందినట్లుగా నేను బాప్తీస్మము పొందగలను.
రంగులువేసే పేజీ
మనము బాప్తీస్మము పొందవచ్చును
యేసు క్రీస్తును అనుసరించడానికి మీరేమి చేయగలరు?
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. జనవరి 2021, నెలవారీ ఫ్రెండ్ సందేశము యొక్క అనువాదము. Telugu. 17464 421