“జ్ఞానవాక్యము,” ఫ్రెండ్, ఆగష్టు 2021
ఆగష్టు 2021, ఫ్రెండ్ యొక్క నెలవారీ సందేశం
జ్ఞానవాక్యము
జనులకు సువార్తను గూర్చి బోధించుటకు జోసెఫ్ స్మిత్ కూడికలను నిర్వహించెను. కొన్నిసార్లు మగవారు పొగత్రాగుతూ, పొగాకును నమిలేవారు.
ఇది ఎమ్మా స్మిత్‌ను కలవరపరిచెను. పొగ, పొగాకు అపరిశుభ్రతను కలుగజేసేవి, దానిని గూర్చి ఏదో సరిగా లేదనే భావన కలిగేది. దానిని గూర్చి దేవుడు ఏమని భావిస్తున్నాడోనని ఎమ్మా, జోసెఫ్‌లు ఆలోచించేవారు.
జోసెఫ్ ప్రార్థించినప్పుడు, ప్రభువు సమాధానమిచ్చెను. పొగత్రాగుటను గూర్చి, పొగాకును గూర్చి ప్రభువు సంఘ సభ్యులను హెచ్చరించెను. అవి మన శరీరాలకు మంచివి కాదని ఆయన చెప్పెను. తేనీరు, కాఫీ, మద్యము త్రాగుటను గూర్చి కూడా ఆయన వారిని హెచ్చరించెను.
పళ్ళు, కూరగాయలు, ఇతర ఆరోగ్యవంతమైన ఆహారాలను తినవలెనని దేవుడు చెప్పెను. ఈ బోధనలను మనము జ్ఞానవాక్యమని పిలుస్తాము.
నేను జ్ఞానవాక్యమును పాటించగలను. నేను నా శరీరమును శ్రద్ధగా చూచుకొనిన యెడల పరలోకపు తండ్రి నన్ను దీవించును.
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, August 2021 యొక్క అనువాదము. Telugu. 17471 421