2021
కర్ట్‌లాండ్ దేవాలయము
సెప్టెంబరు 2021


“కర్ట్‌లాండ్ దేవాలయము,” ఫ్రెండ్, సెప్టె. 2021.

సెప్టెంబరు 2021, నెలవారీ ఫ్రెండ్ సందేశం

కర్ట్‌లాండ్ దేవాలయము

చిత్రం
దర్శనములో కర్ట్‌లాండ్ దేవాలయాన్ని చూస్తున్న జోసెఫ్ స్మిత్

ఒక దేవాలయాన్ని నిర్మించమని దేవుడు జోసెఫ్ స్మిత్‌కి చెప్పాడు. అది ఎలా ఉంటుందోనని ఒక బయల్పాటు చూపింది. అది దేవుని మందిరమైయుంటుంది.

చిత్రం
కర్ట్‌లాండ్ దేవాలయ నిర్మాణం

దేవాలయాన్ని నిర్మించడంలో సహాయపడేందుకు పరిశుద్ధులు కలిసి పనిచేసారు. పురుషులు ఎత్తైన గోడలు నిర్మించారు. స్త్రీలు పరదాలు, తివాచీ తయారు చేసారు. పనివారి కోసం పనిముట్లు మరియు నీళ్ళు తీసుకురావడంలో పిల్లలు సహాయపడ్డారు.

చిత్రం
పాడుతున్న జనులు

దేవాలయం పూర్తయినప్పుడు పరిశుద్ధులు లోనికి వెళ్ళారు. వారు కీర్తన పాడారు మరియు “హోసన్నా!” అని అరిచారు. దేవాలయాన్ని ప్రతిష్ఠించడానికి (దీవించడానికి) జోసెఫ్ ప్రార్థన చేసారు.

చిత్రం
కర్ట్‌లాండ్ దేవాలయాన్ని దర్శించిన యేసు క్రీస్తు

ఒక వారం తరువాత, దేవాలయములో జోసెఫ్ స్మిత్‌ మరియు ఆలీవర్ కౌడరీలను యేసు క్రీస్తు దర్శించారు. దేవాలయాన్ని తన మందిరంగా అంగీకరించానని యేసు చెప్పారు.

చిత్రం
దేవాలయ స్థలంలో పిల్లలు

నేడు ప్రపంచమంతటా దేవాలయాలున్నాయి! ప్రతీ దేవాలయం ఒక పరిశుద్ధ ప్రదేశం. ఏదో ఒకరోజు నేను లోపలికి వెళ్ళి, దేవునితో ప్రమాణాలు చేస్తాను.

రంగులువేసే పేజీ

దేవాలయం ఒక పరిశుద్ధ ప్రదేశం

చిత్రం
మరొకరితో ఫ్రెండ్ యొక్క ప్రతిని పంచుకుంటున్న ఒక బిడ్డ

డౌన్లోడ్ చేయడానికి చిత్రపటముపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

దేవాలయం ఎందుకు ప్రత్యేకమైనది?

ముద్రించు