“మనం భూమిపైకి రాకముందు,” నెలవారీ ఫ్రెండ్సందేశాలు 2022 జనవరి
“మనం భూమిపైకి రాకముందు”
నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2022 జనవరి
మనం భూమిపైకి రాకముందు
మనం పుట్టకముందు, మన పరలోకపు తండ్రితో కలిసి పరలోకంలో జీవించాము. ఆయన తన సంతోషకర ప్రణాళిక గురించి మనకు బోధించారు.
మనము దేహములను పొందుటకు భూమికి వస్తాము అని పరలోకపు తండ్రి చెప్పారు. మనము నేర్చుకుంటాము మరియు ఎంపికలు చేస్తాము. కొన్నిసార్లు మనం తప్పులు చేస్తాము. మనకు రక్షకుడు అవసరం.
ఎలా జీవించాలో రక్షకుడు మనకు చూపిస్తారు. మరియు మనం తప్పుగా ఎంపిక చేసుకున్నప్పుడు, మనం పశ్చాత్తాపపడగలము.
“నేనున్నాను, నన్ను పంపుము” అని యేసు అన్నారు. పరలోకపు తండ్రి ఆయనను మన రక్షకునిగా ఎన్నుకున్నారు. మనలను రక్షించడానికి భూమిపైకి వస్తానని యేసు వాగ్దానం చేసారు.
నేను యేసును అనుసరించగలను. ఏదో ఒక రోజు నేను తిరిగి వెళ్ళిపరలోక తండ్రితో జీవించగలను.
Intellectual Reserve, Inc. ద్వారా © 2021 All rights reserved. అ.సం.రాలలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, January 2022 యొక్క అనువాదం Telugu. 18295 421