2023
యేసు ఒక స్త్రీని స్వస్థపరుస్తారు
2023 ఫిబ్రవరి


“యేసు ఒక స్త్రీని స్వస్థపరుస్తారు,” నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 ఫిబ్రవరి

“యేసు ఒక స్త్రీని స్వస్థపరుస్తారు”

నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 ఫిబ్రవరి

యేసు ఒక స్త్రీని స్వస్థపరుస్తారు

చిత్రం
ఒక వీధిలో నడుస్తున్న యేసు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

ఒక రోజు యేసు రద్దీగా ఉండే వీధిలో నడిచారు. ఆ గుంపులో 12 ఏళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక స్త్రీ కూడా ఉంది.

చిత్రం
యేసు యొక్క వస్త్రాన్ని తాకుతున్న స్త్రీ

యేసు తనను స్వస్థపరచగలరనే నమ్మకం ఆ స్త్రీకి ఉంది. ఆమె అక్కడికి చేరుకొని, ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె స్వస్థపరచబడింది!

చిత్రం
యేసు క్రీస్తు

”నా వస్త్రమును ముట్టినది ఎవరు?” అని యేసు అడిగారు. ఆ స్త్రీ భయపడింది. ఆమె యేసు యెదుట మోకరించి, జరిగినది చెప్పింది.

చిత్రం
ఒక స్త్రీతో మాట్లాడుతున్న యేసు

యేసు ప్రేమగల వాడు. ఆయన, ”ధైర్యముగా ఉండుము” అన్నారు. ఆమె విశ్వాసం వల్లనే ఆమె స్వస్థత పొందినదని ఆయన ఆమెతో చెప్పారు.

చిత్రం
ఒక పడవలో పిల్లలు

నేను యేసు క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండగలను. ఆయన ప్రేమ నాకు సహాయం చేస్తుంది మరియు నాకు శాంతినిస్తుంది.

రంగులువేసే పేజీ

యేసు క్రీస్తు నందు నాకు విశ్వాసము కలదు

చిత్రం
ప్రార్థిస్తున్న తల్లి మరియు కుమారుడు

డౌన్‌లోడ్ చేయడానికి చిత్రంపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

మీ విశ్వాసమును మీరెలా చూపిస్తారు?

ముద్రించు