ఫ్రెండ్
యేసు ఒక్కొక్కరిని దీవించెను
2024 అక్టోబరు


“యేసు ఒక్కొక్కరిని దీవించెను,” ఫ్రెండ్ 2024 అక్టోబర్, 26–27.

2024 అక్టోబరు, నెలవారీ ఫ్రెండ్ సందేశం

యేసు ఒక్కొక్కరిని దీవించెను

చిత్రం
ప్రవక్తలు నీఫైయులకు బోధించుట

ఆండ్రూ బోస్లీ చేత సచిత్ర వర్ణన

ప్రవక్తలు యేసు క్రీస్తు యొక్క మరణము యొక్క సూచనలను గురించి నీఫైయులకు బోధించిరి. ఆయన మరణించి నప్పుడు, దేశములో మూడు దినములు చీకటి క్రమ్మెను. తరువాత, జనులు పరలోక తండ్రి యొక్క స్వరము పరలోకము నుండి మాట్లాడుట విన్నారు.

చిత్రం
యేసు క్రీస్తు నీఫైయులను సందర్శించడం

“ఇదిగో నా ప్రియ కుమారుడు” అని పరలోక తండ్రి చెప్పెను (3 నీఫై 11:7). యేసు నీఫైయులకు ప్రత్యక్షమాయెను ఆయన పునరుత్థానము చెందెను! ఆయన అనేక సంగతులను నీఫైయులకు బోధించెను. పశ్చాత్తాప పడమని మరియు ఆయనను అనుసరించమని ఆయన వారికి చెప్పెను.

చిత్రం
యేసు రోగులను స్వస్థపరచుట

స్వస్థత పొందునట్లు రోగులను తన యొద్దకు తేవలసినదిగా ఆయన జనులను కోరెను. ఆయన వారిని ఆశీర్వాదించెను.

చిత్రం
యేసు పిల్లలను దీవించుట

ఆయన పిల్లలందరిని కూడ ఒక్కొక్కరిని దీవించెను. దేవదూతలు ఆ పిల్లలను చుట్టుముట్టిరి.

రంగులువేసే పేజీ

పరలోక తండ్రి పిల్లలను ప్రతీఒక్కరిని రక్షకుడు ప్రేమించును.

చిత్రం
రంగులువేసే పేజీ

ఆడమ్ కోఫోర్డ్ చేత సచిత్ర వర్ణన

రక్షకుని ప్రేమను మీరు ఎలా అనుభవిస్తున్నారు?

ముద్రించు