“వినండి, ఆలకించండి, లక్ష్యపెట్టండి,” యౌవనుల బలము కొరకు, జన. 2021, 32.
2021 జనవరి, యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము
వినండి, ఆలకించండి, లక్ష్యపెట్టండి
సిద్ధాంతము మరియు నిబంధనలలో మొట్టమొదటి మాట ఆలకించుడి (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:1 చూడండి). దాని అర్థము “విధేయులు కావాలనే ఉద్దేశ్యంతో వినడం.” ఆలకించడం అంటే “ఆయనను వినడం”— రక్షకుడు చెప్పే దానిని వినడం, ఆపై ఆయన సలహాను లక్ష్యపెట్టడం. “ఆయనను వినండి”— అనే ఆ రెండు మాటలలో— ఈ జీవితంలో విజయం, సంతోషం మరియు ఆనందానికి దేవుడు మనకు నమూనా ఇస్తారు. మనం ప్రభువు మాటలు వినాలి, వాటిని ఆలకించాలి మరియు ఆయన మనకు చెప్పిన దానిని లక్ష్యపెట్టాలి!
ఆయనను వినడానికి మనము ఎక్కడికి వెళ్ళగలము?
మనం లేఖనాలకు వెళ్ళవచ్చు. మనము దేవాలయంలో కూడా ఆయనను వినవచ్చు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను గుర్తించగల మన సామర్థ్యాన్ని మనం మెరుగుపరచుకున్నప్పుడు, మనం మరింత స్పష్టంగా ఆయనను వింటాము. చివరగా, మనము ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల మాటలను వింటున్నప్పుడు మనము ఆయనను వింటాము.
రక్షకుడు చెప్పినదానిని మరియు తన ప్రవక్తల ద్వారా ఆయన ఇప్పుడు చెబుతున్న దానిని మీరు మరింత ఉద్దేశపూర్వకంగా విని, ఆలకించి, లక్ష్యపెట్టినప్పుడు ఏమి జరుగుతుంది? శోధన, శ్రమలు మరియు బలహీనతను ఎదుర్కోవడానికి మీరు అదనపు శక్తిచేత దీవించబడతారని నేను వాగ్దానం చేస్తున్నాను. మీ కుటుంబ సంబంధాలు మరియు రోజువారీ పనిలో అద్భుతాలను నేను వాగ్దానం చేస్తున్నాను. మీ జీవితంలో అల్లకల్లోలం పెరిగినా ఆనందాన్ని అనుభవించే మీ సామర్థ్యం పెరుగుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను.
© 2020 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.స.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, January 2021 యొక్క అనువాదము. Telugu. 17463 421