“నా జీవితంలో ప్రభువు స్వరమును నేను వింటున్నానని ఎలా తెలుసుకోగలను?” (1)యౌవనుల బలము కొరకు, (2) ఫిబ్రవరి 2021, 29.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, ఫిబ్రవరి 2021
నేను ప్రభువు స్వరమును వింటున్నానని నా జీవితంలో ఎలా తెలుసుకోగలను?
ఏ విధంగా యేసు క్రీస్తు మాటలను వినగలమో మరియు “మరింత బాగా, తరచుగా ఆయనను ఆలకించుటకు ఎటువంటి చర్యలు తీసుకోగలమో” మరియు “లోతుగాను మరియు తరచుగాను ఆలోచించమని” అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు. (“‘How Do You #HearHim?’) A Special Invitation,” Feb. 26, 2020, blog.ChurchofJesusChrist.org).
లేఖనముల ద్వారా మరియు ప్రవక్తల మాటలద్వారా మనము ఆయనను ఆలకించగలము. కాని ఆ మాటలను వినుట లేక చదవడం మాత్రమే ముఖ్యమైనది కాదు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా, ప్రభువు వివరించాడు:
“నా స్వరము మీతో ఈ మాటలను పలుకుచున్నది; ఏలయనగా అవి నా ఆత్మచేత మీకు అనుగ్రహించబడినవి … ;
“అందువలన, మీరు నా స్వరము విన్నారని సాక్ష్యమివ్వవచ్చు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:35–36).
అదనముగా, ఆయనను ఆలకించాలని కోరుట మనము దూకుడుగా చేసే పని కాదు. “దానికి మనస్ఫూర్తి, స్థిరమైన సంకల్పము కావలెను” అని అధ్యక్షుడు నెల్సన్ అన్నారు (“Hear Him,” ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము [ఎన్సైన్ లేక లియహోనా, మే 2020, 89]).
మీరు అధ్యయనము, ప్రార్ధన, ఆరాధన, సేవ, చేస్తూ మరియు ప్రభువు ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయన తన ఆత్మతో మిమ్మల్ని దీవించును మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మిమ్మల్ని మార్చును. అప్పుడు మీరు ఆయన స్వరము విన్నారని మీరు తెలుసుకోగలరు.
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. యౌవనుల బలము కొరకు నెలసరి సందేశము, ఫిబ్రవరి 2021, యొక్క అనువాదము. Telugu. 17464 421