2021
నిరంతర బయల్పాటు
2021 మార్చి


“నిరంతర బయల్పాటు,” యౌవనుల బలము కొరకు, 2021, మార్చి, 16.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2021 మార్చి

నిరంతర బయల్పాటు

2020 ఏప్రిల్ సర్వసభ్య సమావేశ ప్రసంగము నుండి.

మొదటి దర్శనము

బెన్ సైమన్సెన్ చేత వివరణ

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ బయల్పాటు వెంబడి బయల్పాటును పొందారు. ప్రవక్తయైన జోసెఫ్ చేత పొందబడిన బయల్పాటులలో అనేకము మన కోసం సిద్ధాంతము మరియు నిబంధనలలో భద్రపరచబడ్డాయి.

అదనంగా, జీవిస్తున్న ప్రవక్తలకు నిరంతర బయల్పాటుతో మనం దీవించబడ్డాము, ప్రవక్తలు, “ఆయన కొరకు మాట్లాడేందుకు అధికారమివ్వబడి, ప్రభువు చేత నియమించబడిన ప్రతినిధులు.”1

ప్రభువు నుండి వినయంతో నడిపింపును వెదికే వారందరికి కూడ వ్యక్తిగత బయల్పాటు లభ్యమవుతుంది. అది ప్రవచనాత్మక బయల్పాటంత ముఖ్యమైనది.

వ్యక్తిగత బయల్పాటు అనేది పరిశుద్ధాత్మ నుండి పొందబడిన ఆత్మీయ సత్యాలపై ఆధారపడుతుంది. పరిశుద్ధాత్మ సమస్త సత్యము గురించి, ప్రత్యేకించి రక్షకుని గురించి బయల్పరచువాడు మరియు సాక్ష్యమిచ్చువాడు. పరిశుద్ధాత్మ లేకుండా, యేసే క్రీస్తని నిజంగా మనము తెలుసుకోలేము. తండ్రి, కుమారుడు మరియు వారి నామములు, వారి మహిమ గురించి సాక్ష్యమివ్వడమే ఆయన ప్రభావశీల పాత్ర.

ప్రభువు యొక్క ద్రాక్షతోటలో మనం వినయంతో పని చేసినప్పుడు, మనలో ప్రతిఒక్కరి చేత ఆ బయల్పాటుతో కూడిన నడిపింపును పొందగలరని నేను హామీ ఇస్తున్నాను.

మన జీవితాలను నడిపించడానికి మనలో ప్రతిఒక్కరు నిరంతరం బయల్పాటును వెదికి, తండ్రియైన దేవునిని, మన రక్షకుడైన యేసు క్రీస్తును మనం ఆరాధించినప్పుడు ఆత్మను అనుసరించాలని నేను సవినయంగా వేడుకుంటున్నాను.

వివరణ

  1. హ్యు బి. బ్రౌన్, “Joseph Smith among the Prophets” (Sixteenth Annual Joseph Smith Memorial Sermon, Logan Institute of Religion, Dec. 7, 1958), 7.