2021
క్షమించటానికి బలాన్ని కనుగొనడం
జూన్ 2021


“క్షమించటానికి బలాన్ని కనుగొనడం,” యౌవనుల బలము కొరకు, జూన్ 2021 , 10–11.

రండి, నన్ను అనుసరించండి

క్షమించటానికి బలాన్ని కనుగొనడం

ఇతరులను క్షమించమని ప్రభువు మనకు ఆజ్ఞాపించాడు. దీనిని కలిపి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆయన మనకు సహాయపడతాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:10

చిత్రం
ఆమెకు చేతిని అందిస్తున్న ఒకరివైపు స్త్రీ చూచుట

జేమ్స్ మాడ్సన్ చేత దృష్టాంతము

కొన్ని ఆజ్ఞలు పాటించడానికి మిగిలిన వాటికంటె కష్టమైనవా?

ఇక్కడ అనేకమందిని భయపెట్టే ఒక ఆజ్ఞ ఉన్నది: “ప్రభువు ఎవరిని క్షమించాలో వారిని క్షమిస్తాడు, కానీ మనము మనుష్యులందరిని క్షమించాల్సినవసరమున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 64:10).

ఆగండి. మనకు అన్యాయము చేసిన ప్రతిఒక్కరిని మనము క్షమించాలా? అది అసలు సాధ్యమేనా?!

మీతో దురుసుగా మాట్లాడిన వారిని మరియు భోజనపు బల్లపై చివరి రొట్టెను తీసుకొన్నందుకు ఎవరినైనా క్షమించుట ఒక విషయము. సాధారణమైన విషయాల కోసం క్షమించడం కంటే లోతైన గాయాలను చేసిన వారి విషయమేమిటి? మన జీవితాలపై అత్యధిక ప్రభావాన్ని కలిగించిన లేక అంతరాయపరచిన తీవ్రమైన పాపముల విషయమేమిటి ?

కొన్నిసార్లు మనల్ని భయంకరంగా గాయపరచిన ఎవరినైనా క్షమించుట మనము నిర్వహించే దానికంటే చాలా కష్టముగా ఉండవచ్చు.

ఇక్కడ మనకు మంచి వార్త ఉన్నది: యేసు క్రీస్తు యొక్క సహాయముతో, మనకు మనం స్వయంగా చేయగలదానిని మనం ఎన్నడూ పరిమితం చేయబడలేదు.

ఆమెకు అవసరమైన సహాయము

నెదర్లాండ్ నుండి కోరీ టెన్ బూమ్ అనే పేరుగల ఒక భక్తిగల క్రైస్తవురాలు, ఎవరినో క్షమించటానికి తనకు సహాయము చేయమని దేవునిని అడుగుట వలన కలిగే శక్తిని అనుభవించుటను కనుగొన్నది.

ఆమె, ఆమె సోదరి బెట్సీ, II రెండవ ప్రపంచయుద్ధమందు యుద్ధ ఖైదీలను ఉంచే జైలులో ఉంచబడింది. కోరీ, ఇతరులు నాజీ జెలు నుండి భయంకరమైన దూషణను సహించారు. ఆమె సోదరి ఆ దురాక్రమము వలన చనిపోయింది కూడా. కోరీ బ్రతికింది.

యుద్ధము తరువాత, ఇతరులను క్షమించే స్వస్థత వరమును కోరీ కనుగొన్నది. బహిరంగమైన సందర్భాలలో ఆమె తరచుగా తన సందేశాన్ని పంచుకున్నది. అయినప్పటికీ ఒకరోజు ఆమె నమ్మిన మాటలు అంతిమ పరీక్ష పెట్టబడినవి.

బహిరంగ ప్రసంగం తరువాత, కోరీని శిబిరాల నుండి క్రూరమైన జైలు గార్డులలో ఒకరు సంప్రదించారు.

అతడు యుద్ధం జరిగినప్పటి నుండి క్రైస్తవుడిగా మారానని మరియు జైలు గార్డుగా తాను చేసిన భయంకరమైన పనుల గురించి పశ్చాత్తాప పడ్డానని కోరీతో చెప్పాడు.

అతడు చేతిని చాపి, “నీవు నన్ను క్షమిస్తావా?” అని అన్నాడు.

ఇతరులను క్షమించడం గురించి ఆమె నేర్చుకున్న మరియు పంచుకున్నప్పటికినీ, కోరీ ఈ ప్రత్యేకమైన వ్యక్తి చేతిని అంగీకరించి అతనిని క్షమించలేకపోయింది—ఏమైనప్పటికీ, ఆమె స్వంతంగా కాదు.

ఆమె తరువాత వ్రాసింది, “కోపము, ప్రతీకారపు ఆలోచనలు త్వరగా చెలరాగాయి, నేను వారి పాపమును చూసాను. … ప్రభువైన యేసు, నన్ను క్షమించండి మరియు అతడిని క్షమించటానికి నాకు సహాయపడమని నేను ప్రార్థించాను.

“నేను నవ్వడానికి ప్రయత్నించాను, [మరియు] నా చేతిని పైకెత్తడానికి ప్రయాసపడ్డాను. కానీ నేను చేయలేకపోయాను. నేను ఏమీ, కాస్త అప్యాయత లేదా దాతృత్వం అనుభూతి చెందలేదు. మరలా తిరిగి మౌన ప్రార్థన చేసాను. యేసయ్యా, నేను అతడిని క్షమించలేను. మీ క్షమాపణ నాకివ్వండి.

“నేను అతడి చేతిని తీసుకొన్నప్పుడు మిక్కిలి అనివార్యమైనదని జరిగింది. నా భుజం నుండి నా చేయి వెంట మరియు నా చేతి ద్వారా ఒక కరెంట్ నా నుండి అతని వద్దకు వెళుతున్నట్లు అనిపించింది, అదే సమయంలో నా హృదయంలోకి ఈ అపరిచితుడిపై ప్రేమ నన్ను దాదాపు ముంచివేసింది.

“అందువల్ల లోకము యొక్క స్వస్థత మన క్షమాపణ, మన మంచితనముపై ఆధారపడిలేదు కానీ ఆయన క్షమాపణపై అని నేను కనుగొన్నాను. మన శత్రువులను ప్రేమించమని ఆయన మనకు చెప్పినప్పుడు, ఆజ్ఞతోపాటు, ప్రేమను ఆయన ఇస్తాడు.”1

కష్టమైనప్పుడు కూడా క్షమించమనే ఆజ్ఞతో కలిపి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి మీకు సహాయపడటానికి దేవుడున్నాడు. ఆయన కోరీ టెన్ బూమ్‌కు సహాయపడినట్లుగా ఆయన మీకు సహాయపడగలడు.

మీరు అర్హులైన స్వస్థత

జీవితము గమ్మత్తైనది. ఇది గందరగోళంగా ఉన్నది. మరియు అది దేవుడిచ్చిన ప్రాతినిధ్యముతో ఉన్న జనులతో ఖచ్చితంగా నిండియున్నది.

మీకు తీవ్రమైన నొప్పిని కలిగించే ఎంపికలను ఎవరైనా చేసినప్పటి సమయములందు—లేక ఆకస్మికంగా చేసినా కూడా—సహాయము కొరకు మీరు ప్రార్థించి, క్షమించటానికి ప్రయాసపడినప్పుడు స్వస్థత శక్తిని పొందగలరు.

ఇతరులను క్షమించుట మీ ఆత్మకు స్వస్థత తెస్తుంది. దేవుని సహాయముతో, మీకు అన్యాయము చేసిన వారిని ఎవరినైనా మీరు క్షమించినప్పుడు, మీరు ఏదైనా చేయడం నుండి ఆపివేసే మీ భుజాలపైన భారమును మీరు తీసివేస్తారు. నిజమైన స్వస్థతకు మార్గము కష్టమైనదిగా భావించినప్పుడు కూడ, దేవునితో, మీరు ఎన్నడూ దానిని స్వయంగా చేయనవసరం లేదు.

వివరణలు

  1. కోరీ టెన్ బూమ్ దాక్కొనే స్థలనము (1971), 215.

  2. జెఫ్రీ ఆర్. హాలండ్ Oct. 2018 general conference (Ensign or Liahona, Nov. 2018, 79).

ముద్రించు