2021
ఆయన సంఘము యొక్క పేరు
2021 అక్టోబరు


“ఆయన సంఘము యొక్క పేరు,” యౌవనుల బలము కొరకు, 2021, అక్టో.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2021 అక్టోబరు

ఆయన సంఘము యొక్క పేరు

యేసు క్రీస్తు తన సంఘానికి ఇచ్చిన పేరు వెనుక అర్థమున్నది.

చిత్రం
యేసు క్రీస్తు మంచి కాపరి

నా సంఘము

సంఘము—ఒకే విషయాలను నమ్మి, కలిసి ఆరాధించే జనుల గుంపు. ఈ సంఘము యేసు క్రీస్తుకు చెందినది. ఆయన దానిని ప్రారంభించారు. ఆయన దానిని నడిపిస్తారు. ఇది ఆయనది.

పిలువబడుట

జనులు ఆయన సంఘాన్ని ఏమని పిలవాలని ఆయన కోరుతున్నారో యేసు క్రీస్తు మనకు చెప్పారు. గనుక మనము దానిని ఆవిధంగా పిలవాలి—మరియు దానిని అలా పిలువమని మనము ఇతరులను దయగా అడగాలి. ఈ పేరు యేసు క్రీస్తు నుండి వచ్చింది.

కడవరి దినములు

కడవరి దినములు—మనం జీవించే దినములు; యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు సమయం. యేసు క్రీస్తు తన సంఘాన్ని ఈ చివరిసారి భూమి మీదకు తెచ్చారు. అది ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయపడుతుంది.

యేసు క్రీస్తు యొక్క సంఘము

(“నా సంఘము,” చూడండి.) ఇది రక్షకుడు తన సంఘానికి ఇచ్చిన పేరు యొక్క మొదటి భాగము. ఆయన దానిని నిర్వహించారు గనుక ఆయన దానిని “సంఘము” అని పిలిచారు. మరియు ఆయన దానికి తన పేరు పెట్టారు.

కడవరి దినము

(“కడవరి దినములు,” చూడండి.) ఇది సంఘ పేరు యొక్క తరువాయి భాగం. ఈ దినాలలో ఆయన తెచ్చిన సంఘమని అది సూచిస్తుంది, మునుపటి కాలములో ఆయన ప్రారంభించినది కాదు.

పరిశుద్ధులు

పరిశుద్ధులు—అనగా “పరిశుద్ధులైన జనులు,” అని అర్థము. ఇది సంఘ పేరు యొక్క చివరి భాగము. అది సంఘ సభ్యులను గూర్చి మాట్లాడుతున్నది. యేసు క్రీస్తు మనల్ని శుద్ధిగా మరియు పరిశుద్ధంగా చేయగలరు. ఆయన మనల్ని ఆజ్ఞాపించినది చేయడానికి మనము ప్రయత్నించినప్పుడు మనల్ని బలపరచడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మను ఇస్తారు. మనము ఆయనయందు విశ్వాసముంచి, ప్రయత్నించుట కొనసాగించిన యెడల, ఆయన మనల్ని పరిశుద్ధంగా చేస్తారు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు.

ముద్రించు