“అవి నావి మరియు నేను వాటిని యెరిగియున్నాను” యౌవనుల బలము కొరకు 2022 జన.
2022 జనవరి, యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము
“అవి నావి మరియు నేను వాటిని యెరిగియున్నాను”
మీరు ఎప్పుడైనా అల్పులుగా భావించారా? ప్రపంచంలో ఉన్న ఎంతోమంది వ్యక్తులు లేదా ఆకాశంలో ఉన్న ఎన్నో నక్షత్రాల సంఖ్య గురించి మీరు ఆలోచించినప్పుడు మీకు ఈ విధంగా అనిపించి ఉండవచ్చు. మీరు ఎవరు మరియు మీ జీవితం ఎలా ఉంటుందో దేవునికి నిజంగా తెలుసో లేదో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలా అయితే, మోషే మీ కోసం ఒక సందేశాన్ని కలిగియున్నాడు.
ఒక దర్శనంలో, దేవుడు మోషేకు భూమిలోని ప్రతి మచ్చను మరియు అక్కడ నివసించే ప్రజలందరినీ చూపించారు. వారు “సముద్రతీరమునందుండు ఇసుకవలె అసంఖ్యాకముగా ఉండెను” (మోషే 1:28). తరువాత దేవుడు మోషేతో “అసంఖ్యాకమైన ప్రపంచములను” (మోషే 1:33) చేసానని—మరియు ఆయన సృష్టి ఈ భూమికి చాలా దూరంగా ఉంటుందని చెప్పారు.
వీటన్నింటిని చూసినప్పుడు మోషే బహుశా ముంచివేయబడినట్లు భావించి ఉండవచ్చు. బహుశా అతడు ఆశ్చర్యపోయాడు: ఇన్ని సృష్టుల మధ్యలో నేను ఎక్కడ సరిపోతాను? మరియు దేవుడు చాలా విషయాలను ఎలా కనిపెట్టుకొని ఉంటారు?
దేవుని సమాధానం చాలా సులభం: “నాకు అన్నియు లెక్కించబడినవి.” ఎలా? “ఏలయనగా అవి నావి మరియు నేను వాటిని యెరిగియున్నాను” (మోషే 1:35). ఆయనకు తన పిల్లలందరూ, మరియు ఆయన సృష్టులన్నీ తెలిసినట్లే, మోషే ఎవరో దేవునికి తెలుసు. నక్షత్రాలు, ఇసుక మరియు ముఖ్యంగా భూమిపై ఉన్న ఆయన పిల్లలు—సమస్తము ఆయనకు చెందినవే ఆయన భూమిని సృష్టించడానికి వారే కారణం. వారి శాశ్వతమైన రక్షణయే దేవుని అతి ముఖ్యమైన కార్యము.
“ఏలయనగా నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే నా కార్యమును మహిమయైయున్నది.” (మోషే 1:39).
మోషే దేవుని ప్రణాళికలో ఎక్కడ సరిపోతాడో తెలుసుకున్నట్లే, దేవునికి మీ గురించి తెలుసునని మీరు కూడా నిశ్చయించుకోవచ్చు! మీరు ఆయన వద్దకు తిరిగి రావడానికి సహాయం చేయడం ఆయన కార్యము మరియు మహిమయైయున్నది. ఎందుకు? ఎందుకంటే మీరు ఆయనకు చెందినవారు. మరియు ఇందులో ముఖ్యమైనది ఏమీ లేదు!
Intellectual Reserve, Inc. ద్వారా © 2021 All rights reserved. అ.సం.రాలలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, December 2021 యొక్క అనువాదం. Telugu. 18295 421