2022
మన పాదములకు దీపము
2022 ఆగష్టు


“మన పాదములకు దీపము, ” యౌవనుల బలము కొరకు, 2022 ఆగష్టు

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2022 ఆగష్టు

మన పాదములకు దీపము

ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఒక సాధారణ వస్తువు, ప్రభువు మనలను ఎలా నడిపిస్తారో మనకు బోధించగలదు.

చిత్రం
నూనె దీపం

వాస్తవాలు

పాత నిబంధన కాలంలో, ప్రజలు చీకటిలో వెలుగును వారితో తీసుకువెళ్ళుటకు నూనె దీపాలను ఉపయోగించారు. ఈ దీపాలలో చాలా వరకు మూడు ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్నాయి:

  1. ఒలీవ నూనెను పట్టుకోవడానికి ఒక మట్టి గిన్నె; సాధారణంగా ఒక వ్యక్తి అరచేతిలో పట్టుకునేంత చిన్నది

  2. నూనెను పీల్చుకున్న తర్వాత వెలిగించవలసిన అవిసెనార వత్తి.

  3. ఒత్తిని పట్టుకోవడానికి ఒక గొట్టము లేదా మొన

కేవలం ఒక వత్తితో సాధారణమైన నూనె దీపాలు వాటి చుట్టూ కొన్ని అడుగుల వరకు వెలుగును ప్రసరింపజేస్తాయి. మీరు నడుస్తున్నప్పుడు ఉపయోగించినట్లయితే, అవి మీ కంటే ఒక అడుగు ముందుకు వేయడానికి తగినంత వెలుగును ప్రసరిస్తాయి, తద్వారా మీరు చీకటిలో జాగ్రత్తగా తిరగవచ్చు.

మనం ఏమి నేర్చుకోగలము

చిత్రం
ఒక నూనె దీపాన్ని పట్టుకొన్న యేసు క్రీస్తు

అనుమతితో ఉపయోగించబడినది. వెలుగు, దయతో నడిపించుము., సైమన్ డ్యువే చేత. altusfineart.com © 2022 సౌజన్యముతో.

లోకములో మన చుట్టూ ఉన్న చీకటి మరియు గందరగోళం నుండి ప్రభువు వాక్యం మన మార్గాన్ని వెలిగించగలదు.

మన వెలుగును దాచి పెట్టక, ఇతరులు దానిని చూడగలిగేలా సువార్త యొక్క వెలుగును మనతో తీసుకువెళ్ళమని ప్రభువు మనలను కోరారు (మత్తయి 5:14–16 చూడండి).

మన దీపాలలో నూనె నింపబడినవని నిశ్చయపరచుకొనడం మన చేతులలోనే ఉంటుంది (మత్తయి 25:1–13 చూడండి). ప్రార్థన, లేఖన అధ్యయనము, సేవ, ప్రవక్తను అనుసరించడం, ఇతర విశ్వాసం మరియు భక్తిగల చర్యల ద్వారా దీనిని మనము చేస్తాము (స్పెన్సర్ డబ్ల్యు. కింబల్, Faith Precedes the Miracle [1972], 256 చూడండి).

మనం విశ్వాసాన్ని సాధన చేసిననట్లయితే, ప్రభువు కొన్నిసార్లు మనం మరొక అడుగు వేయడానికి సరిపోయేంత వెలుగుతో మన మార్గాన్ని వెలిగిస్తారు (బాయిడ్ కె. ప్యాకర్, “The Candle of the Lord,” Ensign, Jan. 1983, 54 చూడండి).

ముద్రించు