2022
యేసు క్రీస్తు గురించి తెలుసుకోండి మరియు ఆయన శక్తిని పొందండి
2022 సెప్టెంబరు


“యేసు క్రీస్తు గురించి తెలుసుకోండి మరియు ఆయన శక్తిని పొందండి,” యౌవనుల కొరకు: 2022 సెప్టెంబరు.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2022 సెప్టెంబరు

యేసు క్రీస్తు గురించి తెలుసుకోండి మరియు ఆయన శక్తిని పొందండి

మన ప్రభువు మరియు భోధకుడైన యేసు క్రీస్తు శక్తిని మన జీవితాలలోకి ఎలా తీసుకురావచ్చో నేను పంచుకోవాలనుకుంటున్నాను.

ఆయని గురించి నేర్చుకోవడం ద్వారా మేము ప్రారంభిస్తాము.1అజ్ఞానమందు రక్షింపబడుట మనకు అసాధ్యము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 131:6). రక్షకుని సిద్ధాంతాన్ని మరియు ఆయన మన కోసం ఏమి చేసారో మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటామో, మన జీవితాలకు అవసరమైన శక్తిని ఆయన అందించగలరని మనకు అంత ఎక్కువగా తెలుసుకోగలము.

కడవరి దిన పరిశుద్ధులుగా, మనము ఆయన నియమితకార్యమును యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం అని సూచిస్తాము, ఇది అందరికీ పునరుత్థానాన్ని వాస్తవంగా చేస్తుంది మరియు వారి పాపాల గురించి పశ్చాత్తాపపడి, ఆవశ్యకమైనన విధులు మరియు నిబంధనలను స్వీకరించి, పాటించే వారికి నిత్య జీవితాన్ని సాధ్యం చేస్తుంది.

తండ్రి యొక్క గొప్ప శాశ్వతమైన ప్రణాళిక క్రింద, బాధపడినది రక్షకుడే. మృత్యువు బంధాలను తెంచినది రక్షకుడే. మన పాపములకు మరియు అతిక్రమములకు మూల్యం చెల్లించి, మన పశ్చాత్తాపం యొక్క షరతుపై వాటిని తుడిచిపెట్టినది రక్షకుడే. మన భౌతిక మరియు ఆధ్యాత్మిక మరణం నుండి మనలను విడిపించేవాడు రక్షకుడు మాత్రమే.

ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానం వంటి పవిత్ర పదాలు, తండ్రి ప్రణాళిక ప్రకారం రక్షకుడు ఏమి చేసాడో వివరిస్తాయి, తద్వారా మనం ఈ జీవితంలో నిరీక్షణతో జీవించగలము మరియు రాబోయే ప్రపంచంలో నిత్య జీవితాన్ని పొందవచ్చు.

గమనిక

  1. యేసు క్రీస్తు” మరియు “జీవించి ఉన్న క్రీస్తు: అపొస్తలుల సాక్ష్యం” అనే అంశం కొరకు మీరువిషయ దీపిక లేదా లేఖన దీపికను అధ్యయనం చేయవచ్చు, ChurchofJesusChrist.org.

ముద్రించు