2022
వేచియుండవద్దు! గొఱ్ఱెల కాపరుల వలె ఉండండి
2022 డిసెంబరు


“వేచియుండవద్దు! గొఱ్ఱెల కాపరుల వలె ఉండండి,” యౌవనుల బలము కొరకు, 2022 డిసెం.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2022 డిసెంబరు

లూకా 2:8–20

వేచియుండవద్దు! గొఱ్ఱెల కాపరుల వలె ఉండండి

చిత్రం
గొఱ్ఱెల కాపరులు

చాలాకాలం క్రితం ఒక నిశ్శబ్దమైన రాత్రి, గొఱ్ఱెల కాపరులు తమ మందలను శ్రద్ధగా కావలికాసారు.

చిత్రం
గొఱ్ఱెలు

గొఱ్ఱెల కాపరులకు ఒక ముఖ్యమైన పని ఉన్నది. గొఱ్ఱెలకు ఆహారము, నీళ్ళు మరియు అపాయము నుండి భద్రత అవసరము.

చిత్రం
దేవదూత

హఠాత్తుగా, ఒక దూత ప్రత్యక్షమయ్యాడు!

“భయపడకుడి, ఇదిగో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. … నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు … ఈయన ప్రభువైన క్రీస్తు.”

చిత్రం
దేవదూత

బెత్లేహేములో, శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, పశువులశాలలో పరుండబెట్టబడియుండుటను వారు కనుగొంటారని దేవదూత గొఱ్ఱెల కాపరులకు చెప్పాడు.

చిత్రం
దేవదూతల గాయకబృందము

దేవదూతల గాయకబృందము ఆకాశమును నింపెను మరియు దేవుడిని స్తుతించుటలో దూతతో చేరెను.

“సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, మనుష్యులకు భూమి మీద సమాధానము.”

చిత్రం
గొఱ్ఱెల కాపరులు

జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు, మనము బెత్లేహేము వరకు వెళ్ళి చూతము రండి.”

చిత్రం
నక్షత్రమును వెంబడిస్తున్న గొఱ్ఱెల కాపరులు

గొఱ్ఱెల కాపరులు వేచియుండలేదు. అది చాలా ముఖ్యమైనది! వారు బెత్లేహేముకు “త్వరగా వెళ్ళిరి.”

చిత్రం
పశువులశాల వద్ద గొఱ్ఱెల కాపరులు

దేవదూత చెప్పినట్లుగా, యేసు పొత్తి గుడ్డలతో చుట్టబడి, పశువుల తొట్టెలో పరుండబెట్టబడియుండుటను గొఱ్ఱెల కాపరులు కనుగొన్నారు.

చిత్రం
శిశువైన యేసు

ఈయన లోక రక్షకునిగా, విమోచకునిగా ఉండడానికి మరియు మనకు నిజమైన సంతోషాన్ని తేవడానికి వచ్చిన వాగ్దానము చేయబడిన మెస్సీయ!

చిత్రం
గొఱ్ఱెల కాపరులు

గొఱ్ఱెల కాపరులు చాలా ఉద్వేగము చెందారు! వారు వినిన దానిని, చూచిన దానిని వారు పంచుకున్నారు.

“లోక రక్షకుడు జన్మించాడు!”

“చివరికి మెస్సీయ వచ్చాడు!”

చిత్రం
లేఖనములను అధ్యయనం చేస్తున్న యువకుడు

గొఱ్ఱెల కాపరులు యేసు వద్దకు “త్వరగా వెళ్ళారు.” మీరు కూడా వెళ్ళగలరు!

మీరు ఆయన గురించి నేర్చుకోగలరు.

చిత్రం
గడ్డిని కోస్తున్న యువకుడు

ఇతరులకు సేవ చేయడం ద్వారా మీరు ఆయనకు సేవ చేయగలరు.

చిత్రం
యువకునితో మోర్మన్ గ్రంథమును పంచుకుంటున్న యువతి

మీరు ఆయన గురించి సాక్ష్యమివ్వగలరు.

ముద్రించు