“ఆయన యొద్దకు రండి,” యౌవనుల బలము కొరకు, 2023 మార్చి.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2023 మార్చి
ఆయన యొద్దకు రండి
మన భారములను ఆయనపై మోపమని రక్షకుడు మనలను ఆహ్వానిస్తున్నాడు.
నా యొద్దకు రండి
ఆయన సువార్తను నేర్చుకొని, ఆయనపై విశ్వాసముంచి, పశ్చాత్తాపపడి, నిబంధనలను చేసి, పాటించి, ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా మనం రక్షకుని యొద్దకు రాగలము.
ప్రయాసపడి … భారము మోసికొనుచున్న
శారీరక శ్రమ మరియు శారీరక భారాలు మనలను అలసిపోయేలా చేస్తాయి, కాగా మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మికమైనవి కూడా అలానే ఉంటాయి. మనము ఎలాంటి భారములను మోస్తున్నప్పటికీ, రక్షకుడు తన శాంతిని మనకు అందజేస్తాడు.
కాడి
కాడి అనేది రెండు జంతువులను ఒకదానితో ఒకటి కలపడానికి వాడే సాధనం, తద్వారా అవి నాగలి లేదా బండి వంటి భారమును కలిసి లాగగలవు. కాడి సాధారణంగా జంతువు యొక్క భుజం మూపురంపై పెట్టబడిన చెక్క దూలములా ఉంటుంది, బరువును పంపిణీ చేస్తుంది.
నేర్చుకోవడం
యేసు క్రీస్తు బోధనలను, ఆయన మాదిరిని అధ్యయనం చేయడం ద్వారా మరియు వాటిని అనుసరించడానికి ప్రయత్నించడం ద్వారా మనం ఆయన గురించి నేర్చుకోగలము.
విశ్రాంతి
రక్షకుని విశ్రాంతి ఆయన శాంతియే, అది మన మనస్సులను మరియు ఆత్మలను శాంతపరుస్తుంది. ప్రాపంచిక చింతలను అధిగమించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు మరియు మనం బలహీనంగా భావించినప్పుడు ఆధ్యాత్మిక శక్తిని మనకిస్తారు.
సుళువు … తేలిక
రక్షకుని కాడిని మనపైకి తీసుకోవడం అంటే నిబంధనల ద్వారా మనల్ని మనం ఆయనకు బంధించుకోవడం. దానర్థం ఆయనకు మరియు ఆయన కార్యానికి మన హృదయాలను అర్పించడం. మనం అలా చేసినప్పుడు, ఆయన మనకు సహాయం చేస్తున్నందున మన భారములు తేలికవుతాయి.
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, March 2023 యొక్క అనువాదం. Language. 18905 421