2023
పరిశుద్ధాత్మ కొరకు మీ హృదయాన్ని తెరవండి
2023 ఏప్రిల్


“పరిశుద్ధాత్మ కొరకు మీ హృదయాన్ని తెరవండి,” యౌవనుల బలము కొరకు, 2023, ఏప్రి.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2023 ఏప్రిల్

పరిశుద్ధాత్మ కొరకు మీ హృదయాన్ని తెరవండి

ఈ ఈస్టర్ కాలములో, మన విమోచకునిగా ఉండేందుకు స్వచ్ఛందంగా భూమిపైకి వచ్చిన తన ప్రియమైన కుమారుడిని మన కొరకు బహుమతిగా ఇచ్చిన మన పరలోకపు తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసారని మరియు పునరుత్థానంలో లేచారని తెలుసుకున్నందుకు నేను కృతజ్ఞుడను. ఆయన ప్రాయశ్చిత్తం కారణంగా, ప్రేమగల కుటుంబంలో శాశ్వతంగా జీవించడానికి నేను ఏదో ఒక రోజు పునరుత్థానం చెందుతానని తెలుసుకోవడం ద్వారా ప్రతీరోజు నేను ఆశీర్వదించబడ్డాను.

మనలో ఎవరైనా వాటిని తెలుసుకోగలిగే ఏకైక మార్గం ద్వారా నాకు ఆ విషయాలు తెలుసు. అవి నిజమని—ఒక్కసారి మాత్రమే కాదు, తరచుగా పరిశుద్ధాత్మ నా మనస్సుతో మరియు హృదయంతో మాట్లాడాడు.

ఒక సహవాసిగా పరిశుద్ధాత్మ యొక్క అమూల్యమైన వాగ్దానాన్ని మనం కలిగియున్నాము. జీవితకాలమంతా పరిశుద్ధాత్మ ద్వారా నిరంతర ఆధ్యాత్మిక దిశానిర్దేశం మరియు ఓదార్పును పొందేందుకు మన హృదయాలను తెరవాలని ఎంచుకోవడం మన బాధ్యత.

చిత్రం
పుష్పము

ఎమిలి ఈ. జోన్స్ చేత వివరణలు

దేవుని ముందు వినయంగా ఉండడమే మొదటి ఎంపిక.

చిత్రం
ప్రార్థిస్తున్న చేతులు

రెండవది ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసంతో ప్రార్థించడం.

చిత్రం
దిక్సూచి

మూడవది ఖచ్చితంగా పాటించడం.

చిత్రం
హృదయాకారం

మరియు నాల్గవది ఇతరుల అవసరాలు మరియు హృదయాలను తెలుసుకోవడానికి మరియు వారికి ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి ప్రభువుకు ప్రార్థించడం.

మీకు చాలా ఉదారంగా పంపబడిన ఆత్మ యొక్క స్వరాన్ని మీరు వినాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మరియు మీ నిరంతర సహవాసిగా పరిశుద్ధాత్మను మీతో కలిగి ఉన్నందుకు సంతోషాన్ని పొందేలా మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను స్వీకరించడానికి మీ హృదయాన్ని తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను.

ముద్రించు