2010–2019
ఆయన ఆత్మ మీతో ఉండులాగున
ఏప్రిల్ 2018


ఆయన ఆత్మ మీతో ఉండుటకు

మీకు చాలా ఉదారముగా పంపబడిన, ఆత్మ యొక్క స్వరమును మీరు వినాలని నా పూర్ణ హృదయముతో నేను ప్రార్థిస్తున్నాను.

నా సహోదర, సహోదరిలాలా, ఈ ఈస్టరు కాలములో ఆయన సంఘము యొక్క సర్వ సభ్య సమావేశములో, ప్రభువు యొక్క సబ్బాతు దినమున మీతో మాట్లాడే అవకాశము కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. మన విమోచకునిగా ఉండుటకు తనంతట తానే భూమి మీదకు వచ్చి, ఆయన ప్రియమైన కుమారుని వరము కొరకు మన పరలోక తండ్రికి నా కృతజ్ఞతలు. ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసారని, పునరుత్థానములో లేచియున్నారని తెలుసుకొనుటకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. ఆయన ప్రాయశ్చిత్తఃము వలన, ప్రియమైన కుటుంబమునందు శాశ్వతంగా జీవించుటకు ఎదోఒకరోజు నేను పునరుత్థానము చెందుతానని తెలుసుకొనుటకు ప్రతీరోజు నేను దీవించబడ్డాను.

మనలో ఎవరైనా వాటిని తెలుసుకోగల ఏకైక విధానములో నేను వాటిని ఎరుగుదును. అవి సత్యమని పరిశుద్ధాత్మ నా మనస్సు మరియు హృదయముతో మాట్లాడింది—కేవలము ఒకసారి కాదు కానీ తరచుగా. ఆ ఎడతెగని నడిపింపు నాకవసరము. ఆత్మ యొక్క అభయము మనకు అవసరమయ్యే ఆపదను మనమందరం అనుభవిస్తాము. ఒకరోజు ఒక హాస్పిటల్‌లో మా నాన్నతో నేను నిలబడినప్పుడు దానిని నేను అనుభవించాను. మా అమ్మ గాఢమైన శ్వాసలు తీసుకొనుట మేము గమనించాము---మరియు తరువాత ఇక లేదు. మేము ఆమె ముఖమును చూచినప్పుడు, బాధ పోయినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతున్నది. కొన్ని మౌన క్షణాల తరువాత, మా నాన్న మొదట మాట్లాడారు. “చిన్న బాలిక ఇంటికి వెళ్ళిపోయింది,” ఆయన అన్నారు.

ఆయన దానిని నెమ్మదిగా చెప్పాడు. ఆయన శాంతిగా ఉన్నట్లు కనబడ్డాడు. తాను సత్యమని ఎరిగిన దానిని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన నెమ్మదిగా అమ్మయొక్క వ్యక్తిగత వస్తువులను సేకరించారు. రోజులుగా ఆమెకు పరిచర్య చేసిన నర్సులు మరియ వైద్యులులో ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుటకు హాస్పిటల్ హాలువైపు ఆయన వెళ్ళాడు.

ఆ క్షణమందు అనుభూతి చెందుటకు, తెలుసుకొనుటకు, మరియు ఆరోజు ఆయన చేసిన దానిని చేయుటకు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మా నాన్న కలిగియున్నారు. అనేకమంది కలిగియున్నట్లుగా: “వారు ఆయన ఆత్మను తమతో కలిగియుండునట్లు” (సి మరియు ని 20:79) ఆయన వాగ్దానమును పొందియున్నాడు.

పరిశుద్ధాత్మను పొందుటకు మీ కోరిక మరియు సామర్ధ్యమును హెచ్చించాలని ఈ రోజు నేనాశిస్తున్నాను. ఆయన త్రియేక దేవుని యొక్క మూడవ సభ్యుడని, గుర్తుందా. తండ్రి మరియు కుమారుడు పునరుత్థాన ప్రాణులు. పరిశుద్ధాత్మ ఆత్మ స్వరూపి. (సి మరియు ని 130:22చూడుము.) ఆయనను స్వీకరించాలో మరియు మీ మనస్సు, హృదయములోనికి ఆయనను స్వాగతించాలో అది మీ ఇష్టము.

ఆ దివ్యమైన దీవెనను మనము పొందుటకు గల షరతులు ప్రతీవారము పలుకబడిన మాటలలో స్పష్టపరచబడినవి, కానీ బహుశా ఎల్లప్పుడు మన హృదయాలు మరియు మనస్సులలోనికి పోవు. ఆత్మ ఎల్లప్పుడు మనకు పంపబడుటకు, మనము రక్షకుని “ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొని” మరియు “ఆయన ఆజ్ఞలను పాటించవలెను” ((సి మరియు ని 20:77().

సంవత్సరములో ఈ కాలము రక్షకుని త్యాగమును జ్ఞాపకముంచుకొనుటకు మరియు సమాధినుండి పునరుత్థానునిగా ఆయన లేచుటను జ్ఞాపకముంచుకొనుట మనకు సహాయపడును. మనలో అనేకులు ఆ దృశ్యాల చిత్రములను మన జ్ఞాపకాలలో ఉంచుకుంటాము. ఒకసారి నేను నా భార్యతో కలిసి యేరూషలేములోని ఒక సమాధి బయట నిలబడ్డాను. ఆ సమాధినుండే రక్షకుడు పునరుత్థానము చెంది, జీవిస్తున్న దేవునిగా బయటకు వచ్చాడని అనేకమంది నమ్ముతారు.

ఆ రోజు గౌరవనీయుడైన గైడు, తన చేతితో సైగ చేసి మనకు చెప్పాడు, “రండి, ఖాళీ సమాధి చూడుము.”

లోపలికి వెళ్ళుటకు మేము వంగాము. మేము ఒక గోడకు ఎదురుగా ఉన్న రాతి బల్లను చూసాము. కానీ ఆ రోజు మేము చూసినంత వాస్తవంగా, నా మనస్సులోనికి మరొక చిత్రము వచ్చింది. అది సమాధి వద్ద అపొస్తులుల చేత విడిచిపెట్టబడిన మరియ. దానినే ఆత్మ నన్ను చూడనిచ్చింది, మరియు నేను అక్కడున్నంత స్పష్టంగా నా మనస్సులో విననిచ్చింది.

“అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చుచుండెను, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా,

“తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును, కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను.

“వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె--నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.

“యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను, ఆమె ఆయన వైపు తిరిగి, ఆయనను, హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్ధము.

“యేసు, అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని –అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయిన యెడల, ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.

“యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను, ఆమె ఆయన వైపు తిరిగి, ఆయనను, హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్ధము.

“యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యెద్దకు ఎక్కిపోలేదు, గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యెద్దకు వెళ్ళి---నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను” (John 20:11–17).

సమాధి వద్ద మరియ అనుభవించినది, యెరూషలేము వద్దకు ఒక ప్రయాణికునిగా ఆయనను అనుకొని, పునరుత్థానము చెందిన రక్షకునితో వారు నడిచినప్పుడు ఎమ్మాకు దారిలో మిగిలిన ఇద్దరు శిష్యులు భావించిన దానిలో కొంత అనుభూతి చెందుటకు అనుమతించబడాలని నేను ప్రార్థించాను.

“వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.

“ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చోన్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా,

“వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.

“అప్పుడు వారు—ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనమును మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి” (లూకా 24:29–32).

70 సంవత్సరాల క్రితం పైగా నేను హాజరైన ఒక సంస్కార సమావేశములో ఆ మాటలలో కొన్ని పునరావృతం చేయబడినవి. ఆ రోజులలో సంస్కార సమావేశము సాయంకాలము జరపబడేది. అది బయట చీకటిగా ఉన్నది. సమూహము ఆ పరిచయమైన పదములను పాడారు. నేను వాటిని అనేకసార్లు విన్నాను. కానీ ఒక ప్రత్యేకమైన రాత్రి కలిగిన ఒక భావనను గూర్చి నా శాశ్వతమైన జ్ఞాపకము. అది రక్షకుని వద్దకు నన్ను దగ్గరగా చేయును. బహుశా నేను పదాలను వల్లిస్తే, అవి మనందరికి తిరిగి రావచ్చు:

సంధ్యవేళ వరకు, నాతో వసించుము

సాయంత్రము పడుచున్న నీడలు,

సాయంత్రము పడుచున్న నీడలు,

రాత్రి రాబోవుచున్నది.

నా హృదయములో ఒక స్వాగతించు అతిథి,

నా గృహములోపల వసించును.

సంధ్యవేళ వరకు; ’నాతో వసించుము.

ఈరోజు నాతో మీరు నడుచుట

నా లోపల నా హృదయము మండునట్లు చేసెను,

నేను మీతో సంభాషించినప్పుడు.

మీ మనఃపూర్వకమైన మాటలు నా ఆత్మను నింపినవి

మరియు నన్ను మీ ప్రక్కన దగ్గరగా ఉంచెను.

ఓ రక్షకుడా, ఈ రాత్రి నాతో వసించుము;

ఇదిగో, సంధ్యవేళ వరకు.

ఓ రక్షకుడా, ఈ రాత్రి నాతో వసించుము;

ఇదిగో, సంధ్యవేళ వరకు.1

సంఘటనల జ్ఞాపకము కంటే ఎక్కువ ప్రశస్తమైన జ్ఞాపకము పరిశుద్ధాత్మ మన హృదయాలను సృశించుట మరియు సత్యమును గూర్చి ఆయన ఎడతెగని నిర్ధారణను గూర్చి జ్ఞాపకము. మన కన్నులతో చూచుట కంటే, లేక చెప్పబడిన మరియు చదవబడిన మాటలను జ్ఞాపకముంచుకొనుట కంటే ఎక్కువ ప్రశస్తమైనది, చేర్చబడిన ఆత్మ యొక్క మెల్లని స్వరమును జ్ఞాపకముంచుకొనుట. అరుదుగా, నేను హృదయములో నిస్సందేహముగా మృదువుగా మండుచున్నట్లుగా---ఎమ్మాకు దారిలో ప్రయాణికుల వలే నేను ఖచ్చితంగా అనుభూతిచెందాను. ఎక్కువ తరచుగా, అది వెలుగు మరియు ప్రశాంతమైన అభయము గల భావన.

ఒక సహవాసిగా పరిశుద్ధాత్మ యొక్క ప్రశస్తమైన వాగ్దానమును మనము కలిగియున్నాము, ఆ వరమును ఎలా హక్కుగా పొందాలో నిజమైన ఆదేశాలు కూడా మనకున్నాయి. ఈ మాటలు ప్రభువు చేత అధికారమివ్వబడిన సేవకుడు తన చేతులను మన తలపై ఉంచి చెప్పబడినవి: “పరిశుద్ధాత్మను పొందుము.” ఆ క్షణమందు, ఆయన పంపబడతాడని నాకు మీకు అభయమున్నది. కానీ జీవితకాలము, ఆత్మ యొక్క పరిచర్యను పొందుటకు మన హృదయాలను తెరచుటకు ఎంపిక చేయుట మన బాధ్యత.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క అనుభవాలు ఒక సూచనను ఇచ్చును. అతడు ఏ గమనాన్ని తీసుకోవాలో తెలుసుకొనుటకు తన స్వంత జ్ఞానము సరిపోదనే నిర్ణయముతో అతడు తన పరిచర్యను ప్రారంభించి కొనసాగించాడు. అతడు దేవుని యెదుట వినయముగా ఉండుటకు ఎన్నుకున్నాడు.

తరువాత, దేవునిని అడగటానికి జోసెఫ్ ఎన్నుకున్నాడు. దేవుడు జవాబిస్తాడనే విశ్వాసముతో అతడు ప్రార్థించాడు. ఒక బాలునిగా ఉన్నప్పుడు జవాబు వచ్చింది. ఆయన సంఘమును ఎలా స్థాపించాలని దేవుడు కోరుచున్నాడో అతడు తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు జవాబు వచ్చింది. అతడి జీవితకాలమంతా పరిశుద్ధాత్మ ఓదార్చింది మరియు అతడిని నడిపించింది.

అది కష్టమైనప్పుడు, అతడు విధేయుడయ్యాడు. ఉదాహరణకు, అతడికి పన్నెండుమంది చాలా అవసరమైనప్పటికిని, వారిని ఇంగ్లండ్‌కు పంపమనే సూచనను అతడు పొందాడు. అతడు వారిని పంపాడు

అతడు చెరలో ఉంచబడి, పరిశుద్ధులు భయంకరంగా అణచివేయబడినప్పుడు ఆత్మనుండి దిద్దుబాటును మరియు ఓదార్పును అతడు అంగీకరించాడు. అతడు మర్త్య అపాయమును ఎదుర్కొన్నాడని తెలిసి కూడా అతడు కార్థేజ్‌కు దారివైపు వెళ్ళినప్పుడు అతడు విధేయుడయ్యాడు.

పరిశుద్ధాత్మ ద్వారా ఎడతెగని నడిపింపు మరియు ఆదరణను ఎలా పొంచాలో ప్రవక్త జోసెఫ్ మనకు ఒక మాదిరిని ఉంచాడు.

అతడు చేసిన మొదటి ఎంపిక, దేవుని యెదుట వినయముగా ఉండుట.

రెండవది ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముతో ప్రార్థించుట.

మూడవది ఖచ్చితంగా విధేయులగుట. విధేయత అనగా త్వరగా కదులుట అని అర్ధము. సిద్ధపడుట లేక ముందు ప్రేరేపణ కొరకు ఓపికగా ఎదురుచూచుట అని దాని అర్ధము కావచ్చు.

నాలగవది, ఇతరుల అవసరాలను మరియు హృదయాలను తెలుసుకొనుటకు మరియు ప్రభువు కొరకు వారికి ఎలా సహాయపడాలో తెలుసుకొనుటకు ప్రార్థించుట. జోసెఫ్ చెరలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్న పరిశుద్ధుల కొరకు జోసెఫ్ ప్రార్ధించాడు. వారు ప్రార్థించినప్పుడు, ప్రేరేపణ కొరకు అడిగి, నడిపింపును పొంది, మరియు దానిపై పని చేసినప్పుడు, దేవుని ప్రవక్తలను గమనించుట నా విశేషావకాశముగా ఉన్నది.

వారు ప్రేమించి, సేవ చేసే జనులను గూర్చి వారి ప్రార్థనలు ఎంత తరచుగా చేయబడినవో నేను చూసాను. ఇతరుల కొరకు వారి చింతలు ప్రేరేపణను పొందుటకు వారి హృదయాలను తెరచినట్లుగా కనబడుచున్నవి. అది మీకు కూడా నిజమైనది.

ప్రభువు కొరకు ఇతరులకు పరిచర్య చేయుటకు ప్రేరేపణ మనకు సహాయపడును. నేను చూసినట్లుగా, మీరు మీ అనుభవములో చూసారు. ఒకసారి మా బిషప్పు నాతో చెప్పాడు---నా భార్య తన స్వంత జీవితంలో గొప్ప ప్రయాసలో ఉన్న సమయములో---“వార్డులో ఎవరికైనా సహాయము అవసరమని నేను వినిన ప్రతీసారి సహాయపడుటకు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, మీ భార్య నాకంటే ముందుగా అక్కడ ఉండుట నేను చూసాను. ఆమె దానిని ఎలా చేయగలిగింది ?”

ప్రభువు యొక్క రాజ్యములో గొప్ప పరిచారకుల వలే ఆమె ఉన్నది. వారు రెండు విషయాలు చేస్తున్నట్లుగా కనబడుచున్నది. గొప్ప పరిచారకులు దాదాపు నిరంతర సహవాసిగా పరిశుద్ధాత్మ కొరకు యోగ్యత కలిగియున్నారు. మరియు వారు దాతృత్వము యొక్క వరము కొరకు యోగ్యత కలిగియున్నారు, అది క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ. ప్రభువు కొరకు ప్రేమతో సేవ చేయుటలో వాటిని ఉపయోగించినప్పుడు, ఆ వరములు వారిలో వృద్ధి చెందినవి.

మన సేవలో ప్రార్థన, ప్రేరేపణ, మరియు ప్రభువు యొక్క ప్రేమ కలిసి పని చేసే విధానము ఈ మాటలలో నాకు పరిపూర్ణముగా వివరించబడినవి:

“నా నామమును మీరు నన్నేమి అడిగినను, నేను చేతును.

“మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.

“నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.

“లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.

“మిమ్మును అనాథలనుగా విడువను. మీ యొద్దకు వత్తును.

“కొంత కాలమైన తరువాత మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.

“నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.

“నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనుబరచుకొందునని చెప్పెను” (యోహాను 14:14–21).

ఈ క్షణమందు తండ్రి మీరు, మీ భావనలను గూర్చి, మీ చుట్టూ ఉన్నవారి యొక్క మీ ఆత్మీయ, భౌతిక అవసరాలను గూర్చి ఎరిగియున్నాడని నేను నా వ్యక్తిగత సాక్ష్యమిచ్చుచున్నాను. తండ్రి మరియు కుమారుడు ఆ వరమును కలిగియుండి, ఆ దీవెన కొరకు అడిగి, దాని కొరకు యోగ్యత కలిగియుండాలని కోరు వారందరికి పరిశుద్ధాత్మను పంపుతారని నేను సాక్ష్యమిస్తున్నాను. తండ్రి, లేక కుమారుడు, లేక పరిశుద్ధాత్మ మన జీవితాలలోని బలవంతముగా రారు. మనము ఎంపిక చేయుటకు స్వతంత్రులము. ప్రభువు అందరికి చెప్పాడు:

“ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను: ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదును.

“నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

“సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగల వాడు వినును గాక” (ప్రకటన 3:20–22).

మీకు ధారాళముగా పంపబడిన, ఆత్మ యొక్క స్వరమును మీరు వింటారని నా పూర్ణ హృదయముతో నేను ప్రార్థిస్తున్నాను. ఆయనను ఎల్లప్పుడు స్వీకరించుటకు మీ హృదయమును మీరు తెరుస్తారని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేరేపణ కొరకు మీరు నిజమైన ఉద్దేశముతో, యేసు క్రీస్తునందు విశ్వాసముతో అడిగిన యెడల, మీరు దానిని ప్రభువు యొక్క విధానములో మరియు ఆయన కాలములో పొందుతారు. దేవుడు దానిని యౌవన జోసెఫ్ స్మిత్ కోసం చేసాడు. మన జీవిస్తున్న ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ కోసం ఆయన దానిని చేస్తున్నాడు. ఆయన కొరకు వారికి సేవ చేయుటకు దేవుని యొక్క మిగిలిన పిల్లల మార్గములో ఆయన మిమ్మల్ని ఉంచియున్నాడు. నా కన్నులతో నేను చూచిన దానిని మాత్రమే కాదు కానీ నా హృదయానికి ఆత్మ గుసగుసలాడిన దానిచేత ఎక్కువ శక్తివంతముగా అని నేను ఎరుగుదును.

ఆత్మ లోకములో ఆయన పిల్లల కొరకు మరియు ప్రపంచములో దేవుని పిల్లలందరి కొరకు తండ్రి యొక్కయు, ఆయన కుమారుని యొక్క ప్రేమను నేను అనుభూతి చెందాను. పరిశుద్ధాత్మ యొక్క ఓదార్పును మరియు నడిపింపును నేను అనుభవించాను. నిరంతరము మీ సహవాసిగా ఆత్మ మీతో ఉండుట వలన కలిగే సంతోషమును మీరు కలిగియుండునట్లు నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “Abide with Me; ’Tis Eventide,” Hymns, no. 165.

ముద్రించు