దేవుని నుండి ప్రశస్తమైన వరములు
క్రీస్తునందు నిజమైన విశ్వాసములో స్వల్ప మొత్తమును మనము సాధన చేసినప్పుడు జీవితము విశ్వాసము, సంతోషము, నిరీక్షణ, మరియు ప్రేమతో నింపబడును.
నా సోదర, సోదరీలారా, మనం ఇప్పుడే ఒక గంభీరమైన సభలో పాల్గొన్నాము, ఒక ఆచారము పూర్వము ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రత్యక్షత యొక్క అనుభూతి పొందుటకు మరియు ఆయన దీవెనలను జరుపుటకు కూడుకొన్నప్పుడు బైబిలు కాలమునకు గుర్తించును.1 ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా ఈ సనాతనాచారము పునరుద్ధరింపబడిన ఈ కాలములో జీవించుట మన విశేషావకాశము.2 మీరు పాల్గొన్న ఈ అత్యంత పరిశుద్ధ సందర్భంలో మీ అనుభూతులను మీ వ్యక్తిగత దినచర్యల పుస్తకంలో వ్రాయమని నేను మిమ్మల్ని ప్రేరేపించుచున్నాను.
ఇటీవల, మన ప్రియ మిత్రుడు, ప్రవక్తయునైన అధ్యక్షుడు థామస్ ఎస్. మాన్సన్‌కు మనము వీడుకోలు పలికాము. మనమంతా ఆయనలేని లోటుకు విచారిస్తున్నప్పటికి, నూతన ప్రవక్తగా, ఆయన సంఘముపైగా అధ్యక్షత్వము వహించుటకు అధ్యక్షుడు రస్సెల్ ఎం. నెల్సన్‌ను ప్రభువు పిలిచినందుకు మనము లోతైన కృతజ్ఞతను కలిగియున్నాము.. మన సంఘ చరిత్రలో ఒక క్రొత్త అధ్యాయమును మనము ప్రారంభించాము. ఇది దేవుని నుండి ఒక ప్రశస్తమైన వరము.
మన పైకెత్తిన చేతుల ద్వారా, అధ్యక్షులు నెల్సన్‌ను మనలో ప్రతిఒక్కరము ఆమోదించినప్పుడు, మనము దేవుని యెదుట సాక్షులుగా నిలబడియున్నాము మరియు ఆయన అధ్యక్షులు మాన్సన్ యొక్క అసలైన వారసులని అంగీకరించాము. ప్రభువు నుండి ఆయన నడిపింపును పొందినప్పుడు, ఆయన స్వరమును ఆలకిస్తామని మనము మన పైకెత్తించిన చేతులతో ప్రమాణము చేయుచున్నాము.
ప్రభువు అన్నారు:
“మీరు అతడు [అనగా సంఘ అధ్యక్షునికి అని అర్థము] తాను పొందినట్లుగా మీకిచ్చు మాటలు మరియు ఆజ్ఞలన్నిటిని లక్ష్యముంచవలెను … ;
“ఏలయనగా, సమస్త సహనముతోను, విశ్వాసముతోను అతడి మాటను నా స్వంత నోటి నుండి వచ్చినట్లుగా మీరు స్వీకరించవలెను.”3
మన క్రొత్త ప్రవక్త-అధ్యక్షునిని నేను 60 ఏళ్ళకు పైగా ఎరుగుదును. 33 సంవత్సరాలుగా, నేను ఆయనతో పన్నెండుమంది అపొస్తులుల కూటమిలో సేవ చేసాను. ఆయనను మన అపొస్తలులకు అధ్యక్షత్వము వహించు అపోస్తులునిగా మరియు ప్రవక్తగాను భూమిమీద పరిశుద్ధ యాజకత్వపు తాళపు చెవులన్నిటిని నిర్వహించుటకు ఆయనను ప్రభువు యొక్క హస్తము సిద్ధపరచుచున్నదని నేను ఒక సాక్షిగా ఉన్నాను. మనలో ప్రతి ఒక్కరూ ఆయనను, ఆయన సలహాదారులను, సంపూర్ణంగా ఆమోదించి వారి నడిపింపును అనుసరించెదముగాక. ఎల్డర్ గాంగ్‌ను, మరియు ఎల్డర్ సోరెస్‌ను, పన్నెండుమంది అపొస్తలుల కూటమిలోనికి సభ్యులుగా కూడా మేము హృదయపూరక్వకంగా ఆహ్వానిస్తున్నాము.
ఈ మహిమకరమైన ఈస్టరు వారాంతమున మనము జరుపుకొనే ఘటన, యేసు యొక్క పునరుత్థానము తరువాత, ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమై వారితో, “మీకు సమాధానము కలుగునుగాక: నా తండ్రి నన్ను పంపినట్లే నేనును మిమ్మును పంపుచున్నాను.”4 రెట్టింపయిన ఈ కార్యమును గమనించుడి.—దేవుడు తన కుమారుని పంపును. వారి కార్యము నెరవేర్చుటకు---కుమారుడు తన సేవకులను —మర్త్యులైన పురుషులు, స్త్రీలను పంపును.—
ప్రభువు యొక్క కార్యమును నెరవేర్చుటకు పిలవబడిన వ్యక్తులు మానవరీత్యా పరిపూర్ణులు కారని తెలుసుకొనుటకు మనం ఆశ్చర్యపడరాదు. లేఖనములలోని కథలు, ఒక గొప్ప కార్యము చేయుటకు పిలవబడిన దేవుని యొక్క పురుషులు, స్త్రీలు--— సంఘములో వారికి అప్పగింపబడిన సేవ చేయుటకు పిలవబడిన మన పరలోక తండ్రి యొక్క మంచి కుమారులు, కుమార్తెలు, వారికి శాయశక్తులా చేయుటకు ప్రయాసపడుతున్నారు, కాని వారిలో ఎవరూ ఇంకా పరిపూర్ణులు కారు. నేడు మన విషయంలో అదే నిజమైనది.
మన మానవ బలహీనతలు మరియు పొరపాట్ల వాస్తవము చెప్పబడ్డాక, మనం ఒకరినొకరం బలపరచుకొనుచు, ఆమెదిస్తూ ఎలా ముందుకు సాగిపోగలము? అది విశ్వాసంతో— ప్రభువైన యేసు క్రీస్తునందు నిజమైన, నిజాయితీగల విశ్వాసముతో అది ప్రారంభమౌతుంది. క్రీస్తు యొక్క సిద్ధాంతము మరియు సువార్త యొక్క మొదటి సూత్రము రక్షకుని యందు విశ్వాసము కలిగియుండుట.
కొన్ని సంవత్సరాల క్రిందట నేను పరిశుద్ధ దేశమును దర్శించాను. మా కారు ఒక ఆవ మొక్కను దాటి వెళ్ళుచుండగా, యెరూషలేములోని బివైయు కేంద్రం యొక్క డైరక్టరు ఎప్పుడైనా ఆవ గింజను చూసారా అని నన్ను అడిగాడు. నేను చూడలేదు, కనుక మేము ఆగాము. అతడు నాకు ఆవ చెట్టు నుండి గింజలను నాకు చూపించాడు. అవి ఆశ్చర్యకరంగా చిన్నవిగా ఉన్నవి.
అప్పుడు యేసు బోధనలను నేను జ్ఞాపకము చేసుకున్నాను: “మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల, ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియు లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు.”5
మనము చిన్న ఆవగింజంత విశ్వాసం కలిగియున్న యెడల, కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, మరియు ఇంక సంఘ సభ్యులను కాని వారిని కలిపి, దేవుని యొక్క పిల్లలతో మనము సేవ చేసినప్పుడు, మన ముందున్న కార్యములలో నిరాశ మరియు అనుమానపు కొండలను తొలగించుటకు ప్రభువు మనకు సహాయపడతారు.
సోదర సోదరీలారా, మనము క్రీస్తునందు ఆవగింజంత విశ్వాసము---కాస్తంత నిజమైన విశ్వాసమును మనము సాధన చేసినప్పుడు, జీవితము విశ్వాసము, సంతోషము, ఆనందము, మరియు ప్రేమతో నింపబడగలదు.
ఎల్డర్ జార్జ్ ఎ. స్మిత్‌కు ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇచ్చిన సలహాను జ్ఞాపకం చేస్తున్నాడు: “కష్టాలెన్ని నన్ను చుట్టుముట్టినా ఎన్నడూ నిరాశ చెందవద్దని నాకు చెప్పాడు. నోవా స్కాషియాలోని లోతైన గోతిలో పడిపోయినా మరియు నా మీద రాతి పర్వతాలన్నీ గుట్టలుగా పడినను, నేను నిరాశపడరాదు కానీ పట్టువదలక, విశ్వాసాన్ని సాధన చేసి, మంచి ధైర్యాన్ని నిలుపుకొని మరియు చివరకు గుట్ట బయటకు నేను రాగలనని అతడు నాకు చెప్పాడు.”6
పౌలు యొక్క ప్రకటనను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి: “నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్త కార్యములు చేయగలను.”7 దీనిని తెలుసుకొనుట దేవుని యొద్దనుండి మరొక ప్రశస్తమైన వరము.
నేను ప్రస్తావించిన వరములకు అదనముగా, ఇంకా అనేకనేక మైనవి ఉన్నాయి. వానిలో కొన్ని వాటిగురించి నేను మాట్లాడతాను---సబ్బాతుదినము, సంస్కారం, ఇతరులకు సేవ, మరియు మన రక్షకుడైన దేవుని నుండి సాటిలేని వరము
సబ్బాతు దినం యొక్క శక్తి అనగా సంఘములో మరియు ఇంటిలో ఏరకమైన అంతరాయము లేకుండా, సంతోషము, ఆనందము, మరియు ప్రభువు యొక్క ఆత్మ అప్యాయతను అనుభవించుట
చాలామంది వారి స్మార్ట్ సాధనాలు—రాత్రి, పగలు వారి ముఖాలను ప్రకాశింప చేసే తెరలతో మరియు మిక్కిలి నిమ్మళమైన స్వరమును ఆటంకపరస్తూ, వారి చెవులలో ఇయిర్ బడ్లతో ఆన్-లైన్ జీవించటానికి తమ్మును అనుమతిస్తున్నారు. “ఊరకుండుము, నేనే దేవుడనని తెలుసుకొనుము,”8 అనుచున్న ఆయన స్వరం వినే అవకాశమును మనము కోల్పోవచ్చు. ఇప్పడు, ప్రభువు చేత ప్రేరేపించబడిన సాంకేతిక పరిజ్ఞానముల అభివృద్ధిని ఉపయోగించుటలో ఏ తప్పులేదు, కానీ మనము వాటి ఉపయోగములో తెలివిగా ఉండాలి. సబ్బాతు దినము యొక్క వరమును జ్ఞాపకముంచుకొనుము.
సంస్కార సమావేశములో సంస్కారమును తీసుకొను దీవెన వాడుక ప్రకారము చేసేది లేక కేవలము ఏదైన మనము చేసేదిగా ఎన్నడూ కారాదు. మనము నిదానించి, మన జీవితాలలో మరింత శాంతి, ఆనందము, మరియు సంతోషమును కనుగొనినప్పడు అది మొత్తము వారములో 70 నిముషాలు మాత్రమే.
సంస్కారంలో పాల్గొనుట మరియు మన నిబంధనలను పునఃసమీక్షించుట ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుచున్నామని ప్రభువుకు మన సూచన. ఆయన ప్రాయశ్చిత్తము దేవుని నుండి కృపా సమృద్ధియైన వరము.
పరలోక తండ్రి యొక్క బిడ్డలకు సేవ చేసే విశేషావకాశము ఒకరికొకరు సేవ చేయుట ద్వారా ఆయన ప్రియకుమారుని మాదిరిని అనుసరించుటకు మరొక అవకాశము.
మన కుటుంబము, మన సంఘ పిలుపులందులోను, మరియు సమాజ సేవా కార్యక్రమములలో మనము పాల్గొనుట--- కొన్ని సేవా అవకాశాలు క్రమ పద్ధతిలోజరుగును.
సంఘ సభ్యులు--స్త్రీ, పురుషులు ఇరువురు కోరుకున్న యెడల--- వారెక్కడ నివసించినప్పటికిని, ఏ ప్రభుత్వ స్థాయిలోనైనా ఎన్నికలలో పాల్గొనుటకు సందేహించరాదు. నేడు మన స్వరములు ముఖ్యమైనవి మరియు మన పాఠశాలలు, మన పట్టణాలు, మరియు మన దేశాలలో ముఖ్యమైనవి. ప్రజాస్వామ్యము ఉన్నచోట, సేవ చేయుటకు సమ్మతించు గౌరవనీయులైన స్త్రీ, పురుషుల కొరకు ఓటు వేయుట సభ్యులుగా మన కర్తవ్యము.
సేవ చేయుటకు అనేక అవకాశాలు నియమించబడకుండా---అనధికారికమైనవి---మరియు జీవితపు ప్రయాణములో మనము కలుసుకొను ఇతరులను మనము సమీపించినప్పుడు వచ్చును. మంచి సమరయుని ఉపమానమును ఉపయోగిస్తూ, మనము దేవునిని మరియు మన పొరుగువారిని మన వలే ప్రేమించవలెనని న్యాయవాదికి యేసు బోధించుట జ్ఞాపకమున్నదా.9
క్రీస్తు యొక్క జీవితమును మరియు పరిచర్యను మనము గ్రహించుట ద్వారా సేవ ఒక కిటికినీ తెరచును. లేఖనాలు బోధించినట్లుగా, ఆయన సేవ చేయుటకు వచ్చారు, “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. కాని, పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను .”10
పేతురు యేసును సూచించినప్పుడు “ఆయన మేలు చేయుచు సంచరించెను.”11 అని ఐదు మాటలలో శ్రేష్టమైన వర్ణనను ఇచ్చాడు.
ప్రభువైన యేసు క్రీస్తు దేవుని నుండి మన మిక్కిలి ప్రశస్తమైన వరము. యేసు చెప్పెను, “ నేనే మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.”12
నీఫై మన రక్షకుని యొక్క ప్రాధాన్యత గ్రహించి ప్రకటించాడు , “మేము క్రీస్తునుగూర్చి మాట్లాడుచున్నాము, మేము క్రీస్తునందు ఆనందించుచున్నాము, మేము క్రీస్తు గురించి బోధించుచున్నాము, మేము క్రీస్తును గూర్చి ప్రవచించుచున్నాము, మరియు మా ప్రవచనములను బట్టి మా పిల్లలు వారి యొక్క పాపముల యొక్క నివృత్తి కొరకు వారు ఏ మూలాధారమును చూడవలెనో మా సంతానము తెలుసుకొనునట్లు వ్రాయుచున్నాము.”13 మనము అన్ని సమయాలలో, అన్ని స్థలములలో, క్రీస్తును మన జీవితముల కేంద్రముగా నిలుపుకోవాలి.
మన ఆరాధనా స్థలములపై ఆయన నామమే కనబడును; ఆయన నామమున మనము బాప్తీస్మము పొందుచున్నాము; మరియు మనము నిర్ధారించబడుచున్నాము, నియమించబడుచున్నాము, ఎండోమెంట్ పొందుచున్నామని మరియు ఆయన నామములో వివాహమందు బంధింపబడుచున్నామని మనము జ్ఞాపకముంచుకోవాలి. మనము సంస్కారములో పాల్గొని, ఆయన నామమును మనపై ధరించుటకు---మరియు నిజమైన క్రైస్తవులమగుటకు వాగ్దానము చేయుచున్నాము.”14
రేపు ఈస్టరు ఆదివారం కొరకు మనము సిద్ధపడుచున్నప్పుడు, క్రీస్తు మహోన్నతుడని మనము జ్ఞాపకముంచుకోవాలి. ఆయన నీతిగల న్యాయమూర్తి, మన నమ్మకమైన న్యాయవాది, మన ధన్యుడైన విమోచకుడు, మంచి కాపరి, వాగ్దానము చేయబడిన మెస్సీయ, ఒక నిజమైన స్నేహితుడు, మరియు ఇంకా అత్యధికము. ఆయన వాస్తవముగా మన తండ్రి నుండి మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వరము.
మన శిష్యత్వములో, మనము అనేక డిమాండ్లు, చింతలు, మరియు పనులను కలిగియుంటాము. ఐనప్పటికీ, కొన్ని కార్యములు ఎల్లప్పుడు మన సంఘ సభ్యత్వము యొక్క ముఖ్య భాగము కావాలి. ప్రభువు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, “కాబట్టి,” “విశ్వాసముగా ఉండుము; నేను మీకు నియమించిన కార్యాలయములో నిలిచియుండుము; బలహీనులకు చేయూత నియ్యుము, క్రుంగిన చేతులను పైకెత్తుము, మరియు బలహీనమైన మోకాళ్ళను బలపరచుము.” 15
ఇది కార్యాచరణగల సంఘం! ఇది స్వచ్చమైన మతము! ఆత్మీయ మరియు భౌతిక అవసరతలో ఉన్న వారికి చేయూతనిచ్చి, పైకెత్తి, మరియు బలపరచినప్పుడు ఈ సువార్త దాని నిజమైన భావములో ఉన్నది! ఆలాగు చేయుటకు మనము వారిని దర్శించుట మరియు వారికి సహాయపడుట అవసరము,16 ఆలాగున పరలోక తండ్రి యందు మరియు యేసు క్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తమునందు, వారి విశ్వాసపు సాక్ష్యములు వారి హృదయములందు దృఢముగా బంధించబడియుండును.
ఆయన పునఃస్థాపించబడిన సంఘములో మన సభ్యత్వమును కలిపి, దేవుని నుండి మన అనేక ప్రశస్తమైన వరములను భద్రపరచుకొనుటకు ప్రభువు మనకు సహాయపడి, మనల్ని దీవించును గాక. మనము మన పరలోక తండ్రి యొక్క పిల్లల కొరకు ప్రేమతో నింపబడి, వారి అవసరతలను చూడగలిగి, మరియు ఒకరినొకరి కొరకు అవగాహనను మరియు ప్రశంసను పెంపొందుంచునట్లు సువార్త గురించి వారి ప్రశ్నలు, సందేహాలకు స్పష్టమైన మరియు దయగల విధానాలలో జవాబిచ్చుటకు సమ్మతిస్తారని నేను ప్రార్థిస్తున్నాను.
యేసు క్రీస్తు మన రక్షకుడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ఈ సర్వసభ్య సమావేశములో మనకు బోధింపబడుచున్నది, సంఘము యొక్క అపోస్తలులు మరియు ప్రవక్తలు, ప్రధాన అధిపతులు మరియు ప్రధాన అధికారులైన నాయకురాళ్లైన సహోదరీల నుండి ప్రేరేపణ ద్వారా మనకు వచ్చును. ప్రభువు యొక్క సంతోషము మరియు సమాధానము ప్రతి ఒక్కరితోనూ నిలిచియుండాలని, ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా వినయముగల ప్రార్థన ఆమేన్.