2010–2019
దేవుని యొక్క ప్రవక్త
ఏప్రిల్ 2018


2:3

దేవుని యొక్క ప్రవక్త

ఒక ప్రవక్త మీకు, రక్షకునికి మధ్య నిలబడడు. మేలుగా, అతడు రక్షకునివైపు మార్గమును సూచిస్తూ మీ ప్రక్కన నిలుచును.

పన్నెండుమంది అపోస్తులుల కోరము యొక్క అసమానమైన సహోదరత్వమునకు ఎల్డర్ గార్రిట్ గాంగ్ మరియు ఎల్డర్ యులిసెస్స్ సోరెస్‌లకు నా స్వాగతమును చేర్చుచున్నాను.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను ప్రభువు యొక్క ప్రవక్తగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షునిగా మనము అమోదించుటలో, మనము దైవికంగా ఆజ్ఞాపించబడిన గంభీరమైన సమావేశములో భాగముగా ఉన్నాము—గంభీరమైనది ఎందుకనగా ఈ గడచిన గడియ యొక్క సంఘటనలు మన మర్త్యత్వమునకు ముందు లోకము నుండి పరలోకములలో ఎదురుచూడబడినవి. ఆయన కార్యమును నడిపించు ప్రభువైన యేసు క్రీస్తు, ఆయన నిబంధన జనులమైన మనకు, ఆయనను ఆమోదించి, ఆయన సలహాను వెంబడించుటకు మన సమ్మతిని తెలియచేయుటకు బహిరంగంగా మనల్ని అనుమతిస్తూ ఆయన అభిషేకించిన నాయకుడు, ఆయన ప్రవక్తను అధ్యక్షులు ఐరింగ్ ద్వారా సమర్పించారు.

సర్వ సభ్య సమావేశ కేంద్రములో ఇక్కడ మాతోలేని మిలియన్ల సభ్యులకు, అధ్యక్షులు నెల్సన్‌ను ఆమోదించు సమయంలో మీరు ఎదురుచూచినట్లుగా, ఈ భవనంలో ప్రభువు యొక్క ఆత్మ---సంపూర్ణ ఆత్మీయ శక్తితో నిండియున్నదని మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. కానీ మన పరలోకము-నడిపించిన సమావేశము, ఈ సమావేశ కేంద్రములో మాత్రమే లేదు కాని ప్రపంచమంతటా ఉన్నది: ఆసియా, ఆఫ్రికా, మరియు ఉత్తర అమెరికాలోని సంఘ భవనాలలో; మధ్య, దక్షిణ అమెరికా మరియు ఐరోపాలలోని గృహాలలో; ఫసిపిక్ మరియు సముద్ర ద్వీపాలలో కప్పబడిన చప్టాలపై; ప్రపంచములో మీరెక్కడ ఉన్నప్పటికినీ, మీ స్మార్ట్ ఫోనులో వినటానికి మాత్రమే కనక్షన్ ఉన్నయెడల, కూడ. పైకి లేపబడిన మన చేతులు మన బిషప్పులచేత లెక్కించబడవు, కానీ దేవునితో మన నిబంధన, మరియు మన క్రియ జీవగ్రంథములో వ్రాయబడినట్లుగా, అవి నిశ్చయముగా గుర్తించబడతాయి,

ప్రభువు తన ప్రవక్తను ఎన్నుకొనును

ఒక ప్రవక్తను ఎంపిక చేయుట ప్రభువు తానే నిర్ణయిస్తాడు. ప్రచారముండదు, వాదోపవాదనలు, స్థానము కొరకు విన్యాసముండదు, అసమ్మతి, అపనమ్మకము, గందరగోళము, లేక కల్లోలముండదు. దేవాలయము యొక్క పైన గదిలో మేము ప్రార్థనాపూర్వకంగా అధ్యక్షులు నెల్సన్‌ను చుట్టిముట్టినప్పుడు, పరలోకము యొక్క శక్తి మాతో ఉన్నదని నేను కూడా నిర్ధారిస్తున్నాను మరియు ఆయనపై ప్రభువు యొక్క నిరాకరించలేని అనుమతిని అనుభూతిచెందాము.

దేవుని యొక్క ప్రవక్తగా సేవ చేయుటకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను ఎంపిక చేయుట చాలాకాలము క్రితం చేయబడింది. యిర్మీయాకు ప్రభువు యొక్క మాటలు అధ్యక్షులు నెల్సన్ కూడా అన్వయించును: “గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.”1 మూడు సంవత్సరాల క్రితం, ఎల్డర్ నెల్సన్, 90 ఏళ్లకు, ఆయన కంటే వయస్సులో చిన్నవారైన ముగ్గురు సీనియర్ అపోస్తులులు ఇద్దరితోపాటు పెద్దరికములో నాలగవవారిగా ఉన్నారు. జీవితమును మరియు మరణమును అదుపుచేయు ప్రభువు, ఆయన ప్రవక్తను ఎంపిక చేస్తారు. అధ్యక్షులు నెల్సన్‌ 93 సంవత్సరాల వయస్సులో, అద్భుతమైన ఆరోగ్యము కలిగియున్నారు. ఆయన మరొక దశాబ్దము లేక రెండు మనతో ఉంటారని మేము ఆశిస్తున్నాము, కానీ ప్రస్తుతానికి ఆయన యూటా ఏటవాలుల స్కై చేయకుండా ఆయనను ఆపటానికి మేము ప్రయత్నిస్తున్నాము.

ప్రవక్తను ప్రభువుచేత అభిషేకించబడిన వానిగా మనము గౌరవించినప్పుడు, మనము మన పరలోక తండ్రియైన దేవుని, మరియు ఆయన దైవిక కుమారునిని మాత్రమే ఆరాధిస్తామని స్పష్టముగా ఉండనియ్యుము. అది మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క యోగ్యత, దయ మరియు కృప ద్వారా, ఒకరోజు మనము వారి సన్నిధిలోనికి తిరిగి వెళ్లగలము.2

మనము ప్రవక్తను ఎందుకు వెంబడిస్తాము

కాని యేసు తాను మనకు పంపిన సేవకులను గూర్చి ముఖ్యమైన సత్యములను కూడా బోధించును, “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు, నన్ను పంపినవాని చేర్చుకొనును,”3 అని ఆయన అన్నాడు.

ప్రభువు ప్రవక్త యొక్క అతి ముఖ్యమైన పాత్ర, రక్షకుని గూర్చి బోధించుట మరియు ఆయన వద్దకు మనల్ని నడిపించుట.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను అనుసరించుటకు అనేక తార్కిక హేతువులున్నాయి. మనము విశ్వాసమునకు చెందని వారు కూడా, “ఆయన తెలివైనవారు” అని చెప్తారు. 22 సంవత్సరాల వయస్సులో ఆయన ఒక వైద్యుడు, పేరు పొందిన గుండె శస్త్ర చికిత్స నిపుణులు, మరియు ఓపెన్-హార్ట్ సర్జరీని అభివృద్ధి చేయుటలో ప్రసిద్ధి చెందిన అగ్రగామి.

“ఆయన నిస్సందేహంగా, జ్ఞానవంతుడు,” అని అనేకమంది అంగీకరిస్తారు: జీవితము మరియు మరణము గురించి తొమ్మిది దశాబ్దాలుగా శిక్షణ, నిస్వార్ధముగా జీవిస్తూ, భూగోళము యొక్క ప్రతీ మూలలో ఉన్నవారిని ప్రేమిస్తూ, బోధిస్తూ, మరియు పదిమంది పిల్లలు, 57 మంది మనుమలు, 118 మంది మునిమనుమలు (ఈ చివరి సంఖ్య తరచుగా మారును. ఒక క్రొత్త ముని మనుమడు గత బుధవారము జన్మించాడు) కలిగియున్న అనుభవముతో పరిపక్వము చెందారు.

క్రొత్త ముని మనుమనితో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌

ఆయనను బాగా ఎరిగిన వారు అధ్యక్షులు నెల్సన్‌ జీవితపు కష్టాలను విశ్వాసముతో మరియు ధైర్యముతో ఎదుర్కొన్నారని చెప్తారు. ఆయన 37 సంవత్సరాల కుమార్తె ఎమిలీని ప్రేమగల భర్త, మరియు ఐదుగురు పిల్లలను వదిలి కాన్సరు ఆమె ప్రాణాన్ని తీసుకున్నప్పుడు, ఆయన ఇలా చెప్పుట నేను విన్నాను, “నేను ఆమెకు తండ్రిని, ఒక వైద్యుడను, మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపోస్తులడను, కానీ నేను నా తల వంచి . . . అంగీకరించాల్సియున్నది, , ‘నా చిత్తము కాదు మీదే జరగనియ్యుము. ’”4

గోపురముపైన కావలికాయువాడు

మనము ఆ దివ్యమైన లక్షణాలు అన్నిటిని మెచ్చుకొన్నప్పటికిని, అధ్యక్షులు నెల్సన్‌ను మనము ఎందుకు వెంబడిస్తాము? మనము ప్రవక్తను ఎందుకు వెంబడిస్తాము? ప్రభువైన యేసు క్రీస్తు ఆయనను గోపురముపై తన కావలికాయువానిగా పిలిచారు కనుక.

కార్కాస్సొని, ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లో అసాధారణమైన గోడలు గల పట్టణము కార్‌కాస్సొని మధ్యయుగపు కాలములనుండి నిలిచియున్నది. దానిని కాపాడే గోడలనుండి పైకి లేచు పొడుగైన గోపురాలు, రాత్రి మరియు పగలు ఆ గోపురాలపై నిలబడిన కావలివారు, శత్రువు కొరకు దూరమునుండి వారి ఆసక్తిని లగ్నము చేయుటకు నిర్మించబడినవి. ఒక శత్రువు సమీపించుట కావలికాయువాడు చూచినప్పుడు, అతడి హెచ్చరించు స్వరము కార్‌కాస్సొనిలోని జనులు చూడలేని పొంచియున్న అపాయమునుండి వారిని కాపాడెను.

ఒక ప్రవక్త, మనము చూడలేని ఆత్మీయ అపాయములనుండి మనల్ని కాపాడుతూ గోపురముపై కావలికాయువాడు.

ప్రభువు యెహెజ్కేలుతో చెప్పాడు, “నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.”5

ప్రవక్తను అనుసరించుటకు మన అవసరతను గూర్చి మనము తరచుగా మాట్లాడతాము, కానీ ప్రభువు తన ప్రవక్తపై ఉంచు బరువైన భారమును ఆలోచించుము: “దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును. గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును.”6

మహాగొప్ప వ్యక్తిగత సాక్ష్యము

అతడి కాలములో మనము జీవించిన యెడల పేతురును లేక మోషేను హత్తుకొన్నట్లుగా అధ్యక్షులు నెల్సన్‌ను మనము హత్తుకుంటాము. దేవుడు మోషేతో చెప్పాడు, “నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను.”7 మనము ప్రభువు యొక్క ప్రవక్త మాటలు “(ప్రభువు యొక్క) స్వంత నోటినుండి వచ్చినవనే” 8విశ్వాసముతో ఆలకిస్తాము.

ఇది అంధ విశ్వాసమా? లేదు, అదికాదు. యేసు క్రీస్తు సువార్త పునస్థాపన యొక్క యధార్ధతను గూర్చి మనలో ప్రతిఒక్కరము ఆత్మీయ సాక్ష్యమును కలిగియున్నాము. మన స్వంత చిత్తము మరియు ఎంపిక ద్వారా, మనము ఈ ఉదయమున, “(మన) నమ్మకము, (మన) విశ్వాసమును, మరియు (మన) ప్రార్థన(ల)” 9 ద్వారా ప్రభువు యొక్క ప్రవక్తను పైకెత్తుటకు మన కోరికను ప్రకటిస్తూ, మన చేతిని పైకెత్తాము. అధ్యక్షులు నెల్సన్‌ యొక్క పిలుపు దేవుని నుండి వచ్చిందని వ్యక్తిగత నిర్ధారణను పొందుటకు కడవరి దిన పరిశుద్ధులుగా మనము విశేషావకాశమును కలిగియున్నాము. నా భార్య కాథీ అధ్యక్షులు నెల్సన్‌ను దాదాపు మూడు దశబ్దాలుగా ఎరిగియున్నది మరియు ఆయన దైవిక పిలుపు గురించి ఏ సందేహములేనప్పటికి, ఆమె గత 34 సంవత్సరాలుగా ఆయన ప్రసంగములను చదవసాగింది, మరియు ఆయన ప్రవచనాత్మక పాత్ర గురించి ఇంకా లోతైన అభయము కొరకు ప్రార్థించింది. మీరు వినయముగా ఉండి మరియు యోగ్యత కలిగియున్నప్పుడు ఈ గొప్ప సాక్ష్యము మీకు వచ్చును.

మన ప్రవక్త యొక్క స్వరమును అనుసరించుటకు మనము ఎందుకు సమ్మతించుచున్నాము? నిత్య జీవితమును శ్రద్ధగా వెదకువారి కొరకు, ప్రవక్త యొక్క స్వరము చాలా కల్లోలముగల లోకములో ఆత్మీయ భద్రతను తెచ్చును.

మిలియన్ల స్వరములతో కేకలు వేయు గ్రహముపై మనము నివసిస్తున్నాము. ఇంటర్నేట్, మన స్మార్ట్ ఫోన్లు, మన వినోదముగల పెద్ద బాక్సులు వాటి ఉత్పత్తులను కొని మరియు వాటి ప్రమాణాలను పొందుపరుస్తామని ఆశిస్తూ అన్నీ మనపై వాటి ప్రభావమును బలవంతము చేస్తాయి.

అంతములేకుండా లభ్యమైనట్లు కనబడుచున్న సమాచారము మరియు అభిప్రాయము మనకు “ఇటు అటు కొట్టుకొనుపోవుచు”10 “గాలితో తరమబడి”11 “మాయోపాయములచేత వంచనతోను” ఎక్కువగా ప్రభావితం చేయబడి మరియు “మోసగించుటకు పొంచియున్నవారి”12 చేత జయించబడుటను గూర్చి లేఖనముల హెచ్చరికలను మనకు గుర్తు చేయును.

ప్రభువైన యేసు క్రీస్తుకు మన ఆత్మలను లంగరు వేయుటకు ఆయన పంపిన వారిని వినుట అవసరము. కల్లలోలము నిండిన లోకములో ప్రవక్తను వెంబడించుట గడ్డకట్టే చలిలో మృదువైన, వెచ్చని దుప్పటితో కప్పబడినట్లు ఉన్నది.

మనము హేతువు, చర్చ, వాదన, తర్కము మరియు వివరణగల లోకములో జీవిస్తున్నాము. “ఎందుకు?” అని ప్రశ్నించుట మనము ప్రతీరోజు ఎదుర్కొను ఎంపికలు మరియు నిర్ణయాల సమూహమును నడిపించుటకు మన బుద్ధి బలమును అనుమతిస్తూ, మన జీవితాల యొక్క అనేక ఆకృతులందు అనుకూలమైనది.

అయితే వివరణ లేకుండా ప్రభువు యొక్క స్వరము తరచుగా వచ్చును.”13 విద్యావేత్తలు సహవాసులు మరియు పిల్లలను నమ్ముటలో దాంపత్యద్రోహము యొక్క ప్రభావమును అధ్యయనము చేయకముందే, ప్రభువు “వ్యభిచరింపకూడదు” మరియు “నరహత్య చేయకూడదు”14 అని ప్రకటించాడు.పూర్తిగా తెలివితేటలపై ఆధారపడుటను మించి, మనము పరిశుద్ధాత్మ యొక్క వరమును భద్రపరుస్తాము.

ఆశ్చర్యపడకుము

నోవహు ప్రకటించుట

ప్రవక్త యొక్క స్వరము, దయగా మాట్లాడుచుండగా, తరచుగా మనము మారుటకు, పశ్చాత్తాపపడమని, మరియు ప్రభువు వైపు తిరగమని పిలిచే స్వరముగా ఉండును. దిద్దుబాటు అవసరమైనప్పుడు, మనము ఆలస్యము చేయరాదు. ఈ కాలములోని ప్రసిద్ది చెందిన అభిప్రాయములను ప్రవక్త యొక్క హెచ్చరించు స్వరము వ్యతిరేకించినప్పుడు విసుగుచెందిన అవిశ్వాసులు ప్రవక్త మాట్లాడుట ప్రారంభించిన వెంటనే ఎగతాళి అగ్నిగోళములను విసరుతారు. ప్రభువు యొక్క ప్రవక్త యొక్క సలహాను మరియు బోధనలను అనుసరించుటలో మీరు వినయముగా ఉన్నప్పుడు, క్షేమము మరియు సమాధానము యొక్క చేర్చబడిన దీవెనలను నేను మీకు వాగ్దానము చేయుచున్నాము.

లేమనీయుడైన సముయేలు ప్రవచించును

మీ స్వంత వ్యక్తిగత అభిప్రాయములు ఎల్లప్పుడు ప్రభువు యొక్క ప్రవక్త యొక్క బోధనలతో పూర్తి ఐకమత్యముగా లేకపోతే ఆశ్చర్యపడకుము. మనము ప్రార్థనయందు మోకరించినప్పుడు ఇవి నేర్చుకొను, వినయముగల క్షణములు. కాలముతో మన పరలోక తండ్రి నుండి ఎక్కువ ఆత్మీయ స్పష్టతను పొందుతామని నమ్ముతూ, దేవునియందు నమ్మకముంచి, మనము విశ్వాసమునందు ముందుకు నడుస్తాము. ఒక ప్రవక్త రక్షకుని యొక్క సాటిలేని వరమును “కుమారుని యొక్క చిత్తము తండ్రి యొక్క చిత్తమందు ఉపసంహరించబడెను” అని వర్ణించాడు.15 వాస్తవానికి దేవుని యొక్క చిత్తమునకు మన చిత్తమును అప్పగించుట, ఎంతమాత్రము ఓడిపోవటం కాదు కానీ మహిమకరమైన విజయము.

కొందరు అతడి ప్రవచనాత్మక స్వరము ఏది మరియు ఏది అతడి స్వంత అభిప్రాయమో తీర్మానించుటకు ప్రయాసపడుతూ, ప్రవక్త యొక్క మాటలను ఎక్కువ విశ్లేషించుటకు ప్రయత్నిస్తారు.

1982లో, ఒక ప్రధాన అధికారిగా పిలవబడకముందు రెండు సంవత్సరాల క్రితం, సహోదరుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “ఒక ప్రవక్త ఎప్పుడు ప్రవక్తగా మాట్లాడతాడు మరియు ఎప్పుడు అతడు మాట్లాడడు ?‘ ఎన్నడూ నాకై నేను అడగను.” ‘నేను ఆయన వలె ఎక్కువగా ఎలా కాగలము?’” ఇది నా ఆసక్తిగా ఉన్నది. ఆయన ఇలా అన్నారు, “నా (తత్వము) ఏమిటనగా ప్రవచనాత్మక వ్యాఖ్యానాలను వెనుక ప్రశ్నార్ధకములను మానివేయుట మరియు బదులుగా ఆశ్చర్యర్ధకములను ఉంచుట.”16 ఈవిధంగా ఒక వినయముగల, ఆత్మీయుడైన వ్యక్తి తన జీవితమును క్రమపరచుటకు ఎన్నుకొనును. 36 సంవత్సరాల తరువాత ఇప్పుడు, ఆయన ప్రభువు యొక్క ప్రవక్త.

రక్షకునియందు మీ విశ్వాసమును వృద్ధి చేయుట

నా వ్యక్తిగత జీవితములో, నేను దేవుని యొక్క ప్రవక్త మాటలను ప్రార్థనాపూర్వకంగా మరియు జాగ్రత్తగా, సహనముతో చదివినప్పుడు, ఆయన బోధనలతో నా చిత్తమును ఆత్మీయంగా కలిపినప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తునందు నా విశ్వాసము ఎల్లప్పుడు వృద్ధిచెందునని నేను కనుగొన్నాను.17ఆయన సలహాను నిర్లక్ష్యము చేయుటకు మీరు ఎన్నుకొని, మనకు బాగా తెలుసని తీర్మానించుకొన్నప్పుడు, మన విశ్వాసము నష్టపడును మరియు మన నిత్య అవలోకనము అస్పష్టము చేయబడును. ప్రవక్తను అనుసరించుటలో మీరు స్థిరముగా ఉన్నప్పుడు, రక్షకుని యందు మీ విశ్వాసము వృద్ధిచెందునని నేను మీకు వాగ్దానము చేయుచున్నాను.

రక్షకుడు చెప్పాడు, “ప్రవక్తలందరు . . . ఎంతమంది చెప్పియుండిరో అంతమంది నన్ను గూర్చి సాక్ష్యమిచ్చిరి.”18

ఒక ప్రవక్త మనకు మరియు రక్షకునికి మధ్య నిలబడడు. బదులుగా, అతడు మన ప్రక్కన నిలబడి, రక్షకునికి మార్గమును సూచించును. ఒక ప్రవక్త యొక్క గొప్ప బాధ్యత మరియు మనకు మిక్కిలి ప్రశస్తమైన వరము ఆయన నిశ్చయమైన సాక్ష్యము, యేసే క్రీస్తని అనే ఆయన స్థిరమైన జ్ఞానము. పాత పేతురు వలే, మన ప్రవక్త ప్రకటించును, “(ఆయన), సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు.”19

భవిష్యత్తు దినములో, మన మర్త్యత్వముపై తిరిగి చూస్తూ, జీవిస్తున్న ప్రవక్త కాలమందు భూమిమీద మనము నడిచామని మనము ఆనందిస్తాము. ఆరోజు, మనము ఇలా చెప్పగలమని నేను ప్రార్థిస్తున్నాను:

మేము ఆయనను ఆలకిస్తాము.

మేము ఆయనను నమ్ముతాము.

మనము ఆయన మాటలను ఓపిక మరియు విశ్వాసముతో అధ్యయనము చేసాము.

మనము ఆయన కొరకు ప్రార్థన చేసాము.

మనము ఆయన ప్రక్కన నిలబడ్డాము.

మనము ఆయనను వెంబడించుటకు తగినంత దీనులుగా ఉన్నాము.

మనము ఆయనను ప్రేమించాము.

యేసే క్రీస్తని, మన రక్షకుడని మరియు విమోచకుడని, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ భూమిమీద ఆయన అభిషేకించిన ప్రవక్త అని నా గంభీరమైన సాక్ష్యమును నేను మీకిచ్చుచున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. యెహెజ్కేలు 33:7.

  2. 2 నీఫై 2:8 చూడుము.

  3. మత్తయి 10:40.

  4. Personal memory; also see Spencer J. Condie, Russell M. Nelson: Father, Surgeon, Apostle (2003), 235.

  5. యెహెజ్కేలు 33: 7.

  6. యెహెజ్కేలు 33:8.

  7. నిర్గమకాండము 4:12.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 21:5.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 107:22.

  10. ఎఫెసీయులకు 4:14.

  11. యాకోబు 1:6.

  12. ఎఫెసీయులకు 4:14.

  13. అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఒకసారి చెప్పారు:

    “1988 ఒక మౌఖిక సంభాషణలో . . . దైవిక బయల్పాటు కొరకు మానవ కారణాలను సరఫరా చేయుటకు ప్రయత్నాల వైపు నా స్వభావమును నేను వివరించాను:

    “‘ఈ ప్రశ్నను మనస్సులో ఉంచుకొని మీరు లేఖనాలను చదివిన యెడల, “ప్రభువు దీనిని ఎందుకు ఆజ్ఞాపించాడు లేక ఆయన దానిని ఎందుకు ఆజ్ఞాపించాడు,” వంద ఆజ్ఞలలో ఒకటి కంటే తక్కువలో ఏ కారణమివ్వబడలేదని మీరు కనుగొంటారు. కారణములిచ్చుట ప్రభువు యొక్క మాదిరి కాదు. (మర్త్యులమైన) మనము బయల్పాటుకు కారణములివ్వవచ్చును. ఆజ్ఞలకు కారణములను మనమివ్వవచ్చు. మనము ఇచ్చినప్పడు మనము మన స్వంతంగా విడవబడతాము. కొందరు జనులు (బయల్పాటుకు) కారణములిస్తారు . . . .మరియు అవి అనూహ్యంగా తప్పైనవి. దానిలో ఒక కారణమున్నది. . . ఆజ్ఞలో నాకు విశ్వాసమున్నదని మరియు దాని కొరకు సూచించబడిన కారణములందు నాకు విశ్వాసములేదని నేను చాలా కాలం క్రితం నిర్షయించుకున్నాను.’ …

    “‘… కారణములన్నియు అనవసరంగా సాహసవంతమైనదగా నాకు కనబడుతున్నది. . . .బయల్పాటుకు కారణములనిచ్చుటకు ప్రయత్నిస్తూ, . . . గతములో చేయబడిన తప్పును మనము చేయవద్దు. కారణములు మానవ నిర్మితమైనవి నుండి గొప్ప మేరకు మారవచ్చు. ప్రభువు యొక్క చిత్తముగా మనము ఆమోదించినవి బయల్పాటులు మరియు అక్కడే భద్రత నిలిచియున్నది’” (Life’s Lessons Learned [2011], 68–69).

  14. నిర్గమకాండము 20:14.

  15. మోషయ 15:7.

  16. Russell M. Nelson, in Lane Johnson, “Russell M. Nelson: A Study in Obedience,” Tambuli, Jan. 1983, 26.

  17. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ చెప్పారు: “మరొక అవాస్తవమైనది ప్రవక్తల యొక్క సలహాను అంగీకరించుట లేక అంగీకరించకుండుట మంచి సలహాను అంగీకరించి దాని ప్రయోజనాలను పొందుట లేక మనమెక్కడ ఉన్నామో అక్కడే నిలిచియుండుట అని నిర్ణయించకుండుట కంటే ఎక్కువైనది కాదని నమ్ముట. కానీ ప్రవచనాత్మక సలహాను తీసుకొనకుండు ఎంపిక మనము నిలబడే పునాదిని మార్చివేయును. అది ఎక్కువ ప్రమాదకరమైనదగును. ప్రవచనాత్మక సలహాను తీసుకొనుటకు విఫలమగుట, భవిష్యత్తులో ప్రేరేపించబడిన సలహాను తీసుకొనుటకు మన శక్తిని తగ్గించివేయును. నోవహు ఓడ నిర్మించుటకు సహాయపడుటకు నిర్ణయించుటకు శ్రేష్టమైన సమయము, అతడు అడిగిన మొదటిసారి. తరువాత అతడు అడిగిన ప్రతీసారి, స్పందించుటకు ప్రతీ వైఫల్యము ఆత్మకు సున్నితత్వమును తగ్గించివేసెను. కనుక వర్షము వచ్చేంత వరకు, ప్రతీసారి అతడి మనవి ఎక్కువ అవివేకమైనదిగా కనబడియుండవచ్చు. మరియు తరువాత అది చాలా ఆలస్యము” (“Finding Safety in Counsel,” Ensign, May 1997, 25).

  18. 3 నీఫై 20:24.

  19. మత్తయి 16:16; యోహాను 6:69 కూడా చూడుము.