2010–2019
“సంఘ సభ్యులతో వుండి వారిని బలపరచుము”
ఏప్రిల్ 2018


“సంఘ సభ్యులతో వుండి వారిని బలపరచుము”

ఈ సర్వసభ్య సమావేశమును విడిచి వెళ్లు ప్రతీ పురుషుడు, స్త్రీ, ఒకరినొకరి కొరకు హృదయపూర్వకమైన శ్రద్ధను భావించుటకు ఎక్కువ లోతుగా ఒడంబడిక చేసుకుంటారని ఈరోజు మా ప్రార్థన.

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్‌ను వ్యాఖ్యానించుటకు, “జీవితంలో మిక్కిలి జ్ఞాపకార్ధమైన క్షణాలు, బయల్పాటు యొక్క వేగమును మనము అనుభూతి చెందేవి.1 అధ్యక్షులు నెల్సన్, ఈ వారాంతములో మేము ఎన్ని “వేగవంతమైన బయల్పాటులు” వినగలమో, నాకు తెలియదు. మాలో కొందరికి బలహీనమైన గుండెలున్నాయి. కానీ దాని గురించి నేను ఆలోచించినప్పుడు, మీరు దానిని కూడ శ్రద్ధ తీసుకోగలరు. ఎలాంటి ప్రవక్త!

నిన్న రాత్రి మరియు ఈ ఉదయమున అధ్యక్షులు నెల్సన్ యొక్క అద్భుతమైన ప్రకటనలు మరియు సాక్ష్యము యొక్క ఆత్మయందు, దాని ఆరంభము నుండి ఈ సంఘమును బయల్పాటు నడిపించిందనుటకు ఈ సవరణలు మాదిరులని నేను నా స్వంత సాక్ష్యమును చెప్పుచున్నాను. దాని కాలమందు ఆయన కార్యమును ప్రభువు వేగిరపరచుచున్నాడనుటకు అవి ఇంకా ఎక్కువ రుజువుగా ఉన్నవి.2

ఈ విషయాలను గూర్చి వివరాలను తెలుసుకోవాలని ఆతృత గల వారందరికి, ఈ సర్వసభ్య సమావేశము ముగిసిన వెంటనే, మా వద్ద ఈ-మెయిల్ చిరునామా ఉన్న సంఘము యొక్క ప్రతీ సభ్యునికి ప్రథమ అధ్యక్షత్వమునుండి ఒక లేఖను పంపు క్రమము ప్రారంభమగును. ప్రశ్నలు మరియు జవాబులు గల ఏడు పేజీల పత్రమును యాజకత్వము మరియు సహాయక నాయకులందరికి పంపబడును. చివరిగా, ఆ విషయములు ministering.LDS.org పై వెంటనే పోస్టు చేయబడును. “అడుగుడి మీకివ్వబడును, తట్టుడి మీకు తెరవబడును.”3

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, కోరము మరియు సహాయకముల సంస్థాపరంగా పరిపక్వత చెందినప్పుడు, మనము వ్యక్తిగతంగా---అదేవిధంగా స్వయంగా, కార్యముగా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నాకు మరియు సహోదరి బి. బింగమ్‌కు ఇచ్చిన అద్భుతమైన కార్యమునకు, స్పష్టముగా సంఘము యొక్క కార్యము సంస్థాపరంగా పరిపక్వత చెందినప్పుడు, మనము యాంత్రికంగా పనిచేయుట వ్యక్తిగతంగా మాని, ఆయన భూలోక పరిచర్య యొక్క ముగింపునందు రక్షకుని చేత వ్యక్తపరచబడిన హృదయపూర్వకమైన శిష్యత్వమునకు ఎదిగి---మనము స్వయంగా పరిపక్వత చెందాలి. ఆయన తన అమాయకులైన మరియు కాస్త కలవరపడిన అనుచరుల చిన్న గుంపును వదలి వెళ్ళుటకు సిద్ధపడినప్పుడు, వారు తీసుకోవాల్సిన అనేక కార్యనిర్వాహాక మెట్లను ఆయన వరసగా చెప్పలేదు, లేక మూడు ప్రతులందు నింపుటకు విస్తారమైన నివేదికలను వారికివ్వలేదు. లేదు, ఆయన వారి కార్యమును ఒక ప్రధాన ఆజ్ఞయందు సంక్షిప్తపరిచాడు: “నేను మిమ్మును ప్రేమించినట్టే, మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను . . . ,” ఆయన అన్నాడు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులను అందరును తెలిసికొందురనెను.”4

ఆ సువార్త ఆదర్శమునకు మనము దగ్గరగా కదిలే ప్రయత్నములో, క్రొత్తగా ప్రకటించిన యాజకత్వము మరియు ఉపశమన సమాజము పరిచర్య భావన మిగిలిన విషయాల మధ్య క్రింది అంశాలను కలిగియుండునని, వాటిలో కొన్నిటిని ఉపశమన సమాజము ఇదివరకే అద్భుతమైన విజయముతో ఉపయోగిస్తున్నారని మేము సంతోషిస్తున్నాము.5

  • మనమిక గృహ బోధన మరియు దర్శించు బోధన భాషను ఉపయోగించము. అది పాక్షికంగా ఎందుకనగా మన పరిచర్య చేయు ప్రయత్నము గృహము కంటే ఇతర సందర్భాలలో ఉండును మరియు అటువంటి అవసరత ఏదైన ఉన్నయెడల నిశ్చయముగా ఒక పాఠము పంచుకొనబడ వచ్చినప్పటికిని, పాక్షికంగా మన పరిచయస్తులు సిద్ధపరచబడిన పాఠములను బోధించుట ద్వారా కాదు. ఈ పరిచర్య చేయుటలో ప్రధాన ఉద్దేశ్యము, ఆల్మా కాలములో చెప్పబడినట్లుగా, “వారి జనుల పైన కనిపెట్టియుండిరి, . . . మరియు నీతిని గూర్చిన వాక్యములతో వారి పోషించిరి.”6

  • మనకు సాధ్యమైనంతగా గృహాలను దర్శించుటను మనము కొనసాగిస్తాము, కానీ పెద్ద సంఖ్యలు, దూరప్రదేశాలు, వ్యక్తిగత భద్రత, మరియు ఇతర కష్టమైన పరిస్థితులు వంటి స్థానిక పరిస్థితులు ప్రతీనెల ప్రతీ గృహమును దర్శించుటను ఆటంకపరచవచ్చు. సంవత్సరాల క్రితం, ప్రథమ అధ్యక్షత్వము సలహా ఇచ్చినట్లుగా, మీకు లభ్యమయ్యే వనరులతో మీకు శాయశక్తులా చేయుము.7 మాములు దర్శనాలకు మీరు ఎర్పరిచే ప్రణాళిక ఏదైనప్పటికిని, ఆ కాలెండరు ఫోను పిలుపులు, వ్రాయబడిన చీటిలు, సందేశాలు, ఈ-మెయిల్, వీడియో సంభాణలు, సంఘ సమావేశాల వద్ద సంభాషణలు, పంచుకోబడిన సేవా ప్రాజెక్టులు, సామాజిక కార్యక్రమాలు, మరియు సామాజిక ప్రపంచము నుండి కలిగే సాధ్యతలు సమూహముతో తిరిగి చేయబడవచ్చు. అయినప్పటికినీ, ప్రతిస్పందించుటకు సాధ్యమైన విధానముల యొక్క విస్తారమైన క్రొత్త దృశ్యము, నేను ఇటీవల ఒక ఆటోమొబైల్ బంపరు స్టిక్కరు పై చూసిన ఒక సిగ్గుకరమైన స్వభావమును కలిగియుండదని నేను నొక్కి చెప్పుచున్నాను, అది ఇలా చదవబడింది, “నేను మీ వైపు నా కారు హారన్‌ను వేస్తే, మీరు ఇంటిలో నేర్పబడ్డారని భావించుము.” సహోదరులారా, దయచేసి,ఈ సవరణలతో మేము ఎక్కువ శ్రద్ధ మరియు ఆలోచనను కోరుతున్నాను, తక్కువ కాదు (సహోదరీలు దీని గూర్చి ఎప్పటికీ దోషులుగా భావించబడరు---సంఘ సహోదరులతో నేను మాట్లాడుతున్నాను).

  • ఈ క్రొత్త పరిచర్య చేయుటకు సువార్త ఎక్కువగా కేంద్రీకరించబడిన భావనతో, నివేదికలో ఏది లెక్కించబడుతుందో మీరు భయపడుట ప్రారంభిస్తారని నేను భావిస్తున్నాను. సరే, విశ్రాంతి తీసుకొనండి, ఎందుకనగా, అక్కడ ఏ నివేదిక లేదు—కనీసము నెలలో 31 వ రోజు కాదు. “నేను నా పిలుపును కేవలము అరుదుగా నెరవేర్చాను” నివేదిక. ఇక్కడ కూడ మనము పరిపక్వత చెందుటకు ప్రయత్నిస్తున్నాము. చేయబడే ఏకైక నివేదిక ఆ త్రైమాసికము వార్డులో పరిచర్య చేయు సహవాసులతో నాయకులకు జరిగిన మౌఖిక సంభాషణలు. నా స్నేహితులారా, అది సాధారణమైనదిగా అనిపించినప్పటికిని, ఆ మౌఖిక సంభాషణలు ఖచ్చితంగా కీలకమైనవి. ఆ సమాచారము లేకుండా ఆ బిషప్పు తన జనుల యొక్క ఆత్మీయ మరియు భౌతిక పరిస్థితులను గూర్చి సమాచారమును ఏవిధంగాను పొందలేడు. జ్ఞాపకముంచుకొనుము: పరిచర్య చేయు సహోదరులు, బిషప్రిక్కు మరియు ఎల్డర్ల కోరము అధ్యక్షత్వమును సూచించును; వారికి బదులుగా వీరుంచబడరు. ఒక బిషప్రిక్కు మరియు ఒక కోరము అధ్యక్షుని యొక్క తాళపు చెవులు ఈ పరిచర్య చేయు భావనను దాటి వెళ్లును.

  • గతములో మీరు అప్పగించిన దానినుండి ఈ నివేదిక భిన్నమైనది కనుక, సంఘ ప్రధాన కేంద్రముల వద్ద ఉన్న మేముమీ జనులతో ఎలా లేక ఎక్కడ లేక ఎప్పుడు సంప్రదిస్తారో మాకు తెలియాల్సినవసరములేదని నేను నొక్కి చెప్పుతున్నాను, మీరు దానిని చేయాలని మరియు మీకు సాధ్యమైన ప్రతీ విధానములో మీరు వారిని దీవించాలని మేము శ్రద్ధ తీసుకుంటాము.

సహోదర, సహోదర, సహాదరిలారా, మనము అవి తేలికగునట్లు ఒకరినొకరి భారములను భరించుటకు మరియు ఆదరణ అవసరమైన వారికి ఆదరణనిచ్చుటకు, విధవరాళ్లకు, తండ్రిలేని వారికి,9 వివాహితులకు, ఒంటరి వారికి, బలమైన మరియు మానసిక వ్యధ చెందిన, అణగద్రొక్కబడినవారు మరియు బలమైన వారికి, సంతోషముగా ఉన్నవారికి, విచారముగా ఉన్నవారికి ---క్లుప్తంగా, మనలో ప్రతిఒక్కరికి పరిచర్య చేయుటకు దేవుని యెదుట అపవిత్రముకాని పరిశుద్ధమైన మతమును రుజువు చేయుటకు”8 ఇక్కడ మనము పరలోకము నుండి పంపబడిన అవకాశమును సంఘము మొత్తముగా మనము కలిగియున్నాము, ఎందుకనగా మనమందరము స్నేహమునుండి వచ్చు అప్యాయతను అనుభూతి చెందాలి మరియు విశ్వాసము యొక్క స్థిరమైన ప్రకటనను వినాలి. అయినప్పటికిని, ఒక క్రొత్త పేరు, క్రొత్త వశ్యత, కొన్ని నివేదికలు ఇప్పుడు అధ్యక్షులు నెల్సన్ చెప్పినట్లుగా ధైర్యముగల, క్రొత్త పరిశుద్ధమైన విధానములో ఒకరినొకరి కొరకు శ్రద్ధ తీసుకొనుటకు ఒక ఆహ్వానముగా దీనిని చూస్తే తప్ప కొన్ని నివేదికలు మన సేవలో చాలా స్వల్ప తేడాను కలిగియుంటాయి. ఎక్కువ విశ్వవ్యాప్తంగా ప్రేమ యొక్క చట్టమును జీవించుట వైపు మన ఆత్మీయ నేత్రములను మనము పైకెత్తినప్పుడు, సంవత్సరాలు సేవ చేసిన తరములకు నివాళి అర్పిస్తాము. మన సహోదర, సహోదరీలతో “వుండి వారిని బలపరచుటకు”10 ప్రభువు యొక్క ఆజ్ఞను అనేకమంది గ్రహిస్తారనే ఆశతో అటువంటి మాదిరిని నేను వివరిస్తాను.

గత జనవరి 14న, ఒక ఆదివారము, సాయంత్రము 5:00 గంటల తరువాత, నా యౌవన స్నేహితులు బ్రెట్ మరియు క్రిస్టిన్, బ్రెట్ బిషప్రిక్కులో సేవ చేసి, క్రిస్టిన్ వారి ఐదుగురు పిల్లలను శ్రద్ధ తీసుకొనుటలో తీరిక లేకుండా ఉన్న దినము తరువాత హాంబ్లిన్ ఆరిజోనాలో వారి ఇంటి వద్ద మాట్లాడుకుంటున్నారు.

గత సంవత్సరము నుండి రొమ్ము కాన్సరుతో పూర్తిగా నయమైనట్లు కనబడిన క్రిస్టిన్ హఠాత్తుగా అపస్మారక స్థితిలో పడిపోయింది. 911 కు ఒక ఫోను పిలుపు పొందిన అత్యవసర జట్టు వచ్చి ఆమెను బ్రతికించుటకు ప్రయత్నించారు. బ్రెట్ ప్రార్ధన చేసి, మనవి చేసినప్పుడు, అతడు త్వరగా రెండు మిగిలిన ఫోనులు చేసాడు: ఒకటి పిల్లలతో సహాయపడమని ఆమెను ప్రాధేయపడుతూ అతడి తల్లికి, మరొకటి అతడి గృహ బోధకుడు ఎడ్విన్ పోటర్‌కు. తరువాత సంభాషణ మొత్తము ఈ క్రిందన్నుది:

ఫోను చేసిన వారిని గుర్తించి, ఎడ్విన్, “హే, బ్రెట్, ఎంటి విషయము?”

బ్రెట్ యొక్క దాదాపు అరవబడిన సమాధానము: “ఇప్పుడు---ఇక్కడ నీవు నాకవసరము!”

బ్రెట్ లెక్కించగల కొన్ని నిముషాలలో, అతడి యాజకత్వపు సహవాసి, పిల్లలతో సహాయపడుతూ, అతడి భార్యను తీసుకొని వెళ్లుచున్న అంబులెన్సు వెనుక హాస్పిటల్‌కు సహోదరుడు హాంబ్లిన్ కారు నడుపుతూ అతడి ప్రక్కన నిలబడి ఉన్నాడు. అక్కడ, ఆమె మొదట తన కన్నులు తెరచిన 40 నిముషాల తరువాత క్రిస్టిన్ చనిపోయిందని వైద్యులు ప్రకటించారు.

చాలా సేపు----బ్రెట్ వెక్కి వెక్కి ఏడుస్తుండగా, కేవలము ఎడ్విన్ అతడిని తన చేతులతో పట్టుకున్నాడు మరియు అతడితోపాటు ఏడ్చాడు. తరువాత, బ్రెట్‌ను సమావేశమైన మిగిలిన కుటుంబ సభ్యులతో దుఃఖించుటకు వదలుతూ, జరిగిన మార్పును బిషప్పుతో చెప్పుటకు అతడి ఇంటికి ఎడ్విన్ వెళ్లాడు. హాంబ్లిన్ ఇంటికి ఎడ్విన్ వెళ్లుచుండగా, అద్భుతమైన బిషప్పు హాస్పిటల్‌కు వెంటనే బయలుదేరాడు. అక్కడ అతడు, పరుగెత్తుకొని వచ్చిన అతడి భార్య, చార్లెట్ తల్లిలేని హాంబ్లిన్ ఐదుగురు పిల్లలతో ఆడుకున్నారు, వారి వయస్సులు 3 నుండి 12. వారు వారికి సాయంత్రము భోజనమిచ్చారు, ఆకస్మికంగా సంగీతము కధనము జరిపారు, మరియు వారు నిద్రపోవటానికి సిద్ధపడుటకు సహాయపడ్డారు.

బ్రెట్ తరువాత నాతో చెప్పాడు, “ఈ వృత్తాంతములో అద్భుతమైన భాగము, నేను పిలిచినప్పుడు, ఎడ్విన్ రావటము కాదు. అత్యవసరములో, సహాయపడుటకు జనులు ఎల్లప్పుడు సమ్మతిస్తారు. లేదు, ఈ వృత్తాంతములో అద్భుతమైన భాగము, నేను అనుకున్న అతడే. చుట్టూ ఇతర జనులున్నారు. క్రిస్టిన్‌కు ఒక సహోదరుడు మరియు సహోదరి ఉన్నారు, ఇరువురు మూడు మైళ్ల కంటే తక్కువ దూరములో ఉన్నారు. మాకు మిక్కిలి గొప్ప బిషప్పు ఉన్నాడు. కానీ ఎడ్విన్ మరియు నా మధ్య అనుబంధము ఎటువంటిదనగా, నాకు అవసరమైనప్పుడు అతడిని పిలవటానికి నేను సహజంగా భావించాను. రెండవ ఆజ్ఞను బాగా జీవించుటకు----ప్రేమించుటకు, సేవ చేయుటకు, మరియు మన సహోదర, సహోదరీలతో అనుబంధాలను వృద్ధి చేయుటకు--- సంఘము నిర్మాణాత్మక విధానమును మనకు అందించును,”11

ఈ అనుభవము గురించి ఎడ్విన్ చెప్పాడు, “ఎల్డర్ హాలండ్, ఇదంతటిలో పరిహాసము, నేను వారి గృహ బోధకునిగా ఉన్నదానికంటే ఎక్కువ కాలము బ్రెట్ మా కుటుంబ గృహ బోధకునిగా ఉన్నాడు. ఆ సమయమందు, అతడు నియమించబడిన దానికంటే ఎక్కువగా ఒక స్నేహితుని వలే దర్శించాడు. మా బాలురు, మరియు మేము ప్రతీ నెల ముగింపులో మాకు ఒక సందేశమును ఇచ్చుటకు బద్ధుడైన ఒకరిగా అతడిని చూడము. చుట్టుప్రక్కల, వీధి చివర నివస్తున్న మమ్మల్ని దీవించుటకు ఈ లోకములో ఏదైన చేయగల ఒక స్నేహితునిగా అతడి గురించి మేము ఆలోచిస్తాము.”12

సహోదర, సహోదరిలారా, మన చరిత్ర అంతటా అంత విశ్వసనీయంగా ప్రేమించి, సేవ చేసిన ప్రతీ బ్లాకు బోధకుడు, గృహ బోధకుడు, వార్డు బోధకులు మరియు దర్శించు బోధకుడిని గౌరవించుటలో నేను మీతో చేరుతున్నాను. ఈ సర్వసభ్య సమావేశమును విడిచి వెళ్లు ప్రతీ పురుషుడు, స్త్రీ, ఒకరినొకరి కొరకు హృదయపూర్వకమైన శ్రద్ధను భావించుటకు ఎక్కువ లోతుగా ఒడంబడిక చేసుకుంటారని ఈరోజు మా ప్రార్థన. ప్రార్థనలకు జవాబిస్తూ, ఆదరణనిస్తూ, కన్నీళ్లు తుడుస్తూ మరియు బలహీనమైన మోకాళ్లను బలపరుస్తూ, 14 ఆయన అసాధారణమైన కార్యముతో దేవునికి మరియు మనందరి యొక్క తండ్రికి సహాయపడుతూ, మన పరిమితులు మరియు అసమర్ధతలను మనమందరము భావించినప్పటికిని, ద్రాక్షతోట యొక్క ప్రభువు ప్రక్క ప్రక్కన మనము పని చేద్దామా.13 మనము దానిని చేసిన యెడల, మనమందరము ఉండాల్సినట్లుగా క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఎక్కువగా ఉంటాము. ఈ ఈస్టరు ఆదివారమున, ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనము ఒకరినొకరము ప్రేమిద్దామా,15 యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు