ఎల్డర్ల కోరము
ఒక వార్డులో ఒక మెల్కీసెదకు యాజకత్వ కోరమును కలిగియుండుట రక్షణ కార్యములో అన్ని అంశములను నెరవేర్చుటకు యాజకత్వముగల వారిని ఏకము చేయును.
ఈ కడవరి యుగములో సంఘము స్థాపించబడిన వెంటనే, ప్రభువు ఒక బయల్పాటులో వివరించాడు, “మీ విశ్వాసము యొక్క ప్రార్థన ద్వారా, మీరు నా చట్టమును పొందుతారు, ఆవిధంగా మీరు నా సంఘమును మరియు నా యెదుట ఉన్న విషయాలన్నిటిని ఎలా పరిపాలించాలో తెలుసుకుంటారు.”1 ఈ సూత్రము సంఘములో అనుసరించబడింది---మరియు అప్పటినుండి, ఆ వాగ్దానము ప్రభువు చేత గౌరవించబడింది. మన కాలములో ప్రవక్త జోసెఫ్ స్మిత్ యాజకత్వ నిర్మాణములు మరియు కోరములను ఏర్పాటు చేసినప్పుడు, ప్రారంభమై యాజకత్వ నిర్మాణము మరియు సేవ కొరకు నమూనాలు అప్పుడప్పుడు బయల్పరచబడినవి. మిగిలిన వారిమధ్య అధ్యక్షులు బ్రిగమ్ యంగ్, జాన్ టేలర్, స్పెన్సర్ డబ్ల్యు కింబల్ కాలములో తమ సంబంధిత పన్నెండుమంది అపోస్తులుల కోరము, డెబ్బది, ప్రధాన యాజకులు, ఇతర కార్యాలయాలు, మెల్కీసెదకు యాజకత్వము మరియు అహరోను యాజకత్వములు రెండిటిలోని కోరములకు సంబంధించి, ముఖ్యమైన సవరణలు బయల్పరచబడినవి మరియు అమలుపరచబడినవి.2 ఇప్పుడు, క్షణాల క్రితం అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఒక చారిత్రక ప్రకటనలో, యింకా ముఖ్యమైన సవరణను ప్రకటించారు.
ఆయన ప్రకటనలో కొంత నేను తిరిగి చెప్తాను: “ప్రభువు యొక్క కార్యమును ఎక్కువ ప్రభావవంతంగా నెరవేర్చుటకు మన మెల్కీసెదకు యాజకత్వము యొక్క ప్రాముఖ్యమైన పునః వ్యవస్థీకరణను నేటిరాత్రి మేము ప్రకటించాము.ప్రతీ వార్డులో, ప్రధాన యాజకులు మరియు ఎల్డర్లు, ఇప్పుడు ఒక ఎల్డర్ల కోరముగా జతపరచబడతారు. . . . ( స్టేకు ప్రధాన యాజకుల) కోరముల యొక్క మిశ్రమము ప్రస్తుతపు యాజకత్వ పిలుపులపై ఆధారపడును.”
అధ్యక్షులు రస్సెల్ చేర్చారు:
“ఈ సవరింపులు అనేక నెలలుగా అధ్యయనము క్రింద ఉన్నాయి. మన సభ్యుల కోరము మనము శ్రద్ధ తీసుకొనే విధానమును మనము మెరుగుపరచుకోవాల్సిన బలమైన అవసరతను మేము భావించాము. . . . దానిని సరిగా చేయుటకు, ప్రభువు తన పరిశుద్ధుల కొరకు ఉద్దేశించిన ప్రేమ మరియు సహకారము యొక్క పరిచర్యకు గొప్ప నడిపింపునిచ్చుటకు మన యాజకత్వము కోరములను మనము బలపరచాల్సిన అవసరమున్నది.
“ఈ సవరణలు ప్రభువు చేత ప్రేరేపించబడినవి. మేము వాటిని అమలుపరచినప్పుడు, మనము ఇదివరకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాము”3
ప్రథమ అధ్యక్షత్వము యొక్క నడిపింపు క్రింద, ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్ మరియు నేను కొంత వివరణను చేరుస్తాము, అది మీకేమైనా ప్రశ్నలుంటే జవాబిస్తుందని మా నమ్మకము.
ఎల్డర్లు మరియు ప్రధాన యాజకుల కోరములు
మొదట, పునరుద్ఘాటించుటకు, వార్డు ఎల్డర్ల కోరములు మరియు ప్రధాన యాజకుల గుంపులకు సవరణలేమిటి? వార్డులలో, ఎల్డర్ల కోరములు మరియు ప్రధాన యాజకుల గుంపుల సభ్యులు, ఇప్పుడు ఒక కోరము అధ్యక్షత్వముతో మెల్కీసెదకు యాజకత్వ కోరముగా జతపరచబడతాము. ఈ కోరము, సంఖ్యలు మరియు ఐక్యతయందు హెచ్చింపబడి, “ఎల్డర్ల కోరము” గా నియమించబడతారు. ప్రధాన యాజకుల గుంపులు నిలిపివేయబడతాయి. ఎల్డర్ల కోరములు ఎల్డర్లు అందరూ, వార్డులో కాబోయే ఎల్డర్లు అదేవిధంగా ప్రస్తుతం బిషప్రిక్కులో, స్టేకు అధ్యక్షత్వములో, ప్రధాన సలహాసభలో, లేక పనిచేసే గోత్రజనకునిగా సేవ చేయనివారు. స్టేకులో ప్రధాన యాజకుల గుంపులు స్టేకు అధ్యక్షత్వములో, బిషప్రిక్కులో, ప్రధాన సలహాసభలో, మరియు పనిచేస్తున్న గోత్రజనకునిగా సేవ చేయు వారితో కలిపియుండును.
ఎల్డర్ల కోరములో యాజకత్వ కార్యాలయాలు
ఎల్డర్ల కోరము యొక్క అధ్యక్షత్వము ఎలా నిర్వహించబడును? స్టేకు అధ్యక్షత్వము ప్రస్తుతపు ప్రధాన యాజకుల గుంపు నాయకత్వములను మరియు ఎల్డర్ల కోరము అధ్యక్షత్వములను విడుదల చేయును మరియు ప్రతీవార్డులో ఒక క్రొత్త ఎల్డర్ల కోరము అధ్యక్షుడిని మరియు సలహాదారులను పిలచును. క్రొత్త ఎల్డర్ల కోరము అధ్యక్షత్వము వేర్వేరు వయస్సులు మరియు అనుభవముగల ఎల్డర్లను మరియు ప్రధాన యాజకులను కలిగి ఒకే కోరము అధ్యక్షత్వముగా కలిసి సేవ చేస్తారు. ఒక ఎల్డరు లేక ప్రధాన యాజకుడు కోరము అధ్యక్షునిగా లేక అధ్యక్షత్వములో ఒక సలహాదారునిగా సేవ చేస్తారు. ఇది ప్రధాన యాజకులు ఎల్డర్ల కోరము యొక్క నాయకత్వమును “స్వాధీనము చేసుకొనుట” కాదు. కోరము అధ్యక్షత్వములో మరియు కోరము సేవలో ఏ కలయకలోనైనా ఎల్డర్లు మరియు ప్రధాన యాజకులు కలిసి పనిచేయుటకు మేమాశిస్తున్నాము. ఈ కోరము సవరణలు అనుకూలంగా సాధ్యమైనంత త్వరలో అమలుపరచబడాలి.
ఎల్డర్ల కోరములో యాజకత్వ కార్యాలయాలు
కోరము నిర్మాణములో ఈ సవరణ కోరము సభ్యులచేత ఉంచబడిన యాజకత్వ కార్యాలయమును మార్చుతుందా? లేదు, ఈ చర్య గతములో నియమించబడిన కోరము సభ్యుని యాజకత్వ కార్యాలయములో దేనిని రద్దు చేయదు. మీకు తెలిసినట్లుగా, ఒక వ్యక్తి తన జీవిత కాలముపైగా వేర్వేరు యాజకత్వ కార్యాలయములకు నియమించబడవచ్చు, మరియు అతడు క్రొత్త దానిని పొందినప్పుడు ముందు నియామకములో దేనిని కోల్పోడు లేక నష్టపోడు. కొన్ని సంఘటనలలో ఒక యాజకత్వముగల వ్యక్తి ఒకేసారి ఒకటి కంటె ఎక్కువ కార్యాలయములో సేవ చేయుచుండగా, ఒక ప్రధాన యాజకుడు ఒక గోత్రజనకునిగా లేక ఒక బిషప్పుగా, డెబ్బదులుగా ఒక గోత్రజనకునిగా లేక ఒక బిషప్పుగా కూడ సేవ చేసినప్పుడు, అదే సమయములో అతడు తన యాజకత్వ కార్యాలయాలన్నిటిలో అతడు మామూలుగా పనిచేయడు. ఉదాహరణకు బిషప్పులు మరియు డెబ్బదులు, ఒకసారి విడుదల చేయబడ్డాక లేక గౌరవాచార్యునిగా చేయబడిన తరువాత ఆ కార్యాలయాలలో చురుకుగా సేవ చేయరు. కాబట్టి, ఒక వ్యక్తి ఎల్డర్ల కోరము యొక్క సభ్యునిగా ఉండగా, ఏ ఇతర యాజకత్వ కార్యాలయమును లేక కార్యాలయాలను కలిగియున్నప్పటికినీ¸ అతడు ఒక ఎల్డరుగా సేవ చేస్తాడు.
సంవత్సరాల క్రితం, అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ ఇలా గమనించారు, “యాజకత్వము దాని కార్యాలయములలో దేనికన్నా మిక్కిలి గొప్పది. . . యాజకత్వము విభజింపబడదు. ఒక అపోస్తులునికి ఉన్నంత యాజకత్వమును ఒక ఎల్డరు కలిగియుంటాడు.(సి మరియు ని 20:38 చూడుము.) ఒక వ్యక్తి (యాజకత్వము అతడిపై దయచేయబడినప్పుడు), దాని సమస్తమును అతడు పొందుతాడు. అయినప్పటికిని, యాజకత్వములో కార్యాలయములున్నాయి---అధికార విభజనలు మరియు బాధ్యత . . . కొన్నిసార్లు ఒక కార్యాలయము మరొక కార్యాలయము కంటే ‘గొప్పది’ లేక ‘స్వల్పమైనది’ చెప్పబడింది. ముఖ్యముగా, ‘గొప్పది’ లేక ‘స్వల్పమైనదిగా’ ఉండుటకంటే మెల్కీసెదకు యాజకత్వములో కార్యాలయములు సేవ యొక్క భిన్న ప్రదేశాలను సూచించును.”4 సహోదరులారా, మెల్కీసెదకు యాజకత్వములో మరొక కార్యాలయమునకు “వృద్ధి చెందుట” వంటి పదములలో ఇక మాట్లాడరని నేను భక్తితో ఆశిస్తున్నాను.
స్టేకు అధ్యక్షత్వము, ప్రధాన సలహాసభ, లేక బిషప్రిక్కుకు వారు పిలవబడినప్పుడు---లేక ప్రార్థనాపూర్వకమైన ఆలోచన మరియు ప్రేరేపణ ద్వారా తీర్మానించిన ఇతర సమయాలలో---ఎల్డర్లు నియమించబడుట కొనసాగిస్తారు. స్టేకు అధ్యక్షత్వములో, ప్రధాన సలహాసభ, లేక బిషప్రిక్కులో వారి సేవ యొక్క గడువులు ముగిసినప్పుడు, ప్రధాన యాజకులు వారి వార్డులోని ఎల్డర్ల కోరమును తిరిగి చేరతారు.
ఎల్డర్ల కోరము అధ్యక్షుని కొరకు సూచన
ఎల్డర్ల కోరము అధ్యక్షుని యొక్క కార్యమును ఎవరు నడిపిస్తారు? స్టేకు అధ్యక్షుడు తన స్టేకులోని మెల్కీసెదకు యాజకత్వముపైగా అధ్యక్షత్వము వహించును. కాబట్టి, ఎల్డర్ల కోరము అధ్యక్షుడు నేరుగా స్టేకు అధ్యక్షునికి బాధ్యుడు, అతడు స్టేకు అధ్యక్షత్వము నుండి మరియు ప్రధాన సలహాసభ ద్వారా శిక్షణ మరియు నడిపింపును అందించును. వార్డులో అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకునిగా, బిషప్పు, క్రమముగా ఎల్డర్ల కోరము అధ్యక్షునితో కలుసుకుంటాడు. బిషప్పు అతడికి సలహా ఇచ్చును మరియు వారు నిర్మాణములన్నిటితో సామరస్యంగా పనిచేస్తూ, వార్డు సభ్యులకు ఎలా సేవ చేయాలి మరియు దీవించాలో దానిగురించి సరైన నడిపింపును ఇచ్చును.5
ఈ మార్పుల యొక్క ఉద్దేశములు
మెల్కీసెదకు యాజకత్వము కోరముల సవరణల యొక్క ఉద్దేశ్యమేమిటి? ఒక వార్డులో ఒక మెల్కీసెదకు యాజకత్వము కోరమును కలిగియుండుట, ప్రధాన యాజకుల గుంపులచేత ముందుగా సహకారమివ్వబడి దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము కలిపి, రక్షణ కార్యము యొక్క అంశములన్నిటిని నెరవేర్చుటకు యాజకత్వ నాయకులను ఏకము చేయును. ఒకరినొకరి యొక్క దృష్టికోణము మరియు మరియు జీవితములో వేర్వేరు దశలలో అనుభవమునుండి ప్రయోజనము పొందుటకు అన్ని వయస్సులుగల కోరము సభ్యులు మరియు నేపథ్యములను అనుమతించును. అనుభవముగల యాజకత్వముగల వారు కాబోయే ఎల్డర్లు, క్రొత్త సభ్యులు, యుక్తవయస్కులు, మరియు సంఘ చైతన్యమునకు తిరిగి వచ్చువారిని కలిపి, ఇతరులకు బోధించుటకు అదనపు అవకాశాలను ఇచ్చును. భవిష్యత్తులో ఎల్డర్ల కోరములు వహించే ఎక్కువగుచున్న ముఖ్యమైన పాత్రను ధ్యానించుటకు నేనెంత ఉత్సాహముగా ఉన్నానో మాటలలో చెప్పలేను. ఈ కోరములలో కనుగొనబడే జ్ఞానము, అనుభవము, సామర్ధ్యము, మరియు బలము సంఘమంతటా యాజకత్వ సేవ యొక్క ఒక క్రొత్త దినమును మరియు ఒక క్రొత్త ప్రమాణమును ముందుగా సూచించును.
ఇరవై సంవత్సరాల క్రితం, సర్వసభ్య సమావేశములో, డెబ్బది యొక్క ఎల్డర్ వాన్ జె. ఫీథర్‌స్టోన్ చేత మొదట చెప్పబడిన వృత్తాంతమును నేను చెప్తాను, అది ఇక్కడ మరలా చెప్పుటకు యోగ్యమైనదని నేను నమ్ముచున్నాను.
1918లో సహోదరుడు జార్జ్ గోట్స్ యూటా, లీహైలో, చక్కెర దుంపలను పండించే రైతు. ఆ సంవత్సరము శీతాకాలము త్వరగా వచ్చింది మరియు నేలలో అతడి పంటలో అధికభాగాన్ని గడ్డ కట్టించిది. జార్జ్ మరియు అతడి చిన్న కుమారుడు ఫ్రాన్సిస్‌కు, పంట కోత నెమ్మదిగా, కష్టముగా ఉన్నది. యింతలో, శీతల జ్వరము అంటువ్యాధి ప్రబలమగుచున్నది. భయంకరమైన వ్యాధి జార్జ్ యొక్క కుమారుడు చార్లెస్ మరియు చార్లెస్ యొక్క చిన్న పిల్లలు---ఇద్దరు చిన్న బాలికలు మరియు ఒక బాలుని ప్రాణాలను తీసివేసింది. కేవలము ఆరు రోజులలో, సమాధి చేయుటకు ఇంటికి శరీరాలను తెచ్చుటకు, దుఃఖిస్తున్న జార్జ్ గోట్స్ యూటా, ఓగ్డన్‌కు మూడుసార్లు ప్రయాణించాడు. ఈ భయంకరమైన సమయము ముగిశాక, జార్జ్ మరియు ఫ్రాన్సిస్ వారి బండ్లను బిగించి దుంపల పండిస్తున్న పొలము వద్దకు తిరిగి వెళ్ళారు.
“(దారిలో) పొరుగు రైతులచేత నడపబడి, ఫాక్టరీకి లాగబడుచున్న దుంపలున్న చేతిబండ్ల లోడును ఒకదాని తరువాత ఒకదానిని వారు దాటారు. వారు ప్రయాణించినప్పుడు, ప్రతీ డ్రైవరు, ఒక పలకరింపుతో చేతిని ఊపారు, ‘హాయ్, జార్జ్ అంకుల్,’ ‘విచారిస్తున్నాను జార్జ్,’ ‘కష్టమైన విరామము, జార్జ్,’ ‘నీకు చాలా మంది స్నేహితులున్నారు, జార్జ్.’
“చివరి బండిలో. . . ముఖంమీద మచ్చలున్న జాస్పర్ రాల్ఫ్ ఉన్నాడు. అతడు చిరునవ్వుతో చేయి ఊపి ‘అంతే చక్కెర దుంపలు, అంకుల్ జార్జ్.’
“(సహోదరుడు గోట్స్) ఫ్రాన్సిస్ వైపు తిరిగి అన్నాడు: ‘అవన్నీ మనవి అయితే బాగుండనని నేననుకుంటున్నాను.’
“వారు పొలము తలుపు వద్దకు చేరినప్పుడు, ఫ్రాన్సిస్ పెద్ద చక్కెర దుంప బండిలోనుండి క్రిందకు దూకాడు మరియు (అతడి తండ్రి) పొలములోకి నడిచినప్పుడు తలుపు తెరిచాడు. (జార్జ్) గుఱ్ఱాలను ప్రక్కకు లాగి, జట్టును ఆపాడు, . . . మరియు పొలమువైపు చూసాడు. . . మొత్తము పొలములో ఒక చక్కెర దుంప లేదు. జాస్పర్ రాల్ఫ్ చెప్పిన దాని అర్ధము అతడు గ్రహించాడు: ‘అంతే చక్కెర దుంపలు, అంకుల్ జార్జ్!’
“(జార్జ్) బండిమీద నుండి దిగాడు, తాను ఎంతగానో ప్రేమించే, ఫలవంతమైన, మట్టిని చేతినిండా తీసుకున్నాడు, మరియు ఒక దుంప పై భాగము కనబడింది, మరియు తన కళ్లను నమ్మలేనట్లుగా తన కష్టము యొక్క ఈ చిహ్నముల కోసము ఒక క్షణకాలము చూసాడు.
“అప్పుడు (అతడు) దుంపల పై భాగముల గుట్టపై కూర్చోన్నాడు---ఆరు రోజుల సమయములో తనకు ప్రియమైన నలుగురును సమాధి చేయుటకు ఇంటికి తెచ్చి, శవ పేటికలను చేసి, సమాధులను తవ్వి, మరియు సమాధిచేసే వస్త్రములకు కూడ సహాయపడిన ఈ వ్యక్తి---ఎన్నడూ తొట్రిల్లని, లేక తొణకని, లేక ఈ వేదన పరీక్ష అంతటా సందేహించని ఈ అద్భుతమైన వ్యక్తి---దుంపల పై భాగముల గుట్టపై కూర్చోని, పసిబిడ్డ వలే వెక్కివెక్కి ఏడ్చాడు.
“తరువాత పైకి లేచి, తన కన్నులను తుడుచుకొని, . . .ఆకాశము వైపు చూసి, ‘మా వార్డు యొక్క ఎల్డర్ల కొరకు కృతజ్ఞతలు తండ్రీ,’”6 అని చెప్పాడు.
అవును, యాజకత్వముగల పురుషులకు మరియు సీయోనును స్థాపించుటలో వ్యక్తులు మరియు కుటుంబాలను పైకెత్తుటలో ఇంకను వారు అందించే సేవ కొరకు దేవునికి కృతజ్ఞతలు.
ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపోస్తులుల కోరము, మరియు డెబ్బది యొక్క అధ్యక్షత్వము ఈ సవరణలు ఎక్కువ కాలము పరిశీలించారు. అధికమైన ప్రేమ, యాజకత్వ కోరముల యొక్క లేఖన పునాదులను గూర్చి శ్రద్ధగల అధ్యయనము, మరియు ఇది ప్రభువు యొక్క చిత్తమనే నిర్ధారణతో, పునస్థాపన యొక్క వృద్ధిలో మరొక అడుగు వాస్తవములో ఉన్నదానికి ఏకగ్రీవంగా మనము ముందుకు సాగుతున్నాము. ప్రభువు యొక్క నడిపింపు ప్రత్యక్షపరచబడింది, మరియు నేను ఆయనను గూర్చి ఆయన యాజకత్వము, మరియు ఆ యాజకత్వములో మీ నియామకాలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు నేను దానియందు ఆనందిస్తున్నాను, ఆమేన్.