కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము: బంధింపబడుట మరియు స్వస్థత
మనము మన కుటుంబ చరిత్రలను సేకరించి మరియు మన పూర్వీకుల తరఫున దేవాలయమునకు వెళ్లినప్పుడు, దేవుడు తెరకు రెండు వైపుల వాగ్దానము చేయబడిన దీవెనలను ఏకకాలములో నెరవేర్చును.
కుటుంబ అనుబంధాలు కొన్ని మిక్కిలి ప్రతిఫలమిచ్చేవి కావచ్చు అయినప్పటికినీ మనము ఎదుర్కొనే కష్టమైన అనుభవాలు. మనలో అనేకులు మన కుటుంబాలలో ఎదోవిధమైన విభేదాలను ఎదుర్కొంటున్నాము. అటువంటి విభేదము ఈ కడవరి దినాలలో యేసు క్రీస్తు యొక్క సంఘము యొక్క పునఃస్థాపనకు చెందిన ఇద్దరు నాయకుల మధ్య పెరిగింది. పార్లీ మరియు ఆర్సన్ ప్రాట్ సహోదరులు, మొదట మార్పు చెందినవారు, మరియు నియమించబడిన అపొస్తులులు. ప్రతిఒక్కరు విశ్వాసము పరీక్షను ఎదుర్కొన్నారు కానీ తరువాత బలమైన సాక్ష్యము కలిగియున్నారు. ఇరువురు సత్యము యొక్క హేతువు కొరకు త్యాగము చేసారు మరియు ఎంతగానో సహాయపడ్డారు.
నావూ కాలములో, వారి అనుబంధము ప్రతికూలంగా మారింది, 1846లో తీవ్రమైన బహిరంగ ఘర్షణలో ఉచ్చదశకు చేరుకున్నది. లోతైన మరియు సుదీర్ఘకాల విరోధ భావనలు ఎక్కువయ్యాయి. పార్లీ వాదనను పరిష్కరించుకొనుటకు ఆర్సన్‌కు వ్రాసాడు, కానీ ఆర్సన్ జవాబివ్వలేదు. పార్లీ, ఆర్సన్ చేత ప్రారంభిస్తే తప్ప ఆ ఉత్తర ప్రత్యుత్తరము శాశ్వతంగా ముగిసిందని భావిస్తూ వదిలేసాడు.1
1853 మార్చిలో, కొన్ని సంవత్సరాల తరువాత, సహోదరుల యొక్క ప్రాచీన అమెరికా పూర్వీకుడు, విలియమ్ ప్రాట్ యొక్క వారసులపై ఒక పుస్తకమును ప్రచురించుటకు ఒక ప్రాజెక్టు గురించి నేర్చుకున్నాడు. కుటుంబ చరిత్ర యొక్క విలువైన సమాచారమును అతడు చూసినప్పుడు, ఆర్సన్ “ఒక పసిబిడ్డ వలే” ఏడ్వసాగాడు. అతడి హృదయము ప్రేమ, కనికరముతో నింపబడింది, మరియు తన సహోదరునితో ప్రతికూలతను బాగు చేయుటకు అతడు తీర్మానించాడు.
ఆర్సన్ పార్లీకి వ్రాసాడు, “నా ప్రియమైన సహోదరుడా, మన పూర్వీకులందరి మధ్య ల్యూటినెంట్ విలియమ్ ప్రాట్ మనవలే తన వంశస్థులను వెదకుటలో లోతైన ఆసక్తిని కలిగియున్నాడు.” కడవరి దిన పరిశుద్ధులు కుటుంబ చరిత్రలను పరిశోధించుటకు మరియు సంగ్రహించు బాధ్యతను కలిగియున్నారని గ్రహించిన మొదటి వ్యక్తి ఆర్సన్, ఆవిధంగా మన వంశస్థులను ప్రతినిధిగా చేయు విధులను మనము నెరవేర్చగలము. అతడి లేఖ కొనసాగును: “మన తండ్రుల యొక్క దేవుడు దీని సమస్తములో హస్తము కలిగియున్నాడు . . . నీకు వ్రాయుటలో నేను చాలా వెనుకబడియున్నందుకు నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను. . . నీవు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను.” 2 వారి బలమైన సాక్ష్యములను లక్ష్యపెట్టకుండా, వారి పూర్వీకుల కొరకు వారి ప్రేమ అనుబంధమును సరిదిద్దుటకు, ఒక గాయమును బాగు చేయుటకు, మరియు క్షమాపణను ఇచ్చుటకు, వెదకుటకు ప్రేరేపించింది.3
ఒక విషయాన్ని చేయటానికి దేవుడు మనల్ని నడిపించినప్పుడు, ఆయన తరచుగా అనేక ఉద్దేశాలను మనస్సులో కలిగియుంటాడు. కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము మృతులను మాత్రమే కాదు, జీవిస్తున్నవారిని కూడా దీవించును. ఆర్సన్ మరియు పార్లీ కొరకు, అది వారి హృదయాలను ఒకరినొకరి వైపు త్రిప్పింది. స్వస్థత అవసరమైన దానిని బాగు చేయుటకు శక్తిని కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యమును అందించింది.
సంఘ సభ్యులుగా, మన పూర్వీకులను వెదకుటకు మరియు కుటుంబ చరిత్రలను సంగ్రహించుటకు దైవికంగా నియమించబడిన బాధ్యతను మనము కలిగియున్నాము. ఇది ప్రోత్సహించబడిన అలవాటు కంటె అధికమైనది, ఎందుకనగా రక్షణ కొరకు విధులు దేవుని యొక్క పిల్లలందరికి ముఖ్యమైనవి. 4 రక్షణ యొక్క విధులను పొందకుండా మరణించిన మన స్వంత పూర్వీకులను మనము గుర్తించాలి. మనము దేవాలయాలలో ప్రతినిధిగా విధులను నెరవైర్చగలము, మరియు మన పూర్వీకులు విధులను అంగీకరించుటకు ఎంపిక చేయవచ్చు. వార్డు మరియు స్టేకు సభ్యులు తమ కుటుంబ పేర్లతో సహాయపడుటకు కూడా మనము ప్రోత్సహించవచ్చు.5 అది ఉత్కంఠభరితంగా అద్భుతమైనది, కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము ద్వారా, మనము మృతులను విమోచించుటకు సహాయపడగలము.
కాని, ఈరోజు కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యములో మనము పాల్గొన్నప్పుడు, ప్రవక్తలు మరియు అపోస్తులుల చేత వాగ్దానము చేయబడిన “స్వస్థత” దీవెనలు పొందుటకు మనము కూడ అర్హులవుతాము.6 వాటి పరిధి, స్వభావము, మరియు మర్త్యత్వములో పర్యవసానము వలన ఈ దీవెనలు ఉంత్కఠభరితంగా అద్భుతమైనవి.ఈ దీవెనలు క్రింద పొడుగైన జాబితాను కలిపియున్నది:
-
రక్షకుని మరియు ఆయన ప్రాయశ్చిత్తః త్యాగమును గూర్చి హెచ్చించబడిన అవగాహన;
-
మన స్వంత జీవితాలలో బలమును మరియు నడిపింపును అనుభవించుటకు హెచ్చింపబడిన పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము;7
-
రక్షకునికి మార్పు చెందుట లోతైనదిగా మరియు నిలకడ గలదిగా మారునట్లు హెచ్చింపబడిన విశ్వాసము;
-
మనము ఎవరము, మనము ఎక్కడినుండి వచ్చాము, మరియు మనము ఎక్కడికి వెళ్లుచున్నామో స్పష్టమైన దృష్టి యొక్క అవగాహన వలన, నేర్చుకొనుటకు మరియు పశ్చాత్తాపపడుటకు హెచ్చింపబడిన సామర్ధ్యము మరియు ప్రేరేపణ;8
-
మన హృదయాలలో హెచ్చింపబడిన శుద్ధి చేయబడిన, పరిశుద్ధపరచబడిన మరియు నిగ్రహముగల ప్రభావాలు.
-
ప్రభువు యొక్క ప్రేమను భావించుటకు హెచ్చింపబడిన సామర్ధ్యము ద్వారా హెచ్చింపబడిన ఆనందము;
-
మన ప్రస్తుత, గత, లేక భవిష్యత్ కుటుంబ పరిస్థితులు లేక మన కుటుంబ వృక్షము ఎంత అపరిపూర్ణమైనదో లక్ష్యపెట్టకుండా, హెచ్చింపబడిన కుటుంబ దీవెనలు;
-
మనము ఇక ఒంటరిగా భావించకుండునట్లు, పూర్వీకులు మరియు జీవిస్తున్న బంధువుల కొరకు హెచ్చింపబడిన ప్రేమ మరియు ప్రశంస;
-
స్వస్థత అవసరమైన దానిని విచారించుటకు మరియు ఆవిధంగా, ప్రభువు యొక్క సహాయముతో, ఇతరులకు సహాయపడుటకు హెచ్చింపబడిన శక్తి;
-
అపవాది యొక్క శోధనలు మరియు తీవ్రమైన ప్రభావములనుండి హెచ్చింపబడిన భద్రత;
-
ఇబ్బందులు పడుతున్న, విరిగిన, లేక ఆతృతగల హృదయాలను బాగు చేయుటకు మరియు గాయపడిన వారిని బాగు చేయుటకు హెచ్చింపబడిన సహాయము.9
ఈ దీవెనలలో వేటి కొరకైనా మీరు ప్రార్ధించిన యెడల, కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యములో పాల్గొనుము. మీరు దానిని చేసినప్పుడు, మీ ప్రార్థనలు జవాబివ్వబడతాయి. మృతుల తరఫున విధులు నెరవేర్చబడినప్పుడు, భూమిపైన దేవుని యొక్క పిల్లలు స్వస్థపరచబడతారు. సంఘ అధ్యక్షునిగా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ తన మొదటి సందేశములో ఇలా ప్రకటించుటలో ఆశ్చర్యము లేదు, “దేవాలయములో మీ ఆరాధన మరియు అక్కడ మీ పూర్వీకుల కొరకు మీ సేవ, హెచ్చింపబడిన వ్యక్తిగత బయల్పాటు మరియు సమాధానముతో మిమ్మల్ని దీవించును మరియు నిబంధన బాటపై నిలిచియుండుటకు మీ ఒడంబడికను పటిష్టపరచును.”10
ప్రాచీన ప్రవక్త ఒకరు జీవిస్తున్న వారికి మరియు మృతులు ఇరువురి కొరకు దీవెనలను ముందుగా చూసాడు.11 పరలోక రాయబారి యెహెజ్కేలుకు దేవాలయమునుండి నీళ్ళు బయటకు పారుచున్న దర్శనము చూపెను. యెహెజ్కేలు చెప్పబడ్డాడు:
“ఈ నీళ్ళు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి . . . అరబాలోనికి దిగి సముద్రములోనికి పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును.
“వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్లగును, ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.”12
నీళ్ళ యొక్క రెండు స్వభావాలు గుర్తింపదగినవి. మొదటిది, చిన్న ప్రవాహమునకు ఉపనదులుండవు, అది ఇంకా ప్రవహించగా విశాలముగా మరియు లోతైన పెద్ద నదిగా పెరుగును. వ్యక్తులు కుటుంబాలుగా బంధింపబడినప్పుడు, దేవాలయములనుండి ప్రవహించు దీవెనలకు అదేవిధంగా జరుగుతుంది. బంధనా విధులు కుటుంబాలను కలిసి బంధించినప్పుడు, తరములగుండా వెనక్కి, ముందుకు వెళ్ళినప్పుడు, అర్ధవంతమైన వృద్ధి సంభవించును.
రెండవది, అది తాకిన ప్రతీదానిని నది క్రొత్తగా చేసింది. దేవాలయము యొక్క దీవెనలు అదేవిధంగా స్వస్థపరచు విభ్రాంతిపరచే సమర్ధతను కలిగియున్నవి. దేవాలయ దీవెనలు హృదయాలను, జీవితాలను మరియు కుటుంబాలను బాగు చేయును.
దానికి ఒక ఉదాహరణను నేను మీతో పంచుకుంటాను. 1999లో, టాడ్ అనే పేరుగల యువకుడు తన మెదడులో పగిలిన రక్తనాళముతో పడిపోయాడు. టాడ్ మరియు అతడి కుటుంబ సభ్యులు సంఘ సభ్యులైనప్పటికిని, వారి చైతన్యము తరచుగా లేదు, మరియు ఎవరూ దేవాలయ దీవెనలు అనుభవించలేదు. టాడ్ యొక్క చివరి రాత్రి అతడి తల్లి, బెట్టీ, అతడి మంచము ప్రక్కన కూర్చొని, అతడి చేతిని నిమురుతూ చెప్పింది, “నీవు నిజముగా వెళ్లాల్సి వస్తే, నీ దేవాలయము కార్యము జరుగునట్లు చూస్తానని నేను వాగ్దానము చేస్తున్నాను.” మరుసటి ఉదయము, టాడ్ మెదడు పనిచేయక చనిపోయాడని ప్రకటించబడ్డాడు. శస్త్రచికిత్సకులు టాడ్ యొక్క గుండెను నా రోగియైన రాడ్ అనే పేరుగల అసాధారణమైన వ్యక్తికి మార్చారు.
గుండె మార్పిడి జరిగిన కొన్ని నెలల తరువాత, తనకు గుండెను దానమిచ్చిన కుటుంబము యొక్క గుర్తింపును రాడ్ తెలుసుకున్నాడు మరియు వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. రెండు సంవత్సరాల తరువాత, టాడ్ తల్లి బెట్టీ, మొదటిసారి దేవాలయమునకు వెళ్లినప్పుడు హాజరుగుటకు రాడ్‌ను ఆహ్వానించింది. యూటా, సెయింట్ జార్జ్ దేవాలయము యొక్క సిలెస్టియల్ గదిలో రాడ్ మరియు బెట్టీ మొదట వ్యక్తిగతంగా కలుసుకున్నారు.
కొంతకాలము తరువాత, టాడ్ యొక్క తండ్రి—బెట్టీ యొక్క భర్త—చనిపోయాడు. రెండు సంవత్సరాల తరువాత, బెట్టీ తన కుమారునికి దేవాలయ విధులను పొందుటలో చనిపోయిన అతడికి బదులుగా ప్రతినిధిగా ఉండుటకు రాడ్‌ను ఆహ్వానించింది. కృతజ్ఞతగా రాడ్ ఆవిధంగా చేసాడు, మరియు యూటా, సెయింట్ జార్జ్ దేవాలయము యొక్క బంధింపబడే గదిలో ప్రతినిధిగా చేయబడే కార్యము పూర్తిచేయబడింది. ప్రతినిధిగా సేవ చేస్తున్న తన మనుమని నుండి బలపీఠముకు ఎదురుగా మోకరించి, చనిపోయిన తన భర్తతో బంధింపబడింది. కన్నీళ్లు బుగ్గలమీదుగా కారుచుండగా, బలిపీఠము వద్ద వారితో చేరమని రాడ్‌కు సైగ చేసింది. ఆమె కుమారునికి ప్రతినిధిగా చేస్తూ, రాడ్ చాతీలో టాడ్ హృదయము కొట్టుకొంటూ, రాడ్ వారి ప్రక్కన మోకరించాడు. రాడ్ యొక్క గుండెను దానమిచ్చిన, టాడ్ అప్పుడు తన తల్లిదండ్రులతో నిత్యత్వమంతటి కొరకు బంధించబడ్డాడు. సంవత్సరాల క్రితం చనిపోతున్న తన కుమారునికి ఆమె చేసిన వాగ్దానమును టాడ్ తల్లి నిలుపుకున్నది.
కాని ఆ వృత్తాంతము అక్కడితో ముగియలేదు. అతడి గుండె మార్పిడి జరిగిన పదిహేను సంవత్సరాల తరువాత, రాడ్ వివాహము చేసుకొనుటకు నిశ్చయింపబడ్డాడు మరియు యూటా, ప్రోవో దేవాలయములో బంధనను నెరవేర్చమని నన్ను అడిగాడు. వివాహ దినమున, అక్కడ వారి కుటుంబాలు మరియు సన్నిహిత స్నేహితులు ఎదురుచూస్తున్న బంధించు గదికి ఎదురుగా ఉన్నగదిలో నేను రాడ్‌ను, అతడి అద్భుతమైన పెండ్లి కుమార్తె కిమ్‌ను కలుసుకున్నాను. రాడ్ మరియు కిమ్‌తో కాసేపు మాట్లాడిన తరువాత, వారికేమైనా ప్రశ్నలున్నాయా అని నేనడిగాను.
“అవును, నా దాత కుటుంబము ఇక్కడున్నది మరియు మిమ్మల్ని కలుసుకొనుటను ప్రేమిస్తారు.”
అతడు నాతో చెప్పినది నేనూహించలేదు, “వారిక్కడ ఉన్నారని నీ ఉద్దేశమా? ఇప్పుడా?”
“అవును,” రాడ్ జవాబిచ్చాడు.
నేను గది మూలకు వెళ్ళి, బంధించు గదినుండి కుటుంబాన్ని బయటకు పిలిచాను. బెట్టీ, ఆమె కుమార్తె, అల్లుడు మాతో చేరారు. రాడ్ బెట్టీని అక్కున చేర్చుకొని పలుకరించాడు, వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు, మరియు నాకు ఆమెను పరిచయము చేసాడు. “బెట్టీ, ఈయన ఎల్డర్ రెన్‌లండ్. ఆయన అనేక సంవత్సరాలుగా నీ కుమారుని గుండెను జాగ్రత్త తీసుకున్న వైద్యుడు.” ఆమె గది దాటి నన్ను హత్తుకున్నది. తరువాత కొన్ని నిముషాలు, అందరినుండి సంతోషముతో నిండిన కన్నీళ్ళు మరియు హత్తుకొనుట ఉన్నాయి.
మేము స్థిమితపడిన తరువాత, కాలము మరియు నిత్యత్వము కొరకు రాడ్ మరియు కిమ్ బంధింపబడిన, బంధనా గదిలోనికి మేము వెళ్లాము. పరలోకము దగ్గరగా ఉన్నదని, ఇంతకుముందు చనిపోయిన ఇతరులు ఆ రోజు మాతో ఉన్నారని రాడ్, కిమ్, బెట్టీ, మరియు నేను సాక్ష్యమిస్తున్నాము.
ఆపద, నష్టము, మరియు కష్టము లక్ష్యపెట్టకుండా, దేవుడు తన అంతములేని సమర్ధతతో, వ్యక్తులు మరియు కుటుంబాలను బంధించును మరియు స్వస్థపరచును. మనము కొన్నిసార్లు దేవాలయములో అనుభూతి చెందిన భావనలు పరలోకమును కాసేపు చూసిన భావన కలిగియున్నట్లుగా, పోలుస్తాము.13 ఆరోజు యూటా ప్రోవో దేవాలయములో, సి. ఎస్. లూయీస్ చేత ఈ వ్యాఖ్యానము నాకు ప్రత్యేక అర్ధమును కలిగియున్నది: “పరలోకము ఒకసారి పొందబడిన తరువాత, మర్త్యత్వములో మనము పొందిన వేదన మహిమగా మారుతుందని ఎరుగని, (మర్త్యులు) కొంత లోకసంబంధమైన బాధ గురించి ఇలా చెప్తారు, భవిష్యత్‌లో ఆనందమేది దాని నష్టమును భర్తీ చేయదు.’”14
దేవుడు మనల్ని బలపరచును, సహాయపడును మరియు పైకెత్తును;15 మరియు మన లోతైన నిరాశను ఆయన మనకు పరిశుద్ధపరచును.16 మన కుటుంబ చరిత్రలను మనము సేకరించి, మన పూర్వీకుల తరఫున దేవాలయమునకు వెళ్లినప్పుడు, తెరకు రెండువైపుల ఏకకాలములో ఈ వాగ్దానము చేయబడిన దీవెనలలో అనేకము నెరవేర్చును. అదేవిధంగా, మన వార్డులు మరియు స్టేకులలో దానిని చేయుటలో మనము ఇతరులకు సహాయపడినప్పుడు, మనము దీవించబడతాము. దేవాలయమునకు దగ్గరగా నివసించని సభ్యులు దేవాలయ విధులు నెరవేర్చుటకు వారి పూర్వీకుల పేర్లను సేకరిస్తూ, కుటుంబ చరిత్రలో పాల్గొనుట ద్వారా ఈ దీవెనలను కూడా పొందవచ్చు.
అయినప్పటికిని, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ హెచ్చరించారు “కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యముతో ఇతరులకు కలిగిన అనుభవాలను గూర్చి మనము దినమంతా ప్రేరేపించబడగలము. కానీ మనకై మనము సంతోషమును అనుభూతి చెందుటకు మనము ఏదైనా చేయాలి.” ఆయన కొనసాగించాడు, “కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యమును ఎక్కువగా చేయుటకు---మీరు చేయగలది---ముఖ్యంగా సమయమును త్యాగము చేయుట—మీరు ఏరకమైన త్యాగము చేయగలరో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.”17 అధ్యక్షులు నెల్సన్ యొక్క ఆహ్వానమును మీరు అంగీకరించినప్పుడు మీరు కుటుంబమును కనుగొని, సేకరించి, మరియు సంబంధింప చేస్తారు. అదనముగా, మీకు, మీ కుటుంబమునకు యెహేజ్కేలుచేత మాట్లాడబడిన నదివలే దీవెనలు ప్రవహించును. స్వస్థత అవసరమైన దానికి స్వస్థతను మీరు కనుగొంటారు.
ఈ యుగములో ముందుగా కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము యొక్క స్వస్థత మరియు బంధనా ప్రభావములను ఆర్సన్ మరియు పార్లీ అనుభవించారు. బెట్టీ, ఆమె కుటుంబము, మరియు రాడ్ దానిని అనుభవించారు. మీకు కూడా చేయగలరు. ఆయన ప్రాయశ్చిత్తః త్యాగము ద్వారా, యేసు క్రీస్తు ఈ దీవెనను మృతులు మరియు జీవిస్తున్న అందరికి ఇచ్చుచున్నారు. ఈ దీవెనల వలన, మనము ఉపమానముగా, “పరలోకములో . . . తప్ప ఎక్కడా ఎప్పుడూ జీవించలేదని కనుగొంటాము.”18 ఆలాగున యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.