2010–2019
దేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడుట
ఏప్రిల్ 2018


దేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడుట

దైవికంగా నియమించబడిన బాధ్యతలను నీతి, ఐక్యత మరియు సమానత్వమునందు కొనసాగించుట దేవుడిని కలుసుకొనుటకు మనల్ని సిద్ధపరచును.

ఎలైజా ఆర్. స్నో (ఆమె హాజరైన) కర్ట్‌లాండ్ దేవాలయ సమర్పణ గురించి మాట్లాడుతూ, అన్నారు: “ఆ సమర్పణ యొక్క ఆచారాలు తిరిగి చెప్పబడవచ్చు, కానీ ఆ జ్ఞాపకార్థ దినమున కలిగిన పరలోక ప్రత్యక్షతలను ఏ మానవ భాష వర్ణించలేదు. హాజరైన వారందరి చేత దైవిక సన్నిధి గ్రహించబడగా, కొందరికి దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ప్రతీఒక్కరి హృదయము చెప్పలేనంత సంతోషముతో, మహిమతో నింపబడింది.” 1

కర్ట్‌లాండ్ దేవాలయములో సంభవించబడిన దైవిక ప్రత్యక్షతలు మన పరలోక తండ్రి పిల్లల యొక్క రక్షణ మరియు ఉన్నత స్థితిని తెచ్చుటకు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘము ఉద్దేశమునకు పునాదిగా ఉన్నాయి. 2 మనము దేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడినప్పుడు, కర్ట్‌లాండ్ దేవాలయములో పునఃస్థాపించబడిన పరిశుద్ధ తాళపు చెవులను సమీక్షించుట ద్వారా దైవికంగా నియమించబడిన మన బాధ్యతలను మనము తెలుసుకోగలుగుతాము.

సమర్పణ ప్రార్థనలో, “దీనిని. . . . మీరు నిర్మించమని ఆజ్ఞాపించిన ఈ గృహమును అంగీకరించుము” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ వినయముగా ప్రభువుకు మనవి చేసారు. 3

ఒక వారము తరువాత, ఈస్టరు ఆదివారమున, ప్రభువు అద్భుతమైన దర్శనములో ప్రత్యక్షమై తన దేవాలయమును అంగీకరించారు. ఈ ఈస్టరు ఆదివారము నుండి దాదాపు 182 సంవత్సరాల క్రితం, సరిగ్గా 1836, ఏప్రిల్ 3న ఇది జరిగింది. అది పస్కా పండుగ సమయము కూడా---ఈస్టరు మరియు పస్కా కలిపి వచ్చే అరుదైన సమయాలలో ఒకటి. దర్శనము ముగిసిన తరువాత, ముగ్గురు ప్రాచీన ప్రవక్తలు మోషే, ఏలీయా, ఎలీషా ప్రత్యక్షమై ఆ యుగములో పునఃస్థాపించబడిన ఆయన సంఘము కొరకు ప్రభువు యొక్క ఉద్దేశమును నెరవేర్చుటకు అవసరమైన తాళపు చెవులు అప్పగించారు. ఆ ఉద్దేశము ఇశ్రాయేలును సమకూర్చుట, కుటుంబాలుగా వారు ముద్రింపబడుట, మరియు ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు లోకమును సిద్ధపరచుట అని సరళముగా, కాని అనర్గళంగా వివరించబడింది. 4

ఎలీషా మరియు మోషే ఇరువురు అగుపించుట “యూదా ఆచారము ప్రకారము . . . అసాధారణమైన పోలికను కలిగియున్నది, దాని ప్రకారము ఎలీషా మరియు మోషే ‘ముగింపు సమయములో’” 5 కలిసి వస్తారు. మన సిద్ధాంతములో, ఈ ప్రత్యక్షత నిర్ధిష్టమైన తాళపు చెవుల యొక్క మొదటి పునఃస్థాపనను నెరవేర్చింది, అవి “కడవరి దినాల కొరకు చివరిసారిగా ఇవ్వబడినవి, దానిలో సంపూర్ణ కాలముల యుగమున్నది.” 6

కర్ట్‌లాండ్ దేవాలయము, స్థానము మరియు పరిమాణములో సాపేక్షికంగా స్పష్టంగా ఉన్నది. కానీ మానవాళికి దాని విస్తారమైన ప్రాముఖ్యతను బట్టి, అది శాశ్వతమైన ప్రభావమును కలిగియున్నది. యేసు క్రీస్తు సువార్త యొక్క నిత్య రక్షణ విధుల కొరకు యాజకత్వపు తాళపు చెవులను ప్రాచీన ప్రవక్తలు పునఃస్థాపించారు. ఇది విశ్వాసులైన సభ్యుల కొరకు అమితమైన ఆనందాన్ని తెచ్చింది.

ఈ తాళపు చెవులు దైవికంగా నియమించబడిన బాధ్యతల కొరకు “ఉన్నతమునుండి వచ్చిన శక్తిని” 7 ఇచ్చును, అది సంఘము యొక్క ప్రధాన ఉద్దేశమును ఏర్పరచును. 8 ఆ అద్భుతమైన ఈస్టరు దినమున కర్ట్‌లాండ్ దేవాలయములో, మూడు తాళపు చెవులు పునఃస్థాపించబడినవి:

మొదట, మోషే ప్రత్యక్షమయ్యాడు, మరియు మిషనరీ కార్యమైన, భూమి యొక్క నాలుగు భాగములనుండి ఇశ్రాయేలును సమకూర్చు తాళపు చెవులను అప్పగించాడు. 9

రెండవది, ఏలీయా ప్రత్యక్షమయ్యాడు మరియు అబ్రాహాము యొక్క సువార్త యుగపు తాళపు చెవులను అప్పగించాడు, అది అబ్రాహాము నిబంధన యొక్క పునఃస్థాపనను కలిగియున్నది. 10 దేవుని రాజ్యము కొరకు సభ్యులను సిద్ధపరచుట నిబంధన తాళపు చెవుల యొక్క ఉద్దేశమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు. “మనము ఎవరిమో మనమెరుగుదుము మరియు దేవుడు మననుండి కోరుచున్న దానిని (మనమెరుగుదుము) అని అన్నారాయన.” 11

మూడవది, ఎలీషా ప్రత్యక్షమై, ఈ యుగములో ముద్రించే శక్తి యొక్క తాళపు చెవులను అప్పగించాడు, అది జీవించుచున్నవారు మరియు మృతుల కొరకు రక్షణను సాధ్యపరచు కుటుంబ చరిత్ర కార్యము మరియు దేవాలయ విధులకు సంబంధించినది. 12

ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క నడిపింపు క్రింద, సంఘ ప్రధాన కేంద్రము వద్ద మూడు కార్యనిర్వాహక మండళ్ళు గలవు, అవి కర్ట్‌లాండ్ దేవాలయములో పునఃస్థాపించబడిన తాళపు చెవులపై ఆధారపడి దైవికంగా నియమించబడిన ఈ బాధ్యతలను పర్యవేక్షించును. అవి మిషనరీ కార్యనిర్వాహక మండలి, యాజకత్వము మరియు కుటుంబ కార్యనిర్వాహక మండలి, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యనిర్వాహక మండలి.

దైవికంగా నియమించబడిన ఈ బాధ్యతలను నెరవేర్చడానికి నేడు మనము ఏమి చేస్తున్నాము?

మొదటిది, ఇశ్రాయేలును సమకూర్చుటకు మోషే యొక్క పునఃస్థాపన యొక్క తాళపు చెవులకు సంబంధించి, నేడు దాదావు 70,000 మిషనరీలు ఆయన ఏర్పరచినవారిని సమకూర్చుటకు ఆయన సువార్తను బోధిస్తూ భూమి అంతటా విస్తరించబడియున్నారు. ఇది అన్యులు మరియు ఇశ్రాయేలు సంతతి ఇరువురి మధ్య నీఫై ముందుగా చూసిన గొప్ప మరియు అద్భుతమైన కార్యము యొక్క నెరవేర్పు యొక్క ఆరంభము. దేవుని యొక్క పరిశుద్ధులు భూముఖమంతటిపై ఉన్న మన సమయాన్ని నీఫై చూసాడు, కానీ దుష్టత్వము వలన వారి సంఖ్యలు చిన్నవి. అయినప్పటికిని, వారు “గొప్ప మహిమలో పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొని యుందురని” అతడు ముందుగా చూశాడు. 13 సంఘము పునఃస్థాపించబడిన క్లుప్తమైన చరిత్ర అంతటా చూసినప్పుడు, మిషనరీ ప్రయత్నము మిక్కిలి అసాధారణమైయున్నది. మనము నీఫై దర్శనము యొక్క నెరవేర్పును చూస్తున్నాము. మన సంఖ్యలు సాపేక్షికంగా కొన్ని అయినప్పటికినీ, రక్షకుని సందేశమునకు స్పందించే వారిని సమీపించుటను మరియు మన ప్రయత్నమును మనము కొనసాగిద్దాము.

రెండవది, ఏలీయా ప్రత్యక్షమయ్యాడు, మన సంతతి మరియు మన తరువాత తరములన్నీ మనయందు దీవించబడతాయని ప్రకటిస్తూ అబ్రాహాము సువార్త యుగమును అప్పగించాడు. ఈ సమావేశములో, పరిశుద్ధులను పరిపూర్ణులుగా చేయుటకు మరియు దేవుని రాజ్యము కొరకు వారిని సిద్ధపరచుటలో సహాయపడుటకు ముఖ్యమైన నడిపింపు సమర్పించబడింది. 14 ఎల్డర్లు మరియు ప్రధాన యాజకుల సమూహములకు సంబంధించి, యాజకత్వ సమావేశములో చేసిన ప్రకటన యాజకత్వపు శక్తి మరియు అధికారానికి స్వేచ్ఛనిస్తుంది. గృహ మరియు దర్శించి బోధించుట అనగా ఇప్పుడు “పరిచర్య చేయుట” అనేది ఈ సమావేశంలో చాలా శక్తివంతంగా నేర్పించబడింది, అది దేవుడిని కలుసుకోవడానికి కడవరి-దిన పరిశుద్ధులను సిద్ధపరుస్తుంది.

మూడవది, ఎలీషా ఈ యుగము యొక్క ముద్రణ తాళపు చెవులను అప్పగించాడు. ఈ సమయమందు జీవిస్తున్న మనందరికి, దేవాలయాలు మరియు కుటుంబ చరిత్ర కార్యము అసాధారణమైనది. ఈ వేగము కొనసాగుతుంది మరియు రక్షకుని యొక్క రెండవ రాకడ వరకు వేగవంతమవుతూ ఉంటుంది, లేనియెడల సమస్త భూమి “ఆయన రాకడయందు, పూర్తిగా వ్యర్థమవుతుంది.” 15

కుటుంబ చరిత్ర కార్యము, సాంకేతిక విద్య చేత పరలోకము దీవించబడి గత కొన్ని సంవత్సరాలుగా నాటకీయంగా వృద్ధి చెందింది. ఈ దైవికంగా నియమించబడిన బాధ్యత గురించి సంతోషించి మరియు జేన్ అత్త లేక మరొక ఒడంబడిక చేసుకొన్న బంధువు దానిగురించి శ్రద్ధ తీసుకుంటారని ఆశించుట అవివేకము. అధ్యక్షలు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ గారి నిష్కపటమైన వ్యాఖ్యానాలను నేను మీతో పంచుకుంటాను: “ఈ గొప్ప బాధ్యతనుండి ఎవరూ మినహాయింపు కాదు. దానికి అపొస్తలుడు, అదేవిధంగా వినయముగల ఎల్డర్ (లేక సహోదరి) అవసరము. స్థానము, హోదా లేక సంఘములో సుదీర్ఘమైన సేవ . . . ఏదీ ఒకరి యొక్క మృతుల రక్షణను నిర్లక్ష్యము చేయుటకు ఎవరికీ హక్కునివ్వదు.” 16

ఇప్పుడు మనము ప్రపంచమంతటా దేవాలయాలను మరియు దేవాలయమునుండి దూరముగా ఉండి అవసరతలో ఉన్న వారికి దేవాలయమునకు వెళ్ళి కుటుంబాలతో ముద్రించబడుటకు సహాయపడేందుకు నిధులను కలిగియున్నాము.

వ్యక్తులుగా, మనము మిషనరీ కార్యము, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యమును చేయుటలో మరియు దేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడుటలో మన ప్రయత్నమును లెక్కించవలెను.

నీతి, ఐక్యత మరియు ప్రభువు యెదుట సమానత్వము ఈ పరిశుద్ధ బాధ్యతలకు బలమైన పునాదినిచ్చును.

నీతితో సంబంధించి, ఈ జీవితము మనందరికి దేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడు సమయము. 17 వ్యక్తులు లేక సమూహములు దేవుని ఆజ్ఞలను పాటించుటలో విఫలమైనప్పుడు దుఃఖకరమైన పర్యవసానాలకు చెందిన అనేక మాదిరులను మోర్మన్ గ్రంథము ఇచ్చును. 18

నా జీవితకాలమందు, లోకసంబంధమైన సమస్యలు మరియు చింతలు ఒకదానినుండి మరొకదానికి---నిష్ప్రయోజనమైన మరియు అల్పమైన అన్వేషణల నుండి తీవ్రమైన దుర్నీతికి మారాయి. ఏకాభిప్రాయరహితమైన దుర్నీతి బహిర్గతపరచబడి, ఖండించబడినప్పుడు అది మెచ్చుకోదగినది. 19 ఏకాభిప్రాయరహితమైన దుర్నీతి దేవుని యొక్క శాసనములకు మరియు సమాజమునకు వ్యతిరేకమైనది. దేవుని ప్రణాళికను అర్థము చేసుకునేవారు, ఏకాభిప్రాయమైన దుర్నీతిని కూడా వ్యతిరేకించాలి, ఎందుకంటే అది కూడా పాపము. ప్రపంచమునకు కుటుంబ ప్రకటన ఇలా హెచ్చరిస్తుంది, “పవిత్రత యొక్క నిబంధనలను ఉల్లంఘించి, సహవాసిని లేక సంతతిని (లేక ఆ మాటకొస్తే, ఎవరినైనా) దూషించువారు . . . ఒకరోజు దేవుని యెదుట జవాబుదారులుగా నిలబడతారు.” 20

మనము చుట్టూ చూసినప్పుడు, వినాశకరమైన దుర్మార్గతను మరియు ప్రతీచోట వ్యసనమును చూస్తున్నాము. వ్యక్తులుగా, మనము మన రక్షకుని యొక్క అంతిమ తీర్పు గురించి నిజముగా చింతించిన యెడల, మనము పశ్చాత్తాపపడాలి. అనేకమంది ఇకపై దేవునికి జవాబుదారులుగా భావించడంలేదని, నడిపింపు కొరకు లేఖనాలు లేక ప్రవక్తల వైపు తిరగడంలేదని నేను భయపడుతున్నాను. సమాజముగా మనము, పాపము యొక్క పర్యవసానములను లోతుగా ఆలోచించిన యెడల, అప్పడు అశ్లీల చిత్రములు మరియు స్త్రీలను వస్తువులుగా చూచుట పట్ల విస్తారమైన బహిరంగ వ్యతిరేకత ఉంటుంది. 21 ఆల్మా తన కుమారుడైన కొరియాంటన్ తో చెప్పినట్లుగా, “దుర్గార్మము ఎన్నడును సంతోషము కాలేదు.” 22

ఐక్యతకు సంబంధించి, రక్షకుడు ఇలా ప్రకటించారు, “మీరు ఐక్యతగా లేనియెడల మీరు నావారు కాదు.” 23 వివాదముగల ఆత్మ దుష్టుని నుండి వచ్చునని మనకు తెలుసు. 24

మన కాలములో, ఐక్యత కొరకు లేఖనముల నడిపింపు విస్తారంగా నిర్లక్ష్యము చేయబడింది, మరియు అనేకులకు వారి తెగకు నమ్మకస్తులుగా ఉండుటపై ఉద్ఘాటన, 25 తరచుగా హోదా, లింగభేదము, జాతి, మరియు ఐశ్వర్యము పై ఆధారపడుతుంది. అత్యధికము కాకపోయినా, చాలా దేశాల్లో జనులు తమ జీవన విధానమును బట్టి లోతుగా విభజించబడ్డారు. ప్రభువు సంఘములో, మనము అనుసరించి మరియు బోధించే సంప్రదాయము యేసు క్రీస్తు సువార్త యొక్క సంప్రదాయము. మనము కోరుకునే ఐక్యత రక్షకునితో మరియు ఆయన బోధనలతో సామరస్యముగా ఉండాలి. 27

సంఘము యొక్క ప్రధాన ఉద్దేశాల వైపు మనము చూచిన యెడల, అవన్నీ ప్రభువు యెదుట సమానత్వముపై27 మరియు యేసు క్రీస్తు యొక్క సువార్త సంప్రదాయముపై ఆధారపడతాయి. మిషనరీ కార్యమునకు సంబంధించి, బాప్తీస్మమునకు ప్రధానమైన అర్హత, ఒకరు విరిగిన హృదయము, నలిగిన ఆత్మను కలిగియుండి దేవుని యెదుట తమనుతాము తగ్గించుకొనుట. 28 విద్య, ఐశ్వర్యము, తెగ, లేక జాతి మూలము ఏ మాత్రము పరిగణించబడవు.

అదనముగా, పిలువబడిన చోట మిషనరీలు వినయముగా సేవ చేస్తారు. వారు ప్రాపంచిక ప్రమాణమైన హోదా లేక భవిష్యత్తు వృత్తుల కొరకు సిద్ధపాటుపై ఆధారపడి సేవ చేయడానికి ప్రయత్నించరు. వారు ఎక్కడ నియమించబడినప్పటికిని, తమ పూర్ణ హృదయము, శక్తి, మనస్సు, మరియు బలముతో సేవ చేస్తారు. వారు తమ మిషనరీ సహవాసులను ఎంపిక చేయరు, మరియు క్రీస్తు వంటి లక్షణాలను వృద్ధి చేయడానికి శ్రద్ధగా వెదకుతారు, 29 అవి యేసు క్రీస్తు యొక్క సంప్రదాయమునకు ప్రధానమైనవి.

మన అతి ముఖ్యమైన అనుబంధాలకు లేఖనాలు నడిపింపునిస్తాయి. మొదటి ఆజ్ఞ “నీ దేవుడైన ప్రభువును ప్రేమించుట” మరియు రెండవది, “నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట” 30 అని రక్షకుడు బోధించారు.

ప్రతిఒక్కరు మన పొరుగువారని రక్షకుడు అదనముగా వివరించారు. 31 -ఈయులు, తెగలు, లేక తరగతులు32 ఉండరాదని మోర్మన్ గ్రంథము స్పష్టము చేస్తుంది. మనము దేవుని యొదుట ఐక్యతతో, సమానముగా ఉండాలి.

పరిశుద్ధ విధులు మరియు దైవిక బాధ్యతలు ఈ పూర్వసిద్ధాంతముపై కట్టబడ్డాయి. దేవాలయములో మీ స్వంత అనుభవాలు నాకు కలిగిన వాటితో పోలియున్నవని నేనూహిస్తాను. నేను శాన్‌ఫ్రాన్సిస్కోలో నా ఉద్యోగ ప్రపంచమును విడిచి, ఓక్లాండ్ దేవాలయమునకు చేరినప్పుడు, నేను అమితమైన ప్రేమ మరియు శాంతిని అనుభవిస్తాను. దానిలో ప్రధాన భాగము, నేను దేవునికి, ఆయన ఉద్దేశాలకు దగ్గరగా ఉండుటను భావించుట. రక్షించే విధులు నా ప్రాధమిక దృష్టిగా ఉన్నాయి, కానీ ఆ అందమైన భావనలలో ముఖ్యమైన భాగము దేవాలయము అంతటా వ్యాపించిన సమానత్వము మరియు ఐక్యత. ప్రతీఒక్కరు తెలుపు వస్త్రములను ధరిస్తారు. ఐశ్వర్యము, స్థాయి, లేక సాధించిన విద్య యొక్క రుజువు ఏదీ లేదు. మనమందరము దేవుని యెదుట మనల్ని మనం తగ్గించుకొనే సహోదర, సహోదరీలము.

పరిశుద్ధమైన ముద్రణ గదిలో, నిత్య వివాహ విధి ప్రతిఒక్కరికి ఒక్కటే. వినయముగల నేపథ్యము నుండి వచ్చిన దంపతులు మరియు సంపన్న నేపథ్యముగల దంపతులు ఖచ్చితంగా ఒకే అనుభవమును కలిగియుంటారు. వారు ఒకేరకమైన అంగీలను ధరిస్తారు మరియు ఒకే బలిపీఠము వద్ద ఒకేరకమైన నిబంధలను చేస్తారు. వారు ఒకేవిధమైన నిత్య యాజకత్వ దీవెనలను కూడా పొందుతారు. ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరముగా పరిశుద్ధుల యొక్క దశమభాగముల చేత కట్టబడిన అందమైన దేవాలయములో ఇది నెరవేర్చబడుతుంది.

నీతి, ఐక్యత, మరియు ప్రభువు యెదుట సమానత్వముపై ఆధారపడి దైవికంగా నియమించబడిన బాధ్యతలను నెరవేర్చుట, ఈ లోకములో వ్యక్తిగత సంతోషమును, శాంతిని తెస్తుంది మరియు రాబోయే లోకములో నిత్యజీవము కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. 33 అది దేవుడిని కలుసుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తుంది. 34

మీలో ప్రతీఒక్కరు మీ ప్రస్తుత పరిస్థితులను లక్ష్యపెట్టకుండా, మీ బిషప్పు మార్గదర్శకత్వములో దేవాలయ సిఫారసు కలిగియుండుటకు యోగ్యులుగా ఉంటారని మేము ప్రార్థిస్తున్నాము. 35

దేవాలయమునకు వెళ్లుటకు ఇంకా అనేకమంది సభ్యులు సిద్ధపడుచున్నందుకు మేము కృతజ్ఞులము. అనేక సంవత్సరాలుగా దేవాలయ సిఫారసుగల యోగ్యులైన పెద్ద సభ్యుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉన్నది. గత రెండు సంవత్సరాలుగా, యోగ్యులైన యువత కొరకు పరిమితంగా ఉపయోగించే సిఫారసులు నాటకీయంగా పెరిగాయి. స్పష్టముగా సంఘము యొక్క నమ్మకమైన ప్రధాన సభ్యత్వము ఎన్నడూ ఇంత బలముగా లేదు.

ముగింపులో, దైవికంగా నియమించబడిన సంఘ ఉద్దేశములపై అధ్యక్షత వహించు సంఘము యొక్క సీనియరు నాయకులు దైవిక సహాయమును పొందుతారని హామీ ఇవ్వబడుతున్నారు. ఆత్మ నుండి ఈ నడిపింపు వస్తుంది మరియు కొన్నిసార్లు రక్షకుడి నుండి నేరుగా వస్తుంది. రెండు రకాల ఆత్మీయ నడిపింపు ఇవ్వబడుతుంది. అటువంటి సహాయమును పొందుటకు నేను కృతజ్ఞుడను. కానీ నడిపింపు, “సర్వజ్ఞుడైన దేవుడు మనకు బోధించుటకు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసినప్పుడు,” 37 ప్రభువు కాలములో, వరుస వెంబడి వరుస మరియు సూత్రము వెంబడి సూత్రము ఇవ్వబడుతుంది. 36 మొత్తముగా సంఘము కొరకు నడిపింపు పూర్తిగా ఆయన ప్రవక్తకు మాత్రమే వస్తుంది.

ఈ సమావేశములో మన ప్రవక్తగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షులుగా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ గారిని ఆమోదించే విశేషావకాశమును మనమందరము కలిగియున్నాము. అధ్యక్షులు నెల్సన్ గారి తలపై మేము మా చేతులుంచగా, స్వరముగా పని చేయుచున్న అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్‌ ఆయనను సంఘ అధ్యక్షునిగా నియమించి ప్రత్యేకపరచినప్పుడు, పన్నెండుమందిమి గుంపుగా మరియు వ్యక్తిగతంగా ప్రముఖమైన ఆత్మీయ అనుభవమును కలిగియున్నాము. ఆయన ముందుగా నియమించబడ్డారని, మన కాలము కొరకు ప్రభువు యొక్క ప్రవక్తగా ఉండుటకు తన జీవితకాలమంతా సిద్ధపరచబడ్డారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు