అహరోను యాజకత్వము గల ప్రతిఒక్కరు గ్రహించవలసినదేమిటి
మీ అహరోను యాజకత్వ నియామకము దేవుని యొక్క పిల్లలు ప్రాయశ్చిత్త శక్తిని పొందుటకు సహాయపడు టకు ప్రధానమైనది.
సహోదరులారా, ఈ చారిత్రక సమావేశములో మీతో ఉండుట విశేషావకాశముగా ఉన్నది. నేను ఒక క్రొత్త మిషను అధ్యక్షునిగా ఉన్నప్పుడు, మా మొదటి క్రొత్త మిషనరీల గుంపును తీసుకొనిరావటానికి నేను ఉత్సాహము చెందాను. ఎక్కువ అనుభవముగల మా మిషనరీలలో కొందరు వారిని కాసేపు కలుసుకొవటానికి సిద్ధపడుచున్నారు. అర్ధవృత్తాకారములో పిల్లల కుర్చీలను వారు ఏర్పాటు చేయుట నేను గమనించాను.
“ఈ చిన్న కుర్చీలు దేనికి?” నేను అడిగాను.
“క్రొత్త మిషనరీల కోసం” అని మిషనరీలు కాస్త బేలగా చెప్పారు.
ఇతరులను మనము చూసే విధానము, వారెవరు మరియు వారు ఏమి కాగలరనే వారి ఊహను గణనీయంగా ప్రభావితం చేస్తుందని నేను నమ్ముతాను.1 ఆ రోజు మా క్రొత్త మిషనరీలు పెద్ద కుర్చీలపై కూర్చోన్నారు.
కొన్నిసార్లు, మనము అహరోను యాజకత్వముగల పిల్లలకు, దేవుడు వారికిచ్చిన పరిశుద్ధ నమ్మకము మరియు చేయటానికిచ్చిన పనిని వారు చూచుటకు సహాయపడుటకు బదులుగా, అలంకారికంగా కూర్చోవటానికి వారికి పిల్లల కుర్చీలను ఇస్తున్నామని నేను భయపడుతున్నాను.
యువకులు “దేవుని యొక్క యాజకత్వమును వహించువారిగా ఉండుట అనగా అర్ధమేమిటో . . .గ్రహించాలి. వారు తమ నియమింపబడిన పిలుపు యొక్క పరిశుద్ధతను గూర్చి ఆత్మీయ ఆధ్యాత్మిక అవగాహనకు వారు నడిపించబడాలి,”2 అని అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ మనకు సలహా ఇచ్చారు.
పరిశుద్ధాత్మ మనల్ని అహరోను యాజకత్వము యొక్క పరిశుద్ధతను మరియు శక్తిని గూర్చి గొప్ప అవగాహనకు నడిపిస్తుందని మరియు మన యాజకత్వ బాధ్యతలపై మరింత శ్రద్ధగా దృష్టిసారించుటకు మనల్ని ప్రేరేపించాలని ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను. నా సందేశము మెల్కీసెదకు యాజకత్వముగల వారిని కలిపి, అహరోను యాజకత్వముగల వారందరి కొరకైనది.
యాజకత్వము యొక్క ఉద్దేశము దేవుని పిల్లలు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తః శక్తికి ప్రవేశమును అందించుట అని ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ బోధించారు.3 మన జీవితాలోనికి క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తః శక్తిని పొందుటకు, మనము ఆయనయందు విశ్వాసము ఉంచాలి, మన పాపముల కొరకు పశ్చాత్తాపపడాలి, విధుల ద్వారా నిబంధనలను చేసి, పాటించాలి, మరియు పరిశుద్ధాత్మను పొందాలి. 4 ఇవి కేవలము ఒక్కసారి పూనుకునే సూత్రములు కాదు, బదులుగా, అవి “క్రీస్తునొద్దకు వచ్చి, ఆయనయందు పరిపూర్ణులు,”5 అగుటకు పైకి పురోగతి చెందు నిరంతర ప్రక్రియలో ఒకరినొకరిని బలపరచుకుంటూ మరియు నిర్మించుకొనుటకు, కలిసి పనిచేస్తాయి.
అయితే, దీనిలో అహరోను యాజకత్వము యొక్క పాత్ర ఏమిటి? క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తః శక్తికి ప్రవేశమును పొందుటకు అది మనకు ఎలా సహాయపడుతుంది? అహరోను యాజకత్వము కలిగియున్న తాళపు చెవులందు జవాబున్నదని నేను నమ్ముచున్నాను---దేవదూతల పరిచర్య మరియు సిద్ధపరచు సువార్త యొక్క తాళపు చెవులు.6
దేవదూతల పరిచర్య
దేవదూతల పరిచర్యతో మనము ప్రారంభిద్దాము. దేవుని యొక్క పిల్లలు యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుటకు ముందు, వారు ఆయనను గూర్చి తెలుసుకోవాలి మరియు ఆయన సువార్తను బోధింపబడాలి. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా:
“వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు?
“ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? . . .
“కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.”7
కాలము ఆరంభమునుండి, దేవుడు, “క్రీస్తు యొక్క రాకను గూర్చి విశదము చేయుటకు నరుల యొక్క సంతానమునకు పరిచర్య చేయుటకు, దేవదూతలను పంపెను.”8 దేవదూతలు దేవుని యొక్క సందేశమును వహించు పరలోకపు ప్రాణులు.9 హెబ్రియ మరియు గ్రీకు రెండిటిలో, దేవదూత అను మాటకు మూలము, “రాయబారి.”10
ఆయన మాటను ప్రకటించుటకు మరియు విశ్వాసమును నిర్మించుటకు అధికారమివ్వబడిన దేవదూతలు దేవుని చేత పంపబడిన విధంగా, అహరోను యాజకత్వముగల మనము, “బోధించుటకు, మరియు క్రీస్తునొద్దకు వచ్చుటకు అందరిని ఆహ్వానించుటకు”11 నియమించబడ్డాము. సువార్తను ప్రకటించుట యాజకత్వ బాధ్యత. మరియు ఈ బాధ్యతతో సంబంధించిన శక్తి ప్రవక్తల కొరకైనది మాత్రమే కాదు లేక మిషనరీల కొరకు మాత్రమే కాదు. అది మీ కొరకైనది!12
దేవుని యొక్క పిల్లల హృదయాలకు క్రీస్తునందు విశ్వాసమును ఎలా తెస్తాము? ఆయన వాక్యమును భద్రపరచుకొనుట ద్వారా మనము ప్రారంభిస్తాము, ఆవిధంగా దాని శక్తి మనలోపల ఉండును.13 మనము చేసిన యెడల, సరైన సమయములో ఏమి చెప్పాలో మనము ఎరుగుదుమని ఆయన వాగ్దానమిచ్చాడు.14 ఒక కోరము సమావేశములో బోధించే అవకాశము లేక ఒక సభ్యుని గృహమును దర్శించుట కావచ్చు. అది స్వల్ప పద్ధతి ప్రకారమైన, ఒక స్నేహితునితో లేక కుటుంబ సభ్యునితో సంభాషణ కావచ్చు. ఈ సందర్భాలు ఏవైనా, మనము సిద్ధపడిన యెడల, పరిశుద్ధాత్మ వరము చేత, దేవదూతల వలే మనము సువార్తను బోధించగలము.15
పాపౌ న్యూ జెనివాలోని ఒక అహరోను యాజకత్వముగల జేకబ్, మోర్మన్ గ్రంథము యొక్క శక్తిని గూర్చి, అది అతడు చెడును ఎదిరించుటకు మరియు ఆత్మను వెంబడించుకు ఎలా సహాయపడిందో సాక్ష్యమిచ్చాడు. అతడి మాటలు నా విశ్వాసమును మరియు ఇతరుల యొక్క విశ్వాసమును హెచ్చించాయి. నేను అహరోను యాజకత్వముగల వారు తమ కోరముల సమావేశాలలో భక్తిగల గౌరవముతో బోధించి, సాక్ష్యమిచ్చుటను నేను వినినప్పుడు కూడా నా విశ్వాసము వృద్ధి చెందింది.
యువకులారా, మీరు అధికారమివ్వబడిన రాయబారులు. మీ మాటలు మరియు క్రియల ద్వారా, దేవుని యొక్క పిల్లలకు క్రీస్తునందు విశ్వాసమును తెస్తారు.16 అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పినట్లుగా “వారికి మీరు పరిచర్య చేయు దూతలుగా ఉంటారు.”17
సిద్ధపరచు సువార్త
క్రీస్తునందు హెచ్చించబడిన విశ్వాసము మార్చుకొనుటకు లేక పశ్చాత్తాపపడుటకు ఒక కోరికకు నడిపించును.18 దేవదూతల పరిచర్య యొక్క తాళపు చెవులు “పశ్చాత్తాపము, బాప్తీస్మము, మరియు పాపముల పరిహారము యొక్క సువార్త” 19 సిద్ధపరచు సువార్త యొక్క తాళపు చెవులతో కలిపి ఉంటాయనుట తార్కికమైనది.
అహరోను యాజకత్వ బాధ్యతలను మీరు అధ్యయనము చేసినప్పుడు, పశ్చాత్తాపపడుటకు మరియు మెరుగుపరచుకొనుటకు ఇతరులను ఆహ్వానించు స్పష్టమైన ఆజ్ఞ అని మీరు చూస్తారు.20వీధి చివర నిలబడి, “పశ్చాత్తాపపడండి” అని కేకలు వేయుట దాని అర్ధముకాదు. చాలా తరచుగా, దాని అర్ధము, మనము పశ్చాత్తాపపడాలి, మనము క్షమించాలి, మరియు మనము ఇతరులకు సహాయపడినప్పుడు, మనము పశ్చాత్తాపము తెచ్చు నిరీక్షణ మరియు శాంతిని ఇస్తాము---ఎందుకనగా మనకై మనము దానిని అనుభూతి చెందాము.
వారు తమ సహ కోరము సభ్యులను దర్శించినప్పుడు, అహరోను యాజకత్వముగల వారితో నేను ఉన్నాను. వారి శ్రద్ధ హృదయాలను మృదువుగా చేయును మరియు వారి సహోదరులు దేవుని యొక్క ప్రేమను అనుభూతిచెందుటకు సహాయపడిందని నేను ప్రత్యక్షంగా చూసాను. ఒక యువకుడు తన తోటివారికి పశ్చాత్తాపము యొక్క శక్తిని గూర్చి సాక్ష్యమిచ్చుటను నేను విన్నాను. అతడు చేసినప్పుడు, హృదయాలు మృదువుగా చేయబడినవి, ఒడంబడికలు చేయబడినవి, మరియు క్రీస్తు యొక్క స్వస్థపరచు శక్తి అనుభూతి చెందబడింది.
అధ్యక్షుల గార్డన్ బి. హింక్లీ బోధించారు: “పశ్చాత్తాపపడుట ఒక విషయము. మన పాపములు మాఫీ చేయబడుట లేక క్షమించబడుట మరొకటి. దీనిని తెచ్చుటకు శక్తి అహరోను యాజకత్వములో కనుగొనబడింది.”21 అహరోను యాజకత్వము యొక్క బాప్తీస్మము మరియు సంస్కార విధులు మన పాపముల పరిహారము కొరకు పశ్చాత్తాపమును పూర్తిచేయును.22 అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ దీనిని ఈవిధంగా వివరించారు: “మన పాపముల కొరకు పశ్చాత్తాపపడుటకు మరియు విరిగి నలిగిన ఆత్మతో ప్రభువు వద్దకు వచ్చుటకు, సంస్కారములో పాల్గొనుటకు మనము ఆజ్ఞాపించబడ్డాము. . . . ఈ విధముగా మన బాప్తీస్మపు నిబంధనలను మనము క్రొత్తవిగా చేసుకొన్నప్పుడు, ప్రభువు మన బాప్తీస్మము యొక్క శుద్ధి చేయు ప్రభావమును క్రొత్తదిగా చేయును.”23
సహోదరులారా, పశ్చాత్తాపపడు హృదయాలకు రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త కృపను తెచ్చుటకు సహాయపడు విధులను నిర్వహించుట పరిశుద్ధమైన విశేషావకాశము.24
తనకై తాను వ్యక్తపరచుకొనుటకు ప్రయాసపడే ఒక యాజకుడు, మొదటిసారి సంస్కారమును దీవించుట గూర్చి నేను చెప్పబడ్డాను. అతడు చేసినప్పుడు, అతడిపై మరియు సమూహముపై ఒక శక్తివంతమైన ఆత్మ వచ్చింది. సమావేశములో తరువాత, అతడు ఆ విధియందు అనుభవించిన దేవుని శక్తిని గూర్చి సరళమైనది కాని స్పష్టమైన సాక్ష్యమును చెప్పాడు.
సిడ్నీ, ఆస్ట్రేలియాలో, యాజకుల కోరములో నలుగురు సభ్యులు మ్యులంగో కుటుంబ సభ్యులకు బాప్తీస్మమిచ్చారు. ఈ అనుభవము తన కుమారుడిని శక్తివంతంగా ప్రభావితం చేసిందని ఆ యాజకులలో ఒకరి తల్లి నాతో చెప్పింది. ఈ యాజకులు “యేసు క్రీస్తు చేత ఆజ్ఞాపించబడుట”25 అనగా అర్ధమేమిటో వారు గ్రహించారు.
మీకు తెలిసినట్లుగా, ఇప్పుడు యాజకులు దేవాలయములో ప్రతినిధి బాప్తీస్మమును ఇవ్వగలరు. ఈమధ్య నా 17-సంవత్సరాల కుమారుడు మా పూర్వీకులలో కొందరి కోసం నాకు బాప్తీస్మమిచ్చాడు. మేమిరువురము అహరోను యాజకత్వము మరియు దేవుని యొక్క పిల్లలందరి యొక్క రక్షణ కొరకు పనిచేయు విశేషావకాశము కొరకు లోతైన కృతజ్ఞతను భావించాము.
యువకులారా, “మానవుని యొక్క అమర్త్యత్వమును మరియు నిత్యజీవమును తెచ్చుటకు,”26 మీ యాజకత్వ బాధ్యతలందు మీరు శ్రద్ధగా పూనుకొన్నప్పుడు, ఆయన కార్యమునందు దేవునితో మీరు పాల్గొనుచున్నారు. ఇటువంటి అనుభవాలు మీరు మిషనరీల వలే పశ్చాత్తాపమును బోధించి మరియు మార్పు చెందిన వారిని బాప్తీస్మమిచ్చుటకు మీ కోరికను హెచ్చించును మరియు మిమ్మల్ని సిద్ధపరచును. అవి మెల్కీసెదకు యాజకత్వములో జీవితకాల సేవ కొరకు కూడ మిమ్మల్ని సిద్ధపరచును.
మన మాదిరి, బాప్తీస్మమిచ్చు యోహాను
అహరోను యాజకత్వముగల వారలారా, బాప్తీస్మమిచ్చు యోహానుతో సహ సేవకులుగా చేయుటకు బాధ్యతను మనము కలిగియున్నాము. క్రీస్తును గూర్చి సాక్ష్యమును వహించుటకు, పశ్చాత్తాపపడుటకు, మరియు బాప్తీస్మము పొందుటకు అధికారమివ్వబడిన దూతగా యోహాను పంపబడ్డాడు---దానిని, మనము చర్చించిన అహరోను యాజకత్వపు తాళపు చెవులను అతడు సాధన చేసాడు. తరువాత యోహాను ప్రకటించాడు, “మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీస్మమిచ్చుచున్నాను: అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు … : ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నితోను మీకు బాప్తీస్మమిచ్చును.”27
కనుక అహరోను యాజకత్వము, సిద్ధపరచు సువార్తను నిర్వహించుట, మెల్కీసెదకు యాజకత్వము ద్వారా, ఈ జీవితములో మనము పొందగల మిక్కిలి గొప్ప వరమైన, పరిశుద్ధాత్మను పొందుటకు దేవుని యొక్క పిల్లల కొరకు మార్గమును సిద్ధపరచును.28
అహరోను యాజకత్వముగల వారికి దేవుడు ఎంత లోతైన బాధ్యతనిచ్చాడు!
ఒక ఆహ్వానము మరియు వాగ్దానము
తల్లిదండ్రులు మరియు యాజకత్వ నాయకులారా, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ సలహా “దేవుని యొక్క యాజకత్వమును వహించువారిగా ఉండుట అనగా అర్ధమేమిటో”29యువకులు గ్రహించుటకు సహాయపడవలసిన ప్రాముఖ్యతను మీరు గ్రహించారా? అహరోను యాజకత్వమును గ్రహించుట మరియు నెరవేర్చుట మెల్కీసెదకు యాజకత్వముగల వారిగా, శక్తి నిండిన మిషనరీలుగా, మరియు నీతిమంతులైన భర్తలు, తండ్రులుగా ఉండుటకు మనము ఇవ్వగల శ్రేష్టమైన సిద్ధపాటు. వారి సేవ ద్వారా, వారు దేవుని పిల్లల యొక్క రక్షణ కొరకు క్రీస్తు నామములో పనిచేయుటకు శక్తి అయిన యాజకత్వ శక్తి యొక్క వాస్తవమును అనుభవించడమే కాదు కానీ, అనుభూతి చెందుతారు.
యువకులారా, దేవుడు మీరు చేయుటకు ఒక కార్యమును కలిగియున్నాడు.30 మీ అహరోను యాజకత్వము నియామకము ఆయన పిల్లలు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తః శక్తిని పొందుటకు సహాయపడుటకు చాలా ముఖ్యమైనది. ఈ పరిశుద్ధ బాధ్యతలను మీ జీవితములో ప్రాధాన్యతగా చేసినప్పుడు, మునుపెన్నటి కంటే, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవిస్తారు. ఆయన కార్యమును చేయుటకు ఒక పరిశుద్ధ పిలుపుతో పిలవబడిన దేవుని కుమారునిగా మీ గుర్తింపును మీరు గ్రహిస్తారు. బాప్తీస్మమిచ్చు యోహాను వలే ఆయన కుమారుని రాకడ కొరకు మార్గమును సిద్ధపరచుటకు మీరు సహాయపడతారు. ఈ సత్యములను గూర్చి యేసుక్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.