2010–2019
అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును
ఏప్రిల్ 2018


2:3

అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును

మనము విశ్వసించు దానికి మరియు ఎరిగిన దానికి విశ్వాసముగా మనము ఉందాము.

నా ప్రియమైన సహోదర, సహోదరులారా, నా భావనలలో కొన్నిటిని వ్యక్తపరచు అవకాశమును నేను చాలా అభినందిస్తున్నాను.

కొన్ని సంవత్సరాల క్రితం, నా భార్య, నేను సాల్ట్‌లేక్‌లోని సంఘ చారిత్రక మ్యూజియమ్‌లో పరస్పర ప్రదర్శన యొక్క ప్రారంభ వేడుకకు హాజరయ్యాము. వేడుక ముగింపులో, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ మావైపు నడిచి వచ్చారు, మరియు మాతో కరచాలనము చేసినప్పుడు ఇలా చెప్పారు, “సహించుము, మరియు మీరు జయిస్తారు”---లోతైన బోధన మరియు దీని సత్యమును, మనమందరము నిర్ధారించగలము.

“అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును”1 అని యేసు క్రీస్తు మనకు అభయమిచ్చాడు.”1

అంతము వరకు సహించుట అనగా “శోధన, వ్యతిరేకత, మరియు దుర్దశను లక్ష్యపెట్టకుండా, దేవుని ఆజ్ఞలకు యదార్ధముగా ఉండుటకు చేసిన ఒడంబడికయందు స్థిరముగా నిలిచియుండుట.”2

శక్తివంతమైన ఆత్మీయ అనుభవములు కలిగిన వారు మరియు విశ్వాసమైన సేవ చేసిన వారు కూడ ఒకరోజు తప్పిపోవచ్చు లేక అంతము వరకు సహించని యెడల వారు చైతన్యము లేనివారు కావచ్చు. మనము ఎల్లప్పుడు “ఇది నాకు జరగదు” అనే మాటను మన మనస్సులు మరియు హృదయాలలో బలముగా ఉంచాలని నేనాశిస్తున్నాను.

కపెర్నహూములో యేసు క్రీస్తు బోధించినప్పుడు, “ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు ”

“యేసు మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడిగెను.”3

ఈరోజు, ఆయనతో పరిశుద్ధ నిబంధనలు చేసిన మనందరిని, యేసు క్రీస్తు “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని ప్రశ్నిస్తాడని నేను నమ్ముచున్నాను.

నిత్యత్వములు మనకొరకు కలిగియున్న దాని గురించి లోతైన అవగాహనతో “ప్రభువా, యెవని యొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు,” 4 అని సీమోను పేతురు చెప్పినట్లుగా మనందరము జవాబిస్తామని నేను ప్రార్థిస్తున్నాను.

మనము నమ్మిన దానికి, ఎరిగిన దానికి మనము విశ్వాసముగా ఉండెదముగాక. మన జ్ఞానము ప్రకారము మనము జీవించని యెడల, మనము మారాలి. పశ్చాత్తాపము చెందని, వారి పాపములందు పట్టువిడువని పాపులు, పశ్చాత్తాపపడుటకు, క్షమించబడుటకు, మరియు నిత్యత్వము యొక్క దీవెనలన్నిటితో దీవించబడుటకు వారి అవకాశమును బహుగా అపాయములో ఉంచుతూ, సాతాను తనకై వారిని హక్కుగా పొందేంతవరకు, మురికిలో మిక్కిలి లోతుగా మునిగిపోవుచున్నారు.

సంఘములో చురుకుగా పాల్గొనుట ఆపివేసి మరియు ఈ భూమి మీద మన ప్రయాణము యొక్క ఉద్దేశము యొక్క సరైన దర్శనమును కోల్పోయిన వారినుండి అనేక సమర్ధింపులను మనము విన్నాము. ప్రతిఫలించి, మరియు తిరిగి రమ్మని నేను వారిని ప్రోత్సహించుచున్నాను, ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు యెదుట ఏ ఒక్కరు నెపములు చెప్పలేరని నేను నమ్ముచున్నాను.

మనము బాప్తీస్మము పొందినప్పుడు, “అంతము వరకు ఆయనకు సేవ చేసే తీర్మానమును కలిగియుండి, యేసు క్రీస్తు నామమును (మనపై) తీసుకొనుటకు,”5 అంగీకరిస్తూ, మానవునితో కాదు కానీ రక్షకునితో--- మనము నిబంధనలను చేస్తున్నాము

ఆయనకు సేవ చేయుటకు, మన ఆత్మీయ ధైర్యమును, మరియు ప్రభువైన యేసు క్రీస్తునందు అభివృద్ధిని మన తీర్మానము మనము లెక్కించగల ముఖ్యమైన విధానాలలో ఒకటి సంస్కార సమావేశాలలో హాజరగుట.

సంస్కారములో పాల్గొనుట సబ్బాతు దినమున మనము చేసే అత్యంత ముఖ్యమైన విషయము. ఆయన చనిపోకముందు తన అపొస్తులులకు ఈ విధిని ప్రభువు వివరించాడు. ఆయన దానినే అమెరికా ద్వీపములో కూడా చేసాడు. ఈ విధిలో మనము పాల్గొన్న యెడల, అది మనము ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకముంచుకొంటామని తండ్రికి సాక్ష్యముగా ఉండును, మరియు ఆ ప్రకారము, మనము ఆయన ఆత్మను మనతో కలిగియుంటామని ఆయన వాగ్దానము చేయుచున్నాడు.6

తన కుమారుడైన షిబ్లోనుకు చిన్నవాడైన ఆల్మాకు బోధనలందు, మన నిబంధనలకు విశ్వసనీయంగా నిలిచియుండుటకు మనకు సహాయపడే తెలివైన సలహాను మరియు హెచ్చరికను మనము కనుగొంటాము:

“నీవు గర్వమునకు పైకెత్తబడకుండ చూచుకొనుము.అవును నీ స్వంత జ్ఞానమందు లేక నీ అధిక బలమును బట్టి నీవు ఆడంబరములు పలుకకుండ చూచుకొనుము.

“ధైర్యమునుపయోగించుడి, కానీ అధిగమించుట కాదు మరియు మీరు ప్రేమతో నింపబడునట్లు మీ కామోద్రేకములన్నిటికీ మీరు కళ్లెము వేయునట్లు కూడ చూచుకొనుడి.”7

కొన్ని సంవత్సరాల క్రితం, సెలవు దినముపై ఉండగా, మొదటిసారి కాయాకింగ్ (చిన్న పడవపై) వెళ్లాలని నేను కోరాను. నేను ఒక పడవను అద్దెకు తీసుకున్నాను మరియు ఉత్సాహముతో నిండి, సముద్రములోనికి ప్రవేశించాను.

కొన్ని నిముషాల తరువాత, ఒక అల పడవను తలక్రిందులుగా చేసింది. చాలా కష్టమైన ప్రయత్నముతో, ఒక చేతితో తెడ్డును పట్టుకొని మరియు మరొక దానితో పడవను పట్టుకొని నేను నా అడుగు నిలుపుకోగలిగాను.

నా పడవ తెడ్డు వేయటానికి నేను మరలా ప్రయత్నించాను, కానీ కొన్ని నిముషాల తరువాత, పడవ మరలా తలక్రిందులైంది. పడవలో పగులు ఉండి ఉంటుందని, పడవ నీటితో నిండి, దానిని అస్థిరముగా చేసి అదుపు చేయుటకు అసాధ్యముగా చేసియుండవచ్చని కాయాకింగ్‌‌ను అర్ధము చేసుకొన్న ఒకరు నాకు చెప్పేంత వరకు, నేను మొండిగా ప్రయత్నించసాగాను, కాని విఫలమయ్యాను. నేను పడవను తీరానికి లాగాను మరియు ప్లగ్ తీసేసాను, మరియు చాలా విస్తారమైన పరిమాణములో నీళ్లు బయటకు వచ్చాయి.

నా పడవలో రంధ్రమువలే, కొన్నిసార్లు మన ఆత్మీయ అభివృద్ధిని ఆటంకపరచు పాపములతో మనము జీవితము గుండా కదులుతాము.

మనము మన పాపములందు పట్టువిడువక యుంటే, మన జీవితాలలో ఆ పాపములు సృష్టించే అసమతుల్యత వలన అభివృద్ధి చెందుట విఫలమైనప్పటికిని, ప్రభువుతో మనము చేసిన నిబంధనలను మనము మరచిపోతాము.

నా పడవలో పగులు వలే, మన జీవితాలలోని పాపములతో వ్యవహరించాల్సినవసరమున్నది. కొన్ని పాపములకు మిగిలిన వాటికంటే పశ్చాత్తాపపడుటకు ఎక్కువ ప్రయత్నాలు అవసరము.

కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి: రక్షకుడు మరియు ఆయన కార్యము పట్ల మన స్వభావము గురించి మనమెక్కడ ఉన్నాము? అతడు యేసు క్రీస్తునును నిరాకరించినప్పుడు, మనము పేతురు యొక్క స్థితిలో ఉన్నామా? లేక అతడు రక్షకుని నుండి “గొప్ప ఆజ్ఞను” పొందిన తరువాత అతడు కలిగియున్న స్వభావము మరియు తీర్మానమును మనము కలిగియున్న స్థితికి వృద్ధి చెందామా? 8

మనము ఆజ్ఞలన్నిటికి విధేయులగుటకు ప్రయాసపడాలి మరియు మనకు పాటించుటకు కష్టమైన వాటికి ఎక్కువ ఆసక్తిని చూపాలి. మనము నిజాయితీగల కోరికను రుజువు చేసి మరియు ఆ ప్రకారము చేసిన యెడల, అవసరత మరియు బలహీన సమయములందు మనకు సహాయపడుటకు, ప్రభువు మన ప్రక్కన ఉంటాడు, మరియు “బలహీనమైన సంగతులను బలమైనవిగా,”9 ఆయన చేస్తాడు.

విధేయత పాపమును జయించుటకు మనకు బలమునిచ్చును. మన విశ్వాసము యొక్క పరీక్షకు, తరచుగా ఫలితాలు తెలుసుకోకుండా మనము విధేయులగుట అవసరమని కూడా మనము గ్రహించాలి.

అంతము వరకు సహించుటకు మనకు సహాయపడే ఒక నియమాన్ని నేను సూచిస్తాను:

  1. ప్రతీరోజు ప్రార్థించుము మరియు లేఖనాలను చదువుము.

  2. వారానికి ఒకసారి, విరిగి నలిగిన ఆత్మతో సంస్కారములో పాల్గొనుట.

  3. మన దశమభాగము చెల్లించుట మరియు నెల నెలా మన ఉపవాస అర్పణను చెల్లించుట.

  4. ప్రతీ రెండు సంవత్సరాలు---యువతకు ప్రతీ సంవత్సరము---మన దేవాలయ సిఫారసులను క్రొత్తవిగా చేసుకోవాలి.

  5. మన జీవితకాలమంతటా, ప్రభువు యొక్క కార్యములో సేవ చేయాలి.

సువార్త యొక్క గొప్ప సత్యములు మన మనస్సులను స్థిరముగా చేయునుగాక, మరియు ఈ జీవితపు సముద్రముగుండా మన సురక్షితమైన ప్రయాణమును ఆటంకపరచే పాపములనుండి స్వేచ్ఛగా మన జీవితాలను ఉంచెదముగాక.

ప్రభువు యొక్క మార్గములో విజయము ఖరీదును కలిగియున్నది, మరియు సాధించుటకు ఏకైక మార్గము ఆ ఖరీదును చెల్లించుట.

తన గొప్ప ప్రాయశ్చిత్తః త్యాగమును పూర్తి చేస్తూ, మన రక్షకుడు అంతము వరకు సహించినందుకు నేనెంత కృతజ్ఞుడను.

ఆయన మన పాపములు, బాధలు, నిరాశలు, వేదన, బలహీనతలు, మరియు భయాల కొరకు బాధింపబడ్డాడు, మరియు అందుచేత మనకు ఎలా సహాయపడాలో, మనల్ని ఎలా ప్రేరేపించాలో, మనల్ని ఎలా ఓదార్చాలో, మరియు మనల్ని ఎలా బలపరచాలో ఆయన ఎరుగును ఆవిధంగా మనము సహించగలము మరియు ఓడిపోనివారి కొరకు దాచబడిన కిరీటమును సంపాదించగలము.

మనలో ప్రతీ ఒక్కరికి జీవితము భిన్నమైనది. మనందరము శ్రమల కాలము, సంతోషముగల సమయము, నిర్ణయాలు చేసే సమయము, ఆటంకాలను జయించుటకు సమయమును, మరియు అవకాశముల ప్రయోజనమును తీసుకొనే సమయమును కలిగియుంటాము.

మన వ్యక్తిగత పరిస్థితులు ఏవైనప్పటికిని, మన పరలోక తండ్రి “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను బలపరుస్తాను, నేను నీతో ఉన్నాను, నిరాశ చెందకు. పశ్చాత్తాపపడు మరియు నేను చూపిన మార్గములో సహించుము. మన సిలెస్టియల్ గృహములో మనము ఒకరినొకరము మరలా చూసుకుంటామని నేను మీకు అభయమిస్తున్నాను,” అని నిరంతరము చెప్పుచున్నారని, యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.