గృహములో బోధన---ఒక సంతోషకరమైన మరియు పరిశుద్ధమైన బాధ్యత
మన స్వంత గృహాలలో క్రీస్తు వంటి బోధకులుగా ఉండుటకు మనము ప్రయాసపడినప్పుడు, పరలోకము యొక్క సహాయము కొరకు నేను వేడుకుంటున్నాను.
నా ప్రియమైన భార్య, జూలీ, మరియు నేను ఐదుగురు ప్రశస్తమైన పిల్లలను పెంచాము, మరియు ఇటీవల మేము ఒంటరివారమయ్యాము. పూర్తికాల సమయము, మా పిల్లలు మా యింట్లో ఉండుటం నేను బలముగా గుర్తు చేసుకుంటున్నాను. నేను వారి నుండి నేర్చుకొనుటను మరియు వారికి బోధించుటను కోల్పోయాను.
ఈరోజు నేను తల్లిదండ్రులందరు మరియు తల్లిదండ్రులుగా ఉండాలని కోరే వారందరితో ప్రసంగిస్తాను. మీలో అనేకులు ఇప్పుడు పిల్లలను పెంచుతున్నారు. ఇతరులకు, ఆ సమయము త్వరలో వచ్చును. మరియు ఇంకను ఇతరులకు, మాతృత్వము ఒక భవిష్యత్ దీవెన కావచ్చు. ఒక బిడ్డకు బోధించుట ఒక సంతోషకరమైన మరియు పరిశుద్ధమైన బాధ్యత అని మనమందరం గుర్తించాలని నేను ప్రార్థిస్తున్నాను. 1
తల్లితండ్రులుగా, మనము మన పిల్లలను పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన, యేసు క్రీస్తుకు పరిచయము చేస్తున్నాము. మన పిల్లలు వారి మొదటి ప్రార్థనను చెప్పుటకు మనము సహాయపడుచున్నాము. బాప్తీస్మము ద్వారా వారు నిబంధన మార్గమును2 ప్రవేశించినప్పుడు మనము నడిపింపును మరియు సహకారమును ఇస్తున్నాము. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులగుటకు మనము వారికి బోధిస్తున్నాము. ఆయన పిల్లల కొరకు ఆయన ప్రణాళిక గురించి మనము వారికి నేర్పుతాము, మరియు పరిశుద్ధాత్మ యొక్క గుసగుసలను గుర్తించుటకు వారికి మనము సహాయపడతాము. మనము వారికి ప్రాచీన ప్రవక్తల వృత్తాంతములను చెప్తాము మరియు జీవిస్తున్న వారిని అనుసరించమని ప్రోత్సహిస్తాము. మనము వారి విజయాల కొరకు ప్రార్థిస్తాము మరియు వారి శ్రమలందు వారితో బాధపడతాము. దేవాలయ దీవెనలను గూర్చి మన పిల్లలకు మనము సాక్ష్యమిస్తాము, మరియు పూర్తి-కాల మిషన్ల సేవ చేయుటకు వారిని సిద్ధపరచుటకు మనము ప్రయాసపడతాము. మన పిల్లలు వారికై వారు తల్లిదండ్రులైనప్పుడు, మనము ప్రేమగల సలహానిస్తాము. కానీ అయినప్పటికిని---మనము ఎన్నటికీ తల్లిదండ్రులుగా ఉండుట మానము. వారి బోధకులుగా ఉండుట ఎప్పటికీ మానము. ఈ నిత్యమైన పిలుపులనుండి మనము ఎప్పటికీ విడుదల చేయబడము.
మన గృహాలలో మన పిల్లలకు బోధించుటకు మనము కలిగియున్న అద్భుతమైన అవకాశాలలో కొన్నిటిని మనము ఈరోజు ధ్యానిద్దాము.
కుటుంబ గృహ సాయంకాల బోధన
కుటుంబ గృహ సాయంకాల బోధనతో మనము ప్రారంభిద్దాము, అది నేను పెంచబడిన విశ్వాసము నిండిన గృహములో ఉన్నతమైన ప్రాధాన్యతగా ఉన్నది. కుటుంబ గృహ సాయంకాల బోధన వద్ద ప్రత్యేక పాఠములను నేను గుర్తుంచుకోలేదు, కానీ మేము ఒక్క వారము మానలేదని నాకు గుర్తున్నది.3 నా తల్లిదండ్రులకు ఏది ముఖ్యమైనదో నేను ఎరుగుదును.4
కుటుంబ గృహ సాయంకాల కార్యక్రమాలలో నాకు ప్రియమైన వాటిలో ఒకటి నేను గుర్తు చేసుకుంటున్నాను. నాన్న తన పిల్లలలో ఒకరిని “పరీక్ష” తీసుకొనుటకు ఆహ్వానించును. “మొదట, వంట గదిలోనికి వెళ్ళి, రిఫ్రిజిరేటరును తెరచి మూసి వేయుము. తరువాత, నా పడక గదిలోనికి పరుగెత్తి వెళ్ళి, నా దుస్తుల వద్దనుండి ఒక సాక్సుల జతను త్వరగా తీసుకో. తరువాత నా దగ్గరకు తిరిగి వచ్చి, మూడుసార్లు పైకి క్రిందకు ఎగిరి గెంతి, “నాన్నా, నేను దానిని చేసాను!’ ” అని చెప్పుము వంటి సూచనల పరంపరను ఆయన బిడ్డకు ఇస్తాడు.
నా వంతు వచ్చినప్పుడు నేను ప్రేమించాను. ప్రతీ అడుగు ఖచ్చితంగా చేయాలని నేను కోరుకున్నాను, మరియు “నాన్నా, నేను దానిని చేసాను!” అని నేను చెప్పినప్పుడు ఆ క్షణమును నేను ఆనందించాను. ఈ ప్రోత్సాహకార్యక్రమము నా విశ్వాసమును నిర్మించుటకు సహాయపడింది మరియు అమ్మ లేక నాన్న ఒక సువార్త సూత్రమును బోధించుటకు ఆసక్తిని చూపుటకు విశ్రాంతి లేని బాలునికి సులభతరం చేసింది.
అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ సలహా ఇచ్చారు: “కుటుంబ గృహ సాయంకాలము గురించి మీకేదైనా అనుమానమున్న యెడల, దానిని ప్రయత్నించుము. మీ పిల్లలను మీ చుట్టూ సమావేశపరచి, వారికి బోధించుము, వారికి సాక్ష్యమియ్యుము, కలిసి లేఖనాలను చదువుము మరియు కలిసి మంచి సమయాన్ని కలిగియుండుము.”5
కుటుంబ గృహ సాయంకాలము జరుపుటకు ఎల్లప్పుడు వ్యతిరేకత ఉండును.6అయినప్పటికిని, అడ్డంకులను అధిగమించి ఒక మార్గమును కనుగొని, కుటుంబ గృహ సాయంకాలమును ఒక ప్రాధాన్యతగా చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను---మరియు సరదాను ఒక ముఖ్యమైన అంశముగా చేయుము.
కుటుంబ ప్రార్థన బోధన
కుటుంబ ప్రార్థన బోధించుటకు మరొక ప్రధాన అవకాశము.
అధ్యక్షులు ఎన్. ఎల్డన్ టాన్నర్ యొక్క తండ్రి కుటుంబ ప్రార్థన సమయమందు ఆయనకు ఎలా బోధించారో నాకు ప్రియమైనది. అధ్యక్షులు టాన్నర్ దీనిని చెప్పారు:
“ఒక సాయంత్రము, మేము కుటుంబ ప్రార్థనలో మోకరించినప్పుడు, మా నాన్న, ప్రభువుతో ఇలా చెప్పుట నాకు గుర్తున్నది, ‘ఈ రోజు ఎల్డన్ తాను చేయకూడని దానిని చేసాడు, అతడు విచారిస్తున్నాడు; మరియు మీరు అతడిని క్షమించిన యెడల, అతడు దానిని ఇక ఎన్నడూ చేయడు.’
“అది నేను ఇక ఎన్నడూ దానిని చేయకుండా తీర్మానించునట్లు నన్ను చేసింది---కఠినంగా దండించుట చేసేదానికంటే అత్యధికమైనది.”7
ఒక బాలునిగా, “కొన్ని నిముషాల క్రితమే కదా ప్రార్థన చేసాము?” అని నేను కొన్నిసార్లు మా అత్యధికముగా కనబడే కుటుంబ ప్రార్థనలను బట్టి విసుగు చెందేవాడిని. ఇప్పుడు, ఒక తండ్రిగా, నేను ఒక కుటుంబముగా నేను ఎప్పటికీ ఎక్కువగా ప్రార్థించలేనని ఎరుగుదును.8
పరలోక తండ్రి యేసు క్రీస్తును తన ప్రియమైన కుమారునిగా ఎలా పరిచయము చేసారో నేను ఆశ్చర్యపడుతున్నాను.9 వారు నాకు ఎంత ప్రియమైన వారో పరలోక తండ్రికి నేను తెలియజేయుటను వారు వినినప్పుడు, పేరు పేరున నా పిల్లల కొరకు ప్రార్థించుటను నేను ఆనందిస్తున్నాను. వారితో ప్రార్థించినప్పుడు లేక వారిని దీవించినప్పుడు మన పిల్లలతో ప్రేమను సంభాషించుట కంటే శ్రేష్టమైన సమయము ఏదీ లేనట్లుగా కనబడుచున్నది. కుటుంబాలు వినయముగల ప్రార్థనయందు సమావేశమైనప్పుడు, శక్తివంతమైన మరియు శాశ్వతమైన పాఠములు బోధింబడతాయి.
బోధించుటకు సిద్ధపడియుండుట
తల్లిదండ్రి బోధన సెలవులో ఉండి, ఫోను రాగానే హాజరయ్యే వైద్యుని వలె ఉన్నది. మన పిల్లలకు బోధించుటకు మనము ఎల్లప్పుడు సిద్ధపడియుండాల్సినవసరమున్నది, ఎందుకనగా, అవకాశము దానికదే ఎప్పుడు వస్తుందో మనకెన్నడు తెలియదు.
మనము రక్షకుని వలే ఉన్నాము, ఆయన బోధన తరచుగా, “సమాజ మందిరాలలో జరగలేదు కాని లాంఛనప్రాయమైన, అనుదిన సందర్భాలలో---తన శిష్యులతో ఒక భోజనము తినుచుండగా, ఒక బావి నుండి నీటిని తోడుచుండగా, లేక అంజూరపు చెట్టును దాటి నడుస్తుండగా.”10
సంవత్సరాల క్రితం, మా అమ్మ మా పెద్ద అన్న మాథ్యూతో తన రెండు శ్రేష్టమైన సువార్త సంభాషణలను పంచుకొన్నది, అవి ఒకసారి, ఆమె దుస్తులను మడత పెట్టినప్పుడు జరిగింది, మరొకసారి, దంత వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు మరొకసారి జరిగింది. మా అమ్మ గురించి నేను మెచ్చుకునే అనేక విషయాలలో ఒకటి, తన పిల్లలకు బోధించుటకు ఆమె సిద్ధపాటు.
ఆమె తల్లిదండ్రి సంబంధిత బోధన ఎన్నడూ ముగించలేదు. నేను బిషప్పుగా సేవ చేస్తున్నప్పుడు, అప్పటికి 78 సంవత్సరాలుగల మా అమ్మ, నేను జుట్టు కత్తిరించుకోవాలని నాకు చెప్పింది. నేను ఒక మాదిరిగా ఉండాల్సినవసరమున్నదని ఆమె ఎరుగును, మరియు ఆవిధంగా చెప్పుటకు ఆమె సందేహించలేదు. అమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!
ఒక తండ్రిగా, నేను నా పిల్లలు లేక మనుమలకు బోధించే అవకాశము కలిగినప్పుడు హాజరైనప్పుడు, నేను స్పందించుటకు బదులుగా వ్యక్తిగతంగా లేఖనాలను అధ్యయనము చేసి, ధ్యానించుటకు నేను ప్రేరేపించబడ్డాను.11 “ఒక (కుటుంబ) సభ్యుని హృదయములో ఒక ప్రశ్న లేక ఆలోచనగా శ్రేష్టమైన బోధనా క్షణాలలో కొన్ని కలుగును.”12 ఆ క్షణములందు మనము వినుచున్నామా? 13
అపోస్తులుడైన పేతురు యొక్క ఆహ్వానమును నేను ప్రేమిస్తున్నాను: “మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివారికిని సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండుడి.” 14
నేను యౌవనునిగా ఉన్నప్పుడు, మా నాన్న, నేను ఎవరికి బలమైన పట్టు ఉన్నదో చూచు సవాలును ఆనందించేవారము. నొప్పితో చిట్లించుకొనునట్లు చేయు ప్రయత్నములో మేము ఒకరినొకరి చేతులను సాధ్యమైనంత గట్టిగా పట్టుకొని నొక్కేవారము. అది ఇప్పుడు అంత సరదాగా కనబడుటలేదు, కానీ ఎదోవిధంగా అ సమయములో అనిపించేది. అటువంటి ఒక పోరాటము తరువాత, నాన్న నా కళ్ళలోకి చూసి, “కుమారుడా, నీకు బలమైన చేతులున్నాయి. నీ చేతులు, ఒక యువతిని అసభ్యకరంగా ఎన్నడూ తాకకుండా ఎల్లప్పుడు బలము కలిగియుంటాయని నేను ఆశిస్తున్నాను.” తరువాత నైతికంగా పవిత్రముగా ఉండమని మరియు ఇతరులు ఆవిధంగా చేయుటకు సహాయపడమని ఆయన నన్ను ఆహ్వానించారు.
ఎల్డర్ డగ్లస్ ఎల్. కాల్లిస్టర్ తన తండ్రి గురించి దీనిని పంచుకున్నారు: “ఒకరోజు పని నుండి ఇంటికి ప్రయాణిస్తూ, నాన్న హఠాత్తుగా చెప్పారు, ‘ఈ రోజు నేను నా దశమభాగము చెల్లించాను. నేను “మీకు ధన్యవాదములు” అని దశమభాగము చెక్కుపై వ్రాసాను. మన కుటుంబమును దీవించినందుకు ప్రభువుకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను.’”
తరువాత ఎల్డర్ కాల్లిస్టర్ తన బోధకుడైన తండ్రికి ఈ నివాళిని అర్పించారు: “ఆయన విధేయతగల క్రియలు మరియు లక్షణాలు రెండింటిని బోధించారు.”15
అప్పుడప్పుడు, మనల్ని మనం ప్రశ్నించుకొనుట తెలివైనదని నేను అనుకుంటున్నాను, “నేనేమి బోధిస్తాను, లేక విధేయతగల నా క్రియలు మరియు లక్షణాల ద్వారా నా పిల్లలకు నేనేమి బోధిస్తున్నాను?”
కుటుంబ లేఖన అధ్యయనము బోధన
కుటుంబ లేఖన అధ్యయనము గృహములో సిద్ధాంతమును బోధించుటకు ఆదర్శమైన వేదికగా ఉండును.
“తల్లిదండ్రులు ప్రభువు యొక్క వాక్యమును పట్టుకొనియుండటమే కాదు కాని వారు తమ పిల్లలకు బోధించాల్సిన దైవిక బాధ్యతను కలిగియున్నారు,”16 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు.
జూలీ మరియు నేను మా పిల్లల్ని పెంచినప్పుడు, మేము ఏకరీతిగా మరియు సృజనాత్మకంగా ఉండటానికి ప్రయత్నించాము. ఒక సంవత్సరము, మేము కుటుంబముగా స్పానిష్‌లో మోర్మన్ గ్రంథమును చదువుటకు నిర్ణయించుకున్నాము. అందుకేనా పూర్తికాల మిషను సేవ చేసిన మా పిల్లలో ప్రతీ ఒక్కరిని ప్రభువు స్పానిష్ మాట్లాడే మిషనుకు పిలిచాడు? సాధ్యము కావచ్చు.
సహోదరుడు బ్రైన్ కె. ఆష్టాన్ తన ఉన్నత పాఠశాల సీనియర్ సంవత్సరమందు తాను, తన తండ్రి కలిసి మోర్మన్ గ్రంథములో ప్రతీ పేజీని కలిసి చదివారని నాతో చెప్పినప్పుడు, నేను లోతుగా తాకబడ్డాను. సహోదరుడు ఆష్టాన్ లేఖనాలను ప్రేమించాడు. అవి అతడి మదిలో, అతడి హృదయముపై వ్రాయబడినవి. సహోదరుడు ఆష్టాన్ యౌవనునిగా ఉన్నప్పుడు, అతడి తండ్రి ఆ విత్తనమును నాటాడు, మరియు ఆ విత్తనము17 సత్యము యొక్క లోతుగా నాటబడిన చెట్టువలే ఎదిగింది. సహోదరుడు ఆష్టాన్ తన పెద్ద పిల్లలతో అదేవిధంగా చేసాడు.18 అతడి ఎనిమిది-సంవత్సరాల కుమారుడు ఇటీవల అతడిని అడిగాడు, “నాన్న, నీతో కలిసి మోర్మన్ గ్రంథమును చదివే అవకాశము నాకు ఎప్పడు వస్తుంది?”
మాదిరిగా బోధించుట
చివరిగా, మన మిక్కిలి ప్రభావవంతమైన బోధన మన మాదిరి. “మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా”19 ఉండుటకు మనము పిలవబడ్డాము.
ఇటీవల ప్రయాణమందు, జూలీ మరియు నేను సంఘానికి హాజరయ్యాము మరియు ఈ వచనమును క్రియయందు చూసాము. త్వరలో తన మిషను కొరకు వెళ్ళబోవుచున్న ఒక యువకుడు, సంస్కార సమావేశములో మాట్లాడాడు.
అతడు అన్నాడు, “సంఘములో మా నాన్న మంచి వ్యక్తి అని మీరందరు అనుకుంటారు . . . కానీ ” అతడు నిదానించాడు, మరియు తరువాత ఏమి చెప్తాడోనని నేను ఆతృతగా ఆశ్చర్యపడ్డాను. అతడు కొనసాగించి, చెప్పాడు, “అతడు ఇంటిలో శ్రేష్టమైన వాడు.”
తన తండ్రికి ప్రేరేపించబడిన నివాళిని అర్పించిన ఈ యువకునికి నేను ధన్యవాదాలు తెలిపాను. తరువాత అతని తండ్రి వార్డు బిషప్పు అని నేను కనుగొన్నాను. ఈ బిషప్పు తన వార్డుకు విశ్వసనీయంగా సేవ చేస్తున్నప్పటికిని, అతడి శ్రేష్టమైన కార్యము ఇంటిలో చేయబడిందని అతడి కుమారుడు భావించాడు. 20
ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ సలహా ఇచ్చారు: “నవతరమునకు . . . బోధించుటకు మనకు అనేక పద్ధతులున్నాయి, మరియు మనము వాటి పూర్తి ప్రయోజనమును తీసుకొనుటకు మన శ్రేష్టమైన ఆలోచనను మరియు ప్రయత్నమును అంకితమివ్వాలి. అన్నటికిపైగా, . . . ప్రత్యేకంగా మాదిరి ద్వారా తల్లిదండ్రులు ఉత్తమంగా, ఏకరీతిగల బోధకులుగా ఉండుటకు ప్రోత్సహించుటను మరియు సహాయపడుటను కొనసాగించాలి.”21
ఆవిధంగా రక్షకుడు బోధించును.22
గత సంవత్సరము, మా ఇద్దరు చిన్న పిల్లలతో జరిగిన సెలవులందు, సె. జార్జ్, మరియు సాన్‌డియాగో దేవాలయాలు రెండిటిలో ప్రతినిధిగల బాప్తీస్మములు చెయ్యాలని జూలీ సూచించింది. “మేము ఇంటి వద్ద దేవాలయానికి హాజరవుతాము, మరియు ఇప్పడు సెలవుపై ఉన్నాము,” ఆలోచిస్తూ—నాలోనేను—సణిగాను. సెలవు దినము వంటిది ఏదైనా మనము ఎందుకు చేయలేము? బాప్తీస్మములు తరువాత, దేవాలయము వెలుపల ఫోటోలు తీసుకోవాలని జూలీ కోరింది. నేను---మరలా మౌనంగా సణిగాను. తరువాత జరిగింది మీరూహించవచ్చు---మేము ఫోటోలు తీసుకొన్నాము.
మా పూర్వీకులకు మేము ఎలా సహాయపడ్డామో జ్ఞాపకాలను మా పిల్లలు కలిగియుండాలని జూలీ కోరుకొన్నది, మరియు నేను కూడా. దేవాలయముల ప్రాముఖ్యతను గూర్చి పద్ధతి ప్రకారమైన పాఠము మాకవసరములేదు. మేము దానిని జీవిస్తున్నాము---దేవాలయమును ప్రేమించి, ఆ ప్రేమను తన పిల్లలు పంచుకోవాలని కోరుకునే తల్లికి కృతజ్ఞతలు.
తల్లిదండ్రులు ఒకరినొకరు ఆనందించి, నీతిగల మాదిరులను ఇచ్చినప్పుడు, పిల్లలు నిత్యముగా దీవించబడతారు.
ముగింపు
మీ గృహాలలో బోధించుటకు మీ శాయశక్తులా చేయుటకు ప్రయాసపడు మీ అందరికీ, మీ ప్రయత్నములందు మీరు సమాధానమును మరియు ఆనందమును కనుగొందురు గాక. మెరుగుదలకు ఖాళీ ఉన్నదని, లేక గొప్ప సిద్ధపాటు అవసరమని మీరు భావించిన యెడల, ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా దయచేసి వినయముగా స్పందించుము మరియు చేయుటకు మిమ్మల్ని బద్ధులుగా చేసుకొనుము.23
ఎల్డర్ ఎల్. టామ్ పెర్రీ చెప్పారు, “ఏ సమాజము యొక్క ఆరోగ్యము, దాని జనుల యొక్క సంతోషము, వారి అభివృద్ధి మరియు వారి సమాధానము అంతయు, గృహములో పిల్లలకు బోధించుటలో సాధారణ మూలాలను కనుగొనును.”24
అవును, ఇప్పుడు మా ఇల్లు ఖాళీగా ఉన్నది, కానీ నేనింకను నా ఎదిగిన పిల్లలు, వారి పిల్లలు, మరియు ఏదోఒకరోజు, వారి పిల్లలకు బోధించు అదనపు ప్రశస్తమైన అవకాశములను కనుగొనుటకు సిద్ధపడి, ఆతృతగా ఉన్నాను.
మన గృహాలలో క్రీస్తువంటి బోధకులుగా ఉండుటకు మనము ప్రయాసపడినప్పుడు పరలోకము యొక్క సహాయము కొరకు నేను వేడుకుంటున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.