సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు
రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గదర్శకత్వము, ఆదరణ మరియు స్థిరమైన ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యముకాదు.
సర్వసభ్య సమావేశపు ఆదివారమున మీతో ఈస్టరు జరుపుకొనుట ఎటువంటి మహిమకరమైన విశేషావకాశముగా ఉన్నది! ఈ భూమి మీద ఎప్పటికి నడిచిన అత్యంత ముఖ్యమైన వ్యక్తిని ఆరాధించుట ద్వారా ఈ భూమి మీద ఎప్పటికీ జరిగిన అతి ముఖ్యమైన ఘటనను జరుపుకొనుటకంటే మరింత యుక్తమైనది ఏదీ లేదు. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో, గెత్సేమనే వనములో తన అంతములేని ప్రాయశ్చిత్తఃమును ప్రారంభించిన ఆయనను మనము ఆరాధిస్తాము. మనలో ప్రతీ ఒక్కరి యొక్క పాపములు మరియు బలహీనతల కొరకు బాధపడుటకు ఆయన సమ్మతించాడు, ఆ బాధ ఆయన “ప్రతీ రంధ్రము నుండి రక్తము చిందించునట్లు”1 చేసెను. ఆయన కల్వరి సిలువపై సిలువ వేయబడ్డాడు1 మరియు మన పరలోక తండ్రి యొక్క పిల్లలలో పునరుత్థానము చెందిన ప్రధమునిగా మూడవ దినమున లేచాడు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను మరియు ఆయన జీవిస్తున్నాడని సాక్ష్యమిస్తున్నాను! ఆయనే ఈ సంఘమును నడిపిస్తున్నాడు మరియు దారిచూపును.
మన విమోచకుని యొక్క అంతములేని ప్రాయశ్చిత్తఃమును లేకుండా, మనలో ఏ ఒక్కరు మన పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే నిరీక్షణను కలిగియుండము. పునరుత్థానము లేకుండా, మరణము ముగింపు అగును. మన రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తఃము అందరికి నిత్య జీవమును సాధ్యముగా మరియు అమర్త్యత్వము ఒక వాస్తవముగా చేసింది.
ఆయన అద్భుతమైన మిషను మరియు ఆయన అనుచరులకు ఆయన దయచేయు సమాధానము వలన, నా భార్య వెండీ, మరియు నేను 2018, జనవరి 2న, మధ్యరాత్రి అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ తెరను దాటి వెళ్ళారని మాకు తెలియజేసే ఫోను పిలుపు చేత లేపబడినప్పుడు ఆదరణ పొందాము.
అధ్యక్షులు మాన్సన్‌ను మేము ఎంతగా గుర్తు చేసుకుంటున్నాము! ఆయన జీవితమును మరియు ఆయన వారసత్వమును మేము గౌరవించుచున్నాము. ఒక ఆత్మీయ దిగ్గజుడు, ఆయనను ఎరిగిన వారందరిపై మరియు ఆయన ప్రేమించిన సంఘముపై ఆయన చెరగని ముద్రణ వేసారు.
2018, జనవరి 14 ఆదివారమున, సాల్ట్‌లేక్ దేవాలయము పైన గదిలో, సాధారణమైనది కానీ ప్రభువు చేత ఏర్పరచబడిన పరిశుద్ధ మాదిరియందు ప్రథమ అధ్యక్షత్వము పునర్వ్యవస్థీకరించబడింది. తరువాత నిన్న ఉదయము జరిగిన గంభీరమైన సమావేశములో, ప్రపంచమంతటా సంఘ సభ్యులు అపొస్తులుల చేత తీసుకొనబడిన ముందు చర్యను నిర్ధారించుటకు వారి చేతులను పైకెత్తారు. మీ ఆమోదించు సహకారము కొరకు నేను సవినయంగా కృతజ్ఞత తెలుపుచున్నాను.
నాకు ముందుగా వచ్చిన వారికి కూడా నేను కృతజ్ఞుడను. పన్నెండుమంది అపొస్తులుల కోరములో 34 సంవత్సరాలుగా సేవ చేయుట నా విశేషావకాశము మరియు గత 16 మంది సంఘ అధ్యక్షులలో 10 మందిని నేను వ్యక్తిగతంగా ఎరుగుదును. నేను వారిలో ప్రతిఒక్కరి నుండి ఎక్కువగా నేర్చుకున్నాను.
నేను పూర్వీకులకు కూడ ఎక్కువగా ఋణపడియున్నాను. నా ఎనిమిదిమంది ముత్తాతలు కూడ ఐరోపాలోని సంఘమునకు మార్పు చెందారు. ఈ ప్రముఖ ఆత్మలు సీయోనుకు వచ్చుటకు సమస్తమును త్యాగము చేసారు. తరువాతి తరముల కాలమందు, అయినప్పటికిని, నా పూర్వీకులందరు అంతగా ఒడంబడిక చేసుకొనిలేరు. ఫలితంగా, నేను సువార్త-కేంద్రీకరించబడిన ఇంటిలో పెంచబడలేదు.
నేను నా తల్లిదండ్రులను పూజ్యభావంతో చూసాను. వారే నాకు ప్రపంచము మరియు నాకు ముఖ్యమైన పాఠములను నేర్పారు. నా కోసం మరియు నా తోబుట్టువుల కోసం వారు కల్పించిన సంతోషకరమైన గృహ జీవితము కొరకు తగినంతగా కృతజ్ఞతను తెలుపలేను. మరియు అయినప్పటికిని, ఒక బాలునిగా నేను ఎదో కోల్పోయానని ఎరుగుదును. సంఘము గురించి తెలుసుకొనుటకు, ఒకరోజు నేను ట్రాలీ కారులోకి గెంతి, ఎల్డిఎస్ పుస్తకాల షాపుకు వెళ్లాను. సువార్తను గురించి నేర్చుకొనుటను నేను ప్రేమించాను.
నేను బుద్ధి వాక్యమును గ్రహించినప్పుడు, నా తల్లిదండ్రులు ఆ చట్టమును జీవించాలని నేను కోరాను. అందుచేత, ఒకరోజు నేను చాలా చిన్నవానిగా ఉన్నప్పుడు, నేను క్రింద గదికి వెళ్లాను మరియు ప్రతీ మద్యము సీసాలను కాంక్రీటు నేలపై పగలగొట్టాను. మా నాన్న నన్ను శిక్షిస్తారని నేను ఎదరుచూసాను, కానీ ఆయన ఎప్పుడూ ఒక మాట కూడ చెప్పలేదు.
నేను పరిపక్వత చెంది పరలోక తండ్రి యొక్క దివ్యతను గ్రహించసాగినప్పుడు, “నాకు మరొక క్రిస్టమస్ బహుమతి వద్దు! నేను కేవలము నా తల్లిదండ్రులతో బంధింపబడాలని కోరుతున్నాను,” అని తరచుగా నాకై నేను చెప్పుకున్నాను. ఆ సంఘటన కొరకు ఎదురుచూచుట నా తల్లిదండ్రులు 80 దాటే వరకు సంభవించలేదు, తరువాత అది జరిగింది. ఆ రోజు నేను అనుభవించిన ఆనందమును నేను పూర్తిగా వ్యక్తపరచలేను3 ప్రతీరోజు నేను వారు బంధింపబడుట మరియు నేను వారితో బంధింపబడిన ఆనందమును అనుభూతిచెందాను.
1945లో, నేను వైద్య కళాశాలలో ఉన్నప్పుడు, సాల్ట్‌లేక్ దేవాలయములో నేను డాంట్జల్ను వివాహము చేసుకున్నాను. ఆమె, నేను తొమ్మదిమంది అద్భుతమైన కుమార్తెలు మరియు ఒక ప్రశస్తమైన కుమారునితో దీవించబడ్డాము. ఈరోజు ఎప్పటికీ ఎదుగుచున్న కుటుంబము నా జీవితములో మిక్కిలి గొప్ప సంతోషాలలో ఒకటి.
2005లో, దాదాపు 60 సంవత్సరాల వివాహము తరువాత, నా ప్రియమైన డాంట్జల్ను ఊహించని రీతిలో ఇంటికి పిలవబడింది. కొంత కాలము, నా వేదన దాదాపు కదలకుండా చేసింది. కానీ ఈస్టరు సందేశము మరియు పునరుత్థానము యొక్క వాగ్ధానము నన్ను బలపరచింది.
తరువాత ప్రభువు వెండీ వాట్సన్ నా ప్రక్కకు తెచ్చాడు. మేము 2006, ఏప్రిల్ 6న, సాల్ట్‌లేక్ దేవాలయములో బంధింపబడ్డాము. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నాను! ఆమె ఒక అసాధారణమైన స్త్రీ---నాకు, మా కుటుంబమునకు, మరియు మొత్తము సంఘానికి ఒక గొప్ప దీవెన.
ఈ దీవెలలో ప్రతీఒక్కటి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను వెదకి మరియు లక్ష్యముంచుట ఫలితంగా కలిగినవి. అధ్యక్షులు లోరెంజో చెప్పారు, “మన జీవితాలలో ప్రతీరోజు ఆత్మ యొక్క బయల్పాటును కలిగియుండుట మన హక్కుగా కలిగియుండుట . . . ప్రతీ కడవరి దిన పరిశుద్ధునికి ఇది గొప్ప విశేషావకాశము.”4
సంఘ అధ్యక్షునిగా నా క్రొత్త పిలుపు వచ్చినప్పటినుండి ఆత్మ నామనస్సులో పలుమార్లు ముద్రవేసిన విషయాలలో ఒకటి ప్రభువు తన మనస్సును మరియు చిత్తమును బయల్పరచుటకు ఎంత సమ్మతిగా ఉన్నాడు. బయల్పాటును పొందే విశేషావకాశము తన పిల్లలకు దేవుడిచ్చిన గొప్ప వరములలో ఒకటి.
పరిశుద్ధాత్మ యొక్క బయల్పాటులు ద్వారా, ప్రభువు మన నీతిగల ప్రయత్నాలన్నిటిలో మనకు సహాయపడును. శస్త్ర చికిత్స చేసే గదిలో, అపూర్వమైన విధానమును ఎలా నెరవెర్చాలో అనిశ్చయముతో నేను ఒక రోగి ప్రక్కన నిలబడ్డాను---మరియు నా మనస్సులో పరిశుద్ధాత్మ సాంకేతిక పరిజ్ఞానమును రేఖాచిత్రము వేయుటను నేను భావించుట నాకు జ్ఞాపకమున్నది.5
వెండీకి నా ప్రస్తావనను బలపరచుటకు, నేనామెతో ఇలా చెప్పాను, “నాకు బయల్పాటు తెలుసు మరియు దానిని ఎలా పొందాలో తెలుసు.” ఆమె విలక్షణమైనదని నేను తెలుసుకున్నట్లుగా--- ఆమె గొప్పతనమునకు ఆమె ఇదివరకే మా గురించి స్వంత బయల్పాటును వెదికింది మరియు పొందినది, అది అవునని, చెప్పుటకు ఆమెకు ధైర్యమునిచ్చింది.
పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క సభ్యునిగా, నేను బయల్పాటు కొరకు ప్రతీరోజు ప్రార్థన చేసాను, నా హృదయము మరియు మనస్సుతో ఆయన మాట్లాడిన ప్రతీసారి ప్రభువుకు కృతజ్ఞత తెలిపాను.
దాని యొక్క అద్భుతమును ఊహించుము! మన సంఘ పిలుపు ఏదైనప్పటికిని, మనము మన పరలోక తండ్రికి ప్రార్థించగలము మరియు నడిపింపును, గమ్యమును పొందగలము, అపాయములు మరియు అంతరాయములను గూర్చి హెచ్చరించబడతాము, మరియు మన స్వంతముగా చేయలేని విషయాలను నెరవేర్చుటను సాధ్యపరచును. మనము నిజముగా పరిశుద్ధాత్మను పొంది, ఆయన ప్రేరేపణలను విచారించి, గ్రహించుటను నేర్చుకుంటాము, విస్తారమైన మరియు స్వల్పమైన విషయాలందు మనము నడిపించబడతాము.
ఇటీవల ఇద్దరు సలహాదారులను ఎంపిక చేసే భయపెట్టే కార్యమును ఎదుర్కొన్నప్పుడు, నేను ప్రేమించి మరియు గౌరవించు పన్నెండుమంది నుండి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేయుట నాకు ఎలా సాధ్యమని నేను ఆశ్చర్యపడ్డాను.
మంచి ప్రేరేపణ మంచి సమాచారముపై ఆధారపడియున్నదని నేనెరుగుదును కనుక, నేను ప్రార్థనాపూర్వకంగా అపొస్తులులు ప్రతీ ఒక్కొక్కరితో కలుసుకొన్నాను.6 నేను దేవాలయములో ఒంటరిగా ఏకాంతమైన గదిలోని వెళ్ళి ప్రభువు యొక్క చిత్తమును వెదికాను. ప్రథమ అధ్యక్షత్వములో నా సలహాదారులుగా సేవ చేయుటకు, అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ మరియు అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్లను ఎంపిక చేయమని ప్రభువు నాకు సూచించాడని నేను సాక్ష్యమిస్తున్నాను.
అదేవిధంగా ఎల్డర్ గెర్రిట్ డబ్ల్యు. గాంగ్ మరియు ఎల్డర్ యులిసెస్ సోరెస్ తన అపొస్తులులుగా ఉండుటకు పిలుపును ప్రభువు ప్రేరేపించాడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సహోదరత్వము యొక్క సేవకు మేము, నేను వారిని స్వాగతించుచున్నాను.
ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క సలహాసభగా మేము సమావేశమైనప్పుడు, మా సమావేశ గదులు, బయల్పాటు గదులుగా మారతాయి. ఆత్మ స్పష్టముగా హాజరగును. చిక్కైన విషయాలతో మేము పెనుగులాడినప్పుడు, ప్రతీ అపొస్తులులు తన ఆలోచనలు మరియు ఆలోచనా విధానమును స్వేచ్ఛగా వ్యక్తపరచినప్పుడు, మా మొదటి దృష్టికోణములు భిన్నంగా ఉన్నప్పటికినీ, మేము ఒకరినొకరి కొరకు భావించే ప్రేమ స్థిరముగా ఉన్నది. మా ఐకమత్యము, తన సంఘము కొరకు ప్రభువు యొక్క చిత్తమును విచారించుటకు మాకు సహాయపడును.
మా సమావేశములలో, సగానికి పైగా సమ్మతి ఉన్న ప్రత్యమ్నాయాన్ని ఎంచుకోవటం ద్వారా ఒక నిర్ణయము తీసుకోవటానికి ఒక మార్గము సూచించును. మేము ఒకరినొకరము ప్రార్థనాపూర్వకంగా వింటాము మరియు మేము ఏకమయ్యే వరకు ఒకరితోనొకరు మాట్లాడతాము. తరువాత మేము పూర్తిగా అంగీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యపరచు ప్రభావము ఉత్సాహాన్ని కలిగించును! “మాకు ఏకమైన భావన కలిగినప్పుడు మేము దేవునితో శక్తిని పొందుతాము”7 అని బోధించినప్పుడు ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఎరిగిన దానిని మేము అనుభవించాము. ప్రథమ అధ్యక్షత్వము లేక పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క సభ్యులెవరూ ప్రభువు యొక్క సంఘము కొరకు నిర్ణయాలను ప్రభువును అడగకుండా ఎన్నడూ చేయరు!
సహోదర, సహోదరిలారా, క్రీస్తు వంటి సేవకులైన---పురుషులు మరియు స్త్రీలుగా మనము ఎలా కాగలము? మనల్ని కలవరపరచే ప్రశ్నలకు మనము జవాబులను ఎలా కనుగొనగలము? పరిశుద్ధ వనములో జోసెఫ్ స్మిత్ యొక్క పరలోకపు అనుభవము మనకు ఏదైన నేర్పిన యెడల, అది పరలోకము తెరవబడినది మరియు దేవుడు తన పిల్లలతో మాట్లాడారని.
మన ప్రశ్నలను పరిష్కరించుటలో అనుసరించుటకు మనకు ఒక మాదిరిని జోసెఫ్ స్మిత్ ఉంచాడు. యాకోబు యొక్క వాగ్దానమునకు ఆకర్షించబడి, మనము జ్ఞానము కొదువుగా ఉన్నయెడల దేవుని అడగవచ్చని, 8 బాలుడైన జోసెఫ్ తన ప్రశ్నను నేరుగా పరలోక తండ్రి వద్దకు తీసుకెళ్లాడు. అతడు వ్యక్తిగత బయల్పాటును వెదికాడు, మరియు అతడు వెదకుట ఈ కడవరి యుగమును తెరచింది.
అదేవిధంగా, మీరు వెదకుచున్నది దేనిని మీకు తెరచును? మీరేమి జ్ఞానము కొదువుగా ఉన్నారు? మీరు దేనిని హఠాత్తుగా తెలుసుకోవాలని లేక గ్రహించాలని భావిస్తున్నారు? ప్రవక్త జోసెఫ్ యొక్క మాదిరిని అనుసరించుము. మీరు క్రమముగా వెళ్ళు ప్రశాంతమైన ప్రదేశాన్ని వెదకుము. దేవుని యెదుట తగ్గించుకొనుము. మీ హృదయమును మీ పరలోక తండ్రికి క్రుమ్మరించుము. జవాబుల కొరకు మరియు ఆదరణ కొరకు ఆయన వైపు తిరుగుము.
మీ ఆలోచనలు, మీ భయాలు, మీ బలహీనతలు---అవును, మీ హృదయపు ఆపేక్షలను గురించి యేసు క్రీస్తు నామములో ప్రార్థించుము. తరువాత ఆలకించుము మీ మనస్సులోనికి వచ్చు ఆలోచనలను వ్రాయుము. మీ ఆలోచనలను వ్రాసియుంచుము మరియు మీరు చేయాలని ప్రేరేపించబడిన చర్యల ద్వారా అనుసరించుము. ఈ ప్రక్రియను మీరు పలుమార్లు చేసినప్పుడు, దినదినము, నెలనెలా, సంవత్సర సంవత్సరము, మీరు “బయల్పాటు యొక్క సూత్రములోనికి ఎదుగుతారు.”9
దేవుడు మీతో నిజముగా మాట్లాడాలని కోరుతున్నాడా? అవును! “ఒక మనుష్యుడు కడవరి దిన పరిశుద్ధుల తలలపై పరలోకము నుండి జ్ఞానమును క్రుమ్మరించుట నుండి దేవుని ఆపగలుగుటకు ప్రయత్నించుట కంటే . . .ప్రవహించే మిస్సోరి నదిని ఆపుటకు తన దుర్భలమైన చేతిని చాపుటకు ప్రయత్నించవచ్చు.”10
ఏది సత్యమని మీరు ఆశ్చర్యపడనవసరము లేదు.11 మీరు ఎవరిని సురక్షితముగా నమ్మవచ్చో మీరు సందేహించనవసరము లేదు. వ్యక్తిగత బయల్పాటు ద్వారా, మీరు మోర్మన్ గ్రంథము దేవుని యొక్క వాక్యమని, జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త, మరియు ఇది ప్రభువు యొక్క సంఘమని మీ స్వంత సాక్ష్యమును మీరు పొందగలరు. ఇతరులు చెప్పే దానిని లేక చేసేదానిని లక్ష్యపెట్టకుండా, సత్యమైన దానిగురించి మీ హృదయానికి చెప్పబడిన సాక్ష్యమును ఎవరూ తీసివేయలేరు.
వ్యక్తిగత బయల్పాటును పొందుటకు మీ ప్రస్తుతపు ఆత్మీయ సామర్ధ్యమును వృద్ధి చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఏలయనగా, ప్రభువు ఇలా వాగ్దానమిచ్చాడు, “మీరు అడిగిన యెడల, మీరు బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును పొందుతారు, ఆవిధంగా మీరు సంతోషమును తెచ్చు వాటిని, నిత్య జీవమును తెచ్చు----మర్మములు మరియు సమాధానకరమైన విషయాలు తెలుసుకుంటారు.”12
ఓహ్, మీ పరలోకమందున్న తండ్రి మీరు తెలుసుకోవాలని కోరుకునేది చాలా అధికమున్నది. ఎల్డర్ నీల్ ఎ. మాక్సవెల్ బోధించినట్లుగా, “చూచుటకు కన్నులు గలవాడు, వినుటకు చెవులు గల వారికి, తండ్రి మరియు కుమారుడు విశ్వము యొక్క రహస్యములను ఇచ్చివేస్తున్నాడని స్పష్టముగా ఉన్నది!”13
హెచ్చించబడిన పరిశుద్ధత, ఖచ్చితమైన విధేయత, మనఃపూర్వకంగా వెదకుట, మోర్మన్ గ్రంథములో క్రీస్తు యొక్క మాటలను ప్రతీరోజు విందారగించుట14వీటి కలయక, దేవాలయమునకు మరియు కుటుంబ చరిత్ర కార్యమునకు తరచుగా సమయమును ఇచ్చుట వంటి వాటికంటే పరలోకమును ఏదీ తెరవదు.
నిశ్చయపరచుటకు, పరలోకములు మూయబడినట్లుగా మీరు భావించిన సమయాలున్నాయి. కానీ మీరు విధేయులుగా ఉండుట కొనసాగించినప్పుడు, ప్రభువు మీకిచ్చిన ప్రతీ దీవెన కొరకు కృతజ్ఞతను వ్యక్తపరచుట, మరియు ప్రభువు యొక్క కాలపట్టికను మీరు ఓపికగా గౌరవించినప్పుడు, మీరు వెదకు జ్ఞానమును మరియు అవగాహన ఇవ్వబడతారని నేను మీకు వాగ్దానమిస్తున్నాను. మీకోసం ప్రభువు కలిగియున్న ప్రతీ దీవెన---అద్భుతాలు కూడ---అనుసరిస్తాయి. వ్యక్తిగత బయల్పాటును పొందుట అద్భుతాలను మరియు దీవెనలను తెచ్చును.
భవిష్యత్ గురించి నేను ఆశాజనకంగా ఉన్నాను. అది అభివృద్ధి చెందుటకు, సహాయపడుటకు, మరియు భూమి మీద ప్రతీ మూలకు సువార్తను తీసుకొనివెళ్ళుటకు, మనలో ప్రతిఒక్కరి కొరకు అవకాశాలతో నిండియున్నది. కానీ ముందున్న రోజులను గూర్చి నేను తెలియచేయబడ్డానని కూడ నేనెరుగుదును. మనము చిక్కైన మరియు వివాదములు ఎక్కువగుచున్న ప్రపంచములో జీవిస్తున్నాము. సామాజిక మీడియా నిరంతరము లభ్యమగుట మరియు 24 గంటలు వార్తల చక్రము నిర్దాక్షిణ్యమైన సందేశాలతో మనల్ని ముట్టడి చేయుచున్నవి. సత్యమును ముట్టడి చేయు అనేక అభిప్రాయములు మరియు మనుష్యుల తత్వముల మధ్య ఏది విలువైనది లేక ఉపయోగకరమైనదో జాగ్రత్తగా పరిశీలించుటకు మనము ఆశించిన యెడల, మనము బయల్పాటును పొందటం నేర్చుకోవాలి.
మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు, ఇప్పుడు మరియు ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు, తన బలమైన కార్యములలో కొన్నిటిని నెరవేర్చును. తండ్రియైన దేవుడు మరియు ఆయన ప్రియమైన కుమారుడు యేసు క్రీస్తు, ప్రభావము మరియు మహిమయందు ఈ సంఘముపై అధ్యక్షత్వము వహిస్తారనే అద్భుతమైన సూచనలను మనము చూస్తాము. కానీ రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గదర్శకత్వము, ఆదరణ మరియు స్థిరమైన ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యముకాదు.
నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, బయల్పాటును పొందుటకు మీ ఆత్మీయ సామర్ధ్యమును హెచ్చించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ ఈస్టరు ఆదివారము మీ జీవితంలో ఒక నిర్దేశించు క్షణముగా ఉండనియ్యుము. పరిశుద్ధాత్మ యొక్క వరమును ఆనందించుటకు మరియు ఆత్మ యొక్క స్వరమును ఎక్కువ తరచుగా, ఎక్కువ స్పష్టముగా వినుటకు అవసరమైన ఆత్మీయమైన కార్యము చేయుటకు ఎంపిక చేయుము.
మీ జీవితమును మార్చే, మరియు మార్చగల పరిశుద్ధాత్మ యొక్క వరముతో ప్రారంభిస్తూ “క్రీస్తునొద్దకు రమ్ము, మరియు ప్రతి మంచి బహుమానమును పట్టుకొనవలెనని” 15 మొరోనైతోపాటు, నేను ఈ ఈస్టరు సబ్బాతు దినమును మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను.
మనము యేసు క్రీస్తు యొక్క అనుచరులము. పరిశుద్ధాత్మ మీకు ఎప్పటికీ సాక్ష్యమిచ్చే అతి ముఖ్యమైన సాక్ష్యము యేసేక్రీస్తని, జీవిస్తున్న దేవుని కుమారుడని. ఆయన జీవిస్తున్నాడు! ఆయన తండ్రితో మన న్యాయవాది, మన మార్గదర్శి, మరియు మన విమోచకుడు. ఈ ఈస్టరు ఆదివారమున, మనము ఆయన ప్రాయశ్చిత్తః త్యాగమును, యధాతదమైన పునరుత్థానమును, మరియు ఆయన దైవత్యమును జరుపుకుంటున్నాము.
ఇది ఆయన సంఘము, ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడింది. మీలో ప్రతిఒక్కరి కొరకు నా ప్రేమను వ్యక్తీకరిస్తూ, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.