2010–2019
యాజకత్వము యొక్క శక్తులు
ఏప్రిల్ 2018


2:3

యాజకత్వము యొక్క శక్తులు

మీ కుటుంబాలందు మరియు మీ సంఘ పిలుపులందు మీరు కలిగియున్న పరిశుద్ధ యాజకత్వమును ఘనపరచుట ప్రభువు యొక్క కార్యమునకు ముఖ్యమైనది.

నా ప్రియమైన సహోదరిలారా, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి బయల్పరచబడిన ప్రకటనను మనము విన్నాము. ఎల్డర్లు క్రిస్టాఫర్సన్ మరియు రాస్‌బాండ్‌ల చేత మరియు అధ్యక్షులు ఐరింగ్ చేత ముఖ్యమైన విపులీకరణలను మనము విన్నాము. అధ్యక్షులు నెల్సన్ నుండి కలిపి ఇంకా చెప్పబడేది, ప్రభువు యొక్క నాయకులు మరియు యాజకత్వముగల మీరు, ఇప్పుడు మీ బాధ్యతలందు చేసేదానిని విశదీకరించును. దానితో సహాయపడుటకు, మీరు కలిగియున్న యాజకత్వమును పరిపాలించు ప్రధాన సూత్రాలలో కొన్నిటిని నేను పునర్వీక్షిస్తాను.

I. యాజకత్వము

మెల్కీసెదకు యాజకత్వము దేవుని యొక్క దైవిక అధికారము, ఆయన కార్యమైన “మనుష్యుని యొక్క నిత్య జీవమును . . . తెచ్చుట” (Moses 1:39), నెరవేర్చుటకు అప్పగించబడినది. 1829లో, అది రక్షకుని యొక్క అపోస్తులురైన పేతురు, యాకోబు, మరియు యోహానుల చేత జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు ఇవ్వబడింది (సి మరియు ని 27:12 చూడుము). వర్ణించుటకు మన శక్తిని మించి అది పరిశుద్ధమైనది మరియు శక్తివంతమైనది.

యాజకత్వము యొక్క తాళపు చెవులు, యాజకత్వపు అధికారమును సాధనను నడిపించుటకు శక్తులు. కాబట్టి, అపోస్తులులు మెల్కీసెదకు యాజకత్వమును జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు దయచేసినప్పుడు, వారు దానిని ఉపయోగించుటను నడిపించు తాళపు చెవులను కూడా వారికిచ్చారు ( సి & ని 27:12–13 చూడుము.) కాని ఆ సమయమందు అన్ని యాజకత్వ తాళపు చెవులు ఇవ్వబడలేదు. ఈ “సంపూర్ణ కాలముల యుగము” ( సి & ని 128:18) కొరకు అవసరమైన మొత్తము తాళపు చెవులు మరియు జ్ఞానము “వరస వెంబడి వరస” ఇవ్వబడినవి (21 వచనము). ఏడు సంవత్సరాల తరువాత అదనపు తాళపు చెవులు కర్టలాండ్ దేవాలయములో ఇవ్వబడినవి (సి & ని 110:11 చూడుము). ఆ సమయమందు ఇవ్వబడిన మృతుల కొరకు బాప్తీస్మము వంటి, అదనపు పనులందు యాజకత్వమును నడిపించుటలో ఆ తాళపు చెవులు ఇవ్వబడినవి.

మెల్కీసెదకు యాజకత్వము ఒక హోదా లేక ముద్ర కాదు. ఆయన పిల్లల కొరకు దేవుని యొక్క ప్రయోజనము కొరకు ఉపయోగించుటకు యోగ్యతగల పురుషుల స్వాధీనములో ఉంచబడిన దైవిక శక్తి. యాజకత్వము కలిగియుండు పురుషులు “యాజకత్వము” కాదని మనము ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోవాలి. “యాజకత్వము మరియు స్త్రీలు” అని సూచించుట సరైనది కాదు. మనము “యాజకత్వము గలవారు మరియు స్త్రీలు” అని సూచించాలి.

II. సేవ యొక్క పరిచర్య

ఆయన వద్దకు ఆత్మలను మనము ఎలా తీసుకుని రావాలో ---ఆయన యాజకత్వము గల వారినుండి ప్రభువైన యేసు క్రీస్తు దేనిని ఆశిస్తాడో మనము ఇప్పుడు పరిశీలిద్దాము.

అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ బోధించారు: “సంఘము పరిపూర్ణంగా ఏర్పాటు చేయబడిందని నిజముగా చెప్పబడింది. ఏకైక ఇబ్బంది ఎమిటంటే, ఈ నిర్మాణములు వాటిపై ఉంచబడిన బాధ్యతను పూర్తిగా గ్రహించలేదు. అవి చేయబడిన అక్కరలను సమగ్రంగా ఎరిగినప్పుడు, అవి మరింత విశ్వసనీయంగా వాటి బాధ్యతలను నెరవేర్చును, మరియు ప్రభువు యొక్క కార్యము ఎక్కువ బలముగా, శక్తివంతముగా మరియు లోకములో ప్రభావవంతముగా ఉండును.”1

అధ్యక్షులు స్మిత్ ఇలా కూడా హెచ్చరించారు:

“పరిశుద్ధ యాజకత్వము యొక్క క్రమములు మరియు అనేక కార్యాలయాలకు సంబంధించి . . . దేవుడు ఇచ్చిన ఘనత యొక్క బిరుదులు, మానవునిచేత పుట్టింపబడిన శీర్షికలుగా ఉపయోగించబడరాదు లేక భావించబడరాదు, అవి అలంకరణ కొరకు కావు లేక ఆధిక్యతను వ్యక్తపరచుటకు కాదు, కాని మేలుగా మనము సేవ చేయుటకు అంగీకరించిన బోధకుని యొక్క కార్యములో వినయముగల సేవకు నియమించబడినవి. …

“… మనము ఆత్మల రక్షణ కొరకు పనిచేయుచున్నాము, మరియు ఇది మనపై అప్పగించబడిన మిక్కిలి గొప్ప బాధ్యత. కాబట్టి, దేవుని యొక్క ప్రేమ, మనుష్యుల రక్షణ, మరియు భూమిమీద దేవుని రాజ్యము యొక్క విజయము కొరకు, అవసరమైతే సమస్తమును త్యాగము చేయుటకు మనము ఇష్టపడుటను భావించాలి.”2

III. యాజకత్వము యొక్క కార్యాలయాలు

ప్రభువు యొక్క సంఘములో, మెల్కీసెదకు యాజకత్వములోని కార్యాలయాలలో అనేక విధులున్నాయి. సిద్ధాంతము మరియు నిబంధనలు, ప్రధాన యాజకులను “అంతటా చెదరియున్న స్టేకులకు అధ్యక్షత్వము వహించు అధ్యక్షులుగా లేక సేవకులుగా” (సి & ని 124:134) సూచించును. అది ఎల్డర్లను “(ప్రభువు యొక్క) సంఘమునకు అధ్యక్షత్వము వహించు పరిచారకులుగా” (సి & ని 124:137) సూచించును. ఈ వేర్వేరు విధులపై ఇతర బోధనలు ఇక్కడున్నవి.

ఒక ప్రధాన యాజకుడు ఆత్మీయ విషయాలను పర్యవేక్షించును మరియు నిర్వహించును (సి & ని 107:10, 12 చూడుము) మరియు అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ బోధించినట్లుగా, “అతడు ఒక ప్రధాన యాజకునిగా నియమించబడినంత వరకు, (అతడు) . . . వృద్ధులు మరియు యౌవనులు అనుకరించుటకు యోగ్యతగల మాదిరిగా ఉండుటకు . . . సూత్రము ద్వారా మాత్రమే కాదు ఎక్కువ ప్రత్యేకంగా మాదిరి ద్వారా---నీతి యొక్క బోధకునిగా ఉండు స్థానములో తనను ఉంచుకొనుటకు---వయస్సు యొక్క అనుభవము వలన ప్రయోజనమును చిన్నవారికిస్తూ, మరియు ఆవిధంగా, అతడు నివసిస్తున్న సమాజము మధ్యలో ఒక శక్తిగా వ్యక్తిగతంగా అగుటకు . . . .తాను బద్ధుడనని భావించాలి.”3

ఎల్డరు యొక్క బాధ్యతలను గూర్చి, పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క ఎల్డర్ బ్రూస్ ఆర్. మెఖాంకీ బోధించాడు: “ఒక ఎల్డరు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిచారకుడు. . . . అతడు . . . తన పొరుగువారికి పరిచర్య చేయుటలో . . . తన బోధకునికి బదులుగా, ఆయన స్థానములో నిలబడుటకు ఆదేశించబడ్డాడు. అతడు ప్రభువు యొక్క ప్రతినిధి.”4

ఎల్డర్ బ్రూస్ ఆర్. మెఖాంకీ ఒకరు “కేవలము ఎల్డరా” అన్న ఆలోచనను విమర్శించారు. “సంఘములోని ప్రతీ ఎల్డరు, సంఘ అధ్యక్షుడు కలిగియున్నంతగా యాజకత్వమును కలిగియున్నాడు … , ” “ఒక ఎల్డర్ అనగా ఏమిటి? అతడు ఒక కాపరి, మంచి కాపరి యొక్క గొఱ్ఱెల దొడ్డిలో సేవ చేస్తున్న ఒక కాపరి.” 5

మంచి కాపరి యొక్క గొఱ్ఱెల దొడ్డిలో పరిచర్య చేయు ఈ ముఖ్యమైన విధిలో, ప్రధాన యాజకుని కార్యాలయాలు మరియు మెల్కీసెదకు యాజకత్వములోని ఎల్డరు మధ్య తేడా ఏమీలేదు. సిద్ధాంతము మరియు నిబంధనలు 107 గొప్ప అధ్యాయములో ప్రభువు ప్రకటించాడు, “ప్రధాన యాజకులు, మెల్కీసెదకు యాజకత్వము యొక్క క్రమము తరువాత ఉండి, ఆత్మీయ విషయాలను నిర్వహించుటలో, మరియు (లేక అహరోను యాజకత్వములోని ఏ కార్యాలయములోనైన) ఒక ఎల్డర్ యొక్క కార్యాలయములో కూడ, అధ్యక్షత్వము యొక్క నడిపింపు క్రింద, వారి స్వంత స్థానములో పర్యవేక్షించుటకు హక్కును కలిగియున్నారు” (సి & ని 107:1012 వచనము కూడా చూడుము)

యాజకత్వముగల వారందరికి అత్యంత ముఖ్యమైన సూత్రము, మోర్మన్ గ్రంథ ప్రవక్త జేకబ్ చేత బోధింపబడిన సూత్రము. అతడు మరియు అతడి సహోదరుడు జోసెఫ్ జనుల యొక్క యాజకులు మరియు బోధకులను అభిషేకించిన తరువాత, అతడు ప్రకటించాడు: “మరియు మేము మా పదవిని ప్రభువునకు ఘనపరచితిమి, మాపై బాధ్యత తీసుకొనుచూ, మేము దేవుని యొక్క వాక్యమును పూర్ణశ్రద్ధతో వారికి బోధించని యెడల జనుల యొక్క పాపములను మా స్వంత శిరస్సులపై వహించుకొనుచున్నాము” (జేకబ్ 1:19).

సహోదరులారా, యాజకత్వముగల వారిగా మన బాధ్యతలు గంభీరమైన విషయాలు. ఇతర సంస్థలు తమ సందేశాలను ఇచ్చినప్పుడు మరియు వారి మిగిలిన విధులను నెరవేర్చుటలో లోకసంబంధమైన ప్రమాణములను నెరవేర్చుటతో తృప్తిపడవచ్చు. కాని దేవుని యాజకత్వమును కలిగియున్న మనము, దైవిక శక్తిని కలిగియున్నాము, అది దేవుని యొక్క సిలెస్టియల్ రాజ్యములోనికి ప్రవేశమును కూడా పరిపాలించును. సిద్ధాంతము మరియు నిబంధనలకు బయల్పరచబడిన పీఠికలో ప్రభువు వివరించిన ఉద్దేశమును మరియు బాధ్యతను మనము కలిగియున్నాము. మనము లోకమునకు ప్రకటించాలి:

“ప్రతీ మనుష్యుడు లోక రక్షకుడును, ప్రభువైన దేవుని నామములో మాట్లాడునట్లు;

“భూమియందు విశ్వాసము వృద్ధి చెందులాగున;

“నా శాశ్వత నిబంధన స్థాపించబడునట్లు ;

“నా సంపూర్ణ సువార్త లోకము అంతము వరకు బలహీనులు మరియు సామాన్యులచేత బోధించబడునట్లు” (సి & ని 1:20--23().

ఈ దైవిక ఆజ్ఞను నెరవేర్చుటకు, మన యాజకత్వ పిలుపులను మరియు బాధ్యతలను “ఘనపరచుట” (సి & ని 84:33 చూడుము) లో మనము విశ్వసనీయంగా ఉండాలి. యాజకత్వమును నెరవేర్చు అనగా ఏమిటో అధ్యక్షులు హెరాల్డ్ బి. లీ వివరించారు: “ఒకరు యాజకత్వముగల వారైనప్పుడు, ప్రభువు యొక్క ప్రతినిధి అవుతాడు. అతడు ప్రభువు యొక్క పనిమీద ఉన్నట్లుగా తన పిలుపులను గూర్చి అతడు ఆలోచించాలి. యాజకత్వమును ఘనపరచుట అనగా అర్ధమదే.”6

కాబట్టి, సహోదరులారా, ఆయన సేవకుల ద్వారా ఆయన చేసినట్లుగా---ప్రభువు కుమారులు లేక కూతుర్లలో ఒకరికి సహాయపడమని ఆయన మిమ్మల్ని అడిగిన యెడల----మీరు దానిని చేయరా? మీరు చేసిన యెడల, ఆయన వాగ్దానము చేయబడిన సహాయముపై ఆధారపడి “ప్రభువు యొక్క పనిమీద ” ఆయన ప్రతినిధిగా, మీరు పని చేయరా?

యాజకత్వమును ఘనపరచుట గురించి అధ్యక్షులు లీ మరొక బోధన కలిగియున్నారు: “మీరు ఒక భూతద్దమును పట్టుకొని ఎదైన వస్తువుపై ఉంచితే, అది ఆ వస్తువును మీ స్వనేత్రాలతో చూసే దానికంటే పెద్దదిగా చూచునట్లు దానిని చేయును; అది భూతద్దము. ఇప్పుడు, . . . ఎవరైన వారి యాజకత్వమును ఘనపరచిన యెడల---అది వారు మొదట అనుకున్న దానికంటే ఎక్కువ పెద్దదిగా దానిని చేయును మరియు ఎవరైనా అనుకున్న దానికన్నా ఎక్కువ ముఖ్యమైనదిగా చేయును—ఆవిధంగానే మీరు మీ యాజకత్వమును ఘనపరుస్తారు.”7

తన యాజకత్వ బాధ్యతను నెరవేర్చు యాజకత్వముగల ఒకరి మాదిరి ఇక్కడున్నది. ఐడహోలో స్టేకు సమావేశములో నా సహవాసిగా ఉన్న ఎల్డర్ జెఫ్రీ డి. ఎరిక్సన్ నుండి నేను దీనిని విన్నాను. వివాహము చేసుకున్న యౌవన ఎల్డరుగా, చాలా నిరుపేదగా ఉండి, మరియు తన కళాశాల చివరి సంవత్సరమును పూర్తి చేయలేనని భావిస్తున్నప్పుడు, వదిలేసి, ఒక ఆకర్షణీయమైన ఉద్యోగాన్ని అంగీకరించుటకు జెఫ్రీ నిర్ణయించాడు. కొన్నిరోజుల తరువాత, అతడి ఎల్డర్ల కోరము అధ్యక్షుడు అతడి ఇంటికి వచ్చాడు. “నేను కలిగియున్న తాళపు చెవుల యొక్క ప్రాముఖ్యతను నీవు గ్రహించావా?” ఎల్డర్ల కోరము అధ్యక్షుడు అడిగాడు. అవునని జెఫ్రీ చెప్పినప్పుడు, కళాశాల మానేయ్యాలనే అతడి ఉద్దేశమును తాను విన్నప్పటినుండి, ఈ సందేశమును జెఫ్రీకి ఇవ్వమని, ప్రభువు తన నిద్రలేని రాత్రులందు బాధించాడని అతడు జెఫ్రీతో చెప్పాడు: “నీ ఎల్డర్ల కోరము అధ్యక్షునిగా, కళాశాల మానవద్దని నేను నీకు సలహా ఇస్తున్నాను. అది ప్రభువు నుండి నీకు ఒక సందేశము.” జెఫ్రీ కళాశాల మానలేదు. కొన్ని సంవత్సరాల తరువాత నేను అతడిని విజయవంతుడైన వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు కలుసుకున్నాను మరియు “ఆ (సలహా) నా జీవితముపై గొప్ప ప్రభావమును కలిగియున్నది” అని యాజకత్వముగల ప్రేక్షకులతో అతడు చెప్పుట నేను విన్నాను.”

యాజకత్వముగల ఒకరు తన యాజకత్వమును మరియు పిలుపును నెరవేర్చారు, మరియు అది దేవుని యొక్క మరొక బిడ్డ జీవితంలో “గొప్ప ప్రభావమును” కలిగియున్నట్లు చేసింది.

IV. కుటుంబములో యాజకత్వము

ఇప్పటి వరకు, నేను సంఘములో యాజకత్వ విధులను గూర్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను కుటుంబములో యాజకత్వము గురించి మాట్లాడతాను. నేను తాళపు చెవులతో ప్రారంభిస్తాను. సూత్రమేదనగా, ఆ విధి కొరకు తాళపు చెవులు గల ఒకరి నడిపింపు క్రింద మాత్రమే ఉపయోగించబడవలసిన ఆ యాజకత్వ అధికారము సంఘములో ప్రధానమైనది, కాని కుటుంబములో యాజకత్వమును ఉపయోగించుటకు అన్వయించదు.8 తన కుటుంబములో యాజకత్వముగల ఒక తండ్రి, తాను కలిగియున్న యాజకత్వముతో తన కుటుంబమునకు అధ్యక్షత్వము వహించును. తన కుటుంబములో సభ్యులకు సలహా ఇచ్చుటకు, కుటుంబ సమావేశాలను జరుపుటకు, తన భార్య, పిల్లలకు యాజకత్వ దీవెనలు ఇచ్చుటకు, మరియు తన కుటుంబ సభ్యులకు లేక ఇతరులకు స్వస్థపరచు దీవెనలు ఇచ్చుటకు బదులుగా, అతడు యాజకత్వ తాళపు చెవుల అనుమతి లేక నడిపింపును కలిగియుండనవసరము లేదు.

కుటుంబము కలిసి అధ్యయనము చేయుట

తండ్రులు తమ స్వంత కుటుంబములో యాజకత్వమును ఘనపరచిన యెడల, వారు వేరే ఏదైన చేయగలిగినట్లుగా, సంఘము యొక్క మిషను అభివృద్ధికి సహాయపడును. మెల్కీసెదకు యాజకత్వము గల తండ్రులు, ఆజ్ఞలను పాటించాలి ఆవిధంగా వారు తమ కుటుంబ సభ్యులకు దీవెనలు ఇచ్చుటకు యాజకత్వము యొక్క శక్తిని కలిగియుంటారు. తండ్రులు ప్రేమగల కుటుంబ అనుబంధాలను పెంచి పోషించాలి ఆవిధంగా ఆ కుటుంబ సభ్యులు దీవెనల కొరకు వారి తండ్రులను అడగాలని కోరతారు. కుటుంబములో ఎక్కువ యాజకత్వ దీవెనలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.

యాజకత్వము దీవెన

కుటుంబ ప్రకటన బోధించినట్లుగా, తండ్రులారా, మీ భార్యలతో “సమాన భాగస్వాములుగా” పనిచేయుము.9 తండ్రులారా, మీ యాజకత్వ అధికారము యొక్క శక్తిని మరియు ప్రభావమును ఉపయోగించుటకు మీకు విశేషావకాశము కలిగియున్నప్పుడు, దానిని “బోధన ద్వారా, దీర్ఘ-శాంతము ద్వారా, మంచితనము, దీనత్వము మరియు కపటములేని ప్రేమ ద్వారా” (సి & ని 84:33 చూడుము) చేయుము. యాజకత్వ అధికారమును సాధన చేయుటకు ఆ ఉన్నత ప్రమాణము, కుటుంబములో అతి ముఖ్యమైనది. సంఘ అధ్యక్షునిగా అయిన వెంటనే అధ్యక్షులు హెరాల్డ్ బి. లీ ఈ వాగ్దానమిచ్చారు: “మీ ఇంటిలో సంక్షోభము ఉన్నప్పుడు, ఒక తీవ్రమైన వ్యాధి, లేక చేయవలసిన గొప్ప నిర్ణయాలున్నప్పుడు కంటె మీరు కలిగియున్న యాజకత్వపు శక్తి ఎక్కువ అద్భుతమైనదిగా ఎన్నడూ ఉండదు . . . యాజకత్వము యొక్క శక్తినందు ఇమిడియుండి, అది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి, ప్రభువు చిత్తమైతో, అద్భుతాలను చేయుటకు శక్తిని కలిగియున్నది, కానీ మనము ఆ యాజకత్వమును ఉపయోగించుటకు బదులుగా, దానిని ఉపయోగించుటకు మనము యోగ్యత కలిగియుండాలి. ఈ సూత్రమును గ్రహించుటకు విఫలమగుట ఆ గొప్ప యాజకత్వమును కలియుండుట వలన దీవెనలను పొందుటకు విఫలమౌతాము.”10

నా ప్రియమైన సహోదరులారా, మీరు కలిగియున్న పరిశుద్ధ యాజకత్వమును ఘనపరచుట మీ కుటుంబాలు మరియు మీ సంఘ పిలుపులందు ప్రభువు యొక్క కార్యమునకు ముఖ్యమైనది.

ఇది ఎవరి యాజకత్వమో ఆయనను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ప్రాయశ్చిత్త బాధ, త్యాగము మరియు పునరుత్థానము వలన, స్త్రీ, పురుషులందరూ, అమర్త్యత్వము యొక్క అభయమును మరియు నిత్యజీవము కొరకు అవకాశమును కలిగియున్నారు. మనలో ప్రతిఒక్కరు విశ్వాసముగా ఉండాలి మరియు మన నిత్య తండ్రియెన దేవుని యొక్క గొప్ప కార్యములో మన వంతును చేయుటలో శ్రద్ధ కలిగియుండాలి, యేసు క్రీస్తు యొక్క నామములో, ఆమేన్.

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Joseph F. Smith (1998), 343.

  2. Teachings: Joseph F. Smith, 340, 343.

  3. Joseph F. Smith, Gospel Doctrine, 5th ed. (1939), 182.

  4. Bruce R. McConkie, “Only an Elder,” Ensign, June 1975, 66; emphasis in original not preserved.

  5. Bruce R. McConkie, “Only an Elder,” 66; emphasis in original not preserved.

  6. Teachings of Presidents of the Church: Harold B. Lee (2000), 93.

  7. The Teachings of Harold B. Lee, ed. Clyde J. Williams (1996), 499.

  8. See Dallin H. Oaks, “Priesthood Authority in the Family and the Church,” Liahona, Nov. 2005, 24–27.

  9. See “The Family: A Proclamation to the World,” Liahona, May 2017, 145.

  10. Teachings: Harold B. Lee, 97.