2010–2019
ప్రభువైన క్రీస్తు నేడు లేచియున్నాడు
ఏప్రిల్ 2018


ప్రభువైన క్రీస్తు నేడు లేచియున్నాడు

ఇది ఈస్టరు ఆదివారము. జీవిస్తున్న క్రీస్తును గూర్చి నేను భక్తిగల గౌరవముతో సాక్ష్యమిస్తున్నాను మరియు--- “చనిపోయి, సమాధి చేయబడి, మూడవ దినమును తిరిగి లేచిన ఆయనను గూర్చి గంభీరముగా సాక్ష్యమిస్తున్నాను.”

ప్రియమైన సహోదర, సహోదరిలారా, మా కుమారులు చాలా చిన్నవారిగా ఉన్నప్పుడు, నేను వారికి బీగల్ పప్పీల కధలను చెప్పేవాడిని మరియు “ప్రభువైన క్రీస్తు నేడు లేచియున్నాడు” 1 తోపాటు రాత్రి కీర్తనలు పాడేవాడిని. కొన్నిసార్లు నేను సరదాగా మాటలను మార్చేవాడిని, “ఇప్పుడు, నిద్రపోయే సమయము, హల్లేలూయా!” సాధారణంగా మా కుమారులు త్వరగా నిద్రపోయేవారు, లేక కనీసము వారు నిద్రపోయారని నేను అనుకుంటే నేను పాడటం ఆపేస్తానని వారికి తెలుసు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రేమగా నా చేతులను తన చేతులలోకి తీసుకొని, నా ప్రియమైన సూసాన్ నా ప్రక్కన ఉండగా, ప్రభువునుండి ఈ పరిశుద్ధ పిలుపును ఇచ్చినప్పటి నుండి మాటలు---కనీసము నా మాటలు నా అత్యధిక భావనలను వ్యక్తపరచలేవు, అది నా ఊపిరిని తీసివేసి, ఈ గత కొన్ని రోజులుగా అనేకసార్లు నేను దుఃఖించునట్లు చేసింది.

ఈ ఈస్టరు సబ్బాతు దినమున, “హల్లేలూయా” అని నేను సంతోషముగా పాడతాను. మన పునరుత్థానుడైన రక్షకుని యొక్క విమోచకుని ప్రేమ యొక్క పాట,2 నిబంధనల సామరస్యమును (అది మనల్ని దేవునితో మరియు ఒకరినొకరితో సంబంధింప చేయును) మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును జరుపుకుంటున్నాము. (అది మనము ప్రకృతి సంబంధియైన పురుషుని మరియు స్త్రీని ప్రక్కన పెట్టి, పరిశుద్ధాత్మ యొక్క ఆకర్షణలకు లోబడుటకు మనకు సహాయపడును 3).

మన నిబంధనలు మరియు మన రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము కలిసి బలపరచును మరియు గొప్ప చేయును. కలిపి, అవి మనము సువార్తను పట్టుకొనియుండుటకు మరియు మనల్ని ఆపివేసే వాటిని విడిచిపెట్టుటకు సహాయపడును. కలిసి, అవి ప్రియముగా చేయును, కాపాడును, పరిశుద్ధపరచును, విమోచించును.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పాడు: “భూమిపై బంధించబడినది మరియు పరలోకములో బంధింపబడును లేక నమోదు చేయబడే శక్తిని గూర్చి మనము మాట్లాడుట, చాలా సాహసముగా కొందరికి కనబడవచ్చు. అయినప్పటికినీ, లోకములోని అన్ని యుగములలో, వాస్తవమైన బయల్పాటుతో ప్రభువు ఏ వ్యక్తికి లేక కొందరు పురుషులకు యాజకత్వము యొక్క యుగము ఇచ్చినప్పుడు, ఈ శక్తి ఎల్లప్పుడు ఇవ్వబడెను.”4

మరియు ఈరోజు ఆవిధంగా ఉన్నది. ఎక్కడా లభ్యముకాని పరిశుద్ధమైన నిబంధనలు మరియు విధులు, 43 దేశాలలోని 159 పరిశుద్ధ మందిరాలలో పొందబడెను. పునఃస్థాపించబడిన యాజకత్వపు తాళపు చెవులు, సిద్ధాంతము మరియు అధికారము, మన విశ్వాసమును ప్రతిఫలించుట, విధేయత, మరియు పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానముల ద్వారా వాగ్దానము చేయబడిన దీవెనలు కాలము మరియు నిత్యత్వములో మనకు వచ్చును.

మన ప్రపంచ వ్యాప్త సంఘము అంతటా, ప్రతీ రాజ్యము, వంశము, మరియు భాషలోని ప్రియమైన సహోదర, సహోదరిలారా, మీరు చేయు ప్రతీ విషయములో మీ జీవముగల విశ్వాసము, నిరీక్షణ, మరియు దాతృత్వము కొరకు మీకు ధన్యవాదములు. పునఃస్థాపించబడిన సంపూర్ణ సువార్త సాక్ష్యము మరియు అనుభవము నిండిన సమూహమైనందుకు మీకు ధన్యవాదములు.

ప్రియమైన సహోదర, సహోదరిలారా, మనము ఒకరినొకరికి చెందియున్నాము. “మనముండు అన్ని స్థలములందు, మరియు అన్ని విషయాలందు. మనము ఐక్యత యందు మరియు ప్రేమయందు5 చేర్చబడియున్నాము.”6 ప్రభువైన యేసు క్రీస్తు మనలో ప్రతీఒక్కరిని ఆహ్వానించినట్లుగా, మనమెక్కడ ఉన్నప్పటికినికిని, మన పరిస్థితులేవైనప్పటికిని, దయచేసి “వచ్చి, చూడుము.”7

అవి ఏమైనప్పటికినీ లేక ఎలా మారినప్పటికిని, నా రక్షకునికి, నా ప్రియమైన సూసాన్‌కు, నా కుటుంబానికి, మరియు నా సహోదరులకు, మరియు ప్రియమైన సహోదర, సహోదరిలారా మీలో ప్రతీఒక్కరికి, “నా ఆత్మ యొక్క పూర్ణబలముతో మరియు సామర్ధ్యములతో” 8 నేను సవినయముగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను.

యోగ్యతగలది మరియు నిత్యమైన సమస్తము పరిశుద్ధాత్మ చేత సాక్ష్యమివ్వబడి మన ప్రేమగల నిత్య తండ్రియైన దేవుని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు జీవిస్తున్నాడనే వాస్తముమునందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు కెంద్రీకరించబడును.9 ఆయన చనిపోయి, సమాధి చేయబడి, మరియు మూడవ దినమున మరలా లేచి, పరలోకమునకు ఆరోహణమయ్యాడని”10 ---జీవముగల క్రీస్తును గూర్చి నేను భక్తిగల గౌరవముతో, మరియు గంభీరముగా ఈ ఈస్టరు ఆదివారమున నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ఆదినుండి మనతో ఉన్న---- ఆయన అల్పయును మరియు ఓమెగా11---ఆయన అంతము వరకూ మనతో ఉండును.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ నుండి ఇప్పడు మనము సంతోషముగా ఆమోదించు మన ప్రియమైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వరకు కడవరి దిన ప్రవక్తలను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. “ప్రవక్తను అనుసరించుడి, ఆయన మార్గమును ఎరుగును,”12 అని మన ప్రాథమిక పిల్లలు పాడినట్లుగా, మోర్మన్ గ్రంథముతో కలిపి, పరిశుద్ధ లేఖనముందు ప్రవచింపబడినట్లుగా, ప్రభువు యొక్క రాజ్యము మరలా భూమిమీద స్థాపించబడిందని, మెస్సీయా యొక్క రెండవ రాకడకు సిద్ధపరచుటకని నేను సాక్ష్యమిస్తున్నాను.”13 యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన మరియు పరిశుద్ధ నామములో, ఆమేన్.

ముద్రించు