2010–2019
ఇదిగో! రాజుచేత ఆజ్ఞాపించబడిన సైన్యము
ఏప్రిల్ 2018


ఇదిగో! రాజుచేత ఆజ్ఞాపించబడిన సైన్యము

బోధించుట, నేర్చుకొనుట మరియు కలిసి సేవ చేసే దీవెన కలిగియుండుట మెల్కీసెదకు యాజకత్వముగల వారందరికి ఎంత ఆనందదాయకమైనది.

నా ప్రియమైన యాజకత్వ సహోదరులారా, మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత నియమించబడి ఈ చారిత్రక సందర్భములో గొప్ప వినయముతో నేను మీ యెదుట నిలబడ్డాను. ఈ అద్భుతమైన దేవుని యొక్క వ్యక్తిని మరియు మన క్రొత్త ప్రథమ అధ్యక్షత్వమును నేను ఎంతగా ప్రేమిస్తున్నాను. ప్రకటించబడిన మార్పులు, ప్రభువు యొక్క చిత్తమని ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ మరియు పన్నెండుమంది అపోస్తులుల కోరములో మా మిగిలిన సహోదరులతో నా సాక్ష్యమును నేను చేరుస్తున్నాను.

అధ్యక్షులు నెల్సన్ చేత వివరించబడినట్లుగా, ఈ విషయము ప్రార్థనాపూర్వకంగా చర్చించబడింది మరియు చాలాకాలముగా సంఘములోని పెద్ద సహోదరుల చేత పరిశీలించబడింది. ప్రభువు యొక్క చిత్తమును వెదకుట మరియు మెల్కీసెదకు యాజకత్వ కోరములను బలపరచాలనే కోరిక. ప్రేరేపణ పొందబడింది, మరియు ఈ సాయంత్రము మన ప్రవక్త ప్రభువు యొక్క చిత్తమును బయల్పరిచారు. “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు!” 1ఈరోజు జీవిస్తున్న ప్రవక్తను కలిగియుండుటకు మనమెంతగా దీవించబడ్డాము!

మా జీవితకాలమంతా, సహోదరి రాస్‌బాండ్, నేను వేర్వేరు సంఘ మరియు వృత్తిపరమైన పనులందు ప్రపంచములో ప్రయాణించాము. నేను సంఘములోని దాదాపు ప్రతీ విధమైన విభాగపు సాపేక్షస్థితిని చూసాను: రష్యాలోని చిన్న బ్రాంచి, అక్కడ మెల్కీసెదకు యాజకత్వము గలవారిని ఒక చేతితో లెక్కపెట్టవచ్చు; ఆఫ్రికాలో ఎదుగుచున్న వార్డు, అక్కడ మొత్తము మెల్కీసెదకు యాజకత్వము గలవారు తక్కువమంది కనుక ప్రధాన యాజకులు మరియు ఎల్డర్లు ఒకటిగా కలుసుకుంటారు; బాగా స్థాపించబడిన వార్డులు, అక్కడ ఎల్డర్ల సంఖ్యకు వారి కోరము రెండు కోరములుగా విభజించుట అవసరమగును!

మేము వెళ్లిన ప్రతీచోట, జనులను మరియు మార్గమును ముందుగా సిద్ధపరచుచు ఆయన సేవకుల యెదుట ప్రభువు యొక్క హస్తము వెళ్లుట మేము ప్రత్యక్షంగా చూసాము, ఆవిధంగా ఆయన పిల్లలందరు వారి ప్రతీ అవసరత ప్రకారము దీవించబడతారు. ఆయన “(మన) ముఖము యెదుట వెళతాడని” మరియు “(మన) కుడివైపు మరియు (మన) ఎడమవైపు” ఉంటానని మరియు ఆయన “ఆత్మ మీ హృదయాలలో ఉండునని, మరియు (మన) చుట్టూ (ఆయన) దూతలు ఉంటారని” ఆయన వాగ్దానము చేయలేదా”? 2

మీ అందరి గురించి ఆలోచిస్తూ, నేను “ఇదిగో! రాజుచేత నియమించబడిన సైన్యము” కీర్తన గుర్తు చేయబడ్డాను.

ఇదిగో! రాజుచేత ఆజ్ఢాపించబడిన సైన్యము

పతాకము, ఖడ్గము, మరియు కవచముతో,

జయించుటకు ముందుకు కవాతు చేస్తున్నది

జీవితము యొక్క గొప్ప యుద్ధప్రదేశములో.

దాని హోదాలతో నింపబడిన సైనికులు,

ఏకము చేయబడి, ధైర్యముగా మరియు బలముగా ఉన్నవి,

వారు తమ అధికారిని అనుసరిస్తున్నారు

వారు సంతోషకరమైన పాటను పాడతారు.3

వార్డు స్థాయిలో ప్రధాన యాజకుల గుంపులు మరియు ఎల్డర్ల గుంపులు, మెల్కీసెదకు యాజకత్వము యొక్క సహోదరులు యొక్క ఏకీకృతము చేయబడిన, బలమైన సైన్యముగా, ఒకటిగా జతపరచబడునట్లు, చేయబడిన ప్రకటన వలన నిశ్చయముగా కలిగే కొన్ని ప్రశ్నలకు ఎల్డర్ క్రిస్టాఫర్సన్ జవాబిచ్చారు.

ఈ సవరణలు ఎల్టర్ల కోరములు మరియు ఉపశమన సమాజములు వారి కార్యమును పొందుపరచుటకు సహాయపడతాయి. అవి బిషప్రిక్కు మరియు వార్డు సలహాసభతో కోరము యొక్క సహకారమును కూడా సూక్ష్మీకరిస్తాయి. ఎల్టర్ల కోరములు మరియు ఉపశమన సమాజము అధ్యక్షులకు ఎక్కువ బాధ్యతలను అప్పగించుటకు అవి బిషప్పును అనుమతించును, ఆవిధంగా బిషప్పులు మరియు అతని సలహాదారులు ---ప్రత్యేకంగా యువతులపై మరియు అహరోను యాజకత్వమును కలిగిన యువకులపై అధ్యక్షత్వము వహించే-- వారి ప్రధాన బాధ్యతలపై దృష్టిసారించవచ్చు

సంఘ నిర్మాణములు మరియు విధులలో మార్పులు అసాధారణమైనవి కావు. 1883లో, ప్రభువు అధ్యక్షులు జాన్ టేలర్‌కు చెప్పాడు: “నా సంఘము మరియు యాజకత్వము యొక్క నిర్వహణ మరియు సంస్థ (గురించి) . . . నా సంఘము యొక్క భవిష్యత్తు మరియు అభివృద్ధికి అవసరమైన సమస్తము కొరకు, నా రాజ్యము ముందుకు వెళ్లుట కొరకు నేను నియమించిన విధానముల ద్వారా, ఎప్పటికప్పుడు నేను మీకు బయల్పరుస్తాను.”4

ఇప్పుడు, ప్రధాన యాజకులైన సహోదరులైన మీకు కొన్ని మాటలు---మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని తెలుసుకొనుము! మన పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు! మీరు యాజకత్వము యొక్క రాజు సైన్యములో గొప్ప భాగము, మరియు మీ మంచితనము, సేవ, అనుభవము, మరియు నీతి లేకుండా ఈ కార్యము ముందుకు సాగదు. వారి అత్యధికమైన విశ్వాసము మరియు ఇతరులకు బోధించుటకు మంచి క్రియలు, మరియు పరిచర్య చేయుట వలన, ప్రధాన యాజకులుగా పురుషులు పిలవబడ్డారని ఆల్మా బోధించెను.5 బహుశా ఎప్పటికంటె ఎక్కువగా ఇప్పుడు ఆ అనుభవము అవసరము.

అనేక వార్డులలో, వారి కోరము అధ్యక్షునిగా ఒక ఎల్డరు చేత అధ్యక్షత్వము వహించు అవకాశమును కలిగియుండబోయే ప్రధాన యాజకులను మనము కలిగియుండవచ్చు. మనము ప్రధాన యాజకులుపైగా ముందు అధ్యక్షత్వము వహించుటను కలిగియున్నాము: ప్రపంచములోని కొన్ని ప్రాంతాలలో బ్రాంచి అధ్యక్షులుగా ప్రస్తుతము సేవ చేయుచున్న ఎల్డర్లు, అక్కడ బ్రాంచీలో ప్రధాన యాజకులు నివసిస్తున్నారు, కేవలము ఎల్డర్ల కోరము ఏర్పాటు చేయబడి మరియు ప్రధాన యాజకులు హాజరయ్యే బ్రాంచీలు ఉన్నాయి.

వారి వార్డులోని సభ్యులందరికి బోధించుట, నేర్చుకొనుట మరియు కలిసి సేవ చేసే దీవెన కలిగియుండుట మెల్కీసెదకు యాజకత్వముగల వారందరికి ఎంత ఆనందదాయకమైనది. మీరెక్కడ ఉన్నప్పటికిని, మీ పరిస్థితులేవైనప్పటికిని, యాజకత్వ సహోదరులు ఒకటిగా ఏకగ్రీవముగా నడిపించుటకు లేక నడిపించబడుటకు మరియు సేవ చేయుటకు క్రొత్త అవకాశాలను అంగీకరించమని మేము మిమ్మల్ని ప్రార్ధనాపూర్వకంగా, మరియు సంతోషముగా ఆహ్వానిస్తున్నాము.

ఇప్పుడు పరిశుద్ధ యాజకత్వమునకు చెందిన ఆయన కోరముల నిర్మాణము గురించి ప్రభువు యొక్క చిత్తమును అమలుపరచుటకు మనము ముందుకు సాగినప్పుడు, స్పష్టత అవసరమైన అదనపు విషయాలను నేను ప్రసంగిస్తాను.

స్టేకు ప్రధాన యాజకుల కోరము కొరకు సవరణలేమిటి? స్టేకు ప్రధాన యాజకుల కోరము పనిచేయుట కొనసాగును. స్టేకు అధ్యక్షత్వములు స్టేకు ప్రధాన యాజకుల కోరముల అధ్యక్షత్వములుగా సేవ చేయుట కొనసాగిస్తాయి. అయినప్పటికిని, ఎల్డర్ క్రిస్టాఫర్సన్ వివరించినట్లుగా, స్టేకు ప్రధాన యాజకుల కోరము యొక్క సభ్యులు ఇప్పుడు వార్డు బిషప్రిక్కు సభ్యులుగా, స్టేకు ప్రధాన సలహాసభ యొక్క సభ్యులుగా, మరియు పనిచేయుచున్న గోత్రజనకునిగా స్టేకు అధ్యక్షత్వములో ప్రస్తుతము సేవ చేయుచున్న ప్రధాన యాజకులను కలిగియుండును. వార్డు మరియు స్టేకు గుమస్తాలు స్టేకు ప్రధాన యాజకుల కోరముల యొక్క సభ్యులు కాదు. ప్రధాన యాజకునిగా, గోత్రజనకునిగా, డెబ్బదిగా, లేక అపోస్తులునిగా చురుకుగా సేవ చేస్తున్న ఎవరైన ఒకరు ఒక వార్డును దర్శించి యాజకత్వ సమావేశములకు హాజరుకావాలని కోరితే, అతడు ఎల్డర్ల కోరముతో సమావేశమవుతాడు.

ఈ పిలుపులందు సహోదరులు విడుదల చేయబడినప్పుడు, వారు ఎల్డర్ల కోరము యొక్క సభ్యులుగా వారి గృహ విభాగాలకు తిరిగి వెళతారు.

స్టేకు ప్రధాన యాజకుల కోరము యొక్క పాత్ర ఏమిటి? కలిసి ఆలోచన చేయుటకు, సాక్ష్యమిచ్చుటకు, మరియు శిక్షణ ఇచ్చుటకు అధ్యక్షత్వము ప్రధాన యాజకుల కోరము యొక్క సభ్యులతో కలుసుకొనును. మన చేతి పుస్తకములో సంక్షిప్తపరచబడినట్లుగా స్టేకు సమావేశాలు రెండు సవరణలతో కొనసాగుతాయి.

ఒకటి, వార్డు మరియు స్టేకులు ఇకముందు కార్యనిర్వహాక కమిటీ సమావేశాలు జరపరు. ఒక ప్రత్యేక వార్డు సమస్య, ఒక సున్నితమైన కుటుంబ విషయము లేక అసాధారణమైన శ్రేయస్సు సవాలు కలిగిన యెడల, పొడిగించబడిన బిషప్రిక్కు సమావేశములో ప్రసంగించబడవచ్చు. మిగిలిన తక్కువ సున్నితమైన విషయాలు వార్డు సలహాసభలో ప్రసంగించబడవచ్చు. స్టేకు యాజకత్వ కార్యనిర్వహాక కమిటీ సమావేశముగా పిలవబడినది, ఇప్పుడు “ప్రధాన సలహాసభ సమావేశముగా” పిలవబడును.

రెండవది, స్టేకులో నియమించబడిన ప్రధాన యాజకులందరి యొక్క వార్షిక సమావేశము ఇకముందు జరపబడదు. అయినప్పటికిని, ఈరోజు ప్రకటించబడినట్లుగా, స్టేకు అధ్యక్షత్వము స్టేకు ప్రధాన యాజకుల కోరముల యొక్క వార్షిక సమావేశమును జరుపుట కొనసాగించును.

ఒక వార్డు ఒకటి కంటే ఎక్కువ ఎల్డర్ల కోరము కలిగియుండవచ్చా? జవాబు, అవును. సిద్ధాంతము మరియు నిబంధనలు 107, 89వచనము యొక్క ఆత్మలో, ఒక వార్డు అసాధారణంగా విస్తారమైన చురుకైన మెల్కీసెదకు యాజకత్వము గల వారిని కలిగియున్నప్పుడు, నాయకులు ఒక ఎల్డర్ల కోరము కంటే ఎక్కువ నిర్వహించవచ్చు. అటువంటి సందర్భాలలో, ప్రతీ కోరము వయస్సు, అనుభవము, మరియు యాజకత్వ కార్యాలయము మరియు బలము వంటి నిబంధనలందు సరైన సమతుల్యతను కలిగియుండాలి.

మన వార్డులు మరియు స్టేకులలో ఈ ప్రేరేపించబడిన కోరము పునర్వ్యవస్థీకరణతో మనము ముందుకు సాగినప్పుడు, మనము విస్తారమైన దీవెనలను చూస్తామని నేను సాక్ష్యమిస్తున్నాను. కేవలము కొన్ని మాదిరులను నేనిస్తాను.

బిషప్పు నడిపింపు క్రింద, ఎక్కువ యాజకత్వ వనరులు రక్షణ యొక్క కార్యముతో సహాయపడవచ్చు. ఇది దేవాలయ కార్యము మరియు కుటుంబ చరిత్ర కార్యము ద్వారా ఇశ్రాయేలును సమకూర్చుట, అవసరతలో ఉన్న కుటుంబాలు మరియు వ్యక్తులతో పని చేయుట, మరియు యేసు క్రీస్తుకు ఆత్మలను తెచ్చుటకు మిషనరీలకు సహాయపడుట వంటి వాటిని కలిపియున్నది.

ఎల్డర్ల కోరముతో వారి అనుభవమును పంచుకొనుటకు, ముందు అధ్యక్షత్వము వహించు నాయకులు తిరిగి వచ్చినప్పుడు, బలమైన కోరము సభ్యత్వము కలుగును.

కోరము లోపల గొప్ప వైవిద్యముగల వరములు మరియు సమర్ధతలు ఉండును.

మన వేర్వేరు పరిచర్య చేయు నియామకాలను నెరవేర్చుటలో, వార్డు మరియు కోరములోపల ప్రస్తుతపు మరియు తక్షణ అవసరతలను తీర్చుటకు ఎక్కువ వశ్యత మరియు లభ్యత ఉండును,

ఒక క్రొత్త ఎల్డర్ మరియు ఒక అనుభవముగల ప్రధాన యాజకుడు, కోరము సమావేశాలు మరియు నియామకాలలో ప్రక్కప్రక్కనుండి అనుభవాలను పంచుకొన్నప్పుడు, మార్గదర్శకత్వము మరియు ఐక్యతయందు వృద్ధి కలుగును.

బిషప్పులు మరియు బ్రాంచి అధ్యక్షులు వారి మందలను కాయుటకు మరియు అవసరతలో ఉన్నవారికి పరిచర్య చేయుటకు వారి పిలుపులను నెరవేర్చుటకు ఆశాజనకంగా విడిపించబడతారు.

ప్రతీ వార్డు మరియు స్టేకు భిన్నంగా ఉందని మేము గ్రహించాము. ఈ భిన్నత్వాలను గ్రహిస్తుండగా, ఈ సర్వసభ్య సమావేశము తరువాత ఈ మార్పులను తక్షణమే అనుసరిస్తారని మేము ఆశిస్తున్నాము. మనము దేవుని యొక్క ప్రవక్త చేత నడిపింపు ఇవ్వబడ్డాము! ఎంత అద్బుతమైన దీవెన మరియు బాధ్యత. సమస్త నీతి మరియు శ్రద్ధతో మనము దానిని నెరవేరుద్దాము!

యాజకత్వ అధికారము ప్రత్యేకించి, నియమించబడుటతో వస్తుంది, కానీ నిజమైన యాజకత్వ శక్తి, ప్రభువైన యేసు క్రీస్తు నామములో పనిచేయుటకు శక్తి, నీతిగా జీవించుట ద్వారా మాత్రమే వస్తుందని నేను మీకు గుర్తు చేస్తున్నాను.

పునఃస్థాపన యొక్క ప్రవక్త, జోసెఫ్ స్మిత్‌కు ప్రభువు ప్రకటించాడు:

“ఇదిగో, మరియు నేను మీ మందలను జాగ్రత్తగా చూస్తాను, మరియు ఎల్డర్లను లేవనెత్తెదను మరియు (మందలకు) వారిని పంపెదను.

“ఇదిగో, నేను నా కార్యమును వేగిరపరచెదను.”6

వాస్తవానికి, ఇది ప్రభువు తన కార్యమును వేగవంతము చేస్తున్న సమయము.

మనలో ప్రతిఒక్కరు పర్యాలోచన చేయుటకు ఈ అవకాశమును ఉపయోగించుకొనుము మరియు మన జీవితాలు ఆయన చిత్తముతో ఒకే కూటమిలో బాగా చేరుటకు మెరుగుపరుచుకోవాలి, ఆవిధంగా మనము యధార్ధవంతులకు మరియు విశ్వాసులకు వాగ్దానము చేసిన అనేక దీవెనలకు అర్హులవుతాము.

సహోదరులారా, ఈ అద్భుతమైన కార్యములో భాగముగా ఉండుటకు మీరు చేస్తున్న సమస్తము కొరకు మీకు ధన్యవాదాలు. ఈ గొప్ప, గౌరవనీయమైన హేతువులో మనము ముందుకు సాగెదముగాక.

ఓ, యుద్ధము ముగిసినప్పుడు,

కలహము మరియు వివాదములు ముగిసినప్పుడు,

అందరూ క్షేమంగా సమకూర్చబడినప్పుడు

శాంతి యొక్క ఆశ్రయములోపల,

నిత్య రాజు యెదుట,

ఆ విశాలమైన మరియు బలమైన సమూహము

ఆయన నామమును శాశ్వతంగా స్తుతించును,

ఇది వారి పాట అగును:

విజయము, విజయము,

మనల్ని విమోచించిన ఆయన ద్వారా!

విజయము, విజయము,

మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా!

విజయము, విజయము, విజయము

మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా! 7

ఈరోజు మనమందరము ప్రభువు తన చిత్తమును ఆయన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ద్వారా బయల్పరుచుచున్న దానికి సాక్షులుగా నిలిచియున్నాము. ఆయన భూమి మీద దేవుని యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు, మన గొప్ప విమోచకుడు మరియు రక్షకుని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది ఆయన కార్యము, ఇది ఆయన చిత్తము, దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో నా గంభీరమైన సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు